
టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పట్ల టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. టీటీడీ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశాయి. టీటీడీలో జరుగుతున్న అవకతవకలను బయల పెట్టినందుకే బోర్డు రమణ దీక్షితులును తొలగించడానికి కుట్ర పన్నుతోందని తెలిపారు. ఏ హక్కుతో ఆయనను విధుల నుంచి తొలగిస్తారని బోర్డుని ప్రశ్నించారు. వెంటనే రమణ దీక్షితులుపై చర్యలను వెనక్కి తీసుకొవాలని బోర్డుని కోరారు.
టీటీడీ వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాసంగా మారిందని బ్రాహ్మణ సంఘాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 19, 20న గుంటూరులో బ్రాహ్మణ సంఘాలు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. తొందరలోనే దీనికి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఈ ప్రభుత్వం హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే ఓ వివాదస్పద వ్యక్తిని చైర్మన్‌గా పెట్టారని మండిపడ్డారు.