POSTINGS
-
ఏపీ క్యాడర్‌పై కక్ష.. నాన్ ఏపీ క్యాడర్‌పై ఆపేక్ష
సాక్షి, అమరావతి: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు కక్ష పూరితంగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను మాత్రం ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ కూటమి సర్కారు రాగానే 9 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కక్షపూరితంగా నలుగురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు రాష్ట్రంలో పాలన వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరంటూ జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తోంది. రెడ్‌బుక్ కుట్రలపై మినహా పాలన వ్యవస్థపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. రాగానే కక్ష సాధింపు చర్యలు.. గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 15 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ప్రభుత్వ విధానాలను అమలు చేసే అధికారులపై తన అక్కసు చూపడంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. దాదాపు ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరికి అప్రాధాన్య పోస్టుల్లో పోస్టింగులు ఇచ్చింది.పలువురికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్‌లోనే ఉంచడం చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం. వీరిలో ఐదుగురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మురళీధర్‌రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠరెడ్డి, మాధవీలతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్‌కుమార్, కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాకు పోస్టింగులు ఇవ్వకపోవడం గమనార్హం. పదిమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందుబాటులో ఉన్నా వారి సేవలను వినియోగించుకోకుండా ఇతర రాష్ట్రాల క్యాడర్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపాలని కోరడం గమనార్హం. నలుగురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ నలుగురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ కుట్రకు పరాకాష్ట. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఎన్.సంజయ్, టి. కాంతిరాణా, విశాల్ గున్నీను ప్రభుత్వం కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. వలపు వల(హనీ ట్రాప్) విసిరి బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడమే పనిగా పెట్టుకున్న ముంబై మోడల్ కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీను సస్పెండ్ చేయడం బాబు సర్కారు కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం. రామోజీ కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికి తీశారనే కక్షతో ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న సమర్థులైన ఐపీఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరోవైపు ఇతర రాష్ట్రాల అధికారుల కోసం అర్రులు చాస్తుండటం కూటమి సర్కారు దుర్నీతికి నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యుటేషన్ అధికారులే ముద్దు...తమ అక్రమాలకు వత్తాసు పలికేందుకే ఇతర రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీ య అధికారులను డిప్యుటే షన్‌పై రప్పించి కీలక స్థానాలు కట్టబెడుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో కీలక పోస్టింగులు నిర్వహించిన యూ ్డపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి గతేడాది చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్రంలో వాలిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టు కట్టబెట్టారు. అదే తరహాలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీఎండీసీ ఎండీగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మరోసారి రప్పించి ఏకంగా టీటీడీ అదనపు ఈవోగా అత్యంత కీలక పోస్టు కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృతి చెందినా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. టీటీడీలో ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పాగా వేసి అక్రమాలకు తెగబడటం వెనుక కీలక పాత్ర వెంకయ్య చౌదరిదే.అదే రీతిలో తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడుకు కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఆయన్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించింది. తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యుడైనప్పటికీ సస్పెండ్ చేయకుండా బదిలీతో సరి పెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు కోటాగా పరిగణించడంతో ఇక తన కోటా కూడా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే ఆయన డిమాండ్ మేరకు కేరళ క్యాడర్‌కు చెందిన మైలవరపు కృష్ణ తేజను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. నలుగురు ఇతర రాష్ట్రాల అధికారులను డిప్యుటేషన్ మీద తెప్పించుకున్నా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మరింత మంది కావాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. టీడీపీ తీరుపట్ల రాష్ట్రానికి చెందిన ఏఐఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే విద్యుక్త ధర్మంగా భావించే ఏఐఎస్ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా దుష్ట సంప్రదాయానికి పాల్పడుతోందని పేర్కొంటున్నారు. -
వ్యక్తిత్వ హననం చేస్తారా?.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు. -
తరగతి గదిలో కొత్త తరం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు. వాస్తవానికి వారి నియామక తేదీ ఈనెల 10 అని, అన్ని జిల్లాల డీఈవోలు పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలోను కౌన్సెలింగ్ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువ మంది సొంత మండలాల్లోనే విధుల్లో చేరారు. ఇతర మండలాలకు వెళ్లిన వాళ్లు 20 శాతం ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్జీటీలు చేరిన వాటిలో 85 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నట్టు తెలిసింది. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికానందున బుధవారం కూడా కొనసాగినట్టు వార్తలొచ్చాయి. టీచర్లు రిలీవ్...ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో స్థాన చలనం జరిగిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్ కాలేదు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 317 మంది బాధితుల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొత్త నియామకాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆగని డిప్యుటేషన్లుకొత్త టీచర్ల నియామకంతో ఖాళీలు భర్తీ అవుతున్న నేపథ్యంలో... మళ్లీ డిప్యుటేషన్ల అంశం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో డిప్యుటే షన్లు చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. డిప్యుటే షన్ల కమిటీ పరిశీలనకు పంపకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్ బాధ్యతలు ఇస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి తెలిపారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏడుగురికి ఈ తరహాలో అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొన్ని డిప్యుటేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఇవన్నీ పైరవీలేనని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు పేరుతో అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారని పీఆర్టీయూ–తెలంగాణ నాయకుడు ఎం.చెన్నయ్య ఆరోపించారు. చదివిన బడిలో ఉపాధ్యాయుడిగా!ఖానాపురం: విద్యాబుద్ధులు నేర్చిన పాఠశాల లోనే ఉపాధ్యా యునిగా ఉద్యో గం వస్తే?.. అలా ంటి అరుదైన అవకాశం పొందారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ఆయన 1998 నుంచి 2002 వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివారు. డీఎస్సీ–2024లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటేశ్వర్లు బుధవా రం విధుల్లో చేరగా.. స్థానికులు అభినందించారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబెట్టారు. పోస్టింగ్‌ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్‌లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్‌ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్‌కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్‌కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్‌కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్‌లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్‌ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
మేము చెప్పినట్లు జరగాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో తాము చెప్పినట్లే బదిలీలు జరగాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. దీంతో గడువు ముగిసినప్పటికీ గత్యంతరం లేక పాత తేదీలతో అధికారులు బదిలీలు చేస్తున్నారు. ఈ శాఖలో బదిలీలకు ముందే ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు బయటకు రావడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు నేతల సిఫారసులు ఉన్నప్పటికీ, కనీస అర్హత ఉన్న ఉద్యోగుల బదిలీలలనే ఆమోదించారు. ఆ మేరకు కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇచ్చారు. అలాగే రాజకీయ నేతల కోరిక మేరకు కొందరిని బదిలీ చేసినప్పటికీ డిప్యూటేషన్ పేరుతో ప్రస్తుత స్థానంలోనే కొనసాగేలా ఆదేశాలిచ్చారు. అయినా తృప్తి పడని కొందరు నేతలు ఇంకా ఒత్తిళ్లు తేవడంతో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు వారిచ్చిన బదిలీలను సైతం పాత తేదీలతో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బదిలీలకు ఈ నెల 22వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌లో ఆరుగురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త పోస్టింగ్‌లతో మంగళవారం మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. -
టీడీపీ విష ప్రచారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురుద్దేశంతో తిరుమల శ్రీవారి పవిత్రతను మంటగలుపుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. పనిగట్టుకుని టీడీపీ విష ప్రచారం చేస్తోందని సోషల్ మీడియా సాక్షిగా బట్టబయలైంది. ‘సుమారు రెండు మూడేళ్ల నుంచి తిరుపతి లడ్డూ తిన్న ప్రతిసారి అమ్మ అనారోగ్యం పాలవుతోంది. ఎక్కువగా తిరుపతి లడ్డూ తినొద్దని మాకు చెబుతోంది. ప్రతి చోటా పరిశుభ్రంగా లేదంటూ వందల సార్లు ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో ఆమెకు మతి స్థిమితం బాగోలేదని మేం అనుకున్నాం. ఇప్పుడు లడ్డూపై వచ్చిన వివాదాన్ని బట్టి చూస్తే.. తిరుపతి లడ్డూ విషయంలో మా అమ్మ చెప్పింది నిజమే అన్పిస్తోంది’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఒకే రకమైన పోస్టును దేశవ్యాప్తంగా వందల మంది ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
ప్రతివాదులుగా ఎల్లో మీడియా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించడంతోపాటు కేసు కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పునిచ్చినందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతోపాటు ఏసీబీ కోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లు, కామెంట్లు పెట్టడంపై దాఖలైన క్రిమినల్ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఎల్లో మీడియా చానల్స్ టీవీ 5, మహాన్యూస్, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్‌లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్ ఎల్ఎల్సీని ఆదేశించింది. కాగా.. తమ మాధ్యమాల్లో ఉంచిన అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ఇప్పటికే తొలగించామని ప్రముఖ ఆన్లైన్ సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్, ఫేస్బుక్ హైకోర్టుకు నివేదించాయి. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో పలువురికి ఇంకా నోటీసులు అందచేయాల్సి ఉందని, అందువల్ల నోటీసులు అందజేసేందుకు మరికొంత గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పచ్చ సైన్యం అసభ్య, అభ్యంతరకర పోస్టులు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, మరో న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డిని లక్ష్యం చేసుకుంటూ సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు వెల్లువెత్తాయి. కులం పేరుతో కూడా వారిని దూషించారు. ఈ విషయాన్ని న్యాయవాది వసంత్‌కుమార్ లిఖితపూర్వకంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై ఏజీకి లేఖ రాశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సైతం ఆ లేఖలకు జత చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు, విమర్శలు చేసిన వారిపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఆ పోస్టులను తొలగించలేదు తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులు, న్యాయాధికారిపై పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను యూట్యూబ్ ఇప్పటికీ తొలగించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించిన వెంటనే సామాజిక మాధ్యమ సంస్థలు తమ ఆన్లైన్ వేదికలపై ఉన్న పోస్టులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందని, ఆ సంస్థ ఆ పని చేయలేదని తెలిపారు. యూట్యూబ్ తరఫున సీనియర్ న్యాయవాది సజన్ పువయ్య వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు లేదా కేంద్రం నియమించిన అ«దీకృత అధికారి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే తాము ఆ పోస్టులను తొలగిస్తామన్నారు. కోర్టు ఆదేశిస్తే తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అసభ్య, అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్‌ను ఆదేశించింది. ఎల్లో మీడియా చానళ్లను ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ నేతలకు గతంలోనే నోటీసులు ఈ లేఖలను వాటితో పాటు జత చేసిన సోషల్ మీడియా తాలూకు కామెంట్లు, పోస్టింగ్‌లు, విమర్శలు, దూషణలను పరిశీలించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారందరినీ ప్రతివాదులుగా చేర్చారు. టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్.రామకృష్ణ, మువ్వా తారక్కృష్ణ యాదవ్, రవికుమార్ ముదిరాజ్, రుమాల రమేష్, యల్లారావు, కళ్యాణి, ఎన్.చిరంజీవి, చైతన్య కుమార్‌రెడ్డి, ఆనంద్, కిషోర్‌కుమార్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు టీడీపీ నేతలతో సహా గూగుల్ ఇండియా, ట్విట్టర్ కమ్యూనికేషన్స్, ఫేస్బుక్ ఇండియాలతో కలిపి మొత్తం 27 మందికి నోటీసులు ఇచ్చింది. అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టినందుకు ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలని వీరందరినీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఫేక్ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీపీ చీఫ్ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు. తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్బుక్లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు. బెదిరింపులు పెరిగాయి: సునీత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు: సైబరాబాద్ కమిషనర్ కొరఢా
హైదరాబాద్: సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు పొందిన పోలీసులపై సైబరాబాద్ కమిషనర్ కొరఢా ఝళిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల పలుకుబడితో పోస్టింగ్‌లు కొట్టేసిన అధికారులను సాగనంపే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దిశగా ఇప్పటికే పలువురిపై బదిలీ/సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ అవినాశ్ మహంతి..మరికొంత మంది చిట్టాను కూడా రూపొందించారు. రూల్స్ బుక్ కమిషనర్‌గా పేరొందిన మహంతి..విధుల్లో నిర్లక్ష్యం, బాధితులపై విచక్షణారహితంగా దాడులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై పోలీసు మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమాచారం సేకరించిన సీపీ..త్వరలోనే సంబంధిత అధికారులకు చెక్‌చెప్పే అవకాశాలున్నట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిభావంతులకు పట్టం.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో ఠాణా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా నేరుగా పోలీసు బాస్‌లను కలుస్తున్నారు. వీరి ఫిర్యాదులను సీపీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఏసీపీ స్థాయి అధికారులతో అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీసు సిబ్బంది చేసింది తప్పని తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొత్త బాస్ రాకతో అప్రాధాన్యత పోస్టులలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. చాలా వరకు ఠాణాలలో కొత్త ఇన్స్పెక్టర్లు బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
హైదరాబాద్ కొత్త సీపీ సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారులు స్థానాల్లో కొత్త అధికారులు నియామకం అయ్యారు. ఈసీ ఆదేశాల మేరకు కీలక ప్రభుత్వ శాఖలు, పోలీసు విభాగంలో ఈ మేరకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, వరంగల్ కమిషనరేట్లకు కొత్త పోలీసు కమిషనర్లను నియమించడంతోపాటు పది జిల్లాలకు ఎస్పీలను, నాలుగు జిల్లాలకు కలెక్టర్లను నియమించారు. అలాగే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు కొత్త కమిషనర్లను నియమించారు. సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ.. పనితీరుపై ప్రతిపక్షాల ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న నివేదికల ఆధారంగా 20మంది ఐపీఎస్, ఐఏఎస్, నాన్ కేడర్ ఎస్పీలను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. వెంటనే ప్రతీ పోస్టుకు ముగ్గురు లెక్కన అధికారుల పేర్లను వారి నడవడిక, వార్షిక పనితీరు మదింపు, విజిలెన్స్ నివేదికలతో సహా తమకు పంపాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జాబితాలను పంపగా.. సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తూ అధికారులను ఈసీ ఎంపిక చేసింది. గతంలో నాన్ కేడర్ అధికారులు జిల్లాల ఎస్పీలుగా ఉంటే.. ఐపీఎస్ నుంచి నేరుగా రిక్రూటైన యువ అధికారులకు ఈసీ సూచనల మేరకు పోస్టింగ్‌లు లభించినట్టు సీఎస్ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఆయా అధికారుల సిన్సియారిటీ, కమిట్మెంట్ను పరిగణనలోకి తీసుకుని, పలు ఇతర అంశాలపైనా పరిశీలన జరిపాక ఆయా పోస్టులకు సూచించినట్టు తెలిసింది. -
జనసేనలో భగ్గుమన్న వర్గపోరు.. కత్తులతో పరస్పర దాడులు
సాక్షి, పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరులో జనసేన పార్టీ శ్రేణుల మధ్య వర్గ పోరు భగ్గుమంది. గ్రామంలోని కోళ్లఫారం వద్ద జనసేన పార్టీకి చెందిన రెండు వర్గాలు కత్తులతో, కర్రలతో మంగళవారం దాడికి తెగబడ్డాయి. పెడన–గుడివాడ హైవే పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. సినిమాల్లోని పోరాట సన్నివేశాలను తలపించేలా సమ్మెట బాబు వర్గం కత్తులతో దాడులకు తెగబడటంతో యడ్లపల్లి రామసుధీర్ వర్గం హడలిపోయింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ పెడన నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు యడ్లపల్లి రామసుధీర్, సమ్మెట బాబు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు వర్గాలు ఎక్కడైనా తారసపడితే పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సమ్మెట బాబు వర్గానికి చెందిన వ్యక్తులు రామసుధీర్ వర్గంపై కత్తులు, కర్రలతో దాడి చేయడంతో ఆ వర్గానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనుచిత పోస్టింగ్‌ల వల్లే వివాదం! రెండు వర్గాల వారు వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టడం వల్లే ఈ దాడులు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. నడుపూరు గ్రామానికి చెందిన సింగంశెట్టి అశోక్‌కుమార్(35) గుడివాడ రోడ్డులో కోళ్లఫారం నడుపుతున్నాడు. మంగళవారం అశోక్‌కుమార్, కొఠారి మల్లిబాబు(35), మద్దాల పవన్(28)లతో పాటు మరో ముగ్గురు కోళ్లఫారం వద్ద ఉండగా.. సమ్మెట బాబు వర్గానికి చెందిన బత్తిన హరిరామ్, మెట్టా గణపతి, కనపర్తి వెంకన్న, సమ్మెట శివనాగప్రసాద్, పినిశెట్టి భరత్ శివశంకర్, దాసరి సుబ్రహ్మణ్యం, ముద్దినేని రామకృష్ణ కలిసి అక్కడకు వచ్చారు. వాట్సాప్‌లో పెట్టిన పోస్టింగ్‌ల విషయమై రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో రెండు వర్గాలు కత్తులు, తాటి మట్టలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అశోక్‌కుమార్‌తోపాటు కొఠారి మల్లిబాబు, మద్దాల పవన్ అనే వారు కత్తిపోట్లకు గురయ్యారు. మరో వ్యక్తికి కర్ర దెబ్బలు తగిలాయి. నలుగురినీ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేశారు. -
తెలంగాణ ఐపీఎస్‌లకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పోస్టింగ్‌ల విషయంలో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వగా.. వారిలో ఏ ఒక్కరు కూడా తెలంగాణ మూలాలున్న అధికారి లేరని వ్యాఖ్యానించారు. ‘‘కల్వకుంట్ల రాజ్యంలో ... నిన్న పార్టీలో... నేడు పరిపాలనలో మాయమైపోయిన తెలంగాణం’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. -
Telangana: ఇదేమి ‘పని’ష్మెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని పలువురు ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఎలాంటి కచ్చితమైన విధులు లేకుండా, పోస్టింగుల్లేకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఇలా మొత్తం 47 మంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్ / అటాచ్మెంట్ పేరుతో ఎలాంటి ఉద్యోగం, బాధ్యత లేకుండా గడిపేస్తున్నారు. ఏదో ఒక విభాగానికి అటాచ్ అయిన కొందరికి జీతభత్యాలు అందుతున్నా, పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నవారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఎప్పుడు శాశ్వత పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నట్టు పోలీసు అధికారులే చెబుతుండటం గమనార్హం. అసలు ఎందుకు ఐపీఎస్ అధికారులయ్యామో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ అదనపు ఎస్పీ, ఏఎస్పీ స్థాయిలో ఉన్న కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పదోన్నతి పొందినా పరిస్థితి మారకపోవడం మానసికంగా కుంగుబాటుకు కారణమవుతోందని చెబుతున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల పరిస్థితి ఇలా ఉంటే శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్‌ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాల్సిన వారిని అటాచ్మెంట్ పేరుతో మూడేళ్లుగా గ్రేహౌండ్స్‌లోనే కొనసాగించడం వివాదాస్పదమవుతోంది. ఏళ్ల తరబడి ఒకే పోస్టులో.. ► కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్న వైనం కూడా విస్మయపరుస్తోంది. ► సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న అదనపు డీజీపీ నాగిరెడ్డి, ప్రస్తుతం నార్త్‌జోన్ ఇన్చార్జి ఐజీగా ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ► అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్, ప్రొవిజనల్ అండ్ లాజిస్టిక్ ఐజీగా జూన్ 6, 2015 నుంచి కొనసాగుతున్నారు. పదోన్నతి వచ్చినా ఆయనకు మరోచోట పోస్టింగ్ ఇవ్వకుండా అవే బాధ్యతల్లో కొనసాగింపజేస్తున్నారు. ► బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ. ఈయన ఐజీ హోదాలో సెప్టెంబర్, 2016లో పోలీస్ శాఖ పర్సనల్ విభాగం బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరేళ్లు పూర్తిచేసుకొని పదోన్నతి పొందినా ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. ► కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అదనపున డీజీపీ. మార్చి, 2017 నుంచి గ్రేహౌండ్స్ ఐజీ. ప్రస్తుతం పదోన్నతి పొంది అక్కడే అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► ఐజీ సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ హోదాలో మార్చి, 2018లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఐజీగా పదోన్నతి కల్పించినా ఇంకా అక్కడే అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ► ఐజీ రాజేష్‌కుమార్ 2016, జూన్ 30వ తేదీ నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ నుంచి ఐజీ అయినా ఆరేళ్లుగా పాత పోస్టులోనే కొనసాగుతున్నారు. ► చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఐజీ. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఐజీ హోదా ఉన్నప్పటికీ ఎస్పీ హోదా కలిగిన రామగుండం కమిషనర్ పోస్టులో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 నెలలుగా ఆయన ఈ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుర్చీలో ఖాళీగా.. ఐపీఎస్ అధికారికి పక్కా పోస్టింగ్ కల్పిస్తేనే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహణ సాధ్యమవుతుంది. కానీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఓ పద్ధతి లేకుండా పోయింది. వెయిటింగ్/అటాచ్మెంట్ అనే పేరుతో ఏదో ఒక విభాగంలో కుర్చీ ఇచ్చి ఖాళీగా కూర్చోబెడుతున్నారు. అటాచ్‌మెంట్‌పై ఉన్న అధికారులు ఏదైనా పనిచేయడానికి కానీ, ఏదైనా విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవడం గానీ, ఆదేశాలివ్వడం గానీ, పరిపాలన చేయడం గానీ ఉండదు. ఈ పరిస్థితుల్లోనే అధికారులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 2017లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ అధికారులను సైతం అటాచ్మెంట్ పేరుతో పోలీస్ శాఖ కొనసాగించడం ఏమిటో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పదోన్నతులు పొందినా ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. -
భార్యా భర్తలకు ఒకే చోట పనిచేసే అవకాశమేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా పోలీసు శాఖలో జరిగిన బదిలీలు భార్యాభర్తలైన కానిస్టేబుళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి రావడం వారిలో తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి. ఆత్మహత్యకు వెనుకాడలేం... రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న జంటలు దాదాపు 200 వరకు ఉంటాయని అంచనా. ఇటీవల జరిగిన నూతన జిల్లాల బదిలీల్లో భార్యాభర్తలంతా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే వెసులుబాటు కలి్పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయా జంటలు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆదేశాలు వెలువడలేదు. దీంతో రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, రాచకొండ తదితర యూనిట్లలో పనిచేస్తున్న భార్యభర్తలైన కానిస్టేబుళ్లు ఒంటరితనంతో బతకలేక సతమతమవుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు తమ ఆవేదనను ఆడియో సందేశాల రూపంలో బయటపెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ నరకయాతన అనుభవిస్తున్నామని, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటామో తెలియని పరిస్థితుల్లో బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో ఓ మహిళా కానిస్టేబుల్ పడుతున్న బాధ అంతాఇంతా కాదు. తన భర్త మరో జిల్లాలో పనిచేస్తుండటంతో మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూసే వారు లేక చంటి పిల్లాడిని చంకన వేసుకొని బందోబస్తు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల భవిష్యత్‌పై ప్రభావం... కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎదుగుతున్న పిల్లలపై శ్రద్ధ తీసుకోకపోతే వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత సమస్య కూడా కానిస్టేబుళ్ల దంపతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్నాళ్లూ సొంత జిల్లాల్లో పనిచేసిన వారు వేరే జిల్లాకు బదిలీ కావడం వల్ల తమ పిల్లల స్థానికత విషయంలో సమస్య ఏర్పడుతుందని కలవరానికి గురవుతున్నారు. కాగా, బదిలీల సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియట్లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. -
‘మల్టీజోనల్’లోనూ మడత పేచీ
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం బుధవారం మల్టీ జోనల్ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించింది. దీనిప్రకారం మల్టీజోన్–1 నుంచి జోన్– 2కు 40 మందిని, జోన్–2 నుంచి జోన్–1కి 58 మందిని కేటాయించింది. అయితే జిల్లా కేడర్ కేటాయింపు మాదిరిగానే మల్టీ జోనల్ కేటాయింపు ప్రక్రియ కూడా అత్యంత వివాదాస్పదమైంది. హెచ్ఎంలను రాష్ట్ర స్థాయిలో ఏ స్కూలుకు పంపాలనేది విభజన సందర్భంగానే తేల్చాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎంలను కేవలం జోన్లకు మాత్రమే కేటాయించారు. కానీ ఏ జిల్లాలో ఏ స్కూలుకు పంపుతారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ జిల్లాకు ఎంతమంది హెచ్ఎంలనేది మాత్రం చెప్పా రు. కానీ ఆయా జిల్లాల్లో ఎక్కడ పోస్టులు ఉన్నా యో వెల్లడించలేదు. పైగా జిల్లా అప్షన్లు ఇవ్వమని అడిగారు. దీంతో పోస్టులెక్కడున్నాయో తెలియకుండా ఆప్షన్లు ఎలా పెట్టుకుంటామని హెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమది మల్టీ జోనల్ కేడర్ పోస్టు అయినప్పుడు జిల్లా అధికారులకు తమ పోస్టింగ్ వ్యవహారం ఇవ్వడమేంటని ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నాలు చేశామని, కానీ ఎవరి నుంచీ సరైన సమాధానం రాలేదని టీచర్ల యూనియన్లు చెప్పాయి. ఖాళీలను ప్రకటించాలి: టీఎస్ యూటీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలకు ఆప్షన్ ఇవ్వమనటాన్ని టీఎస్ యూటీఎఫ్ ఖండించింది. హైస్కూల్ హెచ్ఎం పోస్ట్‌ను మల్టీ జోనల్ పోస్ట్‌గా మార్చిన తర్వాత ఆ మల్టీజోన్‌లోని ఏ పాఠశాలనైనా నేరుగా ఎంచుకునే అవకాశం హెచ్ఎంలకు ఉంటుందని, కానీ జిల్లాను ఎంచుకుంటే ఆ జిల్లాలో పోస్టింగ్ ఇస్తామని అధికారులు చెప్పడం నిబంధనలను ఉల్లంఘించటమేనని సంఘం అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి చావా రవి చెప్పారు. హెచ్ఎంల సంఖ్యకు సరిపడా ఖాళీలను చూపించిన తర్వాత మాత్రమే ఆప్షన్లు తీసుకోవాలని కోరారు. జిల్లా ఆప్షన్లు ఇవ్వమంటే ఎలా?: పీఆర్బీ ప్రకాశ్ ‘హెచ్ఎంలు మల్టీ జోనల్ కేడర్. అయినాప్రభుత్వం జిల్లా కేడర్‌కు కేటాయించడం దారుణం. పోస్టులు ఎక్కడున్నాయో ప్రకటిస్తే మేం నచ్చిన ఆప్షన్ ఇవ్వొచ్చు. కేవలం జిల్లాల ఆప్షన్లే ఇవ్వమంటే ఎలా?’ అని హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీఆర్బీ ప్రకాశ్ ప్రశ్నించారు. -
ఉద్యోగుల బదిలీలలో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జిల్లాల కేటాయింపు వ్యవహారంలో నకిలీ అనారోగ్య సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనివల్ల అసలైన వ్యాధిగ్రస్తులకు, దివ్యాంగులకు అన్యాయం జరిగే వీలుందని పలువురు వాపోతున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు, దివ్యాంగులను బదిలీల నుంచి మినహాయించే నిబంధన ఉండటంతో దీన్ని అడ్డం పెట్టుకొని కొందరు నకిలీ వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు అన్ని జిల్లాల నుంచి వస్తున్నాయి. అయినా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వాటన్నింటినీ పరిశీలించడం ఎలా అని ఉన్నతాధికారులు అంటున్నారు. ►వరంగల్ జిల్లాలో 40 మందికిపైగా ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయని సమాచారం. దీనిపై కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ విచారణకు కూడా ఆదేశించలేదని ఓ ఉపాధ్యాయుడు తెలిపాడు. ►మేడ్చల్, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్ 10 మందికిపైగా టీచర్లు చిన్నచిన్న సర్జరీలు చేయించుకున్నప్పటికీ తమకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లు సర్టిఫికెట్లు పుట్టించి బదిలీలు లేకుండా ప్రయత్నిస్తున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల బంధువులూ ఉన్నారని చెబుతున్నారు. ►ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు సమర్పించిన పత్రాలపై అధికారుల్లోనూ అనుమానాలున్నట్లు తెలిసింది. సీనియారిటీపైనా సందేహాలు! టీచర్ల సీనియారిటీ జాబితా తయారీపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండైన ఉదంతాలున్నాయని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఇలాంటి అధికారులు ప్రస్తుతం పారదర్శకంగా సీనియారిటీ జాబితాను తయారు చేస్తారా? అని ఖమ్మంకు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనుమానం వ్యక్తం చేశాడు. కేడర్ స్ట్రెంత్, రోస్టర్ విధానం, వర్కింగ్ పోస్టులు, క్లియర్ వెకెన్సీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ స్పష్టతలేదన్నాడు. జిల్లాలోని వర్కింగ్, ఖాళీ పోస్టులను ఏ దామాషా ప్రకారం భర్తీ చేయనున్నారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదని గుర్తుచేశాడు. వితంతువులకు, ఒంటిరి మహిళలకు, తీవ్ర వ్యాధిగ్రస్థులకు రక్షణ లేదని, మీడియం పంచాయితీలో సీనియారిటీని ఎలా రూపొందించాలో స్పష్టత ఇవ్వలేదని పలువురు టీచర్లు అంటున్నారు. -
డీఎస్సీ–2018 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : డీఎస్సీ–2018లో అర్హత సాధించి మెరిట్లో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ ద్వారా వారు కోరుకున్న స్కూళ్లలో నియమిస్తూ ఆదివారం పోస్టింగ్‌లు ఇచ్చారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు.. ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ–2018లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో ఎలాంటి న్యాయ వివాదాలు లేని వివిధ కేటగిరీల్లోని 2,654 పోస్టులకు ఆదివారం ఈ నియామక ఉత్తర్వులిచ్చారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన వ్యాజ్యం త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. ఇది పరిష్కారమైతే ఆ పోస్టులకూ వెంటనే నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికార వర్గాలు వివరించాయి. బీసీ గురుకులాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ కృష్ణమోహన్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 2018 డీఎస్సీలో 404 ఖాళీల భర్తీకి సంబంధించి గురుకుల సొసైటీ ప్రభుత్వానికి వివరాలు ఇవ్వగా అందులో 322 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో పీజీటీ, టీజీటీ, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. జోన్–1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) నుంచి 78 మంది, జోన్–2 (తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా జిల్లాలు)నుంచి 26 మంది, జోన్–3 (గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు) నుంచి 56 మంది, జోన్–4 (చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప) 162 మంది ఎంపికయ్యారు. మొత్తం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు 132 మంది, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 148 మంది, డ్రాయింగ్ టీచర్లు 18 మంది, క్రాఫ్ట్ టీచర్లు 12 మంది, మ్యూజిక్ టీచర్లు 12 మంది ఉన్నారు. బీసీ గురుకులాల్లో సుమారు 20 సంవత్సరాల నుంచి శాశ్వత టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2018 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ఉన్న కోర్టు అభ్యంతరాలను పరిష్కరించి అడుగులు ముందుకు వేసింది. -
పదోన్నతుల మాటేమిటి?
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్టీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పిడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017నవంబర్‌లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది. భర్తీ ఉత్తర్వులు అందకపోవడంతో అభ్యర్థులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1,979 ఉపాద్యాయ పోస్టుల గాను 2018 ఫిబ్రవరీ, మార్చిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించన పరీక్షకు దాదాపు 50వేల మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ పరీక్ష రాశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అనందంగా ఉన్నా సీనియర్ ఉపాధ్యాయులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండానే నేరుగా పోస్టులు భర్తీ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 1,979 పోస్టుల భర్తీకి కసరత్తు టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కలెక్టర్ కమిటీ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా, డీఈఓను కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీ పాత జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల రోస్టర్ పాయింట్లకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు అందిస్తారు. పాత, కొత్త జిల్లాల వారీగా ఖాళీలు, సబ్జెక్టు, మాధ్యమం, ప్రాంతాల వారీగా వివరాలు సేకరించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమిస్తూ కమిటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ సబ్జెక్టుల వారీగా 1,979 పోస్టులను ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1979 ఎస్జీటీ, 1400 ఎస్టీటీ పోస్టులు ఇవ్వనుండగా, మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రమోషన్లు కల్పించాల్సిందే గత డీఎస్సీలో సీనియర్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చిన తర్వాత మాత్రమే నూనతంగా వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్హాక్ పద్ధతిలో అయినా పోస్టింగ్‌లు ఇచ్చి, విద్యాసంవత్సరం ప్రారంభంలో వారిని రివర్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది. -గట్టు వెంకట్‌రెడ్డి,పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి ప్రస్తుతం ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల అభ్యర్థుల భర్తీ ప్రక్రియను ఎటువంటి న్యాయపరైమన ఇబ్బందులు రాకుండా భర్తి చేస్తే బాగుటుంది. మొదటిగా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలి. అదికూడా పాత జిల్లాల ప్రకారమే ఇస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. పాత జిల్లాల వారీగా టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి, ప్రమోషన్లు మాత్ర కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వడం సరికాదు. – దుంకుడు శ్రీనివాస్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
ఏపీ వైద్యశాఖ పోస్టుల భర్తీలో అక్రమాలు
-
సోషల్ మీడియాలో పోస్ట్‌లతో అరెస్టులు
జైపూర్/సిమ్లా/రాయ్‌పూర్/బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక పోస్ట్‌లు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పారామెడికల్ విద్యనభ్యసిస్తున్న నలుగురు కశ్మీరీ విద్యార్థినులు తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు ఉగ్రదాడికి సంబరాలు చేసుకుంటూ, ఆ ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే విద్యా సంస్థ వారిని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించింది. నలుగురు అమ్మాయిలపై పోలీసులు దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జిలేఖా బీ అనే మహిళ కూడా ఫేస్బుక్లో ‘పాకిస్తాన్ కీ జై’ అని పోస్ట్ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు కస్టడీ విధించింది. కర్ణాటకలో శనివారమే మరో యువకుణ్ని కూడా పోలీసులు ఇదే విషయమై అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న మరో కశ్మీరీ తహ్సీన్ గుల్ ఇన్‌స్టాగ్రాంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కైఫ్(18) ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని పోస్ట్ చేసి అరెస్టయ్యాడు. మరోవైపు బయట పరిస్థితులు బాగాలేనందున కశ్మీరీ విద్యార్థులు క్యాంపస్ దాటి బయటకు రాకూడదని యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం సూచించింది. మన మధ్య గొడవలే శత్రువు లక్ష్యం.. మిగతా భారతీయులు కశ్మీరీలను వెలేస్తే పాక్ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందనీ, కొందరు అత్యుత్సాహపరులు తామేం చేస్తున్నారో మెదడుతో ఆలోచించాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ యువతపై మీరు దాడి చేసి, వారిని వెలేసి ఎవరికి ప్రయోజం చేకూర్చదలచారు? కశ్మీర్ వదిలేసి బయటకొచ్చి బతుకుతున్న వారిని కశ్మీరీ ఆదర్శవంతులుగా మీరు చూడాలి. అలాంటివారిపై దాడులు చేయడం ద్వారా కశ్మీరీ లోయలో తప్ప మిగతా భారత దేశంలో వారికి స్థానం, భవిష్యత్తు లేదనే సందేశాన్ని మీరిస్తున్నారు. కశ్మీరీలు, మిగతా భారతీయుల మధ్య గొడవలు సృష్టించాలన్న శత్రువు లక్ష్యాన్ని మీరే నెరవేరుస్తున్నారు’ అని ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి నకిలీ ఫొటోలు.. నమ్మొద్దు పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికుల శరీర భాగాలుగా చెబుతూ కొన్ని నకిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయనీ, వాటి ని ఎవరూ నమ్మవద్దని సీఆర్పీఎఫ్ ఆదివారం ప్రజలకు సూచించింది. దేశంలో ద్వేషం పెంచేందుకు కొందరు దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనీ, ఆ ఫొటోలను ఎవరూ ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ‘దయచేసి అలాంటి పోస్ట్‌లు, ఫొటోలను షేర్, లైక్ చేయకండి. ఇతరులకు పంపకండి’ అని సీఆర్పీఎఫ్ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఫొటోలు, పోస్ట్‌లు వస్తే webpro@ crpf.gov.inMì కి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని కోరింది. -
ఎస్ఐ బదిలీల్లో.. ఖాకీ అధికారుల రోల్..!
సాక్షి, గుంటూరు: పైరవీలతో పోస్టింగులు.. సిఫార్సులతో పదోన్నతులు.. అనుకూలుడైతే చాలు అందలం ఖాయం.. నిజాయితీ, నిబద్ధతతో అస్సలు పనేలేదు. ఇవన్నీ అక్షర సత్యాలు.. జిల్లా పోలీసు యంత్రాంగంలో సాగుతున్న లాలూచీ వ్యవహారాలు. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతూ.. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ గౌరవాన్ని బజారుకీడుస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ శాఖ బదిలీల్లో చక్రం తిప్పుతూ, అనుయాయులను నియమిస్తూ టీడీపీ నాయకులకు కొమ్ముకాస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఎస్ఐల బదిలీలు. ఓ ముగ్గురు సీఐలు టీడీపీ ముఖ్యనేతల అండతో తమ మాట వినే ఎస్ఐల జాబితాను సిద్ధం చేసి పోస్టింగ్‌లు కేటాయించడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఇటీవల జరిగిన ఎస్ఐల బదిలీల్లో ముగ్గురు సీఐలు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐలకు సీఐలు పోస్టింగ్‌లు ఇప్పించడమేమిటని ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది అక్షర సత్యమని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు ఉన్న ముగ్గురు సీఐలు తమ అనుయాయులకు ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు ఇప్పించుకోవడంలో సఫలీకృతులయినట్లు సమాచారం. పైరవీల కింగ్‌లు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం పోలీస్‌శాఖలో జరిగే బదిలీలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తమ మాట విని ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసే ఎస్ఐల కోసం జిల్లాకు చెందిన అధికారపార్టీ ముఖ్యనేతలు అన్వేషిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న కొందరు సీఐలు వారితో పైరవీలు సాగించి ఎస్ఐల జాబితాను సిద్ధం చేసి అందించినట్లు తెలుస్తోంది. సీఐలు అధికారపార్టీ ముఖ్యనేతలకు తొ త్తులుగా వ్యవహరించడమే కాకుండా ఎస్ఐలను కూడా వారి వద్దకు పిలిపించి ఎన్నికల్లో అనుకూలంగా పనిచేస్తామని చెప్పించిన పిదపే పోస్టిం గ్లు ఇప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు ఉన్న వారికే అందలం.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో అధికారపార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. ఎంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టు అయినా సరే అధికారపార్టీ నేతల సిఫార్సు ఉంటే చాలు.. అదే అర్హతగా భావించి ఎన్ని ఆరోపణలు ఉన్నా, సమర్థత లేకపోయినా పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్న వైనం బహిరంగ విషయమే. ముఖ్యంగా పోలీస్‌శాఖలో పరిస్థితి మరింత దిగజారింది. నిజాయితీగా పనిచేసే అధికారులను లూప్లైన్లకు పరిమితం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే వారికి మాత్రం వరుసగా లాఅండ్ ఆర్డర్ పోస్టింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. దీంతో పోలీస్‌శాఖలో నిజాయితీగా పనిచేసే అధికారులు మనోస్థైర్యాన్ని కోల్పోతుండటం పోలీస్‌శాఖకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టేదిగా మారనుంది. అవినీతి అధికారులు కనిపించడం లేదా? ఆరోపణలు ఎదుర్కొని విచారణలు జరుగుతున్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు వరుస పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో వీరు బాధ్యత మరిచి అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పనిచేసే కొందరు డీఎస్పీలు, సీఐలు అవినీతి, అడ్డగోలు వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ.. తమపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై అధికారపార్టీ ముఖ్యనేతల ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. అధికారపార్టీ నేతల అండతో ఉన్నతాధికారులను సైతం టార్గెట్ చేసేంత స్థాయికి వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్ఐల బదిలీల్లో ముగ్గురు సీఐల ‘కీ’ రోల్.. ఇటీవల జిల్లాలో జరిగిన ఎస్ఐల బదిలీల్లో జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలు ‘కీ’ రోల్ పోషించినట్లు సమాచారం. ‘కోట’లో యువరాజును పట్టుకుని ఓ సీఐ.. పల్నాడులో ముఖ్యనేత అండతో మరో సీఐ.. డెల్టా ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధి ద్వారా ఇంకో సీఐ అనేక మంది ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇప్పించారనే విషయం చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా పనిచేయాలని చెప్పి సదరు సీఐలే జాబితాలు తయారు చేసి పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పైరవీలు చేస్తున్న సీఐలంతా టీడీపీ అధికారంలోకి వచ్చాక వరుస పోస్టింగ్‌లు పొంది ప్రస్తుతం ఎన్నికల నిబంధనల వల్ల లూప్లైన్లకు వెళ్తూ తమ ప్రతినిధులుగా గతంలో తమ వద్ద పనిచేసిన ఎస్ఐలను అధికారపార్టీ నేతలకు అప్పగించి స్వామి భక్తిని చాటుకుంటున్నట్లు తెలుస్తోంది. -
విధుల్లో చేరేందుకు వైద్యుల విముఖత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైద్య స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేస్తే, చాలామంది విధుల్లో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. మొత్తం 911 స్పెషలిస్టు వైద్యులను నియమించగా, ఇప్పటివరకు దాదాపు 600 మందే చేరినట్లు వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి. తమకు ఇచ్చిన పోస్టింగ్ మార్చాలని కొందరు కోరుతుంటే, భార్యాభర్తలను వేర్వేరుగా వేశారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. కొందరైతే పోస్టింగుల్లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీంతో అనేకమంది హైదరాబాద్ వైద్య విధాన పరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరైతే మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరే గడువును ఈ నెల 29 వరకు పొడిగించారు. నేరుగా పోస్టుల భర్తీ.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. ఈ నెల 6న ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 14 హైదరాబాద్‌లోని ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి. సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు ఇచ్చారని, మిగిలిన వారికి అన్యాయం చేశారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. దీన్ని వైద్య విధాన పరిషత్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు విధుల్లో చేరని వైద్యుల జాబితాను అధికారులు తయారు చేశారు. ఆ జాబితాలోని వైద్యుల పేర్ల పక్కన ప్రత్యేక కాలమ్‌లో పైరవీ చేస్తున్న మంత్రి లేదా ప్రజాప్రతినిధి పేర్లను అధికారులు తయారు చేయడం గమనార్హం. -
పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్‌ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్‌లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు. -
బదిలీలలు
ప్రభుత్వ స్థాయిలో జరిగిన బదిలీలకే నామాలు పెట్టి ఇష్టారీతిన పోస్టింగులు ఇచ్చుకొన్న వ్యవహారం గృహ నిర్మాణశాఖలో వెలుగుచూసింది. ఇది గృహనిర్మాణశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ బదిలీలను పక్కనపెట్టి కోరుకున్న చోటకు డీఈలుగా పనిచేసుకుంటున్నారు. అధికారవర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, బి.కొత్తకోట: గృహనిర్మాణ శాఖలో గత సాధారణ బదిలీల్లో భాగంగా సబ్‌డివిజన్ డీఈలను ఆ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్‌దండే బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 14 సబ్డివిజన్లకు సంబంధించిన వాటిలో సాంబశివయ్యను శ్రీకాళహస్తికి, వెంకటేష్‌ను నగరికి, జానకిరాంరెడ్డిని జీడీనెల్లూరుకు, నరసింహాను పుంగనూరుకు, మహేంద్రను చిత్తూరు పీడీ కార్యాలయానికి బదిలీలు చేశారు. ఎండీ స్థాయి ఉన్నతాధికారి చేసిన బదిలీలు యథావిధిగా అమలు కావాలి. అయితే జిల్లాలో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. పై బదిలీలను పట్టించుకోకుండా ప్రాజెక్టు డైరెక్టర్ తనకు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించి డీఈలను నియమించారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఎండీ బదిలీలకు విరుద్ధంగా సాంబశివయ్యకు నగరిలో, వెంకటేష్‌ను జీడీనెల్లూరుకు, జానకిరాంరెడ్డికి శ్రీకాళహస్తి సబ్‌డివిజన్ డీఈలుగా నియమించుకొన్నారు. అలాగే తంబళ్లపల్లె–2 డీఈ బాలాజీని ఇక్కడి నుంచి బదిలీ చేసి పీడీ కార్యాలయంలో నియమించుకొన్నారు. పీడీ కార్యాలయానికి బదిలీ అయిన మహేంద్రను చంద్రగిరి–2 డీఈగా పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై మదనపల్లెకు చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత ఎండీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎండీ విచారణ చేయాలంటూ కలెక్టర్‌ను కోరినట్టు తెలిసింది. దీనిపై విచారించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీని కలెక్టర్ ఆదేశించారని సమాచారం. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారు, కోరిన నివేదికను అందించలేదంటూ ఎండీ జిల్లా అ ధికారులను గురువారం ప్రశ్నించినట్టు తెలిసింది. దీం తో ఎండీ కాంతిలాల్‌దండే ఇచ్చిన బదిలీ ఉత్తర్వులు, ప్రస్తుతం ఏ డీఈ ఎక్కడ పనిచేస్తున్నది సమగ్ర వివరాలతో పీడీ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ తాడేపల్లెలోని ఎండీ కార్యాలయానికి గురువారం రాత్రి బయల్దేరినట్టు తెలిసింది. కొందరు డీఈలు ఒకేచోట 8ఏళ్లుగా పనిచేస్తున్నా ఆయా స్థానాల నుంచి కదిలించక పోవడానికి కారణాలేమిటో తేలాలి. ఈ వ్యవహారంలో పైసా వసూళ్లే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ నిర్ణయం జిల్లాలో డీఈల బదిలీ విషయంలో కలెక్టర్ నిర్ణయం మేరకే చర్యలు తీసుకొన్నాం. జిల్లా గృహ నిర్మాణశాఖకు కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. వారి నిర్ణయాలనే అమలు చేస్తాం. ఎండీ ఉత్తర్వుల ఉల్లంఘనలో అవినీతి ఆరోపణలు అవాస్తవం. నిజాలు నిలకడగా తెలుస్తాయి. – ధనుంజయుడు, హౌసింగ్ పీడీ, చిత్తూరు -
ఉన్న చోటనే కన్ఫర్డ్ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదిమంది అధికారులు పదోన్నతి పొందగా.. తొమ్మిది మంది అధికారులు ఇప్పుడున్న స్థానాల్లోనే యథాతథంగా కొనసాగాలని ఆదేశించింది. పదోన్నతి అందుకున్నవారిలో కె.హైమావతి మినహా 9 మందిపేర్లు, ప్రస్తుతమున్న పోస్టుల వివరాలను ఇందులో ప్రస్తావించింది. ఇప్పటివరకూ రెవెన్యూ అధికారుల హోదాలో ఉన్న వీరందరూ ఇకనుంచి ఐఏఎస్ హోదాలో విధులు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ సింగ్ గురువారం ఈ మేరకు మెమో జారీ చేశారు. జనవరి 22 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కె.హైమావతి ప్రస్తుతం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ఆమె పేరును ప్రస్తావించలేదు. కన్ఫర్డ్ ఐఏఎస్‌లు పోస్టింగ్‌లు కొర్రె లక్ష్మి డైరెక్టర్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కె.ధర్మారెడ్డి జాయింట్ కలెక్టర్, మేడ్చల్ జిల్లా చిట్టెం లక్ష్మి సెర్ప్ డైరెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్, ఖమ్మం సీహెచ్ శివలింగయ్య జాయింట్ కలెక్టర్, నిర్మల్ వి.వెంకటేశ్వర్లు జాయింట్ కలెక్టర్, సంగారెడ్డి ఎం.హనుమంతరావు గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ఎస్వో డి.అమయ్‌కుమార్ జాయింట్ కలెక్టర్, భూపాలపల్లి ఎం.హరిత జాయింట్ కలెక్టర్, వరంగల్ రూరల్ -
పైరవీలకే పెద్దపీట
అనంతపురం అర్బన్: పరిపాలనలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ శాఖ పెద్దన్నలా వ్యవహరిస్తుంది. కానీ అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ శాఖలో ‘అంతా నా ఇష్టం’ చందంగా వ్యవహారాలు సాగుతుంటాయి. ప్రధానంగా ఉద్యోగుల పోస్టింగ్, డిప్యుటేషన్ల విషయంలో ఉన్నతాధికారులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయ సిఫారసులకు పెద్ద పీట వేస్తారు. లాబీయింగ్, పైరవీలు చేసేవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ శాఖలోని ఉద్యోగులు తాము కోరుకున్న స్థానంలో పనిచేసే అవకాశం ఉండదు. కోరుతున్న స్థానం రాకపోతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలి తప్ప ప్రశ్నించడం ఇక్కడ చెల్లదు. ‘నో’ కౌన్సెలింగ్ రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చే క్రమంలోనూ, బదిలీల విషయంలోనూ కౌన్సెలింగ్ విధానం అమలు కావడం లేదు. అధికారులే తమకు ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌లు ఇచ్చి ఉత్తర్వులను జారీ చేస్తారు. స్పౌజ్ విధానం కూడా ఇక్కడ అమలు కాదు. నేతలు చెబితే ఓకే రాజకీయ సిఫారసులకు రెవెన్యూ శాఖలో పెద్ద పీట వేస్తారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచనలను, సిఫారసులను తప్పనిసరిగా అమలు చేస్తారు. వారు సిఫారసు చేసిన వారికి సూచించిన స్థానంలో పోస్టింగ్ ఇస్తారు. తహసీల్దార్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ తంతు ఇక్కడ సర్వసాధారణం. ఉద్యోగులకు హక్కులు లేవు పోస్టింగ్ ఇచ్చే క్రమంలో అధికారులు నిర్దేశాలే అమలువుతాయి. ఇక్కడ ఉద్యోగులకు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. ఇష్టం ఉన్నా...లేక పోయినా అధికారులుు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడి వెళ్లి జాయిన్ కావాల్సిందే. రాజకీయ పలుకుబడి, లాబీయింగ్ చేసుకునే సామర్థ్యం లేని ఉద్యోగులు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వీరిని జిల్లా సరిహద్దుకు విసిరేస్తారు. దీంతో అక్కడ పనిచేయలేని ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవును ఆశ్రయిస్తున్నారు. లాబీయింగ్‌కు ప్రాధాన్యత ‘రెవెన్యూ’లో లాబీయింగ్ చేసేవారికి ప్రాధాన్యత ఉంటుంది. వారు సిఫారసు చేసిన ఉద్యోగులకు సూచించిన స్థానంలో పోస్టింగ్, డిప్యుటేషన్ అవకాశం కల్పిస్తారు. లాబీయింగ్ చేసేవారు ఈ శా>ఖలో ప్రతి అధికారి వద్ద కనిపిస్తారు. అందువల్లే కొందరు ఏళ్ల తరబడి కలెక్టరేట్‌ను విడవకుండా తిష్టవేశారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం డిప్యూటీ తహసిల్దారులను డిప్యుటేషన్లపై నియమించారు. కొందరు ఉద్యోగులు ఏళ్లగా సీట్లకు అతుక్కుపోయారు. ఉద్యోగుల సంక్షేమం ఆలోచించాలి ఉన్నతాధికారులు ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించాలి. బదిలీలు, పదోన్నతుల సమయంలో పకడ్బందీగా కౌన్సెలింగ్ చేపట్టాలి. పారదర్శకత పాటిస్తూ ఖాళీ స్థానాల జాబితాను ఉద్యోగులకు ఇవ్వాలి. వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్‌లు ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. – శీలా జయరామప్ప, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం -
తహసీల్దార్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: ఇటీవలే తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన ఇద్దరికి పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ వీరపాండియన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామాంజినేయరెడ్డిని సొమందేపల్లి తహసీల్దారుగా, ఎన్.నారాయణను ఆత్మకూరు తహసీల్దారుగా నియమించారు. ఇటీవల జిల్లాకు చెందిన ఏడుగురు డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం తహసీల్దారులుగా పదోన్నతి కల్పించిన విషయం తెల్సిందే. మొదటి జాబితాలోని ముగ్గురికి ఇటీవలే పోస్టింగ్ ఇవ్వగా...ప్రస్తుతం ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. ఇక రెండవ జాబితాలో పదోన్నతి పొందిన ఓబన్న, భాస్కర్ నారాయణలను సీసీఎల్ఏ ఇంకా జిల్లాలకు కేటాయించలేదు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరికి పోస్టింగ్‌లు ఇస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
తహసీల్దార్లకు పోస్టింగ్
అనంతపురం అర్బన్: తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ వీరపాండియన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శీలా జయరామప్పను కేఆర్సీ (కోనేరు రంగరావు కమిటీ) విభాగం తహసీల్దారుగా నియమించారు. అలాగే అనిల్‌కుమార్‌ను ఉరవకొండ తహసీల్దారుగా, రామశేఖర్‌ను రొద్దం తహసీల్దారుగా నిమించారు. పదోన్నతులు కల్పించే క్రమంలో జిల్లాకు చెందిన రామాంజినేయరెడ్డి, నారాయణలను చిత్తూరు జిల్లాకు కేటాయించారు. అయితే వీరిద్దరినీ తిరిగి జిల్లాకే కేటాయిస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులను జారీ చేసింది. వీరికి కూడా త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
సాంకేతికమక
మందకొడిగా బదిలీల ప్రక్రియ సమీపిస్తున్న గడువు టీచర్ల ఆందోళన ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైన నాటి నుంచి షెడ్యూలుకు విరుద్ధంగానే కొనసాగుతోంది. బదిలీల ప్రక్రియ ఈ నెల 22న ప్రారంభించి ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే నిర్వహించాలి. ఐతే ప్రారంభమైన నాటి నుంచి ఏ ఒక్క రోజూ షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జరగలేదు. తొలిరోజు నుంచి వెబ్సైట్లో సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉండడంతో కొన్ని పోస్టులకు కౌన్సెలింగ్ వాయిదాపడుతూ వస్తోంది. అయినా ఎలాగోలా కొనసాగిస్తున్న అధికారులు గురువారం తలెత్తిన సమస్యను పరిష్కరించలేక పోవడంతో ఆ రోజు కౌన్సెలింగ్‌లను పూర్తిగా రద్దు చేశారు. అసలు షెడ్యూల్ ఇలా.. 22న ఉదయం జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులు132, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్, పీడీ 56, పీఈటీలు 191 మందికి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది.. 23న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)552, స్కూల్ అసిస్టెంట్ (హిందీ)142 మంది.. 24న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)230, స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం)19 మంది మధ్యాహ్నం భాషా పండితులు (తెలుగు) 212, హిందీ 179, ఉర్దూ 01, సంస్కృతం 02, మందికి కౌన్సెలింగ్ జరగాలి. 25న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (గణితం) 728 మంది, మధ్యాహ్నం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 522 మంది, పీఎస్‌హెచ్‌ఎంలు 151 మందికి, 26న ఉదయం స్కూల్ అసిస్టెంట్ (బయాలజికల్ సైన్స్) 494, సోషల్ స్టడీస్ 393 మంది మందికి కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. 27 నుండి 31వ తేది వరకు స్పెషల్ గ్రేడ్ టీచర్లు (తెలుగు) జాబితా ప్రకారం ఉదయం 350 మంది, సాయంత్రం 350 మందికి, 31వ తేది మధ్యాహ్నం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఉర్దూ) 9 మందికి కౌన్సెలింగ్ జరగాలి. సాంకేతిక కారణాలతో ఆలస్యం.. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి సాంకేతిక కారణాలతో మందకొడిగా జరుగుతున్నాయి. సీనియారిటీ ప్రకారం ముందుగా తమకు నచ్చిన స్థానాలు కోరుకున్న ఉపాధ్యాయులు ఆ మేరకు బదిలీ ఉత్తర్వులు పొందుతుండగా ఆ స్థానాలు జాబితా నుండి తొలగిపోవాల్సి ఉంది. అయితే తరువాత కోరుకునే ఉపాధ్యాయులకు కూడా ముందుగా ఉపాధ్యాయులు కోరుకున్న స్థానాలు కూడా ప్రదర్శితం కావడంతో ఉపాధ్యాయులు, అధికారులు గందరగోళానికి గురయ్యారు. గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన స్పెషల్‌గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీల్లో కూడా ఒకే రెవెన్యూ పంచాయితీలోని రెండు మూడు గ్రామాల్లో స్థానాలు కోరుకోవచ్చని నిబంధనలు తెలుపుతుండగా ఆ మేరకు వెబ్సైట్లో ఆయా రెవెన్యూ పంచాతీలను ఒకే స్థానంగా చూపడంతో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తాయి. దీంతో గురువారం కౌన్సెలింగ్ ప్రక్రియను రద్దు చేశారు. దానిని శుక్రవారం నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ సాఫ్టవేర్‌లో ఆ ఇబ్బంది తొలగక పోవడంతో శుక్రవారం ఉదయం తెలుగు లాంగ్వేజ్ పండిట్లు 212 మందికి, హిందీ లాంగ్వేజ్ పండిట్లు 179 మందికి, సంస్కృతం లాంగ్వేజ్ పండిట్లు 02 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మూడురోజుల్లో 3176 మందికి సాధ్యమయ్యేనా.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 31వ తేదీ నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేసి ఉపాధ్యాయులు ఆగష్టు 1వ తేదీన తమ కొత్త స్థానాల్లో జాయిన్ కావాల్సి ఉంది. ఐతే స్పెషల్ గ్రేడ్ టీచర్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 3176 మందికి కౌన్సెలింగ్ నిర్వహించాలి. అంటే రోజుకి సుమారు 1050 మందికి కౌన్సెలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రోజుకి సుమారు 700 నుంచి 800 మందికంటే ఎక్కువ మందికి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ లెక్కన ఆగష్టు 1వ తేదీన కూడా కౌన్సెలింగ్ నిర్వహించాల్సి వస్తుంది. అలాగైతే 1వ తేదీన కౌన్సెలింగ్ జరిగే ఉపాధ్యాయులు ఆ తరువాతి నెల జీతాలు అందుకోవడంలో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ పూర్తి చేస్తాం.. ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యా శాఖాధికారి.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరునాటికి కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం. ఉపాధ్యాయులకు ఎటువంటి నష్టం జరుగకుండా చూస్తాం. ఆగష్టు 1వ తేదీ నాటికి బదిలీలు పొందిన ఉపాధ్యాయులందరూ తమ నూతన స్థానాల్లో జాయిన్ కావాలి. -
అర్హత లేకున్నా అందలమెక్కేస్తాం...
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోరుకున్న కొలువు కావాలనుకుంటున్నారా.. అర్హత లేకున్నా ఫర్లేదు, కావల్సిందల్లా...దండిగా సొమ్ములు...సిఫార్సులే. ఇదంతా దేవాదాయశాఖలో మాత్రమే సాధ్యమనడానికి ఉదాహరణ జిల్లాలోని పలు ఆలయాల్లో అర్హతలేని ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో కూర్చొబెట్టడమే. అర్హతలుండీ అడిగినంత సొమ్ము ఇచ్చుకోలేని వారిని ప్రాధాన్యం లేని పోస్టులకే పరిమితం చేయడం అవినీతికి దర్పణం పడుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో పడి ఒకేచోట నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్న వైనందేవాదాయ శాఖలో సాగుతోంది. ఎవరైనా ఏదైనా అంటే పదేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని సమాధానం చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. డీసీ పోస్టులో జూనియర్... దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ పోస్టు ఇన్చార్జి ఏలుబడిలో నడుస్తోంది. రాజమహేంద్రవరం అసిస్టెంట్ కమిషనర్ డీఎల్వీ రమేష్‌బాబు గడచిన ఎనిమిది నెలలుగా డీసీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కారుణ్య నియామకంలో 1986లో దేవాదాయశాఖలోకి వచ్చిన రమేష్‌బాబు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంట్‌గా పదోన్నతిపొంది అనంతరం 2009లో అడ్హాక్ ఏసీ అయ్యారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం అడహాక్ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కాకినాడ డీసీగా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాది తప్ప మిగిలిన సర్వీసంతా జిల్లాలోనే. జిల్లాలో పలువురు సీనియర్ అధికారులున్నా రమేష్‌బాబుకు డీసీ ఇన్చార్జిగా కట్టబెట్టడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తాయి. రమేష్‌బాబు కంటే సీనియర్లయిన అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానం ఈవో దేవుళ్లు, పెద్దాపురం మరిడమ్మ దేవస్థానం ఆర్ పుష్పనాథం, అన్నవరం దేవస్థానం సహాయ కమిషనర్ ఈరంగి జగన్నాథం. తలుపులమ్మ లోవ ఈవో చంద్రశేఖర్, అప్పనపల్లి బాలాబాలజీ స్వామి దేవస్థానం ఈవో బాబూరావులు రమేష్బాబుకంటే సీనియర్లు. వీరంతా పూర్తి స్థాయి అసిస్టెంట్ కమిషనర్లే. అయినా వీరందరినీ పక్కనబెట్టి అడహాక్ ఏసీగా ఉన్న రమేష్‌బాబును గడచిన ఎనిమిది నెలలుగా కాకినాడ డీసీగా కొనసాగించడంలో ఔచిత్యమేమిటో ఆ దేవుడికే తెలియాలి. డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) నిర్వహిస్తే పదోన్నతుల్లో పైన పేర్కొన్న ముగ్గురు డీసీ జాబితాలో ముందుంటారు...అయినా అడ్హాక్ ఏసీగా ఉన్న రమేష్‌బాబుకే పదోన్నతి పట్టం కడుతోండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేడ్ వన్ అధికారులు కూడా ఆయన తరువాతే... ఏసీలు, డీసీలే కాదు గ్రేడ్–1 అధికారులు కూడా అన్యాయమైపోతున్నారు. పళ్లంరాజు గ్రేడ్–1 అధికారి. ఆయన అర్హతకు తగ్గట్టు కాకుండా తక్కువ క్యాడర్ కలిగిన వారిని నియమించే 6బి పరిధిలోని కాండ్రకోట నూకాలమ్మ ఆలయానికి ఈవోగా కొనసాగిస్తున్నారు. మరో గ్రేడ్–1 అధికారి అల్లు భవాని కాకినాడ జగన్నాథపురం గ్రూపు దేవాలయాల ఈవోగా పనిచేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈవో పోస్టు 6–సీ అంటే గ్రేడ్–3 అధికారి పనిచేసే పోస్టింగ్ అది. మరో అధికారిణి ఆర్.చందన. ఈమె కూడా పదేళ్ల సీనియర్ గ్రేడ్–1 అధికారి. ఆమెను కూడా 6సీ అంటే గ్రేడ్3 రాజమహేంద్రవరం సత్యనారాయణస్వామి ఆలయం ఈవోగా పని చేస్తున్నారు. గ్రేడ్1అధికారైన పితాని సత్యనారాయణ (తారకేశ్వరరావు)ను 6బి పరిధిలోని రాజమహేంద్రవరం చందాసత్రం ఈఓగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆర్.శ్రీనివాస్, సత్యవాణి వీరు కూడా గ్రేడ్1 అధికారులే. వీరిద్దరూ రాజానగరం సత్రం, రాజమహేంద్రవరం నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్(ఎన్ఎస్బిఎస్) ఈవోలుగా పనిచేస్తున్నారు. 6–బి, 6–సీ గ్రేడ్లు కలిగిన ఈ రెండు పోస్టుల్లో గ్రేడ్–1 అధికారులు పనిచేస్తున్నారు. వీరంతా ఆ శాఖలో సీనియర్ గ్రేడ్–1 అధికారులే అయినా ఉన్నతాధికారులు ఎవరికీ వీరు కనిపించకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా పైవారికి తెలియదా...? అర్హతలు లేని వారెందరో జిల్లాలో అందలాలెక్కి కూర్చున్నా ఆ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కమిషనర్‌కు తెలియకుండా ఉండి ఉంటుందా అనే అనుమానం కలుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కలిగిన ఆలయాల్లో అంతకు తక్కువ స్థాయి కలిగిన వారు పైరవీలతో పాతుకుపోయారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో వాసంశెట్టి ఉమామహేశ్వరరావు కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్, అమలాపురం వెంకటేశ్వరస్వామి ఈఓ వీవీవీఎస్ మూర్తి మందపల్లి, గ్రేడ్–1 స్థాయి కలిగిన ఈఓలు ఉండాల్సిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి, అయినవిల్లి సిద్దివినాయక ఆలయాల్లో అంతకంటే తక్కువ గ్రేడ్–2 క్యాడర్ కలిగిన రమణమూర్తి, సత్యనారాయణరాజు ఈవోలుగా పనిచేస్తున్నారు. అయినవిల్లి, వాడపల్లి రెండు దేవస్థానాల్లో పెరిగిన ఆదాయంతో ఏసీ క్యాడర్‌కు వచ్చేశాయి. అధికారికంగా ఉత్తర్వులు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటువంటి ఈ రెండు దేవస్థానాలు గ్రేడ్–2 అధికారులనే కొనసాగిస్తున్నారు. ఇందులో తాజా బదిలీల్లో వాడపల్లి దేవస్థానానికి వచ్చేందుకు గ్రేడ్–1 రెగ్యులర్ ఇఒలు విశ్వప్రయత్నం చేసినా ఇన్ఛార్జిగా కొనసాగుతోన్న గ్రేడ్–2 వానపల్లి ఇఒ రమణమూర్తి తన స్థానాన్ని కాపాడుకోగలిగారు. ఆ ఆలయానికి పని చేయగలిగే అర్హతలున్న గ్రేడ్–1 ఈవోలను కాదని ఇన్‌ఛార్జిని కొనసాగించడంలో మర్మమేమిటో దేవాదాయశాఖ ఉన్నతాధికారులకే తెలియాలి. ఈ విషయాన్ని గత నెల 25న ‘వాడపల్లి వెంకన్నా నీ వాడిని నేనయ్యా’మ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయ ఈవో గ్రేడ్–2 కేడర్. ఆ ఆలయం చూస్తే గ్రేడ్–1 అంతకంటే ఎక్కువగా అసిస్టెంట్ కమిషనర్‌ను కూడా నియమించవచ్చు. అటువంటిది ఐదేళ్లయినా గ్రేడ్–2 ఈవోను రెగ్యులర్ చార్జితో ఇన్ఛార్జిగా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని గ్రేడ్–1 ఈవోలు బీజేపీ నేతల దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారని తెలిసింది. దేవాదాయ శాఖలోని కమ్యునికేషన్ స్కిల్స్‌లో ఆరితేరిపోవడమే వారికి శ్రీరామ రక్షగా ఉందంటున్నారు. సరైన విధానం లేకనే... అయినవిల్లి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, మురమళ్ల వీరేశస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి...ఈ ఆలయాలన్ని ప్రస్తుతం గ్రేడ్–1, గ్రేడ్–2 ఈవోలు పనిచేస్తున్నారు. ఈ ఆలయాలన్నీ ఏసీ క్యాడర్ స్థాయికి ఎప్పుడో చేరిపోయాయంటున్నారు. వాటికి తగ్గ క్యాడర్‌ను ప్రకటించి ఆ తరహా ఈవోలను నియమించాల్సి ఉంది. ఇవి జరగనంత వరకు ఈ సిఫార్సు వ్యవహారాలు ఆ శాఖలో మామూలేనంటున్నారు. -
మాకే పోస్టింగ్స్ ఇవ్వరా?
- డీజీపీ ప్రతిపాదనలను పైరవీలతో పక్కన పెట్టించిన అదనపు ఎస్పీలు - హోంశాఖ వద్దే నిలిచిపోయిన అధికారుల బదిలీ ఫైలు - రసవత్తరంగా మారిన 9 మంది అదనపు ఎస్పీల బదిలీ - పలు జిల్లాలు, జోన్లకు పోస్టింగ్స్ కల్పిస్తూ డీజీపీ ప్రతిపాదనలు - తమకు అవకాశం కల్పించకపోవడంతో తొక్కిపెట్టిన వైనం సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర పోలీసు బాస్. ఆయనిచ్చే ఆదేశాలకు తిరుగుండదు. కానీ కొంత మంది అధికారులు తమ పైరవీలు, లాబీలతో ఏకంగా డీజీపీ ప్రతిపాదనలను పక్కన పెట్టించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కొంతమంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఆ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో 9 మంది అదనపు ఎస్పీ స్థాయి అధికారులను ప్రతిపాదిస్తూ డీజీపీ వారం రోజుల క్రితం హోంశాఖకు ఫైలు పంపారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, వికారాబాద్ ఎస్పీ, ఎల్బీనగర్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ, మల్కాజ్గిరి డీసీపీ, టాస్క్‌ఫోర్స్, పలు కమిషనరేట్లలో క్రైమ్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల పర్యవేక్షణకు అధికారుల నియామకానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనల్లో తమ పేర్లు లేకపోవడంతో కంగుతిన్న కొంతమంది అదనపు ఎస్పీలు.. మంత్రులు, ఎంపీల చుట్టూ తిరిగి డీజీపీ పంపిన ఫైలును హోం శాఖలోనే పక్కన పెట్టించారు. తమకు కావాల్సిన పోస్టును ఇతరులకు కేటాయించడమేంటని లాబీ చేసి.. విషయం తెర మీదకు తీసుకురాకుండా హెచ్చరికలు జారీ చేయించారు. దీంతో డీజీపీ కార్యాలయ వర్గాలు షాక్ తిన్నట్టు తెలుస్తోంది. ఇది రెండో సారి: అదనపు ఎస్పీల బదిలీ ప్రతిపాదనలకు రెండు రోజుల ముం దు అదనపు కమాండెంట్లకు కమాండెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ పంపిన ప్రతిపాదనలను హోంశాఖలో పక్కన పెట్టించారు. ఫైలు ఎందుకు ఆగిందని ఆరా తీయగా.. ఒక కమాండెంట్‌కు హైదరాబాద్‌లోని బెటాలియన్‌లో పోస్టింగ్ ఇవ్వకుండా సత్తుపల్లిలోని బెటాలియన్‌కు బదిలీ ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ అధికారి తన లాబీయింగ్‌తో హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండా ఆపేసి, నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఓ బెటాలియన్‌కు కమాండెంట్‌గా పోస్టింగ్ మార్పించుకొని ఆదేశాలు వెలువడేలా ఒత్తిడి చేశారు. ఇదేం పద్ధతి?: ఈ రెండు వ్యవహారాలపై ఐపీఎస్ అధికారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. అర్హత, అంకితభావాన్ని బట్టి సంబంధిత అధికారులకు ఉన్న తాధికారులు పోస్టింగ్స్ ప్రతిపాదనలు పంపిస్తే, పైరవీలు చేసి తమను అవమానించేలా చేస్తున్నారని పలువురు ఐపీఎస్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తమకు విలువ ఏముంటుందని ఆందోళన చెందుతున్నారు. -
పదోన్నతి పొందిన ఏఎస్సైలకు పోస్టింగ్‌లు
ఏలూరు అర్బన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి ఇటీవల ఏఎస్సైలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. పదోన్నతి పొందిన వారికి స్టేషన్లు కేటాయిస్తూ జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఇలా.. పేరు పనిచేస్తున్న స్టేషన్ పోస్టింగ్ పి.త్రినాథరావు కొయ్యలగూడెం ద్వారకాతిరుమల ఎంవిఆర్ చంద్రరావు జెఆర్ గూడెం జెఆర్ గూడెం బీవీ ప్రసాదరావు దెందులూరు డీఎస్బీ ఏలూరు కె.శ్రీమన్నారాయణ చేబ్రోలు నరసాపురం ఎ. విజయకుమార్ పెదపాడు తడికలపూడి వైఆర్‌డీ సింగ్‌బాబు పెరవలి తణుకు ట్రాఫిక్ డి.సంజీవరావు ఉండి ఆకివీడు కె.సాల్మన్ రాజు చేబ్రోలు ఏలూరు ట్రాఫిక్ డీకే వరంబాబు ఏలూరు దెందులూరు కె.సూరపరాజు పెంటపాడు పెంటపాడు ఎ.పద్మావతి yì సీఆర్బీ ఐటీ కోర్‌టీమ్ బి.జ్యోతిరాణి లక్కవరం లక్కవరం ఎం.హనుమంతరావు నిడదవోలు సవిుశ్రగూడెం జె.పాపారావు దేవరపలి్ల దేవరపల్లి ఎం.నాగేశ్వరరావు ఏలూరు రూరల్ ఏలూరు టూటౌన్ వైడీ.కృపావరం ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్ సయ్యద్ అహ్మద్ ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్ బి.తాతారావు పెనుగొండ పెరవలి ఎన్వీవీ నాగేశ్వరరావు భీమవరం గణపవరం జేవీఎస్ సాయిబాబు నిడమర్రు అత్తిలి జి.వీరస్వాములు టీ.పీ.గూడెం చేబ్రోలు ఎం.పాపాయ్య పోడూరు జీలుగుమిల్లి జీఎస్.నారాయణ భీమవరం–2 భీమవరం ట్రాఫిక్ వై.కృపాదానం భీమడోలు ద్వారకాతిరుమల వి.వెంకటేశ్వర్లు కొవ్వూరు తణుకు ఐ.భాస్కర్ జీలుగువిులి్ల బుట్టాయిగూడెం కె.సాంబశివరావు పెంటపాడు టీపీగూడెం వి.వరప్రసాద్ డీసీఆర్బీ ఏలూరు డీసీఆర్బీ ఏలూరు ఎస్బీవీజీ కుమార్ భీమవరం–2 పాలకోడేరు వి.లూముంబా జేఆర్ గూడెం జీలుగుమిల్లి పి.కుమారస్వామి దెందులూరు దెందులూరు ఎం.రాజ్యలక్షి్మ ఇరగవరం ఉండ్రాజవరం సీహెచ్.రమేష్‌బాబు పాలకోడేరు తణుకు రూరల్ ఎ.శ్రీనివాసరావు ఆకివీడు మొగల్తూరు -
అంగట్లో పోస్టులు
సబ్ స్టేషన్ ఆపరేటర్ల నియామకాల్లో పైరవీలు డబ్బు, పలుకుబడికే పెద్దపీట రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విద్యుత్ ఉపకేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఆపరేటర్ల ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నా నిరుద్యోగుల నుంచి వస్తున్న పోటీని పలువురు దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఆపరేటర్ ఉద్యోగానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది అభ్యర్థులేమో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధిత కాంట్రాక్టర్లతో బేరాలు సాగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు, ఉద్యోగులు కూడా లోపాయికారిగా సహకారం అందిస్తుండడంతో ఈ పైరవీలకు తెరలేచినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పంద పద్ధతిలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్లను క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. టీఎస్ఎన్పీడీసీఎల్ ద్వారా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో షిఫ్టు ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి జిల్లాలోని 13 గుర్తింపు పొందిన గుత్తేదారులకు ఉపకేంద్రాల మెయింటెనెన్స్‌ను కేటాయించారు. కాగా.. గతంలో ఈ పోస్టుకు రూ.లక్ష వరకు వసూలు చే యగా, ప్రస్తుతం నాలుగింతలు పెరిగినట్లు పలువురు అభ్యర్థులు అంటున్నారు. 38 సబ్స్టేషన్లు.. 108 పోస్టులు.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం కొత్త సబ్‌స్టేష న్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర విద్యుత్ అం దించాలని మూడేళ్లలో నాలుగు డివిజన్ల పరిధిలో 38 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిం ది. ఆదిలాబాద్ పరిధిలో 8, నిర్మల్‌లో 15, మంచిర్యాలలో 7, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో 8 విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించింది. వీటి ద్వారా వి ద్యుత్ సరఫరా అందించేందుకు ఆపరేట ర్ పోస్టులను కేటాయించారు. వీటితోపా టే 2008లో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మ న్ పోస్టుకు ఎంపికైన ఆపరేటర్ల పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఇలా జిల్లావ్యాప్తంగా 108 పోస్టులకు విద్యుత్ సంస్థ అధికారులు గత నెల 19న గుత్తేదారుల ద్వారా నియామక ప్రకటన జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ అభ్యర్థులకు 18 పోస్టులను కేటాయించారు. మిగతా 90 పోస్టులను నాన్ఏజెన్సీ వారికి కేటాయించారు. దీనికోసం డివిజన్ కార్యాలయాల్లో బాక్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత నెల 25 చివరి గడువుగా నిర్ణయించారు. అయితే.. ఇప్పటికే అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ (స్తంభం ఎక్క డం) నిర్వహించాల్సి ఉంది. కానీ.. పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తె లుస్తోంది. దీనికితోడు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక విధానం.. దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీ ఉంటుంది. పదో తరగతి, ఐటీఐలో అత్యధికంగా మార్కులు వచ్చిన వా రికి కాల్‌లెటర్ లేదా పత్రికా ముఖంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకట న ఇస్తారు. అనంతరం అభ్యర్థులకు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష (పోల్ క్లెంబిం గ్) పరీక్ష నిర్వహిస్తారు. ఆపరేషన్ డీఈ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. డీఈ టెక్నికల్, వరంగల్‌లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఒక డీఈ, గుత్తేదారు సభ్యులుగా ఉంటారు. మార్కుల ఆధారంగా.. అభ్యర్థి ఎంపికకు 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందు లో ఐటీఐలో సాంఘిక శాస్త్రం మినహా 90కి పైగా మార్కులు వచ్చిన వారికి 45 పాయింట్లు, 80 నుంచి 90 మార్కులు వచ్చిన వారికి 40 పాయింట్లు, 70 నుంచి 80 మార్కులు వచ్చిన వారికి 35 పాయింట్లు కేటాయిస్తారు. దీంతోపాటు ఉపా ధి కల్పన కార్యాలయంలో ఐటీఐ నమోదు చేయించుకున్న నాటి నుంచి ఏటా 2 పాయింట్లు అత్యధికంగా 10 పాయింట్లు కేటాయిస్తారు. ఉప విద్యుత్ కేంద్రాల్లో పనిచేసిన వాచ్మెన్ ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి, ఆపరేటర్లకు 10 పాయింట్లు, వి ద్యుత్ సంస్థలో అప్రెంటిస్ చేసిన, సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద విద్యుత్ సంస్థలు ఇచ్చిన శిక్షణ తీసుకున్న వారికి 5 పాయింట్లను కేటాయించనున్నారు. గతంలోనూ అవకతవకలు.. గతంలో ఎంపిక సమయంలోనూ ఇదే విధానాన్ని అధికారులు పాటించారు. ఏకంగా వీడియో సైతం తీయించారు. అయినా భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నోటిఫికేషన్ నుంచి చివరి వరకు అధికారులు గుత్తాధిపత్యం వహిస్తూ గుత్తేదారులను పక్కన బెట్టారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిని సభ్యులుగా చేర్చుకున్నారు. దీంతో ఆ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. ముందు జాగ్రత్తపడుతూ అభ్యర్థుల నుంచి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టర్ రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
ప్రతిభకు పాతర
అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగం పాఠశాలలనూ వదలని రాజకీయాలు ఎమ్మెల్యేలు చెప్పిన అభ్యర్థులు.. లేరని భర్తీకి నోచని 100 పోస్టులు గుంటూరు ఎడ్యుకేషన్ : అధికార పార్టీ నేతల నీచ రాజకీయాలు విద్యాలయాలను సైతం విడిచి పెట్టడంలేదు. ప్రతిభ ఆధారంగా జరపాల్సిన నియామకాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేయాల్సిన పోస్టులు అర్హులైన అభ్యర్థులున్నా ఖాళీగా మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యా బోధనకు కాంట్రాక్టు పద్ధతిపై పార్ట్ టైం ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతివ్వగా, జిల్లాలో 275 పోస్టుల భర్తీకి సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.5,000 వేతనాన్ని నిర్ణయించారు. జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్‌ల వారీగా పాఠశాలల్లో ఖాళీల ఆధారంగా అవసరమైన చోట ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లను నియమించాల్సి ఉంది. వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పీఈటీ, మ్యూజిక్, డ్రాయింగ్ విభాగాల వారీగా విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు పని చేయాల్సి ఉంటుంది. హెచ్‌ఎంలపై ఒత్తిడి... ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని, ధృవీకరణ కోసం ఎస్ఎస్ఏ జిల్లా అధికారులకు పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో హెచ్ఎంల అంగీకారం కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతోనే నియామకాలు జరిగాయి. 10 నెలల కాలానికి, అందులోనూ కాంట్రాక్ట్ పద్ధతిపై చేపట్టిన ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను సైతం వదలకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే తాము చెప్పిన అభ్యర్థులకే పోస్టింగ్స్ కల్పించాలని హెచ్‌ఎంలపై ఒత్తిడి తేవడంతో చేసేది లేక వారు చెప్పినట్టే నియమించారు. రాజకీయంగా తమకు అనుకూలురు, కార్యకర్తల కుటుంబ సభ్యులకు పోస్టులు కట్టబెడుతూ వచ్చిన ఎమ్మెల్యేలు జిల్లాలోని 275 పోస్టులకు గానూ 175 మందికి సిఫార్సు చేశారు. వారికి అనుకూలమైన అభ్యర్థులు లేక మరో 100 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తుండగా, మితిమీరిన రాజకీయ జోక్యంతో 100 పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థులకు వృత్తి విద్యా బోధనకు అవకాశం లేకుండా పోయింది. కమిటీల ద్వారానే... జిల్లాలో ఒకేషనల్ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకం విషయంలో నెలకొన్న రాజకీయ జోక్యం, భర్తీ కాకుండా మిగిలిపోయిన 100 పోస్టుల విషయమై ఎస్ఎస్ఏ అధికారులను వివరణ కోరగా, ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు పూర్తిగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారానే జరుగుతున్నాయని, ఇందులో తమ జోక్యం లేదని చెబుతున్నారు. -
నామినేషన్లో గందరగోళం
మిత్ర పక్ష బీజేపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి ఏకపక్షంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ టీడీపీ దౌర్జన్యకాండను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కొరిటెపాడు (గుంటూరు) : అర్బన్ బ్యాంకు పాలకవర్గ పదవులకు సంబంధించి బుధశారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్‌కు తుది గడువుగా ఉంది. దీంతో చైర్మన్ పదవిని ఆశిస్తూ బరిలో ఉన్న టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న బీజేపీ నేత, బ్యాంకు మాజీ చైర్మన్ ఆర్తిమళ్ళ వెంకటరత్నం ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలతో కలిసి బ్యాంకు చేరుకున్నారు. ఈక్రమంలో టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు, నాయకులు నామినేషన్ వేయడానికి లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ మధ్య ఘర్షణ తలెత్తింది. చివరకు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు ఈదర శ్రీనివాసరెడ్డిపై దాడిచేశారు. దీంతో నామినేషన్లు వేయకుండానే బీజేపీ అభ్యర్థులు వెనుదిరిగారు. అనంతరం భారతీయ జనతా పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సిట్టింగ్ చైర్మన్ కొత్తమాసు శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా టీడీపీ శ్రేణులు అడ్డుకుని ఎమ్మెల్యేల వద్దకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల జోక్యంతో కొత్తమాసు నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయారు. టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు ఈ సందర్భంగా అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటి వరకు అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పని చేసిన కొత్తమాసు శ్రీనివాసరావు బ్యాంక్‌ను అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. దీంతో ఏకీభవించని టీడీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిందని ఈ మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పదవిని తమకు వదలి వేయాలని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నుంచి బోనబోయిన శ్రీనివాసయాదవ్, బీజేపీ నుంచి వెంకటరత్నం నామినేషన్లు వేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులతోపాటు నాయకులు నేరేళ్ళ మాధవరావు, చెరుకూరి తిరుపతిరావు, శిఖాకొల్లి అభినేష్, జగన్మోహన్రావు, తోట రామకష్ణ, కె.వి.సుబ్బారావు తదితరులు ఉన్నారు. దౌర్జన్య కాండను ప్రశ్నించిన వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ అడ్డగోలు రాజకీయం, దౌర్జన్యకాండను వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫాలతో పాటు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు తరలి వచ్చారు. బ్యాంకులోకి ఎవ్వరిని వెళ్లనీయకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బ్యాంకులోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అప్పిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలతో వాదనకు దిగారు. అనంతరం బ్యాంకులోకి వెళ్ళి ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలా అడ్డుకునే ధోరణి సరి కాదని, ఈ విధంగావ్యవహరిస్తే తాము న్యాయ పోరాటం చేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించారు. పార్టీ నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, అంగడి శ్రీనివాస్, గులాం రసూల్, జగన్ కోటి, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆరుమండ్ల కొండారెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దాసరి కిరణ్, అంగడి శ్రీనివాసరావు, దుగ్గింపూడి యోగేశ్వరెడ్డి, కె.ప్రేమ్‌కుమార్, మొహమూద్, బడావీరు నాగరాజు, తోట మణికంఠ, కీసర వెంకటసుబ్బారెడ్డి, మేరుగ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, గనిక జాన్సీరాణీ, నిమ్మరాజు శారదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లకు టోపీ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని రెండేళ్ళుగా ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు ఎక్కువ కాలం నిలువలేదు. పాఠశాలల్లో పోస్టింగ్స్ పొందిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతంలో సగం కోత పడనుండగా, డీఈవో పూల్‌లో ఉంచిన వారికి అసలు జీతమే విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ జూన్ 1వ తేదీన పోస్టింగ్స్ ఇవ్వడంతో పాటు అదే రోజు నుంచి వేతన చెల్లింపు పరిధిలోకి వస్తారని ప్రకటించిన ప్రభుత్వం వారిని మోసగించింది. డీఎస్సీ-2014లో ప్రతిభ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులతో ఈనెల 1వ తేదీన సీఎం చంద్రబాబు విజయవాడలో నిబద్ధత ప్రమాణం సైతం చేయించారు. జిల్లాలో డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 890 మంది నియామకం పొందగా, వారిలో 300 మందికి పోస్టింగ్స్ కల్పించలేదు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ కల్పించిన ప్రభుత్వం 13న పాఠశాలల్లో పోస్టింగ్స్ కల్పించింది. వారందరినీ జూన్ ఒకటో తేదీ నుంచి విధుల్లో చేరినట్లుగా పరిగణించాల్సి ఉండగా, విధుల్లో చేరి రోజు నుంచే విద్యాశాఖ అధికారికంగా హాజరు నమోదు చేయడంతో జూన్ నెలకు సగం జీతమే చెల్లించనున్నారు. వారికి జీతాలు నిల్.. పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడంతో డీఈవో పూల్‌లో ఉంచిన 300 మంది అభ్యర్థులకుజీతాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. పాఠశాలల్లో చేరి ఉపాధ్యాయులుగా నమోదైతేనే వారి వివరాలు ట్రెజరీకి పంపడం జరుగుతుంది. డీఈవోకు అటాచ్ చేసినప్పటికీ పాఠశాలల్లో నియామకం పొందని కారణంగా 300 మంది అభ్యర్థులకు జీతాల చెల్లింపులపై ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యామనే ఆనందం మినహా, జీతాలు పొందే పరిస్థితి లేకపోయింది. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు సగం జీతం పొందుతుండగా, పోస్టింగ్స్ అందుకుని పాఠశాలలకు కేటాయించని అభ్యర్థులకు అసలు జీతమే చెల్లించని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు వారు విధుల్లో చేరిన జూన్ 13వ తేదీ నుంచే వేతనాల లెక్కింపు జరుగుతుంది. డీఈవో పూల్‌లో ఉంచిన అభ్యర్థులకు వేతనాలు చెల్లింపు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - కేవీ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
ఏపీలో నలుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులు
హైదరాబాద్ : నలుగురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగులు ఇచ్చింది. జి.వాణిమోహన్- సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ పి.ఉషాకుమారి-మైనార్టీ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రసన్న వెంకటేష్-సీఆర్డీఏ అదనపు కమిషనర్ వి.బి.రమణమూర్తి-సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ -
అక్రమాల జాతర!
టీచర్ల బదిలీల్లో తవ్వినకొద్దీ అవకతవకలు సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ముడుపులు ఇస్తే చాలు కోరుకున్న చోటికి బదిలీలు చేశారు. హేతుబద్ధీకరణలో సర్ప్లస్(అదనంగా ఉన్నట్లు)గా చూపిన పోస్టులను.. ఆ తర్వాత ముడుపులు ముట్టజెప్పిన వారికోసం తిరిగి కొనసాగించారు. బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి కూడా కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నాయకులు డీఈవోలతో కుమ్మక్కై ఈ అక్రమాల బాగోతాన్ని నడిపించారు. ఉప విద్యాధికారులే దళారుల అవతారం ఎత్తినట్లు.. టీచర్లకు, డీఈవోకు మధ్యవర్తిత్వం వహించి భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి మౌనమెందుకో? టీచర్ల బదిలీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకోకున్నా... పారదర్శకంగా, పక్కాగా చేపడతామంటూ ఆయనను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించారు. కానీ అక్రమాలను నిరోధించలేకపోయారు. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ముగ్గురు టీచర్ల స్థానాలు మార్చారన్న ఆరోపణలపై ఆ జిల్లా డీఈవో సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన కడియం శ్రీహరి... మిగతా జిల్లాల్లో అక్రమాలను అసలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, నిజమాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినా పట్టనట్టే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలోని స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతుంటే... అదే జిల్లాలోని చాలా స్కూళ్లలో అవసరం లేకపోయినా ఇప్పటికీ టీచర్లను కేటాయిస్తుండడం గమనార్హం. ఇక్కడ బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తరువాత కూడా వందల సంఖ్యలో పోస్టింగ్‌లను మార్చేశారు. అక్రమాలు ఎన్నెన్నో.. మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పరపల్లి ఉన్నత పాఠశాలలో అవసరానికి మించి ఒక ఎస్జీటీ ఉన్నారని నిర్ధారించి ఆ పోస్టును తొలగించారు. బదిలీల కౌనె ్సలింగ్ ముగిశాక అవసరం లేకపోయినా ఆ పోస్టును తిరిగి కొనసాగించి, ముడుపులు ముట్టజెప్పిన వారికి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కేశంపేటలో జెడ్పీహెచ్ఎస్ పనిచేస్తున్న ఒక తెలుగు పండిట్‌కు జెడ్పీహెచ్ఎస్ కొత్తూరులో ఆగస్టులో ఖాళీ అయ్యే పోస్టును ముందుగానే కేటాయించారు. సిర్సవాడ ప్రాథమిక పాఠశాలలోని ఒక ఎస్జీటీ కౌన్సెలింగ్‌లో గుడిపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంచుకున్నారు. కాని స్థానం మార్చేసి గజ్జిలపల్లి పీఎస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. బండారునగర్ స్కూల్లో పోస్టు లేకపోయినా, అవసరం లేకపోయినా అక్కడికి పోస్టును ఇచ్చి తమకు కావాల్సిన వ్యక్తిని బదిలీ చేశారు. * హైదరాబాద్ జిల్లాలో ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. కానీ ఆయన కోసమే ఆస్మాన్‌గఢ్ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును సృష్టించి ఇచ్చారు. మరో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టును (కాలేడేరా స్కూల్లో) బదిలీల తరువాత క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా సదరు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోరుకున్న స్థానాన్ని ఆయన కోసం మార్పు చేశారు. చాంద్రాయణగుట్టలో తెలుగు పండిట్ పోస్టును రేషనలైజేషన్‌లో సర్‌ప్లస్‌గా ఉన్నట్లు చూపారు. కానీ దానిని అవసరమైన స్కూల్‌కు కేటాయించలేదు. ముడుపులు ముట్టజెప్పిన ఆ టీచర్ కోసమే ఆ పోస్టును, ఆ టీచర్‌ను అక్కడే ఉంచారు. పదోన్నతుల షెడ్యూల్ గత నెల 12వ తేదీనే ముగిసినా 16వ తేదీన పదోన్నతులు (12వ తేదీ పేరుతో) కల్పించి వారు కోరుకున్న స్థానాలను కేటాయించారు. * నిజమాబాద్‌లో ఒక స్కూల్ అసిస్టెంట్ నాగిరెడ్డిపేట మండలం నుంచి గాంధారి మండలంలోని స్కూల్‌ను ఎంచుకున్నారు. కానీ ముడుపుల బాగోతంలో బాన్సుపేట మండలానికి మార్చారు. బయలాజికల్ సైన్స్ టీచర్ ఒకరు కౌన్సెలింగ్‌కే హాజరుకాలేదు. కానీ ఎడపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఖాళీ అయిన తరువాత ఆ పోస్టును ఈ టీచర్‌కు కేటాయించారు. అక్రమాలపై సీఎస్‌కు ఫిర్యాదు ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మకు పీఆర్టీయూ-తెలంగాణ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో భారీగా అక్రమాలు జరిగాయని తెలిపింది. ఈ మేరకు గురువారం పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య తదితరులు సీఎస్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. అడ్డగోలుగా చేసిన బదిలీలకు సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను, అడ్డదారిలో పదోన్నతుల పొందిన టీచర్ల జాబితాలను అందజేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుకు వినతి పత్రాలను అందజేశారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి, బహుజన టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారావు డిమాండ్ చేశారు. -
8 మంది డీసీలకు త్వరలో పోస్టింగ్‌లు
సీఎం ఆఫీస్‌లో ఫైల్ పెండింగ్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖలో రాష్ట్రస్థాయి కేడర్‌లో పనిచేస్తున్న అధికారుల విభజన ప్రక్రియ ఇటీవల దాదాపుగా పూర్తయింది. ఏపీకి చెందిన 35 మంది అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సీటీవోల భర్తీ ప్రక్రియ వేగం అందుకుంది. ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వివిధ డివిజన్లలో భర్తీ చేసేందుకు కమిషనర్ వి. అనిల్ కుమార్ ఫైలు తయారు చేసి ఇటీవలే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఫైలుపై సంతకాలు చేస్తే ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిప్యూటీ కమిషనర్లుగా ఆదిలాబాద్‌కు ఆనంద్ రావు, కరీంనగర్ కు ద్వారకానాథ్ రెడ్డి, హైదరాబాద్ రూరల్- కాశీ విశ్వనాథ్ రెడ్డి, పంజాగుట్ట- లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్- కె. హరిత, బేగంపేట- సాయి కిషోర్, వరంగల్ - లావణ్య, నల్లగొండ- గీతలను నియమించనున్నారు. వీరి భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ల ఖాళీలను భర్తీ చేస్తారు. వీటితో సీటీవోల భర్తీకి డీపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే ఈ కమిటీ సీనియారిటీ ఆధారంగా సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తుంది. అలాగే డీసీటీవోలు సీనియారిటీ ఆధారంగా సీటీవోలు కానున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో కసర త్తు సాగుతున్నా, వివిధ కారణాల వల్ల ఓ కొలిక్కి రాలేదు. డీసీల నియామకం పూర్తయిన వెంటనే ఈ ఫైలు కూడా కదులుతుందని ఓ అధికారి తెలిపారు. -
వైఎస్సార్సీపీ యువజన విభాగంలో నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో పలువురు నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిజామాబాద్ జిల్లా యూత్ కమిటీ అధ్యక్షుడిగా కె.నవీన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సి.హరినాథరెడ్డి, మెదక్ ప్రధాన కార్యదర్శిగా ఎం.విజయభాస్కరరెడ్డి, కార్యదర్శిగా బి.మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఏఎన్ రాంమనోహర్, కార్యదర్శులుగా బి.శ్రీకాంత్‌రెడ్డి, పి.నరేందర్, కార్యదర్శిగా జి.సుమన్‌గౌడ్, కార్యవర్గ సభ్యుడిగా ఎస్.ఎస్.సూర్య, యువజన విభాగం హైదరాబాద్ కార్యదర్శిగా ఒమర్, సంయుక్త కార్యదర్శిగా జి.శివమణిరెడ్డి,కరీంనగర్ ప్రధానకార్యదర్శిగా వై.సంతోష్‌రెడ్డి నియమితులయ్యారు. -
'అధికారంలోకి తెచ్చిన వారికి మంచి పోస్టింగులు'
-
టీడీపీని అధికారంలోకి తెచ్చిన వారికి మంచి పోస్టింగులు: మంత్రి అయ్యన్న
వివిధ జిల్లాల్లో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడుల్లో మంత్రులు గాడి తప్పి మాట్లాడారు. తమ రాజకీయ కోణాన్ని బయటపెట్టి అందర్నీ భయపెట్టారు. సాక్షి, విశాఖపట్నం: కార్యకర్తల కోసం పనిచేసేవారిని తెచ్చుకునేందుకే తమ ప్రభుత్వం బదిలీలు చేపట్టిందని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో సహకరించిన అధికారులకు మంచి పోస్టింగ్లిస్తామని, కార్యకర్తల కోసం పనిచేసే వారిని ఏరికోరి తెచ్చుకుంటామన్నారు. విశాఖపట్నంలోని అంకోసా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదన్నారు. అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ‘మా పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అక్రమ కేసులు బనాయిస్తే జైలుకెళ్లారు. వారికోసం పనులు చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. పత్రికలు రాస్తే రాసుకోనీయండి..మా పని మాదే..పత్రికల పని పత్రికలదే. ఆ రాతల్ని పట్టించుకోనవసరం లేదు’ అని అన్నారు. కార్యకర్తలు చెప్పింది చేయాలి: అచ్చెన్న శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004కు ముందు ప్రభుత్వంతో సమానంగా పార్టీని నడపనందునే ఓటమిపాలయ్యామన్నారు.ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో జరిపిస్తానన్నారు. కార్యకర్తలను గౌరవించాలి: గంటా కడప రూరల్ : టీడీపీ కార్యకర్తలు న్యాయసమ్మతంగా చెప్పింది అధికారులు చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కడప మినీ మహానాడులో మాట్లాడారు. కార్యకర్తలు కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఐఏఎస్‌లకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: పలువురు సీనియర్ అధికారులు సహా 22 మంది ఐఏఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. సోమవారం అర్ధరాత్రి ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఆదివారం కూడా అర్ధరాత్రి వేళ కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులివ్వడం తెలిసిందే. వాటిలో తాజాగా కొన్ని మార్పుచేర్పులు చేసింది. సీనియర్ అధికారి రాజేశ్వర్ తివారీని పర్యావరణం, అటవీ, శాస్త్రసాంకేతికశాఖల ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అధర్‌సిన్హాను సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. వివరాలు... 1. రాజేశ్వర్ తివారీ: పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికల శాఖ ముఖ్యకార్యదర్శి 2. అధర్‌సిన్హా: సీసీఎల్ఏ కార్యలయ ప్రత్యేక కమిషనర్ 3. అర్వింద్‌కుమార్: ఇంధనశాఖ కార్యదర్శి 4. ఎం.జగదీశ్వర్: హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ఎండీ 5. వాణీప్రసాద్: సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్ 6. బి.వెంకటేశం: హోం శాఖ కార్యదర్శి 7. దానకిషోర్: గహనిర్మాణశాఖ కార్యదర్శి 8. సందీప్‌కుమార్ సుల్తానియా: రవాణాశాఖ కమిషనర్ 9. సయ్యద్ ఒమర్ జలీల్: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి 10. జగన్మోహన్: ఆదిలాబాద్ కలెక్టర్ 11. దినకర్‌బాబు: శాప్ ఎండీ 12. డాక్టర్ క్రిస్టీనా జడ్ చొంగ్తు: పర్యాటకశాఖాభివద్ధి సంస్థ ఎండీ 13. డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్: డైరక్టర్ కుటుంబ సంక్షేమం, పీడీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ 14. టి.చిరంజీవులు: పాఠశాల విద్య సంచాలకులు 15. జి.డి.ప్రియదర్శిని: తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్టు చేయాలి. (ఆదివారం ఆమెకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మర్చారు) 16. లోకేశ్‌కుమార్: వీసీ అండ్ ఎండీ ఖనిజాభివద్ధి సంస్థ 17. పౌసుమి బసు: కరీంనగర్ జేసీ (ఆదివారం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా ఇచ్చిన పోస్టింగు రద్దు.) 18. డాక్టర్ ఎం.వి.రెడ్డి: డైరెక్టర్ వ్యవసాయం 19. బి.విజియేంద్ర: జేసీ మహబూబ్‌నగర్ 20. డి.దివ్య: జేసీ నిజామాబాద్. కమిషనర్ (ఎఫ్ఏసీ) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 21. హరిచందన దాసరి: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్. (ఆదివారం రంగారెడ్డి జేసీ-2గా ఇచ్చిన పోస్టింగ్ రద్దు) 22. ఆమ్రపాలి కాటా: జేసీ-2 రంగారెడ్డి -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
-
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
* వెయిటింగ్‌లోని 18 మందికి పోస్టింగ్‌లు * మంగళవారం అర్ధరాత్రి జీవో జారీ సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీస్థాయిలో బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడలో బుధవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంతమంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. జేఎస్వీ ప్రసాద్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి ఆయన బదిలీకి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ముక్కు సూటిగా, నిబంధనల మేరకు, ఒత్తిడిలకు లొంగకుండా పనిచేసే వ్యక్తిగా పేరున్న 2004 బ్యాచ్‌కు చెందిన పీఎస్ ప్రద్యుమ్నను సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఎ.బాబును, శ్రీకాకుళం కలెక్టర్‌గా పి. లక్ష్మీనరసింహంను నియమించారు. వివరాలు.. -
ప్ర‘దక్షిణలు’!
* అధికార పార్టీ నేతలను చుట్టేస్తున్న త్రిబుల్స్టార్లు * పోట్లదుర్తికి క్యూ * ఎంపీకి పత్రికా ప్రకటన ఇచ్చిన సీఐకి చిన్నచౌక్ ఖరారు * కొన్ని సర్కిళ్లకు రూ.10 లక్షలు పలుకుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప: వారంతా ఉన్నతోద్యోగులు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అధికారులు. అయితే కాసులు కురిపించే సర్కిళ్లలో పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కోరుకున్న పోస్టింగ్ కోసం లక్షలను వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. త్వరలో పోలీసు ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయనే సమాచారం రావడంతో పైరవీలను ముమ్మరం చేశారు. గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారి ఒకరు ఏకంగా ఓ సర్కిల్ కోసం రూ.10 లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు జీఓ నెంబర్ 175 కలిసి వస్తోంది. ఆ ఉత్తర్వుల కారణంగా కాసుల వర్షం కురుస్తోంది. అవసరాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ అధికారుల నియామకాలు చేపట్టవచ్చని ఉత్తర్వులు వివరిస్తున్నాయి. దీంతో అధికారపార్టీ నేతలకు డిమాండ్ పెరిగింది. కోరుకున్న పోస్టింగ్ కోసం పోలీసు ఇన్స్పెక్టర్లు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆ క్రమంలో త్రిబుల్‌స్టార్ అధికారులు పోట్లదుర్తికి అధికంగా వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలో పనిచేసి వెళ్లిన కొంతమంది పోలీసు అధికారులు పాత పరిచయాలతో నేతలను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఎంపీకి శుభాకాంక్షలు చెప్పినందుకు..... రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్‌కు అవకాశం దక్కడంతో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పట్లో పోలీసు యూనిఫాంతో శుభాకాంక్షలు చెబుతూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయన కోరుకున్న చిన్నచౌక్ సర్కిల్లో పోస్టింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల హోమంత్రి పర్యటనలో కాపులు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఖర్చులు భరించిన ఓ సీఐకి కడప అర్బన్ సర్కిల్ ఖరారైనట్లు సమాచారం. అదే సర్కిల్లో తనకు అవకాశం ఇవ్వాలని అందుకోసం రూ.10లక్షల వరకూ ఇవ్వగలనని జిల్లా కేంద్రంలో పనిచేసి వెళ్లిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్కిల్ కుదరకపోతే యర్రగుంట్ల సర్కిల్లో అవకాశం ఇచ్చినా సమ్మతమే అన్నట్లుగా సమాచారం. డీఎస్పీలుగా పదోన్నతి పొందడంతో ఖాళీలు పడ్డ కడప రూరల్, వన్‌టౌన్ సర్కిళ్లకు పోటీ తీవ్రతరంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలోని పోస్టింగ్‌లకు ఏకపక్షంగా పనిచేసే అధికారుల కోసం ఆన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరొక సర్కిల్‌ను పంచుకున్న మహిళా నేతలు... జిల్లాలోని మాజీ మహిళా ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకురాలు ఇరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల నియామకాలలో పోటీ పడుతున్నారు. ఇటీవల ఇరువురు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. వారి వారి నివాసాల పరిధిలోని సర్కిళ్లకు వారు సూచించిన అధికారిని నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే తన హయాంలో హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌ఐగాను, కొండాపురం సర్కిల్ సీఐగా పనిచేసి వెళ్లిన అధికారి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోనేత ఎన్నికల్లో పనిచేసి వెళ్లిన అధికారితోపాటు, తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐ పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అవకాశం ఇవ్వాలని మైదుకూరు, రిమ్స్ సర్కిళ్ల కోసం ఆయా ప్రాంతాలకు చెందిన ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇలా ఎవరి పరిధిలో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. -
నచ్చిన చోటుకు ప్రభుత్వ బీమా మహిళా ఉద్యోగుల బదిలీలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమకు నచ్చిన చోట నియామకాలు/బదిలీలు పొందవచ్చు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్ఐసీతో సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగులు... వివాహితులైతే తమ భర్తలు పనిచేసే చోట, అవివాహితులైతే తల్లిదండ్రులు నివసిస్తున్న చోటకు బదిలీలు/నియామకాలు పొందవచ్చు. ఎల్ఐసీ, జీఐసీ, ఇతర ఐదు ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మహిళలకు అనుకూలమైన బదిలీ విధానాలు రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. మహిళా ఉద్యోగుల ఇబ్బందులను తొలగించేలా ఈ బదిలీ నిబంధనలు ఉండాలని కూడా ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. -
కోర్సులేకున్నా పోస్టింగులు
జిల్లాలో కీలక నేత సిఫార్సే అర్హత ఏయూ పెద్దల నిర్వాకం ఇదీ దూరవిద్యావిభాగంలో అస్మదీయులకు అందలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే చివరిపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది ఏయూలో పోస్టిం గుల తీరు. పెద్దలు మనవాళ్తై కోర్సులు లేకపోయినా పోస్టులు మాత్రం కట్టబెట్టేస్తున్నారు. మంత్రివర్యుల సిఫార్సు... ఏయూ పెద్దల సపోర్టు ఉంటే ఇంకేం... పోస్టుల భర్తీ అన్నది పూర్తి ఫార్సుగా తయారైపోతోంది. ఏయూ దూరవిద్యా విభాగం కేంద్రంగా అస్మదీయులకు యథేచ్ఛగా పోస్టుల పందేరం సాగుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది...జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ ప్రభుత్వ పెద్ద అనుగ్రహానికి పాత్రులు కావడమే ఏయూ పెద్దల లక్ష్యంగా మారింది. గతంలోఅడ్డగోలుగా మూడు పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ జరిపించింది. అయినా వ్యవహారం మాత్రం తేలలేదు. కేవలం ఏయూ పెద్దలను తన దారికి తెచ్చుకునేందుకే సదరు పెద్ద ఈ వ్యవహారాన్ని వాడుకున్నారని తేటతెల్లమైంది. తరువాత ఆయన చెప్పిందే ఏయూలో వేదంగా మారింది. ఆ నివేదికను బూచిగా చూపి అస్మదీయులతో ఏయూను నింపేస్తున్నారు. తాజాగా ఆ ప్రభుత్వ పెద్ద తనవారికి ఏయూలో పోస్టులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. కోర్సు లేకపోయినా! ప్రభుత్వ పెద్ద సిఫార్సుతో ఏయూ పెద్దలు తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థి సబ్జెక్ట్ జాగ్రఫీ. ప్రస్తుతం జాగ్రఫీ విభాగంలో ఖాళీలు లేవు. దాంతో ఏయూ పెద్దలు మరో ఎత్తుగడ వేశారు. దూరవిద్యావిభాగంలో ఆయన్ని కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు. కాకపోతే అందుకోసం వెబ్సైట్లోనోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించి కాస్త పద్దతిగానే హడావుడి చేశారు. కానీ అసలు కోర్సే లేని సబ్జెక్ట్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు నియమించారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఈ నియామకంతోవిద్యార్థులకు ఉపయోగం లేదు. పైగా ఏయూకు ఆర్థిక భారం. గతంలో కూడా! జాగ్రఫీలోనేకాదు కొన్ని నెలల క్రితం సోషల్‌వర్క్ విభాగంలో కూడా కాంట్రాక్టు విధానంలో ఓ మహిళను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించారు. ఆమె సర్వీసును రెన్యువల్ కూడా చేశారు. ఇలా కోర్సులు లేకపోయినా పోస్టింగులు కట్టబెడుతున్నవారికి ఇతరత్రా పనులకు ఉపయోగించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ కోర్సులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆ కోర్సులు లేవు. దాంతో వారిని అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకనో మరోదానికనో ఉపయోగించుకోవాలన్నది ఏయూ పెద్దల ఉద్దేశం. ముందు ఉద్యోగం ఇచ్చేసి ... తరువాత ఏదో బాధ్యత అప్పగిస్తారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు వాడుకుంటాం: రిజిస్ట్రార్ ఈ వ్యవహారంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా కోర్సులు లేకపోయినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిన విషయాన్ని ధ్రువీకరించారు. వారిని దూర విద్యావిభాగంలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పనుల్లో ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. -
పోస్టింగ్‌లు ఇప్పించండి
కరీంనగర్ సిటీ : అర్హత పొంది నెలలు గడుస్తున్నా తమకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని, వెంటనే నియామక ఉత్తర్వు లు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శులుగా అర్హత సాధించిన అభ్యర్థులు జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమతో మొరపెట్టుకున్నారు. శుక్రవారం అభ్యర్థులు శ్యాంసుం దర్, జయరాజ్, మారుతి, శ్రీనివాస్ తదితరులు జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఫిబ్రవరి 23 న రాత పరీక్ష జరిగిందని,మార్చి 22న ఫలితాలు వెలువడ్డాయన్నారు. జిల్లాలో 88 మంది అర్హత సాధించామని, జూన్ 10,20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. ఇప్పటివరకు తమకు పోస్టింగ్‌లు మా త్రం ఇవ్వడం లేదన్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉందని ఆవేదన చెందారు. వెంటనే పోస్టింగ్‌లు ఇప్పించేలా చూడాలని కోరారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తానని జెడ్పీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పాతూరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చోల్లేటి శ్రీనివాస్ కోరారు. ఈమేరకు వారు శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమకు వినతిపత్రం సమర్పించారు. బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని కోరారు. ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఆన్లైన్లో ఉంచాలని, నెలనెలా స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్‌టైం స్వీపర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. వారి వెంట ఆసంఘం నాయకులు సత్యనారాయణస్వామి, శ్రీనివాస్, కేతిరి తిరుపతిరెడ్డి, పంపయ్య, శ్రీధర్, రాంచంద్రం తదితరులున్నారు. -
బాబూ.. చిట్టీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అడ్డం తిరిగిన తహసీల్దార్లను దారికి తెచ్చుకునే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విధుల్లో చేరినవారికి భవిష్యత్‌లో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది. ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు న్యాయపర చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ 12 మంది తహసీల్దార్లు విధుల్లో చేరేందుకు ససేమిరా అన్నారు. వీరిలో ఐదుగురు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి కలెక్టర్ జారీచేసిన పోస్టింగ్ ఉత్తర్వులు రద్దు చేయించారు. ఎన్నికలకు ముందు పనిచేసిన మండలాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. స్థానచలనం జరిగిన తహసీల్దార్లు మెట్టు దిగకపోవడంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది. కౌంటర్ అఫిడవిట్! ప్రభుత్వ పెద్దల అండదండలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన జిల్లా యంత్రాంగానికి తహసీల్దార్ల తిరుగుబాటుతో దిమ్మతిరిగింది. కొత్త మండలాల్లో రిపోర్ట్ చేయకపోవడం, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ఉత్తర్వులను రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్.. తహసీల్దార్ల విషయం లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అధికారులతో సమీక్షించారు. విధుల్లో చేరేలా తహసీల్దార్లకు నచ్చజెప్పాలని, స్వల్పకాలంలో మంచి పోస్టింగ్‌లు ఇస్తామని భరోసా ఇవ్వడం ద్వారా డ్యూటీకి రిపో ర్టు చేసేలా చూడాలని రెవెన్యూ ఉన్నతాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ సముదాయించినా పంతం వీడకపోతే న్యాయపరంగా నడుచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం న్యాయ నిపుణులతో డీఆర్ఓ వెంకటేశ్వర్లు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ జరిగిందని, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే పాత మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్దేశించడం సరికాదనే వాదనను వినిపిం చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, బదిలీల వ్యవహారం లో జిల్లా యంత్రాంగం తీరుపై గుర్రుగా ఉన్న 12 మంది తహసీల్దార్లు ఉన్నతాధికారుల బుజ్జగింపులతో డైలమాలో పడ్డారు. బెట్టు కొనసాగిస్తే కొరివితో తలగోక్కున్నట్లే అవుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ట్రిబ్యునల్‌లో జిల్లా యంత్రాంగం దాఖలుచేసే కౌంటర్ అఫిడవిట్ పరి శీలించిన అనంతరం.. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తున్నారు. బదిలీల వ్యవహారంలో ప్రభు త్వతీరును తప్పుపడుతున్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం.. అవసరమైతే రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి ఆందోళనకు దిగాలని యోచిస్తోంది. -
కొత్త ఆర్డీవోలు వీరే..
- హైదరాబాద్‌కు నిఖిల.. సికింద్రాబాద్ కు శర్మ - కొత్త ఆర్డీవోల నియామకం త పలువురు డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు సాక్షి, సిటీబ్యూరో : కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండ్రోజుల్లోనే కీలకమైన రెవెన్యూ విభాగంలో భారీగా బదిలీలు జరిగాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురు పాత డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం తప్పలేదు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌లు దక్కని డిప్యూటీ కలెక్టర్లను తదుపరి పోస్టింగ్ నిమిత్తం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో జరిగిన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఇలా ఉన్నాయి. -
విభజన.. హైరానా!
అందరి దృష్టి జూన్ 2 పైనే - తలమునకలవుతున్న ప్రభుత్వం - ఉద్యోగుల బిల్లులు మినహా తక్కిన పనులన్నీ వాయిదా - నెలాఖరునే పదవీ విరమణ లబ్ధి - మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు - జూన్ ఒకటి సహా మే నెల వేతనం బిల్లుల సమర్పణ గడువు పొడిగింపు? సాక్షి, కర్నూలు: ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతులు.. పోస్టింగ్‌లు.. కౌన్సెలింగ్‌లు.. అన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బిల్లులు మినహా మిగిలిన పనులేవీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పింది. విభజన నేపథ్యంలో చక్కబెట్టాల్సిన పనులపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉద్యోగులు వారి జీతాల బిల్లులు సమర్పించేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు పొడిగించడంతో ఆదివారం కూడా ఖజానా కార్యాలయాలు పనిచేశాయి. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు 65వేల పైమాటే. పింఛన్‌దారులు 35వేల మంది ఉన్నారు. అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ తుది గడువుగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జూన్ 2న అమల్లోకి రానుండటంతో ఆ నెల 1వ తేదీకి సంబంధించి ఒక్కరోజు ఉద్యోగుల జీతం బిల్లును కూడా ముందుగానే సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల తయారీకి ఉద్యోగులు హైరానా చెందుతున్నారు. ఇదిలాఉండగా ఐసీడీఎస్ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులతో పాటు వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను కూడా ఒకే పద్దు కింద డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు మూడు రోజుల్లోనే నిధులన్నీ డ్రా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వస్తే ఆ తర్వాత నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో తెలియని నేపథ్యంలో ఐసీడీఎస్ పథకాలు నిలిచిపోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాఖల కుదింపు ప్రస్తుతం ప్రభుత్వ శాఖల విభాగాలన్నీ కలిపి 114 ఉండగా.. వీటిని కుదించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ విభాగాలను సగం కన్నా తక్కువ సంఖ్యలో కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ డెరైక్టరేట్లోనూ ఆయా శాఖలను పర్యవేక్షించే సిబ్బందిని కుదించనున్నారు. ఈ కసరత్తును ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 24వ తేదీ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఖర్చును అనమతించరాదని నిర్ణయించారు. ఉద్యోగులు జీపీఎఫ్, కంటింజెంట్, జీతాల బిల్లులు, నెలాఖరుకు పదవీవిరమణ చేసే వారి గ్రాట్యూటీ, ఇతర బిల్లులను ఈ గడువులోగానే సమర్పించాల్సి ఉంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన బిల్లులను కూడా ఈ గడువులోపే అందజేయాలని ఆదేశించారు. అందుబాటులోకి రాని సర్వర్లు విభజన ముంచుకొస్తున్న సమయంలో ఆన్లైన్ మొండికేసింది. శని, ఆదివారం సర్వర్లు మొరాయించగా.. సోమవారం ఉదయం కొంతసేపు పనిచేసినా ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. ఉద్యోగులు బిల్లులు సమర్పించేందుకు సోమవారం ఆఖరు కావడంతో గందరగోళానికి తావిచ్చింది. సర్వర్లు పని చేయని కారణంగా గడువును 23వ తేదీ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ట్రెజరీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా విభజన కారణంగా ప్రతి శాఖలోనూ ఉద్యోగులపై ఒత్తిడి అధికమైంది.