ప్రముఖ చాయ్ కంపెనీ ‘చాయ్ సుట్ట’ పెయిడ్ మెనుస్ట్రుయేషన్ లీవ్‌ను అమలు చేస్తోంది. ఈ సెలవు గురించి కంపెనీ ఫౌండర్ అనుభవ్ దూబే మహిళా ఉద్యోగులతో నిర్వహించిన చర్చా కార్యక్రమం తాలూకు విషయాలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యాయి. చర్చలో పాల్గొన్న వారి నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి. కొందరు ‘సెలవు అనివార్యం కాదు’ అన్నట్లుగా మాట్లాడారు.
‘ఆ రోజుల్లో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి సెలవు తప్పనిసరి’ అని కొందరు మాట్లాడారు. చర్చ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండోర్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్, చాయ్ సుట్ట ఫౌండర్ అనుభవ్ దూబే లింక్‌డ్‌ఇన్‌లో ఇలా రాశారు... ‘భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ ఆరోగ్యకరమైన చర్చ నడిచింది. మెనుస్ట్రువల్ లీవ్ ఇవ్వాలి అనుకోవడం కఠినమైన నిర్ణయం కాదు. కొన్ని విషయాలను స్త్రీలు మాత్రమే అర్థం చేసుకోగలరు’
Comments
Please login to add a commentAdd a comment