chadalawada krishnamurthy
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం
-
చదలవాడ చెర వీడుతోంది.. ఆస్తులు పెంచుకోవడమే అజెండా
చదలవాడ కృష్ణమూర్తి.. ఆస్తులు పెంచుకోవడమే అజెండాగా రాజకీయాలు చేస్తుంటారు. ప్రభుత్వ భూములను అవలీలగా ఆరగించేస్తుంటారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసేశారు.. ఆ పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్ పదవి వెలగబెట్టినప్పుడూ వ్యాపార సామ్రాజ్య విస్తరణకే ప్రాధాన్యమిచ్చారు. ఘనత వహించిన చదలవాడ వారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు.. తర్వాత టీడీపీలో కుర్చీలాట ఆడారు.. ప్రస్తుతం జనసేనతో అంటకాగుతున్నారు.. దశాబ్దాలుగా పాలి‘ట్రిక్స్’ సాగిస్తున్నా.. తిరుపతి నగరాన్ని భూకబ్జాలు, దందాలతో చెరబట్టిన ప్రబుద్ధుడిగానే ఆయన పేరు గడించారు.. ఇంతకీ విషయమేమిటంటే ప్రభుత్వ భూములకు చదలవాడ ‘చెర’ వదిలించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. విద్యాసంస్థ పేరిట సర్కారు భూములను అందిన కాడికి మింగేయడంంపై చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తిరుపతి రూరల్ పరిధిలోని దామినేడు గ్రామం సర్వే నంబర్ 131లో ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుంటూ అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేశారు. ఇక్కడితో ఆగకుండా మొత్తం చదలవాడ భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం దామినేడు సర్వే నంబర్ 112/1, 2, 3లో సుమారు 13 ఎకరాలు, సర్వే నంబర్ 115లో 12.5 ఎకరాలు, సర్వే నంబర్ 131లో 39.25 ఎకరాలు, 135లో 7.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి కన్నుపడింది. ఆ భూములకు ఆనుకుని ఉన్న ఓ మోపెడ్ కంపెనీని చదలవాడ కొనుగోలు చేశారు. అంతే.. ఆ తర్వాత మోపెడ్ పరిశ్రమ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, కాలువ, చెరువు పోరంబోకు భూములు అన్నింటినీ క్రమక్రమంగా ఆక్రమిస్తూ వచ్చారు. గతంలో ఆ భూములు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉండేవి. సరిగ్గా అప్పట్లోనే ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఈయన.. పదవిని అడ్డు పెట్టుకుని పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ భూములన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. చదవండి: (వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్) కళాశాలల పేరుతో కబ్జా మోపెడ్ కంపెనీ ఆస్తులను కొనుగోలు చేసిన చదలవాడ ఆ భవనాలకు మరమ్మతులు చేపట్టారు. పక్కనే ఉన్న భూముల్లో పలు కళాశాలలను స్థాపించారు. చదలవాడ కృష్ణతేజ డెంటల్ కాలేజీ, చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల, ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్టడీస్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఇంకా ఎంసీఏ వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులు అందిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేయటంతో అధికారులు, నాయకులు ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసం చేయలేదు. అదే అదనుగా చదలవాడ కళాశాలల ముసుగులో కాలువ, చెరువు పోరంబోకు భూములను పూడ్చివేశారు. ప్రభుత్వ భూములను కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. అడ్డగోలుగా గోడ నిర్మాణం ఇదిలా ఉండగా, కళాశాల వెనుక ఉన్న భూముల్లోని నాలుగు ఎకరాలు తమవేనంటూ పీకే నాగరాజు పిళ్లై, నాగేంద్ర అనే వ్యక్తులు ఈమధ్య తెరపైకి వచ్చారు. తాము 1970 నుంచి సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నా... తాము మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే మూడు వారాల క్రితం చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి అక్కడ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న నాగరాజు పిళ్లై, నాగేంద్ర దీనిపై తిరుపతి రెవెన్యూ, నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవటంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం కలెక్టర్ హరినారాయణన్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే తిరుపతి ఆర్డీవో, రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆక్రమిత స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. మిగిలిన కబ్జా భూములపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చదవండి: (సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం: సజ్జల) సమగ్ర సర్వే దామినేడు రెవెన్యూ గ్రామ పరిధిలో ఆక్రమిత భూములను కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు సమగ్రంగా సర్వే చేయిస్తాం కబ్జాలను అడ్డుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే ఉండదు. – కనక నరసారెడ్డి, ఆర్డీవో, తిరుపతి అవి ప్రభుత్వ భూములే దామినేడులో ఆక్రమణకు గురైన 73.5 ఎకరాలు ప్రభుత్వ భూములే. సిద్ధార్థజైన్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వీటిపై సర్వే చేయించి సర్కారు భూములుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ భూముల్లోని అన్ని ఆక్రమణలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తిగా తొలగిస్తాం. – లోకేశ్వరి, తహసీల్దార్, తిరుపతి రూరల్ -
రూ.500 కోట్ల స్థలం కబ్జా.. అధికారులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ.. దౌర్జన్యకాండకు దిగాడు. కబ్జా స్థలం పరిశీలనకు వెళ్లిన రెవిన్యూ అధికారులను బెదిరించారు. స్థలంలో అడుగుపెడితే కొడతామంటూ హెచ్చరించాడు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. తన వెనుక పదివేల మంది జనం ఉన్నారంటూ చదలవాడ బెదిరింపులకు దిగాడు. రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణమూర్తి 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలం విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. -
వెంకన్న సన్నిధిలో లంక ప్రధాని దంపతులు
సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమ సింగే , తన సతీమణి మైత్రి విక్రమ సింగేతో కలసి గురువారం వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. శ్రీవారిని దర్శించుకోవడంతో ఆధ్యాత్మిక అనుభూతి, ప్రశాంతత చేకూరిందన్నారు. తమిళ జాలర్ల నిర్భంద అంశంపై పరిశీలించి తగిన విధంగా చర్యలు చేపడతామని ఆ దేశ మంత్రి దిగంబరం విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అంతకుముందు విక్రమ సింగే దంపతులకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు, 2017 సంవత్సరం డైరీ, క్యాలెండర్ అందజేశారు. వారి వెంట రాష్ట్ర మంత్రి నారాయణ కూడా ఉన్నారు. -
టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. చైర్మన్ చదలవాడ కష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ అతిథిగహంలో ఈ సమావేశం జరుగుతోంది. దేవస్థానం పరిపాలన సంబంధిత అంశాలు, ఆలయాల పునరుద్ధరణకు సహకారంతోపాటు తిరుమల ఆలయం, అనుబంధ ఆలయాలు, నిత్యాన్నప్రసాద కేంద్రానికి అవసరమైన సరుకుల కొనుగోళ్లకు అనుమతులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, భాస్కర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. -
చదలవాడపై అట్రాసిటీ కేసు
నిండ్ర: ఫ్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో తలెత్తిన వివాదాలకు సంబంధించి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బుధవారం నమోదైంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొప్పేడు దళితవాడకు చెందిన షణ్ముగం ఫిర్యాదు మేరకు... చదలవాడ కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ నెల 25న కర్మాగారంలో గొడవ సృష్టిస్తుంటే తాము అడ్డుకున్నామని, ఆ సమయంలో తనను చదలవాడ అనుచరులు కులం పేరుతో దూషించారంటూ అదే రోజున షణ్ముగం నిండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అనంతరం బుధవారం చదలవాడ కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఏఎస్ఐ దేవదాసు తెలిపారు. -
కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి
చంద్రగిరి(చిత్తూరు): కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామిని శుక్రవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి వెంట టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు. -
వెంకన్న కొలువులో మరో ఏడాది
► టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు ► సోమవారం జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలికి మరో ఏడాది పొడిగింపు ఇచ్చారు. చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీ వరకు పదవిలో కొనసాగనుంది. టీఆర్ఎస్ పార్టీలో చేరి ట్రస్టుబోర్డు సమావేశాలకు గైర్హాజరైన టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తొలగిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఎండోమెంట్ చట్టం, తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి చట్టం ప్రకారం ధర్మకర్తల మండలి పదవీ కాలం రెండేళ్లు. తొలి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 2014 జూన్‌లో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టింది. 11నెలలు టీటీడీకి బోర్డు లేకుండానే గడిపింది. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ధర్మకర్తల మండలిని నియమించారు. ఏప్రిల్ 28వ తేదీతో గడువు ముగిసింది. దీన్ని ముందే గుర్తించిన దేవాదాయ శాఖ పొడిగింపు ఉత్తుర్వుల ఫైలు నెల ముందే సిద్ధం చేసింది. రాజకీయ కారణాలతో అనేక ఊగిసలాటల మధ్య ఎట్టకేలకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. సమావేశాలకు గైర్హాజరైన సాయన్న తొలగింపు టీటీడీ ట్రస్టు బోర్డులో తెలుగుదేశం పార్టీ తెలంగాణా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.సాయన్నకు అవకాశమిచ్చారు. ఆయన ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ట్రస్టుబోర్డు పదవికి రాజీనామా చేయలేదు. పైగా గత ఏడాది డిసెంబరు నుంచి వరుసగా ఐదు సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆ మేరకు ఆయన సభ్వత్వాన్ని రద్దు చేశారు. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన వారినే నియమించే అవకాశముంది. నెల రోజుల చర్చకు సోమవారంతో ముగింపు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏడాది కాలం మాత్రమే టీటీడీ ధర్మకర్తల మండలి పదవిలో ఉంటుందని అంద రూ భావించారు. టీటీడీ చైర్మన్ పీఠం కోసం రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ , గోకరాజు గంగరాజుతో పాటు రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు పోటీ పడ్డారు. ఇచ్చిన గడువు తర్వాత కొత్త బోర్డు వస్తుందని ప్రచారం విస్తృతంగా సాగింది. ఆలయ ధర్మకర్తల మండళ్లకూ పదవీ కాలం ఏడాది ఇచ్చినా రెండు నెలల ముందు రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సంప్రదాయాన్ని టీటీడీకి వర్తింపజేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
టీటీడీ చైర్మన్‌పై పోలీసు కేసు నమోదు
పుత్తూరు : నిండ్రలోని ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను బెదిరించారనే ఆరోపణతో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి తన అనుచరులతో కలసి ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. అక్కడ విధుల్లో ఉన్న కార్మికులను బయటకు వెళ్లాలని ఆగ్రహించా రు. విశ్రాంతి భవనం వద్దకు వెళ్లి ఫ్యాక్టరీకి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ ఏజెన్సీ చైర్మన్ నందకుమార్‌పై దురుసుగా ప్రవర్తించారు. దీనిపై శనివారం కేసు నమోదు చేసినట్టు నిండ్ర ఎస్ఐ బాలకృష్ణయ్య తెలిపారు. నేను దౌర్జన్యానికి పాల్పడలేదు : చదలవాడ ఈ సంఘటనపై చదలవాడ కృష్ణమూర్తిని సాక్షి ప్రతినిధి వివరణ కోరగా ‘‘నేను గానీ, నా అనుచరులు గానీ ఎటువంటి దౌర్జన్యానికీ పాల్పడలేదు. ప్రుడెన్షియల్ షుగర్ ఫ్యాక్టరీలో నేనూ షేర్ హోల్డర్‌ను. ఫ్యాక్టరీ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఎవరూ పనులు చేయకూడదు. రాత్రి 7.30 సమయంలో పనులు చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాను. నాతో పాటు రైతులకు కూడా అన్యాయం జరుగుతోందనీ, ఇంతకీ ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఫ్యాక్టరీలోకి వెళ్లాను. దీనిపై ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాను’’ అని తెలిపారు. -
తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ నాణ్యత గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గిందని, గతంలోలాగ ఆ లడ్డూ ఇప్పుడు నిల్వ ఉండట్లేదని ఆయన అన్నారు. లడ్డూ కౌంటర్లో ఉండే సిబ్బంది.. భక్తులను మోసగిస్తున్నారని చెప్పారు. సిబ్బందికి జీతాలు తక్కువగా ఉండటంతో వాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ నాణ్యతపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. -
శ్రీవారికి కానుకగా కల్యాణ రథం
తిరుమల: ముంబైకి చెందిన భక్తులు తిరుమల శ్రీవారికి కల్యాణరథాన్ని మంగళవారం కానుకగా అందించారు. ముంబైకి చెందిన ఆర్కే చెట్టి, టీపీ ముత్తుతోపాటు మరో ఇద్దరు భక్తులు రూ.40 లక్షల ఖర్చుతో దీన్ని తయారు చేయించారు. తిరుమల ఆలయం వద్ద పూజలు చేయించి వాహనం తాళం చెవిని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఆలయ ఈవో సాంబశివరావు, జేఈవో పోలా భాస్కర్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఈవో సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో, నగరాల్లో శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు కల్యాణరథాలు అనుకూలంగా ఉంటాయన్నారు. -
విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయ నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. అదే విధంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుమలలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చదలవాడ వివరించారు. -
అమెరికాలో నాలుగు చోట్ల శ్రీనివాస కళ్యాణాలు
తిరుమల: అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలు జరపాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తానా సహకారం అందిస్తుందని తెలిపారు. మంగళవారం తిరుమలలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశమైంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమలలో వకుళామాత అతిథి గృహ నిర్మాణానికి రూ. 25 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని ఊపమాత గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని తిరుమల, తంబళ్లపల్లిలో సోలార్ సిస్టమ్ ద్వారా 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. తిరుమలలో 1.50 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచడానికి... మరో 400 హెక్టార్లలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాదికి 12 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచుతామన్నారు. రూ.22 లక్షలతో ఆరునెలలకు సరిపడా కొబ్బరికాయాలు కొనడానికి కూడా పాలక మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. -
తిరుమలలో వీఐపీ టికెట్లు తగ్గించాం: చదలవాడ
తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా వీఐపీ దర్శన టిక్కెట్లును బాగా తగ్గించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఆయన తిరుపతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ అధినాయకుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తిరుమలలో అన్ని విభాగాలు, సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు రోజుకు కేవలం 1,500 నుంచి 2 వేల మందికి మాత్రమే వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. టీటీడీ-మున్సిపల్ కార్పొరేషన్-తుడాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో, యాత్రికులు నడిచి వెళ్లే మార్గాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు
సాక్షి, తిరుమల: తిరుమల కల్యాణకట్టల్లో భక్తుల తలనీలాలు తీసేందుకు రూ.1.54 కోట్లతో 70 లక్షల బ్లేడ్లు కొనుగోలు చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండ లి తొలి సమావేశం శనివారం జరిగింది. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 14 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రి, కొవ్వూరుల్లో శ్రీవారి నమూనా ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు ఆలయ సన్నిధిలో ఉదయం 11.09 గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులతో ఆలయ ఈవో డి.సాంబశివరావు ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన సభ్యుల్లో కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, డోల శ్రీబాలవీరాంజనేయస్వామి, పుత్తా సుధాకర్ యాదవ్, జి.సాయన్న, ఎ.వి.రమణ, జె.శేఖర్, సంపత్ రవినారాయణన్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుచిత్ర ఎల్లా ఉన్నారు. చివరగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో సాంబశివరావుతో జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనా ప్రమాణం చేయలేదు. మరో సభ్యుడు డి.పి.అనంత శనివారం సాయంత్రం ప్రమాణం చేశారు. భక్తుల సేవకే అంకితం: పసుపులేటి తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల సేవకు అంకితమవుతానని పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. టీటీడీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తన జీవితంలో అరుదైన, అదృష్ట ఘట్టమన్నారు. -
టీటీడీ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
-
టీటీడీ చైర్మన్‌గా చదలవాడ ప్రమాణం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ సన్నిధిలో ఉదయం 11గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అనంతరం బోర్డు సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలం తొలి సమావేశం నిర్వహించనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్) కోళ్ల లలిత కుమారి (ఎమ్మెల్యే విజయనగరం జిల్లా శృంగవరపుకోట) పిల్లి అనంతలక్ష్మి (ఎమ్మెల్యే కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా) డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొండేపి) పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా) ఏవీ రమణ (హైదరాబాద్) జె.శేఖర్ (తమిళనాడు) సుచిత్ర ఎల్లా, సంపత్ రవి నారాయణన్ (తమిళనాడు) పి.హరిప్రసాద్ (తిరుపతి) రాఘవేంద్రరావు (సినీ దర్శకుడు) సాయన్న -
రైల్వే కాంట్రాక్టుల కోసం రేణిగుంటకు వచ్చా
తిరుపతి: ఆధ్యాత్మిక నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలోని ఆయన స్వగృహంలో గురువారం మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నగర ప్రజలకు అందుబాటులోకి వైద్యం నగరంలో ప్రతి ఒక్కరికీ ఆర్యోగాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా. ప్రాణదాన ట్రస్టును ప్రవేశ పెట్టడంలో కీలకపాత్ర పోషించా. దానికి మొదటి దాతను నేనే. అదే అలిపిరి ఘటనలో నా ప్రాణాలను కాపాడింది. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా. శాంతి భద్రతలు కాపాడేందుకు తమవంతు ప్రయత్నం చేస్తా. తిరుపతి టీటీడీలో అంతర్భామే కాబట్టి అందంగా తీర్చిదిద్దుతా. అవినీతికి దూరంగా...అన్ని వర్గాలకు అందుబాటుగా అవినీతికి దూరంగా ఉంటూ తిరుపతి ప్రజ లకు సేవ చేస్తాను. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సక్రమంగా నిర్వర్తించేలా ఓ భక్తునిగా ఆ దేవదేవుని కోరుకుంటున్నా. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ హిందూ మత ప్రచారాన్ని కొనసాగిస్తా. ఇక్కడికి ఆయన్ను నమ్ముకొని వచ్చా.. నేను సామాన్యుడిని. నాకు దేవుడు అన్నీ ఇచ్చారు. నాకు కావల్సింది ఏమీ లేదు. ఆయన్ను నమ్నుకొని వచ్చాను. తిరుపతి ప్రజలు నన్ను అక్కున చేర్చుకొని ఆదరించారు. వెంకటేశ్వరస్వామి అలిపిరి ప్రమాదంలో కాపాడి ప్రాణాన్ని నిలబెట్టారు. నేను నమ్ముకొన్న పార్టీ, నాయకుడు పదవి ఇచ్చారు. చైర్మన్‌గా కాకుండా ఓ సేవకుడిగా నా బాధ్యతను నెరవేరుస్తా. ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఎంతోమంది పెద్దలు గతంలో పనిచేశారు. వారి కోవలో సామాన్య భక్తులకు దగ్గరగా, ఆయన ఆస్తులను కాపాడే వ్యక్తిగా పనిచేస్తాను. శేష జీవితాన్ని పుణ్యక్షేత్రంలో, ధర్మానికి దగ్గరగా గడుపుతాను. ప్రజాస్వామ్యా న్ని, సామాన్యుల హక్కులను సంరక్షిస్తాను. రేణిగుంటకు రైల్వే కాంట్రాక్టర్‌గా.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది తిరుపతే. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట. 1973లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశా. నాయుడుపేట సర్పంచ్‌గా, సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశా. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, వెంగళరావు, శివశంకర్‌తో సన్నిహిత సంబంధాలుండేవి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుతో దగ్గర సంబంధాలు ఉండేవి. 1977లో రైల్వే కాంట్రాక్టులు చేసుకునేందుకు రేణిగుంటకు వచ్చాను. 1994లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీచేసి స్వల్ప మెజారిటీ ఓడిపోయాను. 1999లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఈ సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా..
హైదరాబాద్ : టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్‌గా తనకు దేవుడికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన వంతుగా టీటీడీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుమలలో చంద్రబాబు మార్కు పాలనను తీసుకు వస్తానని ఈ సందర్భంగా చదలవాడ అన్నారు.ప్రతి ఒక్కరికీ మనవాడు కృష్ణమూర్తి అనేలా పని చేస్తానని చదలవాడ అన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన తెలిపారు. తాను టీటీడీ ఛైర్మన్ అయ్యేందుకు సాయం, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి చదలవాడ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలిపారు. -
చదలవాడ ... తిరుమలకా? తిరుపతికా?
తిరుమల వెంకన్నకు సేవ చేసుకునే మహాభాగ్యం తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడప్పుడే ఉన్నట్లు కనిపించడం లేదు. టీటీడీ చైర్మన్ పోస్ట్‌కు 'ఎంతో మంది తమ్ముళ్ల' పేరు వినపడిన చివరకు తిరుమల మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పేరు ఖరారైంది. అందుకు సంబంధించిన ఫైలు సీఎం బాబుగారి టేబుల్‌పై చేరింది... ఇంకేముంది రేపోమాపో బాబుగారు సంతకం చేస్తే ప్రకటన వచ్చేస్తుందని చైర్మన్‌తో పాటు సభ్యులుగా తమకు చోటు దక్కిందని సమాచారం ఉన్న వారు తెగ ఖుషీఖుషి పడిపోయారు. అయితే తిరుమల ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎం.వెంకటరమణ అకస్మాత్తుగా మృతి చెందటంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ ఏడాది ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ రాజీనామా చేసి టీడీపీలో చేరిన వెంకటరమణ కూడా అంతే తీవ్రంగా ప్రయత్నించారు. బాబు మాత్రం వెంకటరమణకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి... నీకు మాత్రం టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని చేతిలో ఒట్టు వేసి మరీ చెప్పినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో వెంకటరమణ విజయం సాధించడం.... ఆ తర్వాత ఆయన ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దాంతో ఆ స్థానం నుంచి మళ్లీ చదలవాడనే ఎన్నికల బరిలో నిలబెడితే ఎలా ఉంటుందనే ఆలోచన స్థానిక పచ్చ తమ్ముళ్లకు వచ్చిందని తెలుస్తోంది. అదే విషయం బాబు గారి చెవిన వేయాలని సొంత జిల్లాలో సీఎం గారి సొంత మనుషుల చెవిలో వారు ఊదారంటా. అదే జరిగితే చదలవాడకు తిరుపతి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కుతుంది కానీ కొండపైన శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం మాత్రం దక్కే పరిస్థితి లేదు. అదికాక ఇప్పటికే జిల్లాలోని సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గాలి ముద్దుకృష్ణమ్మనాయుడు, గల్లా అరుణకుమారి టీటీడీ ఛైర్మన్ గిరితో శ్రీవారి సేవ చేసుకోవాలని తెగ ముచ్చట పడుతున్నారు. అలాగే టీటీడీ ఛైర్మన్‌గిరి తన జీవితాశయమంటూ ఎలుగెత్తి చాటుతున్న నరసారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తన జీవితాశయాన్ని నెరవేర్చుకుని పనిలో ఉన్నారు. మరి వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యం చివరికి ఎవరికి దక్కుతుందో అనేది వేచి చూడాల్సిందే. -
ఇదీ.. అదృష్టమంటే..!
ఎన్నికల్లో టికెట్టు రాని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తికి అనుకోకుండా పరిస్థితులు కలిసొచ్చాయి. ఎన్నికల సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చదలవాడను పోటీకి దింపాలని తొలుత భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వెంకటరమణ పేరును ఖరారు చేశారు. దీంతో చదలవాడ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆయనకి నచ్చజెప్పే బాధ్యతను ప్రస్తుతం ఢిల్లీలో కీలక బాధ్యత నిర్వర్తిస్తున్న ఓ నేతకు చంద్రబాబు అప్పగించారు. ఆయన హుటాహుటిన తిరుపతి వెళ్లి చదలవాడతో మంతనాలు జరిపారు. కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. కొంత మెత్తబడిన చదలవాడ ఓ కండిషన్ పెట్టారు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే టీటీ డీ బోర్డు మెంబరు పదవి కావాలని ప్రతిపాదించారట. దానికి ఓకే అన్న ప్రత్యేక దూత.. వెంటనే అధినేతకు నేరుగా ఫోన్ కలిపారు. చదలవాడ కోరికను చెవిలో వేశారు. కార్యకర్తల నినాదాల హోరులో ప్రత్యేక దూత చెప్పినది బాబుకు సరిగా వినపడలేదట. టీటీడీ అనే పదమే అర్థమైంది. చదలవాడ టీటీడీ చైర్మన్ పదవిని కోరుకుంటున్నారని భావించిన చంద్రబాబు.. ఒకే చెప్పటంతో పాటు లిఖితపూర్వకంగా హామీనిస్తానంటూ వెంటనే ఒక లేఖను కూడా పంపారు. ఎన్నికలు ముగిసేవరకూ చంద్రబాబుకు, ఆయన దూతకు మధ్య జరిగిన సంభాషణ గుట్టుగా ఉన్నా, ఆ తరువాత పార్టీ వర్గాలకు లీకైంది. ఇప్పుడు పార్టీ నేతలంతా అదృష్టమంటే చదవలవాడదే అని అంటున్నారు.