టీటీడీ ఛైర్మన్గా చదలవాడ !
హైదరాబాద్ : టీటీడీ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. టీటీడీ ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. బోర్డు సభ్యులుగా సీఎన్ రవిశంకర్, భాను ప్రకాశ్ రెడ్డి, అనంత్ (కర్ణాటక), ఆకుల సత్యనారాయణ, పత్తివాడ నారాయణ స్వామి, బండారు సత్యనారాయణమూర్తి నియమించాలని నిర్ణయించారని తెలిసింది.
తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బోర్డు ఛైర్మన్, సభ్యుల దస్త్రంపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అకాశముంది.