న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమకు నచ్చిన చోట నియామకాలు/బదిలీలు పొందవచ్చు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్‌ఐసీతో సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగులు... వివాహితులైతే తమ భర్తలు పనిచేసే చోట, అవివాహితులైతే తల్లిదండ్రులు నివసిస్తున్న చోటకు బదిలీలు/నియామకాలు పొందవచ్చు.
ఎల్‌ఐసీ, జీఐసీ, ఇతర ఐదు ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మహిళలకు అనుకూలమైన బదిలీ విధానాలు రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. మహిళా ఉద్యోగుల ఇబ్బందులను తొలగించేలా ఈ బదిలీ నిబంధనలు ఉండాలని కూడా ఆర్థిక శాఖ స్పష్టంచేసింది.
నచ్చిన చోటుకు ప్రభుత్వ బీమా మహిళా ఉద్యోగుల బదిలీలు!
Published Mon, Oct 27 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement