రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు | we will purchase blades with rs 1 crore 54 lakhs | Sakshi
Sakshi News home page

రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు

Published Sun, May 3 2015 1:36 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు - Sakshi

రూ.1.54 కోట్లతో బ్లేడ్ల కొనుగోలు

సాక్షి, తిరుమల: తిరుమల కల్యాణకట్టల్లో భక్తుల తలనీలాలు తీసేందుకు రూ.1.54 కోట్లతో 70 లక్షల బ్లేడ్లు కొనుగోలు చేస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండ లి తొలి సమావేశం శనివారం జరిగింది. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 14 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రి, కొవ్వూరుల్లో శ్రీవారి నమూనా ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు ఆలయ సన్నిధిలో ఉదయం 11.09 గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులతో ఆలయ ఈవో డి.సాంబశివరావు ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన సభ్యుల్లో  కోళ్ల లలితకుమారి, పిల్లి అనంతలక్ష్మి, డోల  శ్రీబాలవీరాంజనేయస్వామి, పుత్తా సుధాకర్ యాదవ్, జి.సాయన్న, ఎ.వి.రమణ, జె.శేఖర్, సంపత్ రవినారాయణన్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుచిత్ర ఎల్లా ఉన్నారు. చివరగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో సాంబశివరావుతో జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనా ప్రమాణం చేయలేదు. మరో సభ్యుడు డి.పి.అనంత శనివారం సాయంత్రం ప్రమాణం చేశారు.
 
 భక్తుల సేవకే అంకితం: పసుపులేటి
 
 తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల సేవకు అంకితమవుతానని పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. టీటీడీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తన జీవితంలో అరుదైన, అదృష్ట ఘట్టమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement