kanumuri bapiraju
-
గెలుపు వీరులు...రికార్డుల రారాజులు
సాక్షి, ఏలూరు : పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాలను శాసించిన వీరులు ఎందరో ఉన్నారు. వ్యక్తిగత ప్రతిష్టతో అత్యధికసార్లు నెగ్గి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి భళా అనిపించుకున్నారు. వీరిలో ఆరుసార్లు గెలుపుబావుటా ఎగురేశారు సీహెచ్‌వీపీ మూర్తిరాజు. కనుమూరి బాపిరాజు, కోటగిరి విద్యాధరరావు, కలిదిండి రామచంద్రరాజు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఐదుసార్లు ఓటర్ల మనసు గెలిచారు. అల్లు వెంకట సత్యనారాయణ, పెన్మెత్స వెంకటనరసింహరాజు, గారపాటి సాంబశివరావు, పెండ్యాల వెంకట కృష్ణారావు, చేగొండి హరిరామజోగయ్య నాలుగుసార్లు ప్రజామోదం పొందారు. దండు శివరామరాజు, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, వంకా సత్యనారాయణ, కారుపాటి వివేకానంద, కలిదిండి విజయ నరసింహరాజు, పరకాల శేషావతారం, ఎం.రామ్మోహనరావు, టి.వీరరాఘవులు, పితాని సత్యనారాయణ, తెల్లంబాలరాజు మూడుసార్లు విజయకేతనం ఎగురవేశారు. -
మాజీ ఎంపీ ఇంట్లో చోరీ
హైదరాబాద్: టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంట్లో దొంగలు పడి కారుతో సహా బంగారు ఆభరణాలు చోరీ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలోని బాపిరాజు ఇంట్లోకి శనివారం దొంగలు చొరబడ్డారు. మొదటి అంతస్తు బెడ్రూమ్లోని బీరువాలోంచి బంగారు ఆభరణాలు కాజేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన ఏపీ 09 బీఏ 0456 నంబర్ ఇన్నోవా కారును తస్కరించారు. శనివారం బాపిరాజు కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉండగా బయట చూస్తే కారు కనిపించలేదు. మరోకారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలోని నగలు కూడా కనిపించలేదు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఆయన పెద్ద కోడలు చైతన్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు
ఆనందపేట(గుంటూరు): నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక హోదా కల్పించేంతవరకు పోరాటం సాగిస్తామని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. స్థానిక హిందూ కళాశాల సెంటర్లో ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కనుమూరి బాపిరాజు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జిల్లా పార్టీ పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఆడుతున్న దొంగ నాటకాలను అరికట్టాలన్నారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ వహీద్, లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి సాంబశివరావు, కొరివి వినయ్‌కుమార్, మిరియా ల రత్నకుమారి, బిట్రగుంట మల్లిక, ఈరి రాజశేఖర్, దొంత సురేష్, ముత్యాలు, జిలాని, మొగిలి శివకుమార్, రహమాన్, ఉస్మాన్, కొత్తూరి భైరవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ
-
టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీ
ఫైల్ సిద్ధం చేసిన ఎండోమెంట్ విభాగం తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసేలా రంగం సిద్ధం చేసింది. శాసనసభ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటును మరింత జాప్యం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు టీటీడీలో ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాల పేరుతో..: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని కమిటీని ఈనెల 9వ తేదిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తో రద్దు చేసింది. కేంద్ర కేబినెట్ హోదాతో సమానంగా పరిగణించే టీటీడీ చైర్మన్ పదవికి తొలి నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుత బోర్డును రద్దు చేశాక కీలక పదవిని ఆశించేవారి జాబితా చాంతాడంత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 18వ తేది నుంచి సెప్టెంబర్ 12వ తేది వరకు జరగనున్నాయి. ఇంతలోపే హడావిడిగా కొత్త ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తే పదవుల పందేరంలో సమస్యలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు యోచన చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో ట్రస్టు బోర్డు ఏర్పాటు మరింత జాప్యం చేయాలని భావిస్తున్నారు. ఇంతలోపు టీటీడీలో పరిపాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖాధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీనిపై రాష్ట్ర ఎండోమెంట్ మంత్రి వద్ద ఫైల్ సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. కొత్త స్పెసిఫైడ్ అథారిటీకి సంబంధించి మరో రెండు మూడురోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్పెసిఫైడ్ అథారిటీపై టీటీడీ ఉన్నతాధికారుల్లో చర్చ జోరందుకుంది. -
బాపిరాజు ఇప్పుడేం చేయబోతున్నారు?
తిరుపతి: పాలకమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులు టీటీడీకి అందాయి. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులకు లేఖల ద్వారా ఉత్తర్వులు పంపించారు. దీంతో గడవుకు 11 రోజుల ముందే టీటీడీ పాలకమండలి రద్దయింది. బాపిరాజు పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. రాష్ట్రంలోని దేవాలయాల పాలకమండళ్లను రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి తనకు తానుగా రాజీనామా చేయనని బాపిరాజు ఇంతకుముందు ప్రకటించారు. పదవీకాలం పూర్తయ్యే వరకు గానీ.. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు గానీ పదవిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పాలకమండలిని రద్దు చేస్తూ అధికార ఉత్తర్వులు వెలువడంతో బాపిరాజు ఇప్పుడేం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. -
టీటీడీ చైర్మన్ రేసులో మురళీమోహన్
సాక్షి, ఏలూరు : రాష్ట్రంలోని దేవాల యాల పాలకమండళ్లను రద్దుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేయడంతో టీటీడీ చైర్మన్ పదవిని కనుమూరి బాపిరాజు ఎట్టకేలకు వదులుకోవాల్సి వచ్చింది. టీటీడీ పదవీ కాలం ఈనెల 23 వరకు ఉన్నదృష్ట్యా తనంతట తాను రాజీనామా చేసేది లేదని బాపిరాజు ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయూంశమైంది. టీటీడీ చైర్మన్‌గా 2012 ఆగస్టు 24న బాధ్యతలు చేపట్టిన అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు అంతకుముందు దాదాపు ఏడాదిపాటు ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆశించే వారి జాబితా ఎక్కువైంది. ఇదే పదవిపై కన్నేసిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెరవెనుక యత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈయన కనుమూరి బాపిరాజుకు స్వయూనా బావమరిది కావడం విశేషం. 1970 దశకంలోనే గంగరాజు తండ్రి రంగరాజు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. ఇదిలావుండగా, టీటీడీ కొత్త పాలకవర్గంలో బీజేపీకి చెందిన ఏడుగురు నేతలకు స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో చైర్మన్ పదవి తనకే దక్కుతుందని గంగరాజు భావిస్తున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మాజీ అయిన కనుమూరి బాపిరాజు, గంగరాజు ఒకే సామాజిక వర్గం కావడంతో ఈసారి ఇతర సామాజిక వర్గాలకు పదవిని కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో కోస్తా నేతలకు ఈ పదవి దక్కడంతో ఈసారి రాయలసీమ నేతలకు ఇవ్వాలని టీడీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమ వారిని వరిస్తుందా.. కోస్తా జిల్లాల వారికి దక్కుతుందా అనేది త్వరలోనే తేలనుంది. -
పొడిగింపు లేదు.. రాజీనామాయే దిక్కు!
-
టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు బాపిరాజు రాజీనామా
తిరుమల: టీటీడీ ఛైర్మన్ పదవిని పోడిగించుకునేందుకు ప్రస్తుత ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు రంగం సిద్దమైందమైనట్లు సమాచారం. బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవికి శుక్రవారం మధ్యాహ్నం రాజీనామా చేసి... అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సార్లు బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవిని అలంకరించారు. ముచ్చటగా మూడోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు బాపిరాజు చేసిన ప్రయత్నాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఫలించలేదు. దాంతో బుర్ర మీసాల రాజుగారు తన టీటీడీ ఛైర్మన్ పదవిని వదులుకోవలసి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని దేవాలయాల అన్ని పాలక మండళ్లను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని పాలక మండళ్లు ఛైర్మన్లు, పాలక వర్గ సభ్యులు తమతమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. -
తిరుమల కోసం కమలదండు యత్నం
సూది కోసం సోదికెళ్తే సుడితిరిందా అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా తాడిపల్లిగుడెం నుంచి గెలుపోందిన ఆ పార్టీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు చంద్రబాబు కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టారు. అయితే దేవాదాయశాఖ మాకే దక్కింది కనుక టీటీడీ ఛైర్మన్ పదవి కూడా మాకే దక్కాలంటూ ఆ పార్టీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. అందుకోసం ఇప్పటికే కేంద్రంలోని తమ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలు తమ మంతనాలు తీవ్రతరం చేశారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ అయిన కనుమూరి బాపిరాజు ఇప్పటికే రాజీనామా చేయాల్సి ఉంది. అయితే ఆగస్టుతో తన పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యం తనను రాజీనామా చేయవద్దంటూ ఆయన ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అనుమతించని పక్షంలో మీసాల రాజుగారు మరో నెల రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఖాళీ అయిన ఆ పదవిని ఎట్లా అయిన సొంతం చేసుకోవాలని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకోసం కేంద్రమంత్రులతో ఇప్పటికి రంగంలోకి దిగి మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే టీడీపీ ఎంపీలు, మంత్రులు, మాజీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పదవి ఇటు టీడీపీ నేతలకా లేక బీజేపీ నేతలకు దక్కనుందా అనేది తేలాల్సి ఉంది. -
బావమరిదితో రాయ‘బేరం’
సాక్షి, ఏలూరు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవిని మూడోసారి దక్కించుకునేందుకు కనుమూరి బాపిరాజు ఉవ్విళ్లూరుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కాం గ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘోర పరాజయం పాలైన ఆయన ఏదోరకంగా టీటీడీ పదవిని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టీడీపీ నేతలను సైతం కలుస్తున్నట్లు సమాచారం. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించిన కనుమూరికి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అటునుంచి పని కాదని బాపిరాజు భావించారు. తనపై పోటీ చేసి బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన తన బావమరిది గోకరాజు గంగరాజును ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. గతంలో నరసాపురం ఎంపీగా ఉంటూనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి దక్కించుకున్నారు కనుమూరి బాపిరాజు. సమైక్యాంధ్ర ద్రోహులుగా ముద్ర వేయించుకున్న వారిలో ఆయన కూడా ఒకరిగా మిగిలిపోయారు. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎంపీగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఇదేమని అడిగితే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో చివరకు మిగిలిన సీనియర్ ఆయనొక్కరే. 2019 ఎన్నికల్లోనూ టికెట్టిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో గత ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభా స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇదే స్థానం నుంచి గెలిచిన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు తనకు స్వయానా బావమరిది కావడంతో అతని ద్వారా పని జరిపించుకోవాలని చూస్తున్నారు. ఐ.భీమవరంలో వేదపాఠశాల భవనం ప్రారంభోత్సవానికి గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని తీసుకురావాలని బాపిరాజు భావించా రు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. శీతాకాలంలో తప్పక వస్తానని రాష్ట్రపతి తనకు హామీ ఇచ్చారని, అప్పటివరకు తనను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించవద్దని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉం డటం, తన బావమరిది ఎంపీ కావడం తో కేంద్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిఫారసు చేయించుకోవడానికి బాపిరాజు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమా చారం. నిజానికి బాపిరాజు పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ ఏడాది చివరివరకు పొడిగిస్తే మూడోసారి ఆ పదవి దక్కించుకునట్టవుతుంది. కానీ టీడీపీలో ఈ పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనవారిని కాదని మీసాల రాజు కు పదవి ఇస్తారా అనేది అనుమానమే. -
రాజుగార్ని దువ్వుతున్న రాజుగారు
మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవి చేపట్టాలని కనుమూరి బాపిరాజు మహా ఊవిళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీటీడీ పగ్గాలు వదులుకోవాల్సి వస్తుందని ఆయన ప్రస్తుతం తెగ మధనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి టీటీడీ పాలన పగ్గాలు చేపట్టేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని హేమాహేమీ నాయకులతో భేటీ అయి... స్వామీ వారికి మరోసారి సేవ చేసే 'ఒకేఒక్క ఛాన్స్' తనకు ఇప్పించాలని ప్రాధేయపడ్డారట. అయితే ఆయనకి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది సమాచారం. ఇప్పటికే ఆ పదవి కోసం తమ పార్టీ నేతల్లో తెగపోటీ పడుతున్నారని... ఎంత త్వరగా ఆ పదవికి రాజీనామా చేస్తే అంత మంచిదని సదరు పచ్చపార్టీ నేతలు బాపిరాజుకు హితవు పలికారని తెలిసింది. దాంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో చివరికి మిగిలిన ఒకేఒక్క ఆశ బావమరిది గోకరాజు గంగరాజు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తనపై పోటీ చేసి విజయం సాధించిన బావమరిది గంగరాజును బాపిరాజు ఆశ్రయించారు. ఎలాగోలా టీటీడీ ఛైర్మన్ పదవి తనకే దక్కేలా ప్రయత్నించాలని బాపిరాజు తన బావమరిది గంగరాజును దువ్వుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడు బాపిరాజును కరుణిస్తాడో లేదో చూడాలి. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టు తెలుగుతమ్ముళ్లు ప్రదక్షణాలు చేస్తున్నారని సమాచారం. -
తిరుమలలోనే నూరుకాళ్ల మంటపం
వేయికాళ్ల మంటపం స్థానంలో పునః నిర్మాణం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయం వద్ద 2003లో కూల్చివేసిన వేయికాళ్ల మండపం స్థానంలోనే నూరుకాళ్ల రాతి మంటపం నిర్మించాలని టీటీడీ సీవీఎస్వో నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించింది. రాతి మంటపం తిరుపతిలో నిర్మించాలనే అంశం సమంజసంగా లేదని, పరిమితులకు లోబడే తిరుమల ఆలయం వద్దే పునఃనిర్మించాలని నిపుణులు స్పష్టం చేశారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి మరోసారి నివేదిక సమర్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కోరింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రాతిమంటమం నిర్మాణంపై ఈ మేరకు చర్చ జరిగింది. ై చెర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ నేతృత్వంలో సాగిన ఈ సమావేశానికి సభ్యులు ఎల్ఆర్ శివప్రసాద్, రేపాల శ్రీనివాస్, కన్నయ్య, వెంకట్రమణ, ఎక్స్ అఫిషియో సభ్యుడు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి బీ.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పరిపాలనా సంబంధిత అంశాలపై మాత్రమే చర్చించి తీర్మానం చేశారు. కోడ్ వల్ల సమావేశంలో తీసుకున్న అన్ని తీర్మానాలను కూడా మీడియాకు చెప్పలేమని చైర్మన్ వెల్లడించారు. టీటీడీ కల్యాణ మంటపాల బుకింగ్ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్పు చేయాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానించింది. ఇప్పటి వరకు మాన్యువల్ పద్ధతిలో మాత్రమే బుకింగ్ చేసుకునే కల్యాణ మంటపాలను ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునేలా సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. వీటితోపాటు తిరుమల ఆలయ అవసరాల కోసం బియ్యం, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల వంటి సాధారణ మార్కెట్ కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకున్నారు. - తిరుమల శ్రీవారి ఆలయంలో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న 140 మంది పోటు కార్మికుల కాంట్రాక్టును మరో ఏడాదికి పొడిగించారు. వీరి జీతభత్యాల కింద రూ.3.10 కోట్లు కేటాయించారు. - కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 186 మంది ఫారెస్ట్ కార్మికులను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. - తిరుమలలోని ఉద్యానవనాల నిర్వహణకు నామినేషన్ పద్ధతిపై రూ.1కోటి 11లక్షలు కేటాయించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పరిపాలన పరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇదిలాఉండగా ఇంతకుముందే అసెంబ్లీ రద్దు కావడంతో ఎమ్మెల్యేల కోటా కింద ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులైన రాజిరెడ్డి, పాముల రాజేశ్వరి, కాండ్రుకమల, పదవులకు రాజీనామా చేసిన జీవీ శ్రీనాథరెడ్డి, చిట్టూరు రవీంద్ర సమావేశానికి హాజరు కాలేదు. -
మీసాల రాజు గారూ.. మీరేం చేశారో చెప్పరూ..
అందమైన మీసాలను పదే పదే తిప్పడం, తీయనైన మాటలు చెప్పడంలో నరసాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి బాపిరాజు సిద్ధహస్తులు. రెండు సార్లు ఎంపీగా జిల్లా ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు.అయితే ఎంపీగా ఆయన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీటీడీ చైర్మన్ పదవిని కూడా అలంకరించిన బాపిరాజు పదవులు పొందడమే గాని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపింది లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల సమయంలో అనేక వాగ్ధానాలు ఇచ్చిన ఆయన గెలిచిన తర్వాత వాటిని మరిచిపోయారు. నియోజకవర్గంలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా బాపిరాజు కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. గతంలో తీరగ్రామాల్లో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు బాపిరాజు హామీ ఇచ్చారు. చైనాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్ట్ ఏర్పాటుపై 2005లో అధ్యయనం చేశారు. అప్పట్లో ఆ బృందంతో కలిసి తీరగ్రామాల్లో బైక్‌పై తిరిగి బాపిరాజు నానా హడావిడి చేశారు. కానీ ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ఏమైందనేది ఇప్పటికీ తెలియదు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ రూ. 20 వేల కోట్లతో తీరగ్రామాల్లో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని ముందుకు వచ్చింది. బాపిరాజు దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉంటే ఫలితం ఉండేది. కానీ అంటీముట్టనట్లు వ్యవహరించడంతో అది కూడా కొండెక్కింది. జిల్లాలో బియ్యం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి మౌలిక వసతులూ లేవు. తీరప్రాంతంలో రైస్ పోర్ట్ నిర్మిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని రైతు సంఘం నాయకులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. నరసాపురం-విజయవాడ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు తానే కృషి చేశానని తరచూ ఆయన చెప్పుకుంటుంటారు. కానీ ఇది నాలుగు దశాబ్దాలుగా ఉన్న ప్రతిపాదనే. దీనికి ఎప్పుడో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. భీమవరంలో బైపాస్ రోడ్డు వద్ద నిర్మించిన రైల్వే ట్రాక్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఆయన అనుమతులు ఇప్పించలేకపోయారు. పదేళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బాపిరాజు ప్రజలకు అందుబాటులో ఉన్నదీ అంతంత మాత్రమే. తిరుమల శ్రీవారి దర్శనమైనా తేలిగ్గా దొరుకుంతుందేమో కానీ బాపిరాజు కటాక్షం గగనమేనన్న విమర్శలూ ఉన్నాయి. -
ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్
*కాంగ్రెస్‌కు జిల్లాలో ఏకైక అభ్యర్థి కనుమూరి *నిస్తేజమైన పార్టీకి పరమ భక్తుడిగా గుర్తింపు * ఆఫర్లో నరసాపురం ఎంపీ టికెట్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రమే మిగిలారు. సమైక్యాంధ్ర ద్రోహిగా, కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా పేరు సంపాదించుకున్న బాపిరాజుకే ఈసారి నరసాపురం ఎంపీ టికెట్‌ను ఆ పార్టీ కేటాయించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బాపిరాజు పోటీచేయనున్నారు. పెద్ద మీసాలు అలంకారానికే తప్ప విభజన విషయంలో తానేమీ చేయలేనని అప్పట్లోనే ఆయన ఒప్పుకోవడం గమ నార్హం. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎంపీగా ఉండి కూడా తానేమి చే యలేనని చేతులెత్తేసిన ఘనత బాపిరాజుకే చెందుతుందని ఆ పార్టీనేతలే విమర్శించారు. అలాంటి వ్యక్తి మినహా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వేరే దిక్కులేకుండా పోయింది. ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ మునిసిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి నిలబడే అభ్యర్థులే కరువయ్యారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతానికి అభ్యర్థులు లేకపోవడంతో పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న బాపిరాజు పేరును ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లోనూ నరసాపురం ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కనుమూరి చెబుతున్నారు. ఒన్ ఫ్లస్ ఒన్ ఆఫర్లో సీటు సంపాదించిన బాపిరాజుకు నియోజకవర్గంలో కొంచెం కూడా ఆదరణ లేకపోవడం విశేషం. 2009లో కేవలం వైఎస్ ప్రభంజనంతోనే కనుమూరి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గానూ నియమితులయ్యారు. పదవులు పొందడం మినహా నియోజకవర్గానికి ఆయన చేసిందేమి లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
‘ఇప్పుడు పోటీచేస్తే 2019లోనూ టికెట్’
ఆకివీడు: ఈ ఎన్నికల్లో పోటీచేసిన వారికే 2019 ఎన్నికల్లోనూ టికెట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరామని, ఆ భరోసాతోనే ప్రస్తుతం కార్యకర్తలు సూచించిన వారికి టికెట్లు కేటాయించనున్నట్టు ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరు బాపిరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అయిభీమవరంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశంతో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీచేయనున్నట్టు చెప్పారు. తను పోటీ చేయడంతో పాటు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత చేపట్టాలని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తనను కోరారని అన్నారు. అయితే, నర్సాపురం లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల బాధ్యత తీసుకుంటానని, మిగిలినవాటిలో డీసీసీ అధ్యక్షుడికి సహకరిస్తానని చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా ఇప్పుడు పోటీచేసిన వారికే 2019లో కూడా టికె ట్ ఇవ్వాలని తాను బొత్స సత్యనారాయణతో చెప్పానన్నారు. రాష్ట్ర విభజన తనకు ఎంతో మనస్తాపం కలిగించిందని, అయితే 2009 ఎన్నికల్లోనే తమ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొందన్నారు. విభజన విషయం కొత్తగా చూపిస్తూ పార్టీని నిందించడం సరికాదన్నారు. తాను జీవిత కాలం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. -
మా ఆవిడకు ఓటేయరూ!!
పొడవాటి బుర్ర మీసాలు.. బట్టతల.. భారీ విగ్రహం.. ఇవన్నీ ఒక్కసారి చెబితే చాలు, ఆయన పేరేంటో ఆ మనిషేంటో వెంటనే తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. టీటీడీ చైర్మన్, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి, ఎన్నికలు రాగానే ప్రతి ఒక్కరినీ అక్కా, చెల్లీ, అల్లుడూ అంటూ సొంత మనుషుల్లా పలకరించి ఎలాగోలా గెలిచేయడం ఆయనకు ఇన్నాళ్లూ అలవాటు. కానీ ఇప్పుడు అలాంటిది ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా.. నరసాపురం నుంచే బరిలోకి దిగుతారా.. లేదా అక్కడ తన భార్య అన్నపూర్ణను పోటీ చేయిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ ప్రాంతంలో వినిపిస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి చేపట్టడానికి కొద్ది సమయం ముందు ఆయనను స్వయంగా కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం అందించిన వ్యక్తి.. బాపిరాజు. ఆయన గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికై రాష్ట్ర్ర దేవాదాయ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు. విభజన నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడుతున్న కనుమూరి.. తన బదులు తన భార్యను ఎన్నికల బరిలో దింపడం ద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాని చూస్తున్నారట. అన్నపూర్ణమ్మకు నరసాపురం, భీమవరం, పాలకొల్లు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాలలో ముఖ పరిచయాలు ఉండటంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. టీటీడీలో ఏ కార్యక్రమం జరిగినా ఈ దంపతులు ఇద్దరూ కలిసే పాల్గొంటారు. కనుమూరి రాజకీయ విజయం వెనుక అన్నపూర్ణమ్మ ఉన్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. దీంతో ఆమెను రంగంలోకి దింపడం ద్వారా కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా కొనసాగడంతో పాటు కొత్తముఖాన్ని ప్రజలకు పరిచయం చేసినట్టు ఉంటుందని కనుమూరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాపిరాజు తమ్ముడి కుమారుడు రఘురామకృష్ణంరాజు ప్రత్యర్ధిగా నర్సాపురం బరిలో ఉండటం వల్ల కనుమూరి పోటీకి దిగుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి అడుగు పెడుతుండటంతో ముందు చూపుగా తన భార్యను రంగంలోకి దింపాలనే ఆలోచన ద్వారా కొత్త ఎత్తుగడకు తెరలేపారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అధిష్టానానికి విధేయంగా ఉండి.. తర్వాత రాజ్యసభ సీటు తెచ్చుకోవచ్చన్నది బాపిరాజు ఐడియానట. ఇదే సమయంలో సీఎం కిరణ్ తోనూ కనుమూరి సత్సంబంధాలు కొనసాగిస్తుండటం విశేషం!! -
భక్తుల ఆందోళనపై త్రిసభ్య కమిటీ:బాపిరాజు
వైకుంఠ ఏకాదశ పర్వదినం సందర్భంగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనపై పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే వైకుంఠ ఏకాదశ సందర్భంగా వీఐపీ టికెట్ల జారీలో జరిగిన అవకతవకలపై కమిటీ వేసి విచారణ జరపాలని టీటీడీ పాలక మండలి సభ్యులు కన్నయ్య, శివప్రసాద్‌లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజును డిమాండ్ చేశారు. శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కొనుగోలు విధానంలో పారదర్శకత లేదని వారు ఆరోపించారు. ప్రసాదానికి అవసరమైన ముడి సరుకుల కొనుగోలు విషయంలో గతంలో టీటీడీ విధించిన నిబంధనలు మార్పు చేయాల్సిన అవశ్యకత ఉందని కన్నయ్య, శివప్రసాద్‌లు పేర్కొన్నారు. -
'దావూద్ గ్యాంగ్ కు దర్శనం మాట వాస్తవమే'
-
'దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమే'
తిరుపతి: తిరుమల కొండకు వచ్చే భక్తులు ధర్మాన్ని పాటించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. భక్తులపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. భవిష్యత్తులో ఇక ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు భక్తితో పాటు ధర్మాన్ని కూడా పాటించాలన్నారు. మాఫియా డాన్ దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమేనని బాపిరాజు తెలిపారు.అయితే వారు దావూద్ అనుచరులను తమకు తెలియదన్నారు. మహరాష్ట్ర మంత్రితో వచ్చారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు. -
టీటీడీ ఛైర్మన్, ఈవోలపై కేసులు!
వైకుంఠ ఏకదశి రోజున ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ మండిపడింది. శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలపై ప్రైవేట్ కేసును దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. వైకుంఠ ఏకదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం తిరుమల భక్తులతో పోటెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రులు, ప్రముఖులు తదితర వీవీఐపీలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దాంతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందంటూ సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అయితే తిరుమలలో ఆందోళనలు నిషేధం కావటంతో ధర్నా చేసిన భక్తుల (గుర్తుతెలియని వ్యక్తుల)పై ఏవీఎస్వో గోవిందరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించటం వంటి అభియోగాలతో తిరుమలలోని టూ టౌన్ పోలీసులు సెక్షన్-341 ప్రకారం కేసు నమోదు చేశారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్న వ్యక్తులు, టీటీడీ విజిలెన్స్ తీసిన వీడియో, ఫొటోల ఆధారంగా ఆందోళన చేసిన భక్తులను గుర్తించనున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్‌కు చెందిన పలువురిని గుర్తించినట్టు సమాచారం. -
కోడి పందేరం
ఏలూరు, సాక్షి ప్రతినిధి : సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు నిర్వహించేందుకు డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో గతం కంటే ఘనంగా పందేలు నిర్వహించేందుకు బడాబాబులు సన్నద్ధమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పెద్దలు, అధికార యంత్రాంగం అండదండలు తోడవడంతో పందేలకు ఇప్పటికే చాలావరకూ రంగం సిద్ధమైపోయింది. వీటిని అడ్డుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటిలా హెచ్చరికలు జారీ చేస్తున్నా ఖాతరు చేసే పరిస్థితి నిర్వాహకుల్లో కనిపించడంలేదు. ఏటా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో భీమవరం పరిసర ప్రాంతాలతోపాటు మెట్టలోనూ కొన్నిచోట్ల భారీఎత్తున పందేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భీమవరం పరిసరాల్లో జరిగే పందేలకైతే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారడంసర్వసాధారణ విషయంగా మారిపోరుుంది. వీటిని ఆపడం ఎవరితరం కావడం లేదు. నిర్వాహకుల ధన, అంగ బలానికి అధికారం దాసోహమవుతోంది. భారీ సన్నాహాలు నరసాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐ.భీమవరంలో పందేలు సాధారణ ప్రజలు ఊహించని రీతిలో నడుస్తారుు. కోడిపంద్చే పేరు చెబితే రాష్ట్ర స్థారుులో ఐ.భీమవరం పేరు మార్మోగుతుంది. సంక్రాంతి మూడురోజులూ ఇక్కడ నడిచే పందేల విలువ రూ.60 కోట్ల నుంచి రూ.70కోట్లకు పైనే ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి రూ.లక్ష నుంచి రూ. 20 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ పందాల్లో ఒడ్డుతారు. ఈసారి పందేలకు ఇప్పటినుంచే బరులను సిద్ధం చేస్తున్నారు. వీఐపీ గ్యాలరీలు కట్టేందుకు సామగ్రిని సిద్ధం చేశారు. భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, భీమవరం మండలంలోని వెంప గ్రామాల్లోనూ కోట్లాది రూపాయల పందేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నారుు.. వెంపలో బరుల కోసం ట్రాక్టర్లతో పొలాలను చదును చేస్తున్నారు. ప్రకృతి ఆశ్రమంలో గ్యాలరీలకు రంగులు వేస్తున్నారు. కాళ్ల మండలం మహదేవపట్నం, జువ్వలపాలెంలోనూ భారీ పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోనూ... జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం తదితర ప్రాంతాల్లోనూ పందేలు పెద్దఎత్తున జరుగుతాయి. కొద్ది సంవత్సరాల నుంచి ఏలూరు సమీపంలోని కొప్పాక, దుగ్గిరాల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పందేలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పందేలకు బాగా గుర్తింపు వచ్చింది. నిర్వాహకుల రహస్య సమావేశం పందేలను ఎలా నిర్వహించాలనే దానిపై నాలుగురోజుల క్రితం డెల్టాలోని పందేల నిర్వాహకులంతా భీమవరం సమీపంలోని ఒక గ్రామంలో సమావేశమైనట్టు తెలిసింది. పందేల నిర్వహణలో అందరూ ఒకే మాటపై ఉండాలని, ఆటంకాలు ఎదురైతే ఎలా ముందుకెళ్లాలనే విషయాలను వారు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఎప్పటి మాదిరిగానే ఇక్కడ జరిగే పందేల జోలికి ఎవరూ రాకుండా ముందే ప్రభుత్వస్థాయి పెద్దలతో మాట్లాడుకోవాలని నిర్ణయించుకు న్నట్టు తెలిసింది. ఇందుకోసం అంతా కలిసి పెద్దమొత్తాల్లో చందాలు కూడా పోగుచేసినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎవరెవరిని పిలవాలి, పోలీసు ఉన్నతాధికారులు, ఇతరులను ఎలా మేనేజ్ చేయాలి, దేనికెంత ఖర్చవుతుందనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. పందేలకు రాయలసీమ, తెలంగాణ జిల్లాల ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలను కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితమే భీమవరంలోని లాడ్జిలు, అతిథిగృహాలు, ప్రైవేటు అతిథిగృహాలు బుక్ అయిపోయాయి. పోలీసుల తీరు మామూలే! పందేలకు భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. నాలుగు రోజుల క్రితం ఏలూరు రేంజి డీఐజీ విక్రంమాన్సింగ్ నరసాపురం వచ్చినప్పుడు పందేలను అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా అంతటా పందేలకు బరులు సిద్ధమవుతున్నా వాటిని ఆపే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఒకవేళ చేసినా చివరి నిమిషంలోనైనా వెనక్కి రాక తప్పదని కిందిస్థాయి పోలీ సు అధికారులు చెబుతున్నారు. పందేల నిర్వాహకులు కీలక వ్యక్తులను రంగంలోకి దింపి తమకు అడ్డురావద్దని అధికారులకు చెప్పించుకోవడం ఏటా జరుగుతోంది. దీనికిమించి అన్ని స్థాయిల్లోని అధికారులను నిర్వాహకులు మామూళ్లతో మత్తెక్కిస్తుండటంతో వారెవరూ నోరు మెదపడం లేదు. -
ఎంపీ కనుమూరి స్వగ్రామానికి రాష్ట్రపతి
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 29న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామం ఐ.భీమవరం వెళ్లనున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరంలో కొత్తగా నిర్మించిన వేద పాఠశాల భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రూ. కోటి టీటీడీ నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని గతేడాది అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేత ప్రారంభింపచేయాలని కనుమూరి భావించారు. అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో సాధ్యపడలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్రపతిని రప్పించి ప్రారంభోత్సవం చేయిస్తున్నారు. రాష్ట్రపతి 29న ఉదయం 11 గంటలకు జిల్లాలో అడుగుపెట్టి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళతారని సమాచారం. ఇక కనుమూరి కొత్తగా నిర్మించి ఇటీవలే గృహప్రవేశం చేసిన భవంతిలో రాష్ట్రపతి విడిదికి ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తున్నారంటేనే అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. అలాంటిది దేశ ప్రథమ పౌరుడు జిల్లాలో పాదం మోపుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు. ఆయన వెంట జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ) ఉంటారు. రాష్ట్రపతి ప్రయాణించే హెలికాఫ్టర్‌తో పాటు మూడు హెలికాప్టర్లు వెంట వచ్చే అవకాశం ఉంది. -
తప్పించుకు తిరుగువారు..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనాగ్రహానికి స్పం దించడం లేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాలకు చలించ డం లేదు. ఓట్లేసి గెలి పించిన జనం ప్రయోజనాల కంటే, అధిష్టానం అనుగ్రహమే ముఖ్యమనుకొంటున్నారు. సాటి సీమాంధ్ర ఎంపీలతో కలసి సమైక్యాంధ్రను కాపాడేందుకు ఇసుమంత ప్రయత్నమూ చేయడం లేదు. తిరుపతి ఎంపీ చింతా మోహన్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నరసాపురం లోక్‌సభ సభ్యుడు కనుమూరి బాపిరాజులకు సమైక్యవాదం కంటే పార్టీ, పదవులే ముఖ్యమయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినా వీరు స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పక్క నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. అయితే తిరుపతికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అధిష్టానానికి ఎక్కడ ఆగ్రహం కలుగుతుందో అన్న భయంతో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. వీరి వైఖరి పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అవిశ్వాస తీర్మానాలపై సంతకాలు చేయని సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించాల్సిందిగా ఇప్పటికే ఏపీఎన్జీవోల సంఘం పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతా మోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతా మోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. దీంతో, ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్లో హల్చల్ చేస్తుండగా చింతా మోహన్మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గ ట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు. పిలుపునిచ్చింది. గతంలో సీమాంధ్రకు చెందిన మెజారిటీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో సమైక్య వాణి వినిపించి సస్పెండ్‌కాగా చింతా మోహన్ మాత్రం వారికి దూరంగా ఉన్నారు. కొందరు ఎంపీలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజీనామాలు సమర్పించినా చింతామోహన్ ఆ ఆలోచనే చేయలేదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మొదటి నుంచి దూరంగానే ఉంటున్న చింతామోహన్ పార్లమెంటులోనూ ఉద్యమిస్తున్న సీమాం ధ్ర ఎంపీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. సాటి ఎంపీలతో కలసి ఒక్కసారి ఆంటోని కమిటీ సమావేశానికి వెళ్లడం మినహా సమైక్యాంధ్రకు సంబంధించి ఆయన ఇంతవరకూ చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జేఏసీ నేతలు ఆయన ఇంటిని ముట్టడించినా, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రాజీనామా చేస్తే తిరిగి గెలిపిస్తామంటూ ఎన్జీవోల జేఏసీ ప్రకటించినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఉద్యమానికి దూరంగా ఉన్న ఆయనకు ఇటీవల పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి లభించడం ఉద్యమకారులను మరింతగా రెచ్చగొట్టింది. ఉద్యమకారులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలను పెంచాలని భావిస్తున్నారు. జిల్లాకే చెందిన మరో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్లో హల్చల్ చేస్తుండగా చింతామోహన్ మాత్రం సమైక్యానికి మొహం చాటేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వైఖరిలో మార్పురాకుంటే రానున్న ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు కామెడీతో కాలక్షేపం చేస్తున్నారు. సమైక్య ఉద్యమంలో గట్టిగా పాల్గొంటే పదవి ఎక్కడ ఊడుతుందో అన్న భయంతో తప్పించుకు తిరుగుతున్నారు. -
విభజన నరకాసురుల వధ
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని వినూత్న రీతిలో కొనసాగిస్తోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని, వారిని రాజకీయంగా వధించాలని కోరుతూ తిరుపతి సమీపంలో తుమ్మలగుంట కూడలిలో వారి చిత్రపటాలతో దిష్టిబొమ్మను తయారుచేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలతో తయారుచేసిన ఈ సెట్టింగ్‌ను పేల్చివేసి ’విభజన నరకాసురుల వధ’ నిర్వహించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం నిర్వహించారు. పార్టీ నేత కొణతాల రామకృష్ణ హోమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌ర్యాలీ తీశారు.అదే విధంగా సీమాంధ్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఎంపీ బాపిరాజుకు సమైక్య సెగ: టీటీడీ చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్య సెగ తగిలింది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆయన కాళ్లుపట్టుకొని సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. బాపిరాజు మాట్లాడుతూ త్వరలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయపార్టీలు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపితే విభజన ఆగిపోతుందని చెప్పారు. కొనసాగుతున్న సమైక్యపోరు రాష్ర్ట విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం గురువారం 93వ రోజుకు చేరింది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా బయట సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో ఉద్యమం ప్రారంభమై 80 రోజులు పూర్తయిన సందర్భంగా 216 జాతీయ రహదారిపై 80 ఆకారంలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీ ఎన్జీఓ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా ఆర్టీసీ ఎన్ఎంయూ సభ్యులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. -
కనుమూరి బాపిరాజు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం
సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు పదవులకు రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడం ద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని రాష్ట్ర రైతు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అందులోభాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివిడు మండలం ఐ. భీమవరంలో నరసాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు నివాసాన్ని బుధ, గురువారం ముట్టడించాలని నేతలు పిలుపు నిచ్చారు. విభజనను నిరసిస్తూ బాపిరాజు రాజీనామా చేయనందుకు నిరసనగా నేడు, రేపు ఆయన నివాసం వద్ద స్నానాలు, నిద్ర, భోజనాలు అక్కడే చేయాలని రాష్ట్ర రైతు జేఏసీ నేతలు మంగళవారం వెల్లడించిన విషయం విదితమే. -
ఆకివీడులో ప్లెక్సీ గొడవ
-
కేంద్రానికి వివరించగలిగాం: కనుమూరి
ఢిల్లీ: తాము సస్పెండ్ అవడం ద్వారా తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్రానికి వివరించగలిగామని ఎంపి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిల విందు సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందుకు అందరూ కలిసి వెళ్లాలని ఎంపీల అభిప్రాయంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయంలో ఉన్న పరిస్థితులకు రాజకీయ నాయకులే కారణమని కనుమూరి విమర్శించారు. తెలంగాణ అంశంని అందరూ రాజకీయం అంశం కోసం వాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. విందు సమావేశంలో కేంద్ర మంత్రి జెడి శీలం, కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. -
తిరుమల బస్సులు వెళ్తున్నాయి
తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగిపోయినట్లు టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కనుమూరి బాపిరాజు చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది అలిపిరి నుంచి తిరుమలకు బస్సులు నడిపించేందుకు దయతో అంగీకరించారని, అందువల్ల తిరుమల వెళ్లే భక్తులు సులభంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు బాపిరాజు తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ నివాసంలో సమావేశం అయిన తర్వాత పార్లమెంటు వద్దకు చేరుకున్న ఆయన.. 'సాక్షి'తో మాట్లాడారు. యూపీఏ-2 ప్రభుత్వం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే తమ పార్టీ ఎంపీందరికీ ఈ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలంటూ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ, దేశం మొత్తానికి సంబంధించిన, జాతి ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు కాబట్టి దీనికి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు చూచాయగా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలతో కూడా ఈ మేరకు చర్చించినట్లు తెలుస్తోందని, అందరూ కూడా ఈ బిల్లుకు సహకరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర విభజన విషయమై ఆయన మాట్లాడుతూ గతంలో తాను వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పని చేశానని, అప్పట్లో మొత్తం ఆదాయంలో దాదాపు 75 శాతం హైదరాబాద్ నుంచి, మిగిలిన దాంట్లో కూడా సింహభాగం సీమాంధ్ర నుంచి వచ్చేదని, అతి తక్కువ వాటా మాత్రమే తెలంగాణ నుంచి వచ్చేదని ఆయన చెప్పారు.