
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ.. దౌర్జన్యకాండకు దిగాడు. కబ్జా స్థలం పరిశీలనకు వెళ్లిన రెవిన్యూ అధికారులను బెదిరించారు. స్థలంలో అడుగుపెడితే కొడతామంటూ హెచ్చరించాడు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. తన వెనుక పదివేల మంది జనం ఉన్నారంటూ చదలవాడ బెదిరింపులకు దిగాడు. రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణమూర్తి 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలం విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment