సాధినేని యామినిపై పోలీస్‌ కేసు | TTD Case Filed Against BJP Leader Sadineni Yamini | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీస్‌ కేసు

Published Fri, Aug 14 2020 11:09 AM | Last Updated on Fri, Aug 14 2020 2:30 PM

TTD Case Filed Against BJP Leader Sadineni Yamini - Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు. (కరోనాతో భార్యాభర్తలు మృతి.. మరో ఆరుగురికి కూడా..)

ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా సోషల్ మీడియా ద్వారా ఆమె తాజా రాజకీయ పరిణామాలపై కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement