భక్తుల ఆందోళనపై త్రిసభ్య కమిటీ:బాపిరాజు
వైకుంఠ ఏకాదశ పర్వదినం సందర్భంగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనపై పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అయితే వైకుంఠ ఏకాదశ సందర్భంగా వీఐపీ టికెట్ల జారీలో జరిగిన అవకతవకలపై కమిటీ వేసి విచారణ జరపాలని టీటీడీ పాలక మండలి సభ్యులు కన్నయ్య, శివప్రసాద్లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజును డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కొనుగోలు విధానంలో పారదర్శకత లేదని వారు ఆరోపించారు. ప్రసాదానికి అవసరమైన ముడి సరుకుల కొనుగోలు విషయంలో గతంలో టీటీడీ విధించిన నిబంధనలు మార్పు చేయాల్సిన అవశ్యకత ఉందని కన్నయ్య, శివప్రసాద్లు పేర్కొన్నారు.