బాపిరాజు ఇప్పుడేం చేయబోతున్నారు?
తిరుపతి: పాలకమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులు టీటీడీకి అందాయి. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులకు లేఖల ద్వారా ఉత్తర్వులు పంపించారు. దీంతో గడవుకు 11 రోజుల ముందే టీటీడీ పాలకమండలి రద్దయింది. బాపిరాజు పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. రాష్ట్రంలోని దేవాలయాల పాలకమండళ్లను రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.
టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి తనకు తానుగా రాజీనామా చేయనని బాపిరాజు ఇంతకుముందు ప్రకటించారు. పదవీకాలం పూర్తయ్యే వరకు గానీ.. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు గానీ పదవిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పాలకమండలిని రద్దు చేస్తూ అధికార ఉత్తర్వులు వెలువడంతో బాపిరాజు ఇప్పుడేం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.