Ex.MLA
-
టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. కాగా,18మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని బోర్డు సభ్యులుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. -
టీటీడీ ఛైర్మన్‌గా చదలవాడ !
హైదరాబాద్ : టీటీడీ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. టీటీడీ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. బోర్డు సభ్యులుగా సీఎన్ రవిశంకర్, భాను ప్రకాశ్ రెడ్డి, అనంత్ (కర్ణాటక), ఆకుల సత్యనారాయణ, పత్తివాడ నారాయణ స్వామి, బండారు సత్యనారాయణమూర్తి నియమించాలని నిర్ణయించారని తెలిసింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని బాబు భావిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బోర్డు ఛైర్మన్, సభ్యుల దస్త్రంపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అకాశముంది. -
గీదేందీ శంకరన్నా... యాది మర్సినవా
రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడింది. ఆ ఘనత తమ పార్టీ అధ్యక్షురాలు సోనియ తల్లిదే నంటూ ఢంకా బకాయించి మరీ చెప్పాడు అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియా త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అందుకు సోనియా తల్లింటూ కీర్తించాడు. ఆమె విగ్రహాం ఏర్పాటు చేస్తానని శంకరన్న మీడియా ముందు మీరీ ఓ రేంజ్లో చెప్పాడు. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఓ వేళ ప్రభుత్వం కేటాయించకుంటే... తానే తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లి విగ్రహాం ఏర్పాటు చేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. సోనియా తల్లి విగ్రహాన్ని సొంత ఖర్చులతో విజయవాడ సమీపంలో తయారు చేయించాడు కూడా. ఆ విగ్రహాం తయారవుతున్న దశలో శంకరన్న కుటుంబ సభ్యులతో కలసి సోనియా విగ్రహం తయారీని మరీ పరిశీలించి వచ్చారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఈ వీర విథేయుడైన శంకరన్నకు మాత్రం చోటు దక్కలేదు. దాంతో శంకరన్నకు కోపం కట్టలు తెంచుకుని... తన్నుకొచ్చింది. అధిష్టాన దేవత సోనియాను తెలంగాణలోని నాయకులు ఎవరు కీర్తించని విధంగా బోళా శంకరుడిలా కీర్తించిన తనకు న్యాయం జరగలేదని శంకరన్న లోలోన ఫీలైపోయాడు. అంతే అభ్యర్థుల జాబితాలో తనకు చోటు లేనిపప్పుడు... తన వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లికి చోటు లేదని భావించినట్లు ఉన్నాడు. అంతే సోనియా తల్లి గుడి సోదిలో లేకుండా పోయింది. కనీసం మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఈ గుడి గుర్తుకు వస్తుందేమో చూడాలి. -
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో గత వారం రోజులుగా ఆయన సికింద్రాబాద్ యశోధ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా.. గీట్ల ముకుందారెడ్డి కూనారం గ్రామానికి 1970, 1976లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఆయనది. ఇందులో మూడుసార్లు ఆయన గెలిచారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గీట్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అధిష్టానం భాను ప్రసాదరావుకు టికెట్ ఇచ్చింది. ముకుందరెడ్డికే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఉన్న సీనియర్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం బుజ్జగింపులు, హామీలతో పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. అప్పట్లో అందరికీ గీట్ల టార్గెట్ 1983 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులెందరో వచ్చినా వారందరికీ గీట్ల ముకుందరెడ్డే టార్గెట్. 1983లో గోనె ప్రకాశరావుపై ఓడిపోయిన ఆయన తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన గీట్లను స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి రప్పించుకుని అభినందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోనె ప్రకాశరావు, వేముల రమణయ్య, బిరుదు రాజమల్లు, కాల్వ రాంచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సి.సత్యనారాయణరెడ్డి, విజయరమణారావు ఇలా అందరికీ ఆయనే ప్రత్యర్థి. 2009లో ఓటమి తర్వాత కొంత కాలంపాటు స్తబ్ధుగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని ఏడాదికాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఊరూరా తిరిగి బూత్‌స్థాయి కమిటీలు నియమించారు. ప్రచార బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించారు.