ఫైల్ ఫొటో
టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం
Published Tue, Nov 1 2016 1:09 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ అతిథిగహంలో ఈ సమావేశం జరుగుతోంది. దేవస్థానం పరిపాలన సంబంధిత అంశాలు, ఆలయాల పునరుద్ధరణకు సహకారంతోపాటు తిరుమల ఆలయం, అనుబంధ ఆలయాలు, నిత్యాన్నప్రసాద కేంద్రానికి అవసరమైన సరుకుల కొనుగోళ్లకు అనుమతులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
Advertisement
Advertisement