'దావూద్ గ్యాంగ్ కు దర్శనం మాట వాస్తవమే' | kanumuri bapiraju gets back on cases of devotees | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 16 2014 4:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM

తిరుమల కొండకు వచ్చే భక్తులు ధర్మాన్ని పాటించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. భక్తులపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. భవిష్యత్తులో ఇక ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు భక్తితో పాటు ధర్మాన్ని కూడా పాటించాలన్నారు. మాఫియా డాన్ దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమేనని బాపిరాజు తెలిపారు.అయితే వారు దావూద్ అనుచరులను తమకు తెలియదన్నారు. మహరాష్ట్ర మంత్రితో వచ్చారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement