TTD Trust Board
-
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్ నిర్మాణం చేపట్టాలని బోర్డు సూచించింది. టీటీడీ బంగారు నగలు, డిపాజిట్లతోపాటు పలు విషయాలపై పాలకమండలి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్ టర్మ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందన్న సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు అనేకసార్లు లేఖ రాసినట్లు పాలకమండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. (దేవుడు కూడా చట్టానికి అతీతం కాదు) బంగారు డిపాజిట్ పై చర్చించిన సాలక మండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్ టర్మ్ డిపాజిట్ చెయ్యాలని నిర్ణయించారు. పాలకమండలి సభ్యుడు పార్థసారథి అభ్యర్థన మేరకు విజయవాడ, పోరంకిలో కళ్యాణమండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలపై చర్చించారు. తిరుమలలో పెరుకుపోయినట్లు 7 టన్నులు వ్యర్థాలను తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందింంచారు. వీటితోపాటు టీటీడీ ఎలక్రికల్ విభాగంలో పని చేస్తున్న 53 కార్మికుల కాంట్రాక్టు మరో రెండు సంవత్సరాల పెంపుకు ఆమోదం తెలిపింది. సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. (ఆస్తుల విక్రయ ఆలోచన విరమించుకున్నాం) శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం అధిక మాసం సందర్భంగా ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వహణ కరోనా కారణంగా వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించలేని పరిస్థితి బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదుల నిర్మాణం: టీటీడీ ఛైర్మన్ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం -
టీటీడీ పాలక మండలి సభ్యులు వీరే
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం దాని చట్టంలో సవరణలు చేసిన నేపథ్యంలో 24 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం గతంలోనే నియమించింది. తాజాగా నియమించిన సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవాాదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవో పాలక మండలిలో ఎక్స్ అఫిషీయో సభ్యులుగా కొనసాగుతారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సమాజ సేవకులకు చోటు కల్పించింది. టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా.. 1. కే.పార్థసారథి (ఎమ్మెల్యే) 2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే) 3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే) 4. పరిగెల మురళీకృష్ణ 5. కృష్ణమూర్తి వైద్యనాథన్ 6. నారాయణస్వామి శ్రీనివాసన్ 7. జే.రామేశ్వరరావు 8. వి. ప్రశాంతి 9. బి.పార్థసారథిరెడ్డి 10. డాక్టర్ నిచిత ముప్పవరకు 11 నాదెండ్ల సుబ్బారావు 12 డీ.పీ.అనంత 13 రాజేష్ శర్మ 14 రమేష్ శెట్టి 15 గుండవరం వెంకట భాస్కరరావు 16 మూరంశెట్టి రాములు 17 డి.దామోదర్‌రావు 18 చిప్పగిరి ప్రసాద్‌కుమార్ 19 ఎంఎస్ శివశంకరన్ 20 సంపత్ రవి నారాయణ 21 సుధా నారాయణమూర్తి 22 కుమారగురు (ఎమ్మెల్యే) 23 పుత్తా ప్రతాప్‌రెడ్డి 24 కె.శివకుమార్ ఎక్స్ అఫీషియో సభ్యులు.. 1 రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్) 2 దేవాదాయ శాఖ కమిషనర్ 3 తుడా చైర్మన్ 4 టీటీడీ ఈవో -
టీటీడీపై పిటిషన్; హైకోర్టును ఆశ్రయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్విటర్లో స్పందించారు. ‘తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఇది ఒక మంచి ప్రారంభం’ అని ఆయన పేర్కొన్నారు. -
శ్రీవారి దర్శనం రద్దు చేసే యోచనలో బోర్డు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ నెల 14న అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. ఇక ఆగష్టు 12 నుంచి 16 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ సమయంలో స్వామి వారి దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, పాలక మండలి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్ : స్వామి
న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో గత కొంతకాలం నుండి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో టీటీడీ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు. బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి భార్యకు చోటు కల్పించడం, టీడీపీ ఎమ్మెల్యే అనితకు సైతం బోర్డు మెంబర్‌గా నియమించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఏపీ ప్రభుత్వం ఆమె విషయంలో వెనక్కి తగ్గింది. -
బాబు లేఖపై తీవ్రంగా స్పందించిన ఐవైఆర్
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆభరణాల అంశంలో హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత విచారణ అవసరం ఉందా.. లేదా అని నిర్ణయించుకోవాలని సూచించారు. శ్రీవారి ఆభవరణాల విషయంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డిలపై పరువు నష్టం వేయడం అర్థరహితమని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ దుమారం నుంచి తమను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇది చేసి ఉంటే వారికి మంచిది కాదని హితవు పలికారు. న్యాయస్థానం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్లు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు, విజయసాయి గారి మీద పరువునష్టం దావాలు కూడా అర్థరహితం అవుతాయి’, ‘ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుందని’ ఐవైఆర్ కృష్ణారావు వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఐవైఆర్ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో హైకోర్టు జడ్జి న్యాయ విచారణ కోరారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆ స్థాయిలో విచారణ అవసరమని భావించి కోరితే అది వేరే విషయం. అటువంటప్పుడు దీక్షితులు విజయసాయి గారి మీద పరువునష్టం దావా లు కూడా అర్థరహితం అవుతాయి. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 ఆ విధంగా కాకుండా కేవలం రాజకీయ దుమారం నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం గా న్యాయ విచారణ కోరుకుంటే అది అర్ధ రహితం అవుతుంది. ఉన్నత న్యాయస్థానం తమ అమూల్య సమయాన్ని దానికోసం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే రాజకీయంగా దానిని ఎదుర్కొనవలసి ఉంటుంది. — IYRKRao , Retd IAS (@IYRKRao) 28 June 2018 -
పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారం లేదు
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. అనంతరం శ్రీ విద్యాగణేషానంద భారతీ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి సన్నిధిలో ఉన్న పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారమే లేదని స్వామీజి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీటీడీలో తలెత్తుతున్న వివాదాలు, అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో శ్రీవారి భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని విద్యాగణేషానంద భారతీ స్వామి తెలిపారు. -
దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తాం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల ఉద్వాసనకు గురైన దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థాన వ్యవహరాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ మంగళవారం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. 24 ఏళ్లపాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు దేవస్థాన వ్యవహారాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్ మండిపడ్డారు. ఆరోపణలు చేసేముందు పాలక మండలి దృష్టికి తేవాల్సిందని అన్నారు. శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు పెడతామనీ, దీనిపై ఆగమ శాస్త్ర పండితుల సలహాలను తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. ఆభరణాల పూర్తి భద్రత టీటీడీదేనని అన్నారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వారు వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా దళిత, గిరిజన వాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఒక్కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలోని నాగలాపురంలో వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. తిరుమలలో 70 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
అర్చకులకు రిటైర్మెంట్ మంచిది పద్ధతి కాదు : ఐవైఆర్
సాక్షి, చిత్తూరు : టీటీడీ అర్చకులకు రిటైర్మెంట్ అనేది మంచిది పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆదివారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అభివృద్ధి వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై చర్చించారు. ఈ సదస్సుకు జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు. సదస్సులో ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘అమరావతి ఎవరి రాజధాని’ పుస్తకాన్నా ఈశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఐవైఆర్ మాట్లాడుతూ.. టీటీడీ మ్యానిఫెస్టోలో అర్చకుల పదవీ విరమణ అన్నది ఉండదని ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు పదవీ విరమణ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అర్చకుల పదవీ విరమణ అనేది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. తిరుమలలో పూజా కైంకార్యాలు సరిగా జరగడం లేదని రమణ దీక్షితుల భావన అని, ఇందుకు పరిపాల విభాగమే కారణమని ఆయన పేర్కొన్నారని ఐవైఆర్ గుర్తుచేశారు. ఆరోపణలపై విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. నేను ఈవోగా ఉన్నపుడు గొల్ల మండపం పగలగొట్టాలని కొందరు సలహా ఇచ్చారు.. కానీ నేను అందుకు అభ్యంతరం వ్యక్తం చేశానని ఐవైఆర్ గుర్తుచేశారు. శేఖర్‌రెడ్డి టీటీడీ సభ్యుడుగా ఉంటూ కోట్ల రుపాయలతో పట్టుబడటంతో అన్యమతస్తురాలైన అనితను బోర్డు సభ్యురాలిగా నియమించిపుడు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినలేదా.? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రమణ దీక్షితులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే.. టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ఐవైఆర్ మండిపడ్డారు. -
‘విచారణ అంటే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తిరుపతి : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చచెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ స్పష్టం చేశారు. -
లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా
సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు. (చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్) ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు. వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా. -
నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు
సాక్షి, తూర్పుగోదావరి : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటకలుపుతుదని తణుకు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు మడిపండ్డారు. స్వామి సన్నిధిలో ఎన్నో తరాలు నుంచి ఒక యాదవ కులానికి చెందిన వారసులే తొలిత తలుపులు తీసే ఆనవాయితీ ఉండగా దాన్ని ఇప్పుడు సీఎం మంటగలుపుతున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని యాదవులకే అన్యాయం చేయడం చాలా బాధాకమన్నారు. రెవెన్యూ మినిస్టరు ఇప్పుడు టీటీడీ అర్చకులపై కేసులు పెడుతాం, ఎంక్వెరీ చేయిస్తామంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, ఐయినా టీటీడీ వ్యవస్థలో కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటన్నారు. టీటీడీని భంగ పరుచాలనుకుంటే నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఇప్పటికైనా సన్నిధిలో ఆచారం కొనసాగాలి అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయాన్ని మానుకోవాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పుదని, ఈ నిర్ణయాన్ని విరమించకుంటే ప్రజలు ఉద్యమాలకు దిగుతారని హెచ్చరించారు. -
టీటీడీ బోర్డుపై బ్రాహ్మణ సంఘాలు ఫైర్
సాక్షి, విజయవాడ: ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పట్ల టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. టీటీడీ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశాయి. టీటీడీలో జరుగుతున్న అవకతవకలను బయల పెట్టినందుకే బోర్డు రమణ దీక్షితులును తొలగించడానికి కుట్ర పన్నుతోందని తెలిపారు. ఏ హక్కుతో ఆయనను విధుల నుంచి తొలగిస్తారని బోర్డుని ప్రశ్నించారు. వెంటనే రమణ దీక్షితులుపై చర్యలను వెనక్కి తీసుకొవాలని బోర్డుని కోరారు. టీటీడీ వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాసంగా మారిందని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 19, 20న గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తొందరలోనే దీనికి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే ఓ వివాదస్పద వ్యక్తిని చైర్మన్‌గా పెట్టారని మండిపడ్డారు. -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బుధవారం స్థానిక అన్నమయ్య భవన్లో 17 మంది సభ్యలతో ఈ సమావేశం జరిగింది. కొత్తగా పాలకమండలి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో అందరూ హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు బోర్డు సభ్యులు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘65 ఏళ్లు పైబడితే అర్చకులు పదవీ విరమణ చేయాలి. వంశపారంపర్యంగా వారి కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తాం. ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ డిపాజిట్లపై సబ్‌కమిటీ నియమించాం. గత ఏడాది కాలంగా తీసుకున్న 200 తీర్మానాలుకు సంబంధించి 55 తీర్మానాలుకు ఆమోదం తెలిపాం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రతీనెల పున్వరసు నక్షత్రాన ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీన మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తాం. తిరుమలలో శుభ్రత పర్యవేక్షణకు కమిటీ వేస్తున్నాం. అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై చర్చ జరిగింది. ఆయన అరోపణలపై వివరణ కోరుతాము. వివరణ ఇచ్చాక తగిన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఏడాది ఆభరణాలను గ్రాములతో సహా లెక్కిస్తాం. 65 సంవత్సరాల పైబడిన వారు పదవీ విరమణ అమలు చేస్తే.. రమణ దీక్షితులు కూడా పదవి విరమణ చెయ్యాల్సిదే. 1997లోని చట్టం ప్రకారం సన్నిధి గొల్లలు టీటీడీ ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం 43 మంది మిరాశి అర్చకులు ఉన్నారు’ అని ఆయన వెల్లడించారు. -
ఏడాది తర్వాత కొలువు
ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఏడాది తర్వాత ఏర్పడిన ఈ మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ సుధాకర్‌యాదవ్, 12మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆది నుంచి బోర్డు విషయంలో టీడీపీ నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వచ్చింది. దీంతో అసంతృప్తి స్వరం పెరిగింది. మరోపక్క మిత్రులుగా ఉన్న బీజేపీతో అంతరం పెరిగింది. తప్పని పరిస్థితుల్లో సీఎం బోర్డు ఏర్పాటుచేసినా పలు వివాదాలు చుట్టుముట్టాయి. బోర్డులో అవకాశం దక్కిన ఒక సభ్యురాలు అన్యమత వివాదంతో పక్కకు తొలగాల్సి వచ్చింది. కొత్త బోర్డు నియమించాక టీడీపీలో అసంతృప్తుల స్వరం పెరిగింది. అలకలూ పెరిగాయి. సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ధర్మకర్తల మండలి కొలువుదీరింది. శనివారం చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు మరో 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త బోర్డు నియామకంతో ఏడాది నిరీక్షణకు తెర పడింది. గత బోర్డు పదవీ కాలం గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం అధికారుల పాలనలో గడిపేశారు. తెలుగుదేశం ప్రభుత్వ నాలుగేళ్ల హయాంలో కేవలం రెండేళ్లు్ల మాత్రమే బోర్డు పనిచేసింది. మరో రెండేళ్లు ఖాళీగా ఉంచారు. ఏడాదిగా అధికారుల పాలన ఉండడంతో రూ.2,894 కోట్ల వార్షిక బడ్జెట్‌తో కూడిన టీటీడీలో కీలక నిర్ణయాలు అమ లులో లేవు. రూ.500 కోట్ల మేరకు ఏటా మార్కెటింగ్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటివి బోర్డు అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాయి. శ్రీవారి దర్శనం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం సరికొత్త పథకాలు, కీలక నిర్ణయాల అమలుకు మార్గం ఏర్పడింది. ఇదే టీటీడీ కొత్త బోర్డు టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్, సభ్యులుగా రాయపాటి సాంబశివరావు (ఎంపీ), జీఎస్ఎస్. శివాజీ (ఎమ్మెల్యే), బోండా ఉమామహేశ్వరరావు (ఎమ్మెల్యే), బీకే పార్థసారథి (ఎమ్మెల్యే), చల్లా రామచంద్రారెడ్డి , పొట్లూరి రమేష్‌బాబు, ఇ. పెద్దిరెడ్డి (తెలంగాణ),రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణారెడ్డి, డొక్కా జగన్నాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫి షియో సభ్యులుగా ఎండోమెంట్, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ,టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో సలహా మండలి సభ్యుడి హోదాలో హైదరాబాద్‌కు చెందిన బోదనపు అశోక్‌రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీకి చెందిన స్వప్న, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సంఘ సేవకురాలు సుధానారాయణమూర్తి, ఎండోమెంట్ కమిషనర్ హాజరుకాలేదు. కాగా, పాయకరావు పేట ఎమ్మెల్యే అనితను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ప్రైవేట్ బ్యాంకు రూ.వెయ్యికోట్లపై నిర్ణయం ఎటో? ఇటీవల టీటీడీ రూ.3వేల కోట్లు ఆంధ్రాబ్యాంకు, రూ.వెయ్యికోట్లు ఇండస్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఎక్కువ కోట్ చేసిన తమబ్యాంకును కాదని, ఆంధ్రా బ్యాంకుకు టెండర్ కేటాయించారని విజయాబ్యాంకు ప్రతినిధులు ఆరోపించారు. ఏకంగా రూ.వెయ్యి కోట్లమేర భక్తుల కానుకలతో వచ్చిన డిపాజిట్లను ప్రైవేట్ బ్యాంకు అయిన ఇండస్‌లో డిపాజిట్ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై భక్తుల్లో ఆందోళన ఉంది. ఈవిషయంలో టీటీడీ బోర్డు ఎలాంటి వైఖరి తీసుకుంటోందోనని అందరూ వేచిచూస్తున్నారు. దీనిపై త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో తప్పనిసరిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు సభ్యుడు బోండా ఉమాతోపాటు మరికొంతమంది తెలి పారు. శ్రీవారి లడ్డూ ధరలు, సేవా టికెట్ల ధరల పెంపు అని వార్యమవుతోంది. చాలా కాలంగా చర్చ సాగుతోంది. ధరల పెంపు అంశంపై బోర్డు ఎలాంటి వైఖరి అవలంభిస్తోందనని భక్తులు ఎదురుచూస్తున్నారు. -
గవర్నర్‌కు వీహెచ్‌పీ బహిరంగ లేఖ
-
ఆమెకు పదవి ఇవ్వడం నా పర్సనల్: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నకు సభ్యత్వం ఇవ్వడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రికి భార్యకు అవకాశం ఇవ్వడం తన వ్యక్తిగత (పర్సనల్) విషయమని అన్నారు. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలని, అంతేకాకుండా సదరు మంత్రితో తనకు చాలా ఏళ్లుగా వ్యక్తిగత అనుబంధం ఉందని అందుకే మండలిలో సభ్యత్వం ఇచ్చానని పేర్కొన్నారు. పైగా ఇందులో తప్పేముందని పాత్రికేయులను తిరిగి ప్రశ్నించారు. రిటైర్ అయ్యి ఉద్యోగాలు రాని వారు తనపై విమర్శలు చేస్తూ.. పుస్తకాలు రాస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వాళ్లు తమ పని చూసుకోకుండా ఇలా ప్రవర్తించడం మంచిది కాదంటూ హితవు పలికారు. ఇటీవల తనకు ఏదైనా జరిగితే ప్రజలు రక్షణ కవచంలా ఉండమని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చారు. తాను అలా చెప్పలేదని తనపై కుట్రలకు పాల్పడుతున్నారని, పోలవరం, ప్రత్యేక హోదా, నిధులపై జరిగే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించానంటూ చెప్పుకొచ్చారు. తనపై చాలా మంది చాలా కుట్రలు చేస్తున్నారని, కేసులు పెట్టాలని చూసినా ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. గవర్నర్ వ్యవస్థ వల్ల టీడీపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, దీనిపై చాలాసార్లు గవర్నర్‌కు చెప్పామని, కానీ ఇప్పటికీ గవర్నర్ అలాగే ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమతో మాట్లాడిన అనంతరం గవర్నర్ ఢిల్లీ వెళితే అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లను వాళ్ల పనుల కోసమే పెట్టుకుంటారని విమర్శించారు. తాను పవన్‌పై కానీ, ఇతరులు ఎవ్వరిపైనా బురద చల్లే ప్రయత్నం చేయనని అన్నారు. 2014లో సమన్యాయం కోసం మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. కేంద్రం చాలా నాటకాలు ఆడుతోందని, తమిళనాడులా చేయాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు. కొత్త రాష్ట్రం కోసం బీజేపీతో కలిసి నాలుగేళ్లు ఉన్నామని కానీ కేంద్రం తమను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో తొలిసారి మూడో ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీయే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు వస్తే తామే ప్రధానిని నిర్ణయిస్తామని వెల్లడించారు. -
టీటీడీ బోర్డు నుంచి అనిత ఔట్
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అనిత నియామకంపై అటు ప్రజల్లో, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. గతంలో అనిత ఓ ప్రవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సైతం బయటకు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా బోర్డ్ మెంబెర్ గా తొలగించినట్లు సర్కార్ పేర్కొంది. మంత్రి పదవికోసం ఆశించిన అనితకు రెండుసార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆశాభంగం ఎదురైంది. దీంతో అనిత గత కొద్దికాలం పార్టీ కార్యక్రామాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయంపై పలుసార్లు ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 20న జీవో జారీ చేసింది. అయితే అనిత నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనిత నియామకాన్ని సమర్ధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంతేకాకుండా గతంలో ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని సైతం నెట్‌జన్లు బయటపెట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో స్వచ్చందంగా తప్పుకోవాలంటూ అధిస్టానం ఇచ్చిన సూచన మేరకు అనిత తనను పాలకమండలి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అనిత సభ్యత్వం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీటీడీ వివాదంలో కొత్త మలుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు, ఇతర వర్గాల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వెనక్కి తగ్గారు. టీటీడీ పాలకమండలిలో తనను సభ్యురాలిగా నియమించడం వివాదానికి దారి తీసిందని భావించిన అనిత.. బోర్డు నుంచి తనను తప్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు చంద్రబాబుకు ఎమ్మెల్యే అనిత లేఖ రాశారని సమాచారం. టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితులైన అనిత విషయంలో హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం.. -
టీటీడీ బోర్డు కూర్పు అహంకార పూరిత చర్య
సాక్షి, అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకవర్గ సభ్యుల్లో అర్హులు కానీ వారిని, అన్యమతస్తులను నిమమించి ప్రభుత్వం అపచారం చేసిందని అన్నారు. ఇది పొరపాటు కాదని, అహంకార పూరిత చర్యని ఆయన వాఖ్యానించారు. తాను ఇతర మతాల వారిని, వారి ఆచారాలను గౌరవిస్తానని, ఇది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. భేషజాలకు పోకుండా వివాదాస్పదులను తొలగించి, అర్హులైన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు బీజేపీతో బహిరంగ కాపురం చేసిన ప్రాంతీయ పార్టీలు, నేడు దొంగ చాటుగా కాపురం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ మంత్రి భార్యకి టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడమే ఇందుకు నిదర్శనమని రఘవీరా ఆరోపించారు. -
టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యకు స్థానం
-
భగ్గుమంటున్న హిందూ సంఘాలు
సాక్షి, అమరావతి/సాక్షి, తిరుమల/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి నియామకం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులను, రౌడీయిజం చేసే వారిని, ఆధ్యాత్మిక–సేవా భావం లేనివారిని టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించారని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాది పాటు అధికారుల పాలనలో సాగిన టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియామకంపై హిందూ పీఠాధిపతులు, మఠాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం లెక్కచేయలేదు. అలాగే బోర్డులో సభ్యురాలుగా నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విషయంలోనూ హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాను అన్య మతస్థురాలినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న అనితకు ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో రాజకీయ లబ్ధి కోసం అన్య మతస్థులకు చోటు కల్పించడం దారుణమని హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్త బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాయపాటి సాంబశివరావు అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును బోర్డు సభ్యుడిగా నియమించడంపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో బ్రాహ్మణుల సత్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన బొండాకు టీటీడీ బోర్డులో ఎలా పదవి ఇస్తారని బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు నిలదీశారు. అలాగే తనను టీటీడీ సభ్యుడిగా నియమించడంపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కినుక వహించారు. తాను టీటీడీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వకుండా, సభ్యుడిగా నియమించి అవమానించారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్నా మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగటివర్ సతీమణి సప్నను టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసమే ఆమెకు టీటీడీ బోర్డులో చోటు కల్పించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బోర్డులో తమకు అవకాశం కల్పిస్తారని టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆశించారు. అవకాశం రాని వారు పార్టీకి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు టీటీడీ బోర్డులో తమిళనాడుకు ప్రాతినిధ్యం లేకపోవడం దారుణమని ఆ రాష్ట్రానికి చెందిన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. -
చంద్రబాబు చెంపదెబ్బలు వేసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. హిందువులు, దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో హిందువులందరూ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన టీటీడీ బోర్డులో తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనితను సభ్యురాలిగా నియమించడం హిందువులను అవమానించడం కాదా? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇది వేరే మతాల వాళ్ల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా చెప్పకతప్పదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనిత స్వయంగా ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం హిందువులు, దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకుని, దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ తప్పిదం మళ్లీ చేయనని ప్రజలకు చెప్పాలి..’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘ఇది ధర్మపోరాటం అని చెప్పి కోట్లలో డబ్బులు ఖర్చు చేయడం తప్ప వారు చేసిందేమీ లేదు. మానసిక ఒత్తిళ్లకు.. రకరకాల భయాందోళనలకు సీఎం గురయ్యారు. నిన్న జరిగిన తంతు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకున్నారు తప్పితే ఒక మర్యాద కలిగిన పార్టీ, ఒక హోదా ఉన్న వ్యక్తులు చేసే వ్యవహారంలా లేదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కుటుంబ ప్రతిష్టను, ఎన్టీయార్ పేరును, తెలుగు ప్రజల గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. -
టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. అనిత వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు సందిగ్దంలో పడ్డారు. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన వారిని టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన వీడియోను ఏపీ ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అనిత వ్యవహారంపై అధికారులను చంద్రబాబు నివేదిక కోరారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు ఇబ్బంది లేకుండానిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో టీటీడీ బోర్డులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి టీటీడీ పాలక మండలిని నియమించడానికి ముందుగానే ప్రభుత్వం సభ్యులకు సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తుంది. బొండా ఉమా హిట్లర్.. అతడు అనర్హుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనర్హుడని బ్రాహ్మణ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు విజయవాడ బ్రాహ్మణ సంఘం నేత ముష్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులను తొక్కి ఉమాకు పదవి ఇవ్వడం సరికాదన్నారు. బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలవడానికి కారణం బ్రాహ్మణ సంఘాలే. కానీ గెలిచినప్పటి నుంచి బ్రాహ్మణ సంఘాలకు ఆయన చేసిన మేలు శూన్యమని ఎద్దేవా చేశారు. బొండా ఉమాకు ఆలయ వైదిక ధర్మాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆలయాల్లో నియమాలు తెలియని వ్యక్తికి టీటీడీ పదవులు కట్టబెట్టడం బ్రాహ్మణులను కించపరచడమే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బొండా ఉమా ఒక హిట్లర్ అని.. ఆయనకు అన్ని పదవులు కట్టబెట్టడం దుర్మార్గమని బ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను... బోర్డు సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమా సహా మరికొందరిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. వీడియో సోర్స్: వనిత టీవీ సౌజన్యం..