సోషల్ మీడియాలో పలువురి పేర్లతో ఒకే మెసేజ్ పోస్ట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురుద్దేశంతో తిరుమల శ్రీవారి పవిత్రతను మంటగలుపుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. పనిగట్టుకుని టీడీపీ విష ప్రచారం చేస్తోందని సోషల్ మీడియా సాక్షిగా బట్టబయలైంది. ‘సుమారు రెండు మూడేళ్ల నుంచి తిరుపతి లడ్డూ తిన్న ప్రతిసారి అమ్మ అనారోగ్యం పాలవుతోంది.
ఎక్కువగా తిరుపతి లడ్డూ తినొద్దని మాకు చెబుతోంది. ప్రతి చోటా పరిశుభ్రంగా లేదంటూ వందల సార్లు ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో ఆమెకు మతి స్థిమితం బాగోలేదని మేం అనుకున్నాం. ఇప్పుడు లడ్డూపై వచ్చిన వివాదాన్ని బట్టి చూస్తే.. తిరుపతి లడ్డూ విషయంలో మా అమ్మ చెప్పింది నిజమే అన్పిస్తోంది’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఒకే రకమైన పోస్టును దేశవ్యాప్తంగా వందల మంది ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment