Female Employees
-
Anubhav Dubey: చాయ్ సుట్ట సహృదయం
ప్రముఖ చాయ్ కంపెనీ ‘చాయ్ సుట్ట’ పెయిడ్ మెనుస్ట్రుయేషన్ లీవ్‌ను అమలు చేస్తోంది. ఈ సెలవు గురించి కంపెనీ ఫౌండర్ అనుభవ్ దూబే మహిళా ఉద్యోగులతో నిర్వహించిన చర్చా కార్యక్రమం తాలూకు విషయాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. చర్చలో పాల్గొన్న వారి నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి. కొందరు ‘సెలవు అనివార్యం కాదు’ అన్నట్లుగా మాట్లాడారు. ‘ఆ రోజుల్లో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి సెలవు తప్పనిసరి’ అని కొందరు మాట్లాడారు. చర్చ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండోర్‌కు చెందిన ఎంటర్ప్రెన్యూర్, చాయ్ సుట్ట ఫౌండర్ అనుభవ్ దూబే లింక్డ్ఇన్లో ఇలా రాశారు... ‘భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ ఆరోగ్యకరమైన చర్చ నడిచింది. మెనుస్ట్రువల్ లీవ్ ఇవ్వాలి అనుకోవడం కఠినమైన నిర్ణయం కాదు. కొన్ని విషయాలను స్త్రీలు మాత్రమే అర్థం చేసుకోగలరు’ -
కరోనా ఎఫెక్ట్: ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగిపోతుంది
ముంబై: కరోనా వైరస్ పరమైన సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగినట్లు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం అప్నాడాట్‌కో ఒక నివేదికలో తెలిపింది. 2021లో మహిళా యూజర్ల సంఖ్య 430 శాతం ఎగిసిందని పేర్కొంది. తమ ప్లాట్‌ఫాంలో ఉద్యోగాన్వేషణకు సంబంధించిన ధోరణుల ఆధారంగా అప్నాడాట్‌కో ఈ నివేదిక రూపొందించింది. ఎక్కువగా బీపీవో, బ్యాక్ ఆఫీస్, రిసెప్షనిస్ట్, ఫ్రంట్ ఆఫీస్, టీచర్, అకౌంట్స్, ఫైనాన్స్, అడ్మిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ నెలకొందని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. అలాగే డెలివరీ పార్ట్నర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రైవర్స్ వంటి సంప్రదాయేతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: Work From Home: టీసీఎస్ రూల్స్ మార్చేసింది.. అవి ఏంటంటే? -
మహిళలే టార్గెట్: హలో అంటూ వల వేసి..
తాను ఉన్నతాధికారినంటూ ఫోన్ చేస్తాడు.. ప్రమోషన్ ఇస్తానని నమ్మబలుకుతాడు.. ఫొటోలు కావాలని ముగ్గులో దింపడానికి ప్రయత్నిస్తాడు.. నమ్మితే బలైపోవాల్సిందే. సారవకోట, మెళియాపుట్టి మండలాల్లో వెలుగు చూసిన వ్యవహారమిది. ఆ నంబర్‌తో ఫోన్ వస్తే చాలు ఈ రెండు మండలాల్లోని కొందరు ఉద్యోగిణులు హడలిపోతున్నారు. ఉద్యోగాలంటూ, ప్రమోషన్లంటూ మాటలు కలుపుతూ లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఏ కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా భయపడుతున్నారు. ఫోన్ చేస్తున్న వాడి ఊరు, పేరు తెలియకపోవడంతో అమాయకులు వలలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సారవకోట, మెళియాపుట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహిళలనే టార్గెట్‌గా పెట్టుకున్న ఆ వ్యక్తి కింది స్థాయి ఉద్యోగినులకు ఫోన్లు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఉద్యోగాలు, ప్రమోషన్ల ఎర చూపడం చేస్తున్నాడు. ప్రధానంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఇతరత్రా చిన్న పాటి ఉద్యోగినులకు ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మహిళా వలంటీర్లతోనైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఎవరీ వ్యక్తి అని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తుంటే ఫోన్ చేసిన వాళ్లనూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఉదాహరణలివే.. ►సారవకోట మండలంలోని బొంతు గ్రామానికి చెందిన ఒక మహిళకు 8096762584 నంబర్ నుంచి ఈ నెల 3న ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మహిళతో మాటామాటా కలిపి అసభ్యకరంగా మాట్లాడాడు. ►దీనిపై ఆమె ఈ నెల 4న సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ►ఈ నెల 8న మండలంలోని చీడిపూడి గ్రామానికి చెందిన నలుగురు మహిళా వలంటీర్లకు అదే నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని, అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తున్నారని ఆ పోస్టులు మీకు వచ్చేలా చూస్తానని చెప్పి నమ్మబలికాడు. దరఖాస్తు చేయడానికి పూర్తి సైజ్ ఫొటో ఇవ్వాలని కోరడంతో ఆ వలంటీర్లకు అనుమానం వచ్చి ఫోన్ కట్ చేశారు. ►బుడితి సచివాలయ మహిళా పోలీసుకు సైతం ఇలాంటి కాల్ వచ్చింది. ఆమె స్థానిక ఎస్ఐ దృష్టిలో కూడా పెట్టారు. ►మెళియాపుట్టి మండలంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ►మూడు నెలల కిందట మండలంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా పీడీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని ఫోన్ చేసి మీకు ప్రమోషన్లు ఇప్పిస్తానని, వేరే ►చోటకు బదిలీ చేయిస్తానని నమ్మబలికి వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. ►మరికొంత మందికి ఫోన్ చేసి ‘మీరు గుడ్డు, పాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు. మీ పై ఫిర్యాదులు వచ్చాయ’ని చెప్పి వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేస్తున్నారు. ►గ్రామాల్లో ఉన్న ఒంటరి మహిళల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, ఏఎన్ఎంల నుంచి సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాను ఉన్నతాధికారినంటూ నమ్మబలికి బెదిరిస్తున్నాడు. ►అనుమానం వచ్చి ఇంటిలో మగవారితో తిరిగి ఫోన్ చేయిస్తే తిట్ల పురాణం అందుకుంటూ ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాడు. ►సారవకోట మండల వలంటీర్ల సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. అసభ్యకర రీతిలో మాట్లాడాడు. ఎవరికీ చెప్పుకోలేక.. కింది స్థాయి మహిళా ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఈ ఫోన్ కాల్ వేధింపులు ఉన్నట్లు సమాచారం. అయితే వారు ఎవరికీ చెప్పుకోలేక చాలా కాలంగా సతమతమవుతున్నారు. మండలంలో దాదాపు ప్రతి రోజూ కొంతమందికి 8096762584 అనే ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడిది సారవకోట మండలంలో చర్చనీయాంశంగా మారింది. తిరిగి ఫోన్ చేస్తుంటే తిట్ల పురాణం అందుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతడి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. దీంతో ఆ వ్యక్తి ఆగడాలు ఆపడం లేదు. దర్యాప్తు చేస్తున్నాం బొంతు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఒంటరి మహిళలు, వివిధ ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం ఏ టవర్ లొకేషన్లో ఉండి కాల్ చేస్తున్నాడో తెలుసుకుంటున్నాం. త్వరలోనే అతడిని పట్టుకుంటాం. – ఎం.ముకుందరావు, ఎస్ఐ, సారవకోట -
మహిళా ఉద్యోగులకు పది రోజుల ‘పిరియడ్ లీవ్’
‘ప్రియమైన మహిళా ఉద్యోగులారా.. మీరు చాలాసార్లు సెలవు కోసం మెసేజ్‌లు పెట్టి ఉంటారు. ఆ మెసేజ్‌లలో నలతగా ఉందనో, మరేదో నొప్పి అనో రాసి ఉంటారు. కాని నేను పిరియడ్స్‌లో ఉన్నాను... నాకు రెస్ట్ కావాలి అని నామోషీ లేకుండా రాశారా? ఇక మీదట రాయండి. పిరియడ్స్ సమయంలో కొందరిలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఇక మీదట మా సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు పిరియడ్ లీవ్ తీసుకోవచ్చు’ అని ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ సి.ఈ.ఓ దీపెందర్ గోయల్ తన ఉద్యోగులను ఉద్దేశించి తాజాగా లేఖ రాశారు. ఈ సౌలభ్యం వల్ల జొమాటోలో పని చేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ సెలవులతో పాటు పది రోజుల అదనపు సెలవు దొరికినట్టయ్యింది. ‘డియర్ మగ ఉద్యోగులూ... మన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు పిరియడ్ లీవ్ పెట్టినప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. వారు తమకు విశ్రాంతి కావాలి అని చెప్పినప్పుడు మనం వారిని నమ్మాలి. నేను మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నది బహిష్టు గురించి మనకు ముందు నుంచి ఉన్న పాతకాలపు భావనలు, నిషిద్ధ అభిప్రాయాలు సమసిపోవడానికే. స్త్రీల జీవితంలో ఒక భాగమైన విషయం పట్ల సంస్కారం అలవర్చుకోవడానికే. స్త్రీల సమస్యలు ఎలాంటివో స్త్రీలకు మాత్రమే తెలుస్తాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనం సమష్టిగా సమర్థంగా పని చేయగలం’ అని కూడా దీపెందర్ గోయల్ ఆ లేఖలో రాశారు. జొమాటో భారతదేశంలోని గుర్గావ్లో 2008లో మొదలయ్యి ఇవాళ 24 దేశాలలో సేవలందిస్తోంది. ఆ సంస్థలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మన దేశంలో రుతుస్రావానికి సంబంధించిన ఎన్నో అపోహలు, విశ్వాసాలు ఉన్నాయి. రుతుస్రావంలో ఉన్న స్త్రీల మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం పూర్తిగా నేటి వరకు కుటుంబం, సమాజం చేయనేలేదు. రుతుస్రావ యోగ్యత ఉన్న స్త్రీలను శబరిమల ఆలయ ప్రవేశానికి అర్హులుగా చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై చర్చ, అభ్యంతరం కొనసాగుతూనే ఉంది. ఇక స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకుగాని స్త్రీలకు శానిటరీ నేప్కిన్స్ సమకూర్చే ప్రచారం, ప్రయత్నం మొదలుకాలేదు. వీటన్నింటి నేపథ్యంలో జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం స్త్రీల రుతుస్రావ సమయాలను వొత్తిడి రహితం చేసే ఒక మంచి ఆలోచనగా భావించవచ్చు. -
అరటిపిండి బిస్కట్లు
‘‘మెటర్నిటీ లీవ్ అయిపోయి తిరిగి వర్క్‌కొచ్చేటప్పటికి నా ప్లేస్‌లో ఇంకో వ్యక్తిని అపాయింట్ చేసుకున్నారు. నేను మళ్లీ జాబ్‌లోకి వస్తానని అనుకోలేదట. తిరిగి వచ్చినందుకు నా పోస్ట్ నాకు ఇవ్వాలి కదా... కానీ అలా చేయలేదు. ఎలాగైనా నన్ను వెనక్కి పంపించేయాలనే ప్లాన్‌లోనే ఉంది. ప్రతిరోజూ ఆఫీస్‌లో నేను ఏమేం పనులు చేస్తానో రిపోర్ట్ తయారు చేయమని ఆర్డర్ చేశారు. ఏదో తప్పు వెదకడం మొదలుపెట్టారు. ప్రతిభాసామర్థ్యం గల ఉద్యోగి నుంచి నన్ను ఏమంత ప్రాధాన్యత లేని సాధారణ ఉద్యోగిగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ రకమైన బెదిరింపులను విధిలేక ఏడు నెలల పాటు భరించాను. ఇక నా వల్ల కాదు. అవసరం కూడా లేదని ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అంటూ తాను ఎదుర్కొన్న వివక్ష, వేధింపుల గురించి చెప్పుకొచ్చింది అదితీ మిశ్రా. యాజమాన్యం వేధింపులకు జడిసి ఇంకెక్కడా తాను ఉద్యోగంలో ఇమడలేనేమోనని భయం పెట్టుకుని ఆమె ఉద్యోగం వదిలేసి... బిడ్డను పెంచుతూ ఇంట్లోనే కూర్చుండి పోలేదు. బయోటెక్నాలజీలో బీటెక్, ఎంబీఏ మార్కెటింగ్ సేల్స్ చేసిన కామన్వెల్త్ గేమ్స్‌కి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ, జయ్‌దీప్ గ్రూప్, సుబ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం, కంపెనీ అనుచిత ధోరణి అదితిని ఇంటికే పరిమితం చేయలేదు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసి, ఓ పారిశ్రామికవేత్తగా మార్చింది. ప్లెటానో ఫుడ్స్.. యాభై శాతం మంది మహిళా ఉద్యోగులతో నోయిడాలో ప్లెటానో ఫుడ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది అదితి. ఆహార సమస్యకు సుస్థిర పరిష్కార మార్గాలు చూపే సంస్థ అది. వ్యవసాయోత్పత్తుల వ్యర్థాలను బలవర్ధకమైన, రుచికరమైన ఆహారంగా మారుస్తుందీ ప్లెటానో ఫుడ్స్. ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజ్‌కి పనికిరాని అరటిపళ్లతో గ్రీన్ బనానా పిండిని తయారుచేస్తోంది. ‘‘ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. చూడ్డానికి కంటికి నదురుగా కనిపించినవే రుచిగా ఉంటాయనే నమ్మకంతో ఉంటారు జనం. కాని ప్రకృతి అన్నిటినీ ఒకేలా సృష్టించదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. చూడ్డానికి బాగోలేవని కొననివి.. వాడనివి అన్నీ వ్యర్థాలుగా చెత్తకుండిలోకి పోతాయి. అందుకే సప్లయ్చైన్లో ఉన్న ఇలాంటి వ్యర్థాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం’’ అంటుంది అదితి. ప్లెటానో ఫుడ్స్ ఉత్పత్తి అయిన ఈ గ్రీన్ బనానా ఫ్లోర్ అత్యుత్తమ ఆహారంగా పేరు తెచ్చుకుందట. 20 లక్షల పెట్టుబడితో మొదలైన ఈ సంస్థ లాభాల గ్రాఫ్‌నే చూపిస్తోందట. నిరుత్సాహపడకుండానే.. ఈ ఫుడ్ సంస్థను స్థాపించాలనుకున్నప్పుడు తిరుచిరాపల్లిలోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్లో చేరింది. అరటి పిండితో కుకీస్, బిస్కట్స్ చేయాలి అని ఆమె చెప్పినప్పుడు అక్కడి సైంటిస్టులు అసాధ్యం అన్నారట ఇంకో మాట లేకుండా. 30 శాతం అరటి పిండి, మిగిలిన 70 శాతం మైదాలాంటి పిండిని కలిపితేనే కుకీస్, బిస్కట్స్ తయారవుతాయని ప్రయోగం చేసీ మరీ చూపించారట కూడా. అయినా అదితి అధైర్యపడలేదు.. తాను అనుకున్న ఆలోచనను మళ్లించుకోలేదు. సొంతంగా ప్రయోగాలు చేసి చివరకు వంద శాతం అరటిపిండితో కుకీస్, బిస్కట్స్ తయారు చేయొచ్చు అని చేసి మరీ నిరూపించిందట. ‘‘స్థానిక మీడియా, సోషల్ మీడియా భాగస్వామ్యంతో మా బ్రాండ్ పట్ల అవగాహన కల్పించాలనుకుంటున్నాను. అంతేకాదు భవిష్యత్‌లో బనానా ఫ్లోర్‌తో బ్రెడ్, పాస్తా, పిజ్జా బేస్‌ను తయారు చేస్తే ప్లాన్‌లో ఉన్నాం’’ అంటుంది అదితీ మిశ్రా. నేపథ్యం.. అమ్మాయిలకు చదువు ఉండాలి కాని బయటకు వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనుకునే సంప్రదాయ ఉమ్మడి కుటుంబ నేపథ్యం ఆమెది. బీటెక్ తర్వాత తల్లిదండ్రులు ఆమెను ఎంబీఏ చదవడానికి పంపిస్తుంటే బంధువులంతా ‘‘అమ్మాయికంత చదువెందుకు.. పెళ్లిచేసి అత్తారింటికి పంపేయక? అని చాలా నిరుత్సాహపర్చారట. అయినా ఆమె పేరెంట్స్ వినకుండా ఆమెను ప్రోత్సహించారు. ఎంబీఏ అయిపోయి ఉద్యోగంలో చేరినప్పుడూ బంధువుల పోరు తప్పలేదట. ‘‘ఇంకెన్నాళ్లు ఇంట్లో ఉంచుకుంటారు? వయసు ఎక్కువవుతుంటే ఆడపిల్లకు పెళ్లి కష్టం.. త్వరగా పెళ్లిచేసేయండి అంటూ! ఆ మాటలనూ లెక్కచేయక ఉద్యోగం చేసి తన కాళ్లమీద తాను నిలబడేలా కూతురు వెన్ను తట్టారు అదితీ అమ్మా, నాన్న. అందుకే అంటుంది అదితి ‘‘నాలో ఆత్మవిశ్వాసం నింపి.. ఈ రోజు పదిమందికి ఉపాధి కల్పించేలా నన్ను నిలబెట్టింది మా పేరెంట్సే’’ అని. -
పనిలో సమానత్వం వేతనంలో అసమానత్వం
కష్టం ఒకటే. పని గంటలూ అవే. కానీ చేతికి అందేది మాత్రం ఒకేలా ఉండదు. కింది నుంచి పై వరకు భారతదేశంలో మహిళా కార్మికులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి ఇది. బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాలపై అధ్యయనం చేసినప్పుడు ఈ ‘అసమానత్వం’ బయట పడింది. ఇదేమీ కొత్తగా బయటపడింది కాదు కానీ, ఓ కొత్త విషయాన్ని కూడా ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వం ఏ రంగంలోనైనా ఖర్చు తగ్గించుకున్న ప్రతిసారీ వెంటనే ఆ దుష్ప్రభావం మహిళల జీవితాలపై పడుతోంది. ఉదా : విద్యపై పెట్టే ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంది. లేదా ఆరోగ్యంపై ఖర్చు తగ్గించుకుంది. ఆ వరుసలోనే ప్రజలకు అందవలసిన సేవలూ తగ్గుతాయి. ఆ తగ్గిన సేవలు, సదుపాయాల వినియోగంలో సహజంగానే బాలికలకు, మహిళలకు తొలి ప్రాధాన్యం తగ్గుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించలేనప్పుడు అబ్బాయిని మాత్రమే బడికి పంపడం, డాక్టరు దగ్గరికి వెళ్లవలసిన పరిస్థితిని ఇంట్లో ఆడవాళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం.. ఇలా ఉంటాయి పర్యవసానాలు. స్త్రీలు, బాలికల కోసం అంటూ ప్రత్యేకంగా కేటాయించిన ప్రణాళికలు, పథకాలు వారికి చేరేలోపు దారి మారుతున్న వివక్షాపూరిత వాతావరణంలో ఇలాంటి ప్రభుత్వ తగ్గింపులు మహిళల్ని మరింత దైన్యంలోకి నెట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఆక్స్‌ఫామ్ లెక్కల ప్రకారం ఇండియాలో ఏటా 2 కోట్ల 30 లక్షల మందికి పైగా బాలికలు బడి మానేస్తున్నారు. బడిలో మరుగుదొడ్లు లేకపోవడం, రుతుస్రావ శుభ్రత వసతులు లేకపోవడం ఇందుకు తొలి కారణాలు కాగా, పనికి వెళుతున్న తల్లికి ఆమె శ్రమకు తగ్గ ఫలితం అందకపోవడం ఇంకో కారణం. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఉంటే, మెరుగైన పాఠశాలలో చేర్పించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ అలా ఉంచండి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేని కారణంగా పోషించే శక్తి తగ్గి తన ఇంట్లో తనే స్త్రీ వివక్షకు, వివక్ష నుంచి హింసకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ గమనించింది. ఇంట్లో మగాళ్ల మాటను తు.చ.తప్పకుండా పాటించకపోవడం, వారికి చెప్పకుండా రూపాయి ఖర్చు పెట్టడం, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేయలేకపోవడం, వేళకు వండి వడ్డించకపోవడం, నీళ్ల బిందెలు ఖాళీగా ఉండడం, వంట చెరకును తీసుకు రాలేకపోవడం, చెప్పకుండా బయటికి వెళ్లడం.. ఇవన్నీ కూడా ఇంట్లో ఆర్థికబలం లేని మహిళలను వేధించడానికో, వారిపై చెయ్యి చేసుకోవడానికో నెపాలు అవుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది. -
స్త్రీలోక సంచారం
► సౌదీ అరేబియాలో స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అరేబియా రాజ్యపు నిబంధనలివి. ఈ నిబంధనలను అతిక్రమించి ఒక సంగీతకారుడిని ప్రేమించి, అతడితో పెళ్లికోసం కోర్టుకు వెళ్లిన ఒక మహిళ చివరికి ఆ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో వాద్యాలపై సంగీతం పలికించే వారిని మతపరంగా తక్కువగా చూస్తారు. అలాంటి ‘తక్కువ’ యువకుడిని ఈ యువతి ప్రేమించడం రాజ్య నిబంధనలకు విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. సౌదీ రాజధాని రియాద్‌కి ఉత్తరాన ఉన్న ఖస్సిమ్ శుద్ధ సంప్రదాయ ప్రాంతం. రెండేళ్ల క్రితం.. అక్కడి ఒక బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న 38 ఏళ్ల యువతిని ప్రేమించిన ‘లూట్’ (గిటార్‌ను పోలి ఉంటుంది) వాద్యకారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ యువతి కూడా అందుకు ఒప్పుకుంది కానీ, ఆమె తల్లిదండ్రులు సమ్మతించలేదు. ‘‘మతాచారం ప్రకారం అతడు నీకు తగినవాడు కాదు’’ అని పెళ్లికి తిరస్కరించారు. ఆమె కోర్టుకు వెళ్లింది. అతడిని పెళ్లిచేసుకోడానికి న్యాయపరమైన అనుమతిని ఇమ్మని కోరింది. దీనిపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు... ఆమె తల్లిదండ్రుల నిర్ణయాన్నే సమర్థించింది. ‘‘ఆ సంగీతం వాయించేవాడు నీతో పెళ్లికి అనర్హుడు’’ అని తీర్పు చెప్పింది. ఇక ఆమె ప్రియుడు.. తన ‘లూట్’పై విషాద గీతాలను ఆలపించుకుంటూ తిరగడం తప్ప వేరే మార్గం లేక దిగాలు పడిపోయాడు. ఆ యువతి మాత్రం సౌదీ ఫెమినిస్టు సౌఆద్ అల్షమ్మరీ మద్దతు కోసం చూస్తోంది. ► టర్కీలో పదహారేళ్ల బాలుడు తన 13 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. దానినెవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఎవరో నెట్లో పోస్ట్ చేశారు. దాన్ని స్కూల్ టీచర్లు చూశారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అభం శుభం తెలియని పిల్లని ముద్దుపెట్టుకుంటాడా అని స్కూలు యాజమాన్యం స్కూలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ బాలుడిపై కేసు నమోదు చేశారు. పదిహేనేళ్ల లోపు బాలికల్ని ముద్దు పెట్టుకోవడం టర్కీలో నేరం కనుక ఆ స్కూలు ఉన్న అంతల్య ప్రావిన్సులోని కోర్టు.. ఆ వీడియోను తెప్పించి.. నేరం జరిగినట్లు రూఢీ చేసుకుని ఆ పిల్లవాడికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు.. ఆ వీడియో తీసిన బాలుడినీ, దానిని షేర్ చేసిన బాలుడినీ, ఇంకా ఆ క్రైమ్‌లో భాగస్వామ్యం కలిగిన 13–16 ఏళ్ల మధ్య బాలురు ఐదురురిపైన కూడా స్కూలు పోలీసులు కేసు వేశారు కానీ.. వారందరినీ కోర్టు నిర్దోషులుగా వదిలిపెట్టింది. ముద్దు పెట్టుకున్న బాలుడి తరఫున వాదిస్తున్న జుహాల్ మెర్వ్ ఆజ్ఫిదాన్ అనే మహిళా న్యాయవాది ఇప్పుడు పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టర్కీలో ఇటీవలే స్కూల్ పోలీస్ వ్యవస్థ ప్రారంభం అయింది. పాఠశాలల్లో పిల్లల మధ్య జరుగుతున్న లైంగిక చొరవలు, చొరబాట్లను అదుపు చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ► స్టార్టప్ కంపెనీల్లో మూడింట ఒక వంతుకు పైగా మహిళా ఉద్యోగులే ఉంటున్నారని యు.ఎస్. రైడ్–షేర్ కంపెనీ ‘లిఫ్ట్’ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అమెరికా స్టార్టప్ కంపెనీల్లో 40 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండగా, ఇండియా స్టార్టప్ కంపెనీలలో సగటున 25 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని లిఫ్ట్ తెలిపింది. లిఫ్ట్ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం 5000 నుంచి 5200 వరకు స్టార్టప్స్ ఉండగా.. వాటి వ్యవస్థాపకులుగా 2015లో 9 శాతం మంది, 2016లో 10 శాతం మంది, 2017లో 11 శాతం మంది చొప్పున మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇండియాలో అనతికాలంలోనే ఆదరణ పొందిన ఐదు స్టార్టప్ కంపెనీల్లో మహిళల శాతం ఈ విధంగా ఉంది. జొమాటో (ఫుడ్ డెలివరీ కంపెనీ) విలువ 200 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 2,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 48 శాతం పేటీఎం (ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్) విలువ : 1000 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 13,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 35 శాతం. ఓలా (టాక్సీ, ఫుడ్ డెలివరీ) విలువ : 400 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 5,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు 18 శాతం ఇన్మోబీ (మొబైల్ మార్కెటింగ్) విలువ : 100 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 1,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 29 శాతం రజోర్‌పే (ఆన్లైన్ పేమెంట్స్) విలువ : 10 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 200 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 25 శాతం -
టాటా మోటార్స్‌లో నారీ భేరి!
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ మహిళలకు పెద్ద పీట వేయనుంది. మహిళా ఉద్యోగులకు సరైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు ఆరంభించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వచ్చే నాలుగైదేళ్ల కాలంలో పావు శాతం మహిళలే ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో మొట్టమొదటిది అయిన పుణెలోని టాటా మోటార్స్ ప్లాంట్‌లో 1974లోనే జేఆర్డీ టాటా మహిళా ఇంజనీర్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని నియమించుకున్న విషయాన్ని గుర్తు చేసింది. ‘‘గడిచిన నాలుగైదేళ్ల కాలంలో మహిళా ఉద్యోగులను గణనీయంగా పెంచుకున్నాం. వచ్చే నాలుగైదేళ్ల కాలంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 20–25 శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం’’ అని టాటా మోటార్స్ చీఫ్ హెచ్ఆర్ గజేంద్ర చందేల్ తెలియజేశారు. ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీలో 2,628 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్టు చెప్పారు. ఇందులో 1,952 షాప్ ఫ్లోర్లో పనిచేసేవారని, మొత్తం ఫ్యాక్టరీ ఉద్యోగులు 41,390 మందిలో ఇది 5 శాతమని వివరించారు. టాటా మోటార్స్‌లో ప్రస్తుతం మొత్తం 55,159 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ‘‘గత కొన్నేళ్లలో క్యాంపస్‌ల నుంచి ఎక్కువ మంది మహిళలను నియమించుకుంటున్నాం. 2018 బ్యాచ్‌ల నుంచి 25 శాతం మేర మహిళలనే నియమించుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాం’’ అని చందేల్ తెలిపారు. -
కుమిలిపోతున్నారు..!
జగిత్యాల మండల పరిధిలో ఓ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయురాలు తనను ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ అనంతశర్మను వారం రోజుల క్రితం ఆశ్రయించింది. తనపై జరిపిన వేధింపులను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. ప్రధానోపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన ఎస్పీ సమస్యపై కలెక్టర్ శరత్‌తో చర్చించారు. ఇంత వరకు ఆమెకు న్యాయం జరగలేదు. మూడు నెలల క్రితం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలిని అదే పాఠశాలలో పని చేసే కింది స్థాయి ఉద్యోగి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈవిషయమై ఆమె నిలదీసింది. ఈ వ్యవహారం తెలుసుకున్న సదరు గురుకులం బాధ్యులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చి.. ఒప్పంద పత్రం రాయించారు. ఉద్యోగం పోతుందనే భయంతో సదరు టీచర్ తనకు జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఐదు నెలల క్రితం.. మల్యాల మండలంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగినిని.. ఆమె పైఅధికారి లైంగికంగా వేధించాడు. దాదాపు రెండు నెలలపాటు ఆ అధికారి వేధింపులు భరించిన ఆ ఉద్యోగిని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సదరు అధికారిపై ఫిర్యాదు చేసింది. దీంతో సమగ్ర విచారణ జరిపిన కలెక్టర్ డాక్టర్ శరత్ వెంటనే సదరు అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు ఇంకా ఉన్నాయి. ఉద్యోగం పోతుందనే భయంతో కొందరు.. పరువు పోతుందని ఇంకొందరు.. ప్రాణభయంతో పలువురు మహిళా ఉద్యోగులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ప్రతీక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. పని చేసే కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి విషయాలు వెలుగులోకి రాకపోవడంతో ఎవరికీ తెలియడంలేదు. ఒకేచోట మహిళలతో కలిసి పని చేస్తూ వారిపై కన్నేసి.. లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్న సదరు ఉద్యోగులపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారులూ చర్యలు తీసుకోవడం లేదు. చివరకు సహనం కోల్పోయి వేరే దిక్కు లేక బాధిత మహిళలు పోలీసులు, అధికారులను ఆశ్రయిస్తున్నారు. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో బాధితులు అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. సాక్షి, జగిత్యాల : జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు సుమారు మూడువేల మంది ఉన్నారు. ఔట్సోర్సింగ్, క్రాంటాక్ట్ పద్ధతిలో మరో మూడువేల మంది పని చేస్తున్నారు. వీరితోపాటు 3,770 మంది ఉపాధ్యాయులున్నారు. అన్నిశాఖల్లో కలిపి 3,500 మంది వరకు మహిళలు ఉన్నారు. కలెక్టరేట్, వైద్యశాఖ, విద్యాశాఖలో సింహభాగం మహిళలే ఉన్నారు. మిగిలిన శాఖల్లో తక్కువ మంది ఉన్నారు. అయితే.. పలు శాఖల్లో ఒంటరిగా ఉన్న... వితంతువులు.. తాత్కాలిక ఉద్యోగాల్లో పని చేస్తోన్న మహిళలను వారితో కలిసి పని చేస్తోన్న ఉద్యోగులు, అధికారులు వక్రబుద్ధితో వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు పనికి ఒప్పుకోనివారిపై కక్షగడుతున్నారు. పనితీరు బాగాలేదంటూ అందరి ఎదుట కించపర్చిన సంఘటనలూ ఉన్నాయి. మల్యాలలో ఓ అధికారి తన కింద పనిచేస్తున్న ఓ వితంతువుపై కన్నేసి కటాకటాల పాలైన సంఘటనే ఇందుకు నిదర్శనం. పలు కార్యాలయాల్లో జరుగుతున్న ఈ వేధింపుల గురించి సంబంధిత జిల్లా అధికారులకు చెప్పుకునే ధైర్యాన్ని బాధిత మహిళలు చేయలేకపోతున్నారు. కమిటీ ఉన్నా.. ఫలితం సున్నా..! జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఐదు నెలల క్రితం కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సుగంధిని, జగిత్యాల ఎంపీడీవో శ్రీలత, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ,, మరో తహసీల్దార్‌ను ఇందులో నియమించారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సహచర మహిళను లైంగికంగా వేధించినట్లు నిరూపణ అయితే వారిని సస్పెండ్ లేదా బదిలీ చేసే లేదా పదోన్నతి పొందకుండా చర్య తీసుకునే అధికారం ఈ కమిటీకి ఉంది. అయితే.. ఈ కమిటీ ఏర్పాటై ఐదు నెలలైనా ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు..? ఫిర్యాదు ఎవరికి..? ఎలా చేయాలి.? అని కూడా బాధితులకు తెలియకపోవడం గమనార్హం. కనీసం తమ హక్కులు.. భద్రత విషయంపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవగాహన కల్పించలేదని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కమిటీ సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఓ ఉపాధ్యాయురాలు డిమాండ్ చేశారు. ఈ విషయమై కమిటీ సభ్యురాలు వాణిరెడ్డి వివరణ ఇస్తూ.. ‘కమిటీ ఏర్పాటైన తర్వాత సమావేశం నిర్వహించుకోలేదు. ఇప్పటి వరకు కమిటీకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదు వస్తే పోలీసు కేసు పెట్టి.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అన్నారు. వేధింపుల నిరోధక కమిటీ విధులివే.. వేధింపుల నిరోధక కమిటీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు అండగా ఉంటూ 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. కమిటి చేసిన సిఫారసుల అమలు కోసం బాధిత మహిళా ఉద్యోగిని పనిచేసే కార్యాలయ అధికారికి, సంస్థ యజమాన్యానికి జిల్లా అధికారి 60 రోజుల గడువు ఇవ్వాలి. విచారణ జరుగుతున్న కాలంలో ఆ మహిళాఉద్యోగి స్వచ్ఛంద బదిలీ, సెలవు కోరినా ఇవ్వాలి. కమిటీకి రూ.50 వేల జరిమానా, పదోన్నతులు నిలిపివేయడం, సస్పెన్షన్ చేసే వీలుంటుంది. బాధిత మహిళా ఉద్యోగి ఇండియన్ పీనల్ కోడ్‌కు ఐపీసీ సెక్షన్ కింద కేసు పెట్టదలుచుకుంటే ఆమెకు అధికారులు పూర్తిగా సహకరించాలి. నిరోధక కమిటీలు ఏర్పాటు చేయడంలో సంస్థలు విఫలమైతే ఆ శాఖ అధికారులపై, సంస్థల యజమాన్యాలపై కలెక్టర్ చర్య తీసుకుంటారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం 2013 సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా లైంగిక వేధింపులు అనే పదానికి ఈ చట్టంలో ఈ నిర్వచనం పొందుపరిచారు. ఇందులో పలు అంశాలు. లైంగిక చర్యల కోసం ఒత్తిడి, అసభ్య ద్వందార్థాల వ్యాఖ్యలు, సైగలు, లైంగిక చర్యల కోసం ఒత్తిడి, అశ్లీల చిత్రాలు చూపించడం వంటి వాటివి లైంగిక వేధింపుల కిందకు వస్తాయి. మహిళ ఉద్యోగులు, కార్యాలయాలకు పనులపై వచ్చే మహిళలు, దినసరి, కాంటింజెంట్, అవుట్సోర్స్, కాంట్రాక్ట్, తాత్కాలిక మహిళ ఉద్యోగినిలు, శిక్షణార్థం వచ్చిన మహిళలు, ప్రభుత్వరంగ సంస్థల్లోని కార్యాలయాల్లో, కంపెనీల్లో, కార్ఖనాల్లో పనిచేస్తున్న మహిళలు ఈ చట్టం పరిధి కిందికి వస్తారు. ప్రతీ కార్యాలయం, సంస్థ పరిధిలో పురుషులకు మించి మహిళలుంటే అంతర్గత కమిటీలు వేసుకునే వీలుంది. కానీ.. జిల్లాస్థాయిలో మాత్రం లైంగిక వేధింపుల నిరోధక కమిటీ తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇందులో వివిధ శాఖల నుంచి మహిళా అధికారులను నియమించాలి. కఠినంగా వ్యవహరిస్తాం ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలు కార్యాలయాల్లో వేధింపుల విషయం నా దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ కూడా చేశా. లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఐదుగురు అధికారులతో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశా. బాధితులు నిర్భయంగా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రైవేట్ ఉద్యోగినులకూ రక్షణ కల్పిస్తాం. – డాక్టర్ శరత్, కలెక్టర్ ఫిర్యాదులు వస్తున్నాయ్.. జిల్లాలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. ఇంకా పలువురు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ చేపడుతున్నాం. మహిళలను లైంగికంగా వేధిస్తే చట్టపరంగా చర్య తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అనంతశర్మ, ఎస్పీ, జగిత్యాల -
ఉద్యోగినులపై వివక్ష: ఇరకాటంలో టెక్ దిగ్గజం
అదొక పెద్ద టెక్ దిగ్గజం.. అంతర్జాతీయంగా ఆ దిగ్గజ పేరు మారు మోగుతూంటోంది. కానీ అందరికీ ఆదర్శంగా నిలువాల్సిన ఆ కంపెనీనే మహిళా ఉద్యోగులపై వివక్ష చూపుతోందట. పురుష ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులకు గూగుల్ చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తుందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్(డీఓఎల్) ఆరోపిస్తోంది. మహిళా ఉద్యోగులపై ఆ కంపెనీ వివక్ష చూపుతుందని పేర్కొంది. గూగుల్ లో వేతనాల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నాయని డీఓఎల్ గుర్తించినట్టు గార్డియన్ రిపోర్టు చేసింది. పురుషులకు సమానంగా మహిళలు వర్క్ చేస్తున్నా గూగుల్ వారికి సరిపడ వేతనం చెల్లించడం లేదని ప్రభుత్వ ఇన్వెస్టిగేటర్లు గుర్తించినట్టు పేర్కొంది. అయితే గూగుల్ మాత్రం తాము ఎలాంటి అసమానతలు చూపించడం లేదని వాదిస్తోంది. ఈ ఆరోపణలు ప్రారంభమైన అనంతరం గూగుల్ ఈక్వల్ పే డేను ప్రకటించింది. లింగ వివక్షతను నిర్మూలించడానికి ఈక్వల్ పే డేను తీసుకొచ్చినట్టు గూగుల్ ట్వీట్ చేసింది. కానీ ఫెడరల్ ఎంప్లాయిమెంట్ చట్టాలను గూగుల్ ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. గూగుల్ వంటి పెద్ద కంపెనీలో మహిళలపై వివక్ష చూపించడం నిజంగా చాలా తీవ్రమైన చర్యగా డీఓఎల్ పేర్కొంటోంది. ప్రతేడాది తాము వేతన చెల్లింపుల్లో సమగ్ర విచారణ చేపడతామని, కానీ ఎక్కడా కూడా వివక్ష చూపినట్టు తేలలేదని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. -
రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దు: ఫేస్బుక్
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో పనిచేసే మహిళలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దని, వాటివల్ల సహోద్యోగుల దృష్టి మరలే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం చెబుతోందట. ఈ విషయాన్ని గతంలో అక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆయన పేరు ఆంటోనియో గార్క్లా మార్టినెజ్. హెచ్ఆర్ ఉద్యోగి తమ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగి నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ మేరకు ఉత్తర్వులచ్చారని ఆయన అన్నారు. దాదాపు 10 వేల మందికి పైగా పనిచేసే ఈ కంపెనీలో ఒక ఏడాదికి ముందుకంటే కేవలం ఒక శాతం మంది మాత్రమే మహిళలు ఎక్కువగా ఉన్నారని, మొత్తం ఉద్యోగుల సంఖ్య మాత్రం 40 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే.. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఏమైనా వస్తే వాటిని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని కూడా అంటున్నారు. ప్రకటనల విభాగంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని మార్టినెజ్ చెప్పారు. ఇక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అయితే తరచు అందరిమీద కోపంగా అరుస్తుంటారని ఆరోపించారు. ఫేస్బుక్ కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఒక ఫీచర్ వివరాలను ఓ ఉద్యోగి ప్రెస్‌కు వెల్లడించగా.. ఆఫీసులో ఉన్న అందరికీ 'ప్లీజ్ రిజైన్' అన్న సబ్జెక్టుతో జుకర్‌బర్గ్ ఈమెయిల్ చేశారని, ఆ వ్యక్తి మొత్తం టీమ్‌కు వెన్నుపోటు పొడిచాడంటూ అభివర్ణించారని తెలిపారు. -
తగ్గుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
అసోచామ్ సర్వే న్యూఢిల్లీ: దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పదేళ్ల కాలంలో 10 శాతం మేర పడిపోవడంతో తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అసోచామ్ ప్రభుత్వానికి సూచించింది. 2000-2005 మధ్య దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 34 శాతం నుంచి 37 శాతానికి పెరగగా... 2005 నుంచి 2014కు వచ్చేసరికి 27 శాతానికి పడిపోయినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొనడాన్ని అసోచామ్ ‘భారత్‌లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ఉద్యోగావకాశాల కల్పన, వ్యాపార అవకాశాల సృష్టి ద్వారా మహిళల సాధికారతకు చర్యలు చేపట్టాలని కోరింది. మహిళా ఉద్యోగుల సంఖ్య పరంగా బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే అట్టడుగున ఉండడాన్ని ప్రముఖంగా పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్లో మహిళా ఉద్యోగులు 59 శాతం, రష్యాలో 57 శాతం, దక్షిణాఫ్రికాలో 45% ఉండగా, భారత్‌లో 27శాతంగా ఉంది. ఉన్నత విద్యావకాశాల్ని పొందలేకపోవడం, ఉద్యోగావకాశాలు లేకపోవడం, పని ప్రదేశంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల మహిళలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారని అసోచామ్ వెల్లడించింది. వివాహం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది. -
ప్రతి ఐదుగురిలో నలుగురికి వేధింపులు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఐదుగురి మహిళల్లో నలుగురు (79 శాతం).. బహిరంగ ప్రదేశాలు, ఇళ్లు, పనిచేసేచోట వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో మహిళలకున్న రక్షణపై లండన్‌కు చెందిన యూగోవ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సంస్థ భారత్, బ్రెజిల్, థాయ్‌లాండ్, లండన్లలో 16 ఏళ్లు పైబడిన 2,500 మంది మహిళలపై సర్వే నిర్వహించింది. దీనిప్రకారం భారత్‌లో 25-35 మధ్య వయసులో ఉన్న 84%, మహిళా ఉద్యోగులు, 68% విద్యార్థినులు వేధింపులు ఎదుర్కొంటున్నారు. -
స్టార్టప్‌లలో మహిళల ముందంజ
న్యూఢిల్లీ: భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ స్టార్టప్‌లలో ముఖ్యంగా ఈ-కామర్స్ రంగంలో వీరు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ రంగంలో వీరి సంఖ్య పురుషులతో సమానంగా ఉంది. ఇదే పరిస్థితి నెమ్మదిగా కార్పొరేట్ కంపెనీలలో కూడా కనిపించనుంది. చాలా వ్యాపారాలలో మహిళలు సీనియర్ మేనేజ్మెంట్ హోదాలలో కూడా ఉన్నారు. జివామీ, ఎంబైబ్, గ్రాబ్‌హౌస్, లెబుల్ కార్ప్, లైమ్‌రోడ్ తదితర స్టార్టప్‌లతోపాటు ఆన్లైన్ వ్యాపారాలలో కూడా మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. టెక్నాలజీ వృద్ధి, ఇంటర్నెట్ వినియోగం జోరు, మొబైల్స్ వాడకం పెరగటం వంటి తదితర అంశాలు మహిళా వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయి. తన కంపెనీ సిబ్బందిలో దాదాపు 50 శాతం మంది మహిళలే ఉన్నారని జామ్బే వ్యవస్థాపకురాలు సురుచి వాగ్ అన్నారు. భారత వ్యాపార రంగంలో మహిళల శాతం పెరగటానికి విస్తృతమైన, సమాన అవకాశాలు చాలా దోహదపడతాయని రీసెర్చ్ సంస్థ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. ‘కెరీర్‌ను సవాలుగా తీసుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎంతో మంది మహిళా పారిశ్రామికవేత్తలు మన ముందు ఉన్నారు. వీరందరూ సంప్రదాయ భారతీయ మహిళా సంకె ళ్లను బద్దలుకొడుతూ నూతనంగా వివిధ వ్యాపార రంగాలలోకి అడుగుపెడతారు’ అని గ్రాబ్‌హౌస్.కామ్ సహ వ్యవస్థాపకులు పంఖూరీ శీవత్సవా అన్నారు. గ్రాభౌస్లో దాదాపు 40 శాతం మంది మహిళా ఉద్యోగులే. వ్యాపార అవకాశాలు పెరగటంతోపాటు మహిళా సాధికారతకు దోహదపడే వివిధ పథకాలను, పాలసీలను ప్రభుత్వం ప్రవేశపెడుతుండటంతో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగుతోందని లేబర్‌నెట్ సహ వ్యవస్థాపకులు గాయత్రి వసుదేవన్ చెప్పారు. -
రాత్రిషిఫ్ట్ ఉద్యోగాల్లో తగ్గుతున్న మహిళలు
న్యూఢిల్లీ: రాత్రి షిఫ్ట్ కలిగిన కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27 శాతం తగ్గిందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కవ గంటలు ప్రయాణించాల్సి రావడం వల్ల కూడా మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నదని ఈ నివేదిక పేర్కొంది. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న మొత్తం 1,600 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 12% పెరిగిన ఆన్లైన్ ఉద్యోగాలు: కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాలలో 12% వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌లో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 36% పెరిగినట్లు టైమ్స్‌జాబ్.కామ్ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే ఐటీ రంగంలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 22% పెరిగినట్లు తెలిపింది. -
వీవోఏలపై ఖాకీల ఉక్కుపాదం
మహిళలని కూడా చూడకుండా అరెస్టులు ఇళ్లకు వెళ్లి.. ఫోన్లలో బెదిరించిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచే అరెస్టుల పర్వం 18 నెలల జీతాల కోసం 2 నెలలుగా సీఎఫ్‌ల సమ్మె నేడు హైదరాబాద్‌లో మహాధర్నా, అసెంబ్లీ ముట్టడి దాన్ని విఫలం చేసేందుకు జిల్లాల్లో అడ్డుకోవాలని సర్కారు ఆదేశాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యమాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మహిళలని కూడా చూడకుండా బెదిరింపులు, అరెస్టులకు పాల్పడుతోంది. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్న పోలీసులు ఐకేపీ మహిళల ఇళ్లకు వెళ్లి, ఫోన్లు చేసి బెదిరించి మరీ పోలీస్స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. దీనికి కారణమేమిటంటే.. సోమవారం హైదరాబాద్‌లో జరగనున్న ఐకేపీ సీఎఫ్(వీవోఏ)ల రాష్ట్రస్థాయి ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఈ అరెస్టులని తెలిసింది. కొన్ని నెలలుగా ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిల కోసం కొన్నాళ్లుగా వీవోఏలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం ధర్నా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలినవారు ఆదివారం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచే గ్రామాలు, పట్టణాల్లో మోహరించి వీవోఏలను అదుపులో కి తీసుకోవడం ప్రారంభించారు. గ్రామాల్లో అయితే వీవోఏల ఇళ్లకు వెళ్లి మ రీ అదుపులోకి తీసుకున్నారు. ఇంటి వద్ద లేనివారికి ఫోను చేసి తక్షణమే పోలీస్ ష్టేషనుకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించారు. స్వచ్ఛందంగా రాకపోతే రాత్రివేళ ఇళ్లకు వచ్చి అరెస్టు చేస్తామ ని హెచ్చరించారు. స్టేషన్‌కు వచ్చిన వారికి అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ ఆరెస్టులు జరిగాయి. కాగా అదుపులోకి తీసుకున్న వారిని మంగళవారం ఉదయం పదకొండు గంటల వరకు విడిచిపెట్టే పరిస్థితి లేదని తెలిసింది. దీంతో ఇళ్లు, పిల్లలను వదిలి మహిళలు పో లీస్ ష్టేషన్లలో పడి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. ప్రభుత్వ చర్యలను మ హిళా, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 1300 మంది వీవోఏలు 18 నెలల వేతన బకాయిల కోసం అక్డోబర్ 15 నుం చి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. వేతనాల కోసం ఉద్యమించిన మహిళల సమస్య పరిష్కరించకపోగా వారిని అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. సీఐటీయూ నేతల ఆరెస్టు ఐకేపీ సీఎఫ్‌లకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను సైతం ఆరెస్టు చేశారు. శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యదర్శి దుప్పల గోవిందరావును, రాజాంలో ఆ యూనియన్ నేత రామూర్తినాయుడును ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నా ఐకేపీ మహిళా ఉద్యోగుల(వీవోఏ) అక్రమ ఆరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టు సీఐటీయే అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావులు తెలిపారు. వివిధ మహిళా, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొంటారని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు పీఎన్ కాలనీ: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. ఐకేపీ ఉద్యోగులతోపాటు, తమ యూనియన్ నేతల అరెస్టులను ఆయన ఖండించారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు తమ ఇంటికి వచ్చి తనను అరెస్టు చేశారన్నారు. 18 నెలల నుంచి వీవోఏలకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహ రించడం సరికాదన్నారు. వీవోఏలకు మద్దతుగా ప్రజల సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
అన్నవరం : నిత్యం రైళ్ల రాకపోకలతో.. ప్రయాణికుల రణగొణ ధ్వనులతో దద్దరిల్లే అన్నవరం రైల్వేస్టేషన్ శనివారం సాయంత్రం ఆస్పత్రిగా మారింది. ఓ మహిళకు పురుడుపోసింది. రైల్వేస్టేషన్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఆస్పత్రి సిబ్బందిగా మారారు. ప్రయాణికులు, ఇతర ఉద్యోగులు అవసరమైన వస్తువులను సమకూర్చారు. వీరి సహకారంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నిండు గర్బిణి అన్నవరం రైల్వేస్టేషన్లో దిగింది. రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి ఓవర్‌బ్రిడ్జి మీదుగా నడుస్తూ వచ్చి అక్కడ సిమెంట్ బెంచీ మీద కూర్చుంది. సాయంత్రం 4:30 గంటల సమయానికి ఆమెకు నొప్పులు రావడంతో గట్టిగా కేకలు వేసింది. రైల్వేస్టేషన్ మహిళా సిబ్బంది, ప్రయాణికులు ఆమెను గమనించి దగ్గరలోని రైల్వేక్వార్టర్ల నుంచి దుప్పట్లు, చీరలు తెచ్చి ఆమెకు కప్పి దగ్గరలోని వెయిటింగ్ రూమ్ బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అదే సమయంలో అంబులెన్సు కూడా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అంబులెన్సు సిబ్బంది సుధాకర్, అప్పలరాజు తదితరులు ఆమెను, పాపను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రీనివాసరెడ్డి, నాయుడు, జీఆర్పీ జి.లోవరాజు, ప్రయాణికులు రూ.వేయి నగదు, రెండు దుప్పట్లు, పది చీరలు, జాకెట్లను ఆ మహిళకు అందచేశారు. ఆమె స్వస్థలం ఉప్పాడ మండలం పల్లిపేట ఈసందర్భంగా ఆ మహిళ తన పేరు గోనె దుర్గాభవానీ అని, తనది ఉప్పాడ కొత్తపల్లి మండలం పల్లిపేట గ్రామమని, తన అత్త వారి ఊరు ధవళేశ్వరమని చెప్పినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. భర్త పేరు సాయి అని రాజమండ్రి రైల్వేస్టేషన్లో పళ్లు అమ్ముతాడని, ప్రస్తుతం భర్త తనతో ఉండడం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెకు కుడి చేయి, మోచేయి వరకు మాత్రమే ఉంది. ఓ ప్రమాదంలో ఆ చెయ్యి సగం వరకూ తెగిపోయినట్లు చెప్పిందని వివరించారు. సత్యదేవుని దర్శనార్థం అన్నవరం వచ్చానని చెప్పినట్టు రైల్వేస్టేషన్ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
నచ్చిన చోటుకు ప్రభుత్వ బీమా మహిళా ఉద్యోగుల బదిలీలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమకు నచ్చిన చోట నియామకాలు/బదిలీలు పొందవచ్చు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్ఐసీతో సహా అన్ని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఉద్యోగులు... వివాహితులైతే తమ భర్తలు పనిచేసే చోట, అవివాహితులైతే తల్లిదండ్రులు నివసిస్తున్న చోటకు బదిలీలు/నియామకాలు పొందవచ్చు. ఎల్ఐసీ, జీఐసీ, ఇతర ఐదు ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మహిళలకు అనుకూలమైన బదిలీ విధానాలు రూపొందించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. మహిళా ఉద్యోగుల ఇబ్బందులను తొలగించేలా ఈ బదిలీ నిబంధనలు ఉండాలని కూడా ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. -
సాధికార బతుకమ్మ
ఆదిలాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూల బతుకమ్మ కార్యక్రమంలో జిల్లాలోని రెవెన్యూ, ఐసీడీఎస్, సీపీవో, తదితర శాఖల మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాలను పర్యవేక్షించేందుకు, కుల మతాలకతీతంగా (సాధికారికంగా) బతుకమ్మ వేడుక జరిగేలా రాష్ట్ర మహిళా సంఘం నాయకులు జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, టీఎన్జీవో కార్యదర్శి వనజారెడ్డి, మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫ్రొఫెసర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్నందున పర్యవేక్షణ కు తనతోపాటు మరో నలుగురు మహిళా నాయకులు వచ్చారని తెలిపారు. ‘ఆడపిల్లల్ని బతికించుకుందాం.. ఆడపిల్లల్ని చదివించుకుందాం’.. అనే కొత్త నినాదంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు వెనుకబడి ఉన్నారని, సాధికారిత సాధించాలని ఆకాంక్షించారు. అన్ని శాఖల మహిళా ఉద్యోగులు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బతుకమ్మ ఆడాలని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వనజారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు, చప్పట్లతో హోరెత్తించారు. కలెక్టరేట్ ఆవరణ పండుగలా మారింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అనితారెడ్డి, మెప్మా పీడీ రాజేశ్వర్, సరిత, కవిత, మమత, సుజాత, లక్ష్మి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘దొర’బాబులూ కొండ దిగాల్సిందే!
తిరుమల కొండపై తిష్టవేసిన దొరబాబుల బదిలీలకు రంగం సిద్ధం కీలక స్థానాల కోసం జోరందుకున్న పైరవీలు కుదరదంటున్న అధికారులు అటెండర్‌ను కదిలించాలన్నా అమాత్యుల నుంచి ఫోన్లు సాక్షి, తిరుమల : తిరుమల కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేం దుకు రంగం సిద్ధమైంది. ఇటీవల దర్శన వ్యాపారం చేస్తూ వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో ఇద్దరు ఉద్యోగులు, భక్తుల కానుకలు అపహరిస్తూ మరో ఇద్దరు మహిళా ఉద్యోగులు పట్టుబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యల్ని వేగవంతం చేశారు. మరోవైపు తమ బదిలీలను ఆపుకునేందుకు, కొత్త పోస్టుల్లో తిష్టవేసేందుకు రాజధాని స్థాయి నుంచి పైరవీలు జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నా.. అనుకున్న విధంగా అమలు చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొండపై కీలక విభాగాల జాబితాపై ఉన్నతాధికారుల కసరతు తిరుమలలో ఇటీవల వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో సూపరింటెండెంట్, మరో అసిస్టెంట్ షరాబు కాంట్రాక్టు ఉద్యోగితో కలిసి రూ.300 టికెట్లతో అక్రమ వ్యాపారాలు సాగిస్తూ పట్టుబడ్డారు. అలాగే స్వామి సన్నిధిలోనే భక్తులు వేసిన కానుకల్ని చాకచక్యంగా అపహరిస్తూ ఇద్దరు మహిళా ఉద్యోగులు సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. రిసెప్షన్ విభాగాల్లో ఉద్యోగులు కొం దరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ఆధారాలతోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారు ఈ విషయాల్ని తీవ్రంగా పరిగణించి దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని భావించారు. ఈ నేపథ్యంలో దశలవారీగా ఉద్యోగులను బదిలీ చేయాలని కసరత్తు ఆరంభించారు. తిరుమలలో వివిధ శాఖల్లో ఆరోపణలు ఉన్నవారు, రెండేళ్ల పదవీ కాలం నిండినవారిని స్థాన చలనం చేయడం ఉత్తమమని భావిస్తున్నారు. దీని వల్ల అవినీతి ఆరోపణలు కొంతమేర తగ్గించడం, అక్రమాలకు అడ్డుకట్టవేసే అవకాశాలుంటాయనే భావనలో ఉన్నధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అటెండర్ స్థాయి నుంచి అధికారుల స్థాయి వరకు జాబితాను సిద్ధంచేసే పనిలో పడ్డారు. ఇదే రీతిలో పైరవీలూ జోరందుకున్నాయి. అందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నట్టు సమాచారం. కీలక స్థానాల్లో కదిలిస్తే అమాత్యుల స్థాయిలో పైరవీలు తిరుమలలో ప్రధానంగా శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంపెక్స్, రిసెప్షన్ విభాగం, ధర్మకర్తల మండలి చైర్మన్, బోర్డు సభ్యుల వద్ద పనిచేసేందుకే అధిక శాతం ఉద్యోగులు మొగ్గు చూపుతారు. ఇక్కడ సీటు సంపాదించేందుకు తమతమ సామాజిక వర్గాలకు చెందిన అమాత్యుల నుంచి రాష్ర్ట రాజధానిలోని ముఖ్య పేషీ వరకు పైరవీలు సాగిస్తారు. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో టీటీడీలో పెరిగిపోయింది. పోస్టులో చేరిన వ్యక్తి రెండు కాదు.. ఐదారేళ్లు ముగిసినా తిరిగి మరోచోటుకు బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో? అర్థమవుతోంది. కీలక స్థానాల్లో పనిచేసే కొందరిని కదిపితే తమ స్థానాలకే ఎసరు పెడతారేమో? అన్న సందేహాన్ని ఉన్నతాధికా ఒకరు వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనం. అటెండర్ స్థాయి బదిలీ విషయంపై మాట్లాడితే ఏకంగా తన సెల్‌ఫోన్ నుంచే హైదరాబాద్‌లో ఉన్న మంత్రితోనో, మరో ముఖ్యపేషీలోని ఉన్నతాధికారితోనో నేరుగా మాట్లాడించే పరిస్థితి ఎదురువుతోంది.. అని మరో ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తీవ్ర ఒత్తిడుల నడుమ పారదర్శకమైన బదిలీలు సాధ్యమా? అన్నదీ ప్రశ్నార్థకమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు అనుకున్న విధంగానే తిరుమలకొండపై తిష్టవేసిన దొరబాబులను కొండ దించుతారా? అన్నది వేచి చూడాలి మరి. -
ఐటీ పిటీ
=‘అభయ’ ఘటనతో ఉలిక్కిపడిన ఐటీరంగం =మహిళా ఉద్యోగుల్లో అభద్రత =ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడం శాపం =భద్రత లేని ఆటోలు, క్యాబ్‌లు =అరకొరగా సీసీ కెమెరాలు =నైట్‌విజన్ కెమెరాలకు దిక్కులేదు =అడుగడుగునా భద్రత డొల్ల సాక్షి, హైదరాబాద్/సిటీబ్యూరో/గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఐటీ కారిడార్.. చూడ్డానికి అందంగా, అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ఐటీ ఉద్యోగులు మాత్రం ఆ కారిడార్‌లో అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిల భద్రత గాలిలో దీపంలా మారింది. ఒక నిఘా, నియంత్రణ లేని పాలకుల నిర్వాకం కొందరి జీవితాల్ని చిదిమేస్తోంది. ఐటీ కారిడార్‌లో నేరగాళ్ల స్వైరవిహారం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ‘అభయ’ ఉదంతమే నిదర్శనం. ఇందుకు ఎన్నెన్నో కారణాలు.. నిర్లక్ష్యం కొంత.. ఆదమరుపు మరికొంత.. ఏదైనా ఘటన జరిగినపుడు హడావుడి.. ఆపై మిన్నకుండిపోవడం.. ఫలితంగా హైటెక్ సిటీలో పనిచేసే అమ్మాయిలకు భద్రత కరువైంది. కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఇక్కడ లోపించింది. రాత్రి 8 దాటితే సిటీ బస్సు జాడ ఉండదు. గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నేరాలకు, ఘోరాలకు దారితీస్తోంది. సగర్వంగా తలెత్తుకున్నా.. ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్ర ఐటీ రంగం నిలదొక్కుకుంది. దేశంలో నాలుగో స్థానంలో నిలిచి సగర్వంగా తలెత్తుకుంది. కానీ అదే ఐటీ కారిడార్‌లో పనిచేసే ఓ అమ్మాయి మృగాళ్ల చేతిలో దగాపడిందని తెలిసి మొత్తం సభ్య సమాజం నివ్వెరపోయింది. మహిళా ఉద్యోగులు అభద్రతకు గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 3,27,000 మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఐటీ ఉద్యోగుల్లో వీరి సంఖ్య 11.4 శాతం. ఒక్క హైదరాబాద్‌లోనే ఈ రంగంలో 3 లక్షల వరకు ఉద్యోగులున్నారు. వీరిలో 30- 40 శాతం మంది మహిళా ఉద్యోగులున్నట్టు అంచనా. దశలవారీగా ఐటీ రంగం విస్తరి స్తుంటే.. అందులోని ఉద్యోగులకు కష్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు ప్రజారవా ణావ్యవస్థ విస్తరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఉద్యోగులు అవస్థల పాలవుతున్నారు. ప్రధాన లోపం అదే.. సైబారాబాద్ దాదాపు 52 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఐటీ సంస్థలన్నీ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) పరిధిలో ఉన్నాయి. ఇక్కడ దాదాపు 3 లక్షల సాధారణ జనా భా నివాసం ఉంటోంది. వీరితోపాటు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ప్రధానంగా మాదాపూర్‌లోని సైబర్టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్, ఆర్ఎంజడ్ ఫ్యూచురా, టీసీఎస్ డెక్కన్పార్క్, డెల్, కన్వర్జిస్, వానెన్బర్గ్ ఐటీపార్క్, ఐల్యాబ్స్ క్యాంపస్‌లలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. కొండాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవ ర్, సత్యం సైబర్‌స్పేస్, సత్యం ఇన్ఫోసిటీ, టీసీఎస్ పార్క్, ఎస్ఎంఆర్ టెక్నాలజీస్ తదితర క్యాంపస్‌ల్లోనూ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇవి తొలివిడత విస్తరణలో వచ్చిన సంస్థలు. మలిదశలో గచ్చిబౌలిలో ఐఎస్బీ, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్ సిటీ, ఎస్డీఈ ప్రమేలా తదితర క్యాంపస్‌లు వచ్చా యి. మణికొండలో మైక్రోసాఫ్ట్, పోలారిస్, విప్రో, కాన్బే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, యూబీఎస్, సీఏ, సియరా అట్లాంటిక్, వట్టినాగులపల్లిలో సత్యం క్యాంపస్.. ఇలా వరుసగా కొత్తవి వచ్చాయి. ప్రస్తు తం తెల్లాపూర్, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లోనూ ఐటీ సెజ్‌లు నెలకొంటున్నాయి. ఐ టీ కారిడార్‌లో నివాస ప్రాంతాలు ఖరీదైనవి కావడంతో ఇక్కడికి దూరంగా ఉండి విధులకు హాజరవుతున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు లేదా ప్రైవేటు వాహనాలే వీరికి దిక్కు. తొలిదశలో ఏర్పాటైన ఐటీ క్యాంపస్‌లకే పూర్తిస్థాయిలో ప్రజారవాణా వ్యవస్థ లేదు. పట్టుమని నాలుగు కి.మీ.దూరంలేని జేఎన్టీయూహెచ్ క్యాంపస్ వరకు కూ డా ఆర్టీసీ బస్సులు నడవవు. ఐటీ ఉద్యోగులంతా ప్రగతినగర్, మియాపూర్, నిజాంపేట, హైదర్‌నగర్‌లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ మార్గాల్లో బస్సులే లేవన్నది వీరి ప్రధాన ఆరోపణ. ఇక అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఎక్కాల్సిందే. బోయిన్పల్లి, మేడ్చల్, అల్వాల్, జేబీఎస్, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లేవు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల, బీహెచ్ఈల్ తదితర ప్రాంతాలను ఐటీ కారిడార్‌కు కలుపుతూ రవాణా వ్యవస్థ లేదు. ఉప్పల్, సికింద్రాబాద్, కోటి.. ఈ మూడు మార్గాల్లోనే బస్సులు నడుస్తున్నాయి. ఇక రాత్రి వేళ అయితే జాడే ఉండవు. ప్రైవేటే శరణ్యం.. గతంలో షేరింగ్ ఆటోలో ఓ ఐటీ ఉద్యోగినిపై దాడి జరిగినప్పుడు వివిధ శాఖలు కొంత హడావుడి చేసినా ప్రజా రవాణా వ్యవస్థను మాత్రం మెరుగుపరచలేదు. అప్పట్లో మహిళా ఉద్యోగినుల రక్షణకు ఐటీ, పోలీస్ విభాగాలు కొంత సమన్వయంతో పనిచేసినా.. ఆపై మిన్నకుండిపోయాయి. దుర్ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే నివారణ చర్యలపై దృష్టిపెడితే మేలని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. అధికారులతో మాట్లాడాం: మంత్రి లక్ష్మయ్య ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఇతర సమస్యలపై ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను వివరణ కోరగా.. ‘ఐటీ ఉద్యోగినిపై జరిగిన లైంగికదాడి ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళలపై ఎక్కడ, ఎలాంటి ఘటన జరిగినా అది దురదృష్టకరమై నదే. గత ఏడాది నుంచే భద్రత విషయంలో ఐటీ ఉద్యోగులకు పలు దఫాలుగా అవగాహన కల్పించాం. ఐటీ సంస్థల మహిళా ఉద్యోగులకు కచ్చితంగా క్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఇదివరకు సూచించాం. ఇకపై కూడా సూచిస్తాం. ఐటీ కారిడార్‌లో మౌలిక వసతులపై మరోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. ఈ ప్రాంతంలో క్యాబ్లే గతి.. ‘ఈ ప్రాంతంలో షేరింగ్ ఆటోలు, ప్రైవేటు క్యాబ్లే గతి. ఒక్కరే ఆటో ఎక్కాలంటే చిన్నచిన్న రూట్లలోనే రూ. 150 వరకు అడుగుతున్నారు. ప్రధాన రూట్లలోనే బస్సుల్లేవు. సైబర్ టవర్స్ వరకు ఉన్నా.. మలిదశలో విస్తరించిన ఐటీ క్యాంపస్‌ల వరకు బస్సులు లేవు. రాత్రివేళ అసలే లేవు..’ - నరేంద్రకుమార్, ఐటీ రిక్రూటింగ్ సంస్థ మినీ బస్సులైనా... ‘ఐటీ సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ చాలా ఎక్కువుంది. అమ్మాయిలు బైక్‌పై వెళుతుంటేనే పక్క నుంచి అరుపులు, కామెంట్లు వినిపిస్తుంటాయి. కనీసం మినీ బస్సులైనా నడిపిస్తే అమ్మాయిలకు భరోసా ఉంటుంది. అన్ని సంస్థల్లో క్యాబ్ వ్యవస్థ లేదు. విభిన్న షిఫ్టుల్లో పనిచేయాలి. రాత్రివేళలో రహేజా నుంచి గచ్చిబౌలి మార్గంలో కనీసం విద్యుత్తు దీపాలు కూడా వెలగవు. నిరంతరం బస్సు సౌకర్యం, పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలి’ - స్రవంతి, ఐటీ ప్రోగ్రామర్ -
అష్టదిగ్బంధం
సమైక్యాంధ్ర పరిరక్షణ పోరు జిల్లాలో హోరెత్తుతోంది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాలో రహదారులను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్మించారు. దీంతో జిల్లా అంతటా రోడ్లపై ట్రాఫిక్ గంటలతరబడి నిలిచిపోయింది. రైతులు, న్యాయవాదులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృత్తి కార్మికులు, మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసన గళం వినిపించారు. సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం కోసం ఊరూవాడా ఏకమైంది. ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు జిల్లాను మంగళవారం అష్టదిగ్బంధం చేశారు. రహదారులపై భారీ ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. కైకలూరు తాలుకా సెంటర్ వద్ద ఉద్యోగులు పామర్రు-కత్తిపూడి 14వ నంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. గంటకుపైగా రహదారిపై ఆందోళన చేశారు. జగ్గయ్యపేటలో అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్యోగ, ఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధం చేశారు. మహిళా ఉద్యోగులు ఆటలు ఆడగా, విద్యార్థులు నృత్యాలు చేశారు. జేఏసీ నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. తేలప్రోలులో ఉషారామా ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. జాతీయరహదారిపై కబడ్డీ ఆడి వినూత్న నిరసన తెలిపారు. మైలవరం జాతీయ రహదారిలోని తెలుగు తల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు. బస్సులతో నిరసన ప్రదర్శన.. తిరువూరులో ఉపాధ్యాయులు, సమైక్య జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గుడివాడలో నాలుగు వైపులా రోడ్లు పూర్తిగా మూసేసి రాస్తారోకో చేపట్టారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. 200 ఎడ్లబళ్లతో.. ఉయ్యూరులో రైతులు కేసీపీ కర్మాగారం నుంచి వీరమ్మ తల్లి ఆలయం వరకు 200 ఎడ్లబళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన సెంటర్లో బళ్లతో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ రోడ్డు వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ నేతృత్వంలో ఉద్యోగులు, కార్మికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి మండలం మూలలంకలో విద్యార్థుల ర్యాలీ, గుర్వాయిపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు జరిగాయి. వత్సవాయిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గ్రామస్తులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వ్యాపారులు మైలవరంలో ర్యాలీ నిర్వహించారు. విస్సన్నపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో, ప్రదర్శన, రిలేదీక్షలు కొనసాగాయి. గుడివాడ నెహ్రూచౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగుతోంది. న్యాయవాదులు మునిసిపల్ కార్యాలయం ఎదుట కోర్టు నిర్వహించి నిరసన తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగుల వంటావార్పు.. మచిలీపట్నంలో న్యాయశాఖ ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మైలవరంలో శ్రీ వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి తెలుగు తల్లి సెంటర్లో మానవహారం నిర్మించారు. ఇబ్రహీంపట్నం సెంటర్లో టైలర్లు జాతీయ రహదారిపై మిషన్లతో బట్టలు కుట్టి నిరసన తెలిపారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో వ్యవసాయశాఖ అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై మానవహారం నిర్మించారు. కంకిపాడులో వస్త్ర, కిరాణా మర్చంట్స్, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. దుకాణదారులు రోడ్డుపై క్రికెట్ ఆడి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఉయ్యూరులో కటింగ్ సెలూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణులు రిలేదీక్షలు చేపట్టారు. పెడన మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో పెడన ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో రిలే దీక్ష చేశారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాం ప్రసాద్ సంఘీభావం తెలిపారు. రహదారుల దిగ్బంధంతో పాటు బంటుమిల్లిలో బంద్ పూర్తిగా విజయవంతమైంది. కంచికచర్లలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై కేఆర్‌బీ విద్యార్థినులు రాస్తారోకో, మానవహారం నిర్మించారు. జాతీయ రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేశారు. కంచికచర్ల చెరువుకట్ట వద్ద జాతీయ రహదారిపై ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ నాయకులు రాస్తారోకో చేసి, కబడ్డీ ఆడారు. నూజివీడులో ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జనరల్ బాడీ ఆధ్వర్యంలో చిన్న గాంధీబొమ్మ సెంటర్లో వంటావార్పు చేశారు. విజయవాడలో పోరు హోరు.. విజయవాడలో ఉద్యమం హోరెత్తింది. విజయవాడలో రామవరప్పాడు రింగ్, గొల్లపూడి, బెంజిసర్కిల్ వద్ద రోడ్లను దిగ్బంధం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష జరిపారు. న్యాయవిభాగం సిబ్బంది కోర్టుల ప్రాంగణానికి తాళాలు వేశారు. కోర్టు బయట బెంచీలు వేసి మాక్ కోర్టు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. పాత ప్రభుత్వాస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది భారీ ర్యాలీ జరిపారు. ఇరిగేషన్ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు.