leaves
-
టీచర్లు ఖాళీ.. మంత్రి కంగాళి!
సాక్షి, అమరావతి: నిబంధనలు తెలుసుకోకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్లో ఉన్న టీచర్లలో 50 శాతం వరకు సెలవు తీసుకొనే వెసులుబాటు ఉన్నా, అయినా తక్కువ మందే సెలవులో ఉన్నప్పటికీ, వారందరికీ మెమోలు జారీ చేయాలంటూ ఎంఈవోను ఆదేశించడంపై ఉపాధ్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను మంత్రి మనోహర్ సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. 24 మంది టీచర్లలో ఐదుగురు సాధారణ సెలవు, మరో ఇద్దరు హాఫ్‌డే సెలవు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ‘ఒకేసారి ఏడుగురు టీచర్లు ఎలా సెలవు తీసుకుంటారు? మీరెలా ఇచ్చారు’ అంటూ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్ఎం)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సెలవు పెట్టిన ఉపాధ్యాయులకు మెమోలు జారీచేయాలని ఎంఈవోను ఆదేశించారు. ఈ విషయంపై మంగళవారం డీఆర్సీ సమావేశంలో కలెక్టర్, డీఈవోలతో చర్చిస్తానన్నారు. మొత్తం 399 మంది విద్యార్థుల్లో 80 మంది హాజరు కాకపోవడంపై మంత్రి హెచ్ఎంని ప్రశ్నించారు. మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశిస్తే తాము ఎలా పనిచేయగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు అడగకుండా మంత్రి హడావుడి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన మంత్రే టీచర్లను బెదిరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. వాస్తవానికి శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో 46 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 36 మందే టీచర్లున్నారు. వీరిలో 12 మందిని ఇటీవల డెప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించారు. మిగిలిన 24 మందిలో సోమవారం ఐదుగురు సీఎల్ తీసుకోగా, ఇద్దరు మధ్యాహ్నం నుంచి హాఫ్ డే సెలవు పెట్టారు. అయితే, మంత్రి మనోహర్ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై మాట్లాడకుండా, బోధనాపరమైన సమస్యలు తెలుసుకోకుండా టీచర్ల సెలవుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఉపాధ్యాయుల్లో 50 శాతం తగ్గకుండా విధులకు హాజరు కావాలి. దీనిప్రకారం ఈ స్కూల్లో 11 మంది వరకు సెలవు తీసుకోవచ్చు. కానీ ఐదుగురే సెలవు పెట్టినా మంత్రి హడావుడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉద్యోగులకు మీషో భారీ ఆఫర్.. 9 రోజులపాటు సెలవులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకుని మళ్లీ రీచార్జ్ కావడానికి ఈ సెలవు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాదీ ఇలాంటి ప్రయోజనం కల్పించినట్లు చెప్పింది.‘‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్‌తో పని లేదు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్’’ అని మీషో వెల్లడించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ సెలవులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉండనుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసలతో కామెంట్లు కురిపించారు. -
బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలుసా..!
బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీకి మంచి ఫ్లేవర్‌ని ఇచ్చే బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే ఉప్మాలో కరివేపాకులా బిర్యానీలో వచ్చే బిర్యానీ ఆకును ఏరిపారేయడమే. కానీ వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని తెలుసా? బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే కడుపు నొప్పి, జలుబు, తలనొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో ఇంకేం లాభాలున్నాయంటే..డీ టాక్సిఫికేషన్మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బాడీ టాక్సిసిటీ తగ్గుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుతుంది.యాంటీ క్యాన్సర్ గుణాలు..బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి సమస్యల్ని ముందు నుంచే తగ్గించుకోవచ్చు. అంతేకాదు. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ బ్లడ్ కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఫైటోకెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. దీంతోపాటు లివర్, కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.డయాబెటిస్..బిర్యానీ ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. దీనిని తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.గుండె ఆరోగ్యానికి..పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకుల్లోని కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ గుండె గోడలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.ఎలా తీసుకోవాలి?బిర్యానీ ఆకుల్ని టీలా చేసుకుని తాగొచ్చు. దీనికోసం నీటిలో బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించి తాగొచ్చు. అందులో దాల్చిన చెక్క వేస్తే మరీ మంచిది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
'నో ఆఫీస్.. నో లీవ్స్'.. టెక్ దిగ్గజం కొత్త మంత్రం!
కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది సమయంలో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాయి. అయితే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీఎల్‌టెక్ కొత్త పాలసీని అందుబాటులో తీసుకురానుంది.ఆఫీసులకు వచ్చినవారికి మాత్రమే లీవ్స్ అందింస్తామని, ఆఫీసులకు రాకుండా లీవ్ తీసుకుంటే శాలరీలో కోతలు ఉంటాయని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది. మహమ్మారి తర్వాత ఉద్యోగులను తిరిగి క్యాంపస్‌కు తీసుకురావడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగులు వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు ఆఫీసులో ఉండాలి. హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత హెచ్‌సీఎల్‌టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాలని కోరింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా వెల్లడించాయి. -
బొప్పాయి ఆకులతో గుండె,కాలేయం,కిడ్నీలు పదిలం! అదెలాగంటే..
బొప్పాయి పండు అంటే చాలా మందికి ఇష్టం.బొప్పాయి పండు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.బొప్పాయి పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. కేవలం బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్తున్నారుప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి కొంగొత్త అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స కూడా ఉండటం లేదు. ఈ క్రమం లోనే చాలా మంది జనాలు ఆయుర్వేదం,పురాతన వైద్యం చిట్కాలను ఆశ్రయిస్తున్నారు. మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాలలో గుండె,కాలేయం,కిడ్నీ ఉన్నాయి. ఒక మొక్క ఈ మూడు అవయవాలను 70 ఏళ్ళ పాటు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచుతుంది అని చాలా మందికి తెలియదు. ఈ అవయవాలకు ఆ మొక్క సంజీవినిలాగ పని చేస్తుంది. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..బొప్పాయి ఆకులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నాయి.అవి కాన్సర్ ను నివారించటం లో చాలా సహాయపడతాయి.బొప్పాయిలో ఉండే ఈ యాంటీ ట్యూమర్ గుణాలు కణితులను నివారించి కాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. బొప్పాయి ఆకుల రసంలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బొప్పాయి ఆకుల రసం వివిధ వ్యాధులను నివారించటం లో సహాయం చేస్తుంది కాబట్టి ఈ రసాన్ని సర్వ రోగ నివారిణి అంటారు.బొప్పాయి ఆకులతో చేసిన రసం గుండె,కాలేయం,కిడ్నీ వంటి అవయవాలకు చాలా మేలు చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధుల చికిత్స లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.బొప్పాయి ఆకులతో చేసిన రసాన్ని తాగితే ప్లేట్ లెట్ కౌంట్ వేగంగా పెరుగుతుంది.అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ రసం రక్త ప్రసరణను వేగంగా మెరుగుపరుస్తుంది. గర్భాశయ, ప్రోస్టేట్,రొమ్ము, ఊపిరితిత్తుల కాన్సర్ నివారణలో బొప్పాయి ఆకుల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.మలబద్దకం సమస్య ఉన్న వారికి ఈ రసం ఔషధంలా పని చేస్తుంది.ఈ రసాన్ని బేది మందు అని కూడా అంటారు. బొప్పాయి ఆకులతో చేసిన రసం శరీరం లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన అవి ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయ పడతాయి. గుండె,కాలేయం,కిడ్నీ లను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ బొప్పాయి ఆకుల రసం చాలా సహాయపడుతుంది. అందుకే బొప్పాయి ఆకుల రసం గుండె,కాలేయం,కిడ్నీఅవయవాలకు సంజీవనిలాగ పని చేస్తుంది అని నిపుణులు నమ్మకంగా చెబుతున్నారు. (చదవండి: నేహా ధూపియా వెయిట్ లాస్ జర్నీ!..ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే స్ట్రాటజీ ఇదే..!) -
స్ట్రాబెర్రీ పండే కాదు..ఆకులతో కూడా : డబుల్ ధమాకా
జ్యూసీ, జ్యూసీ స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కాస్త ఖరీదు ఎక్కువైనా సరే, ప్రతీ బైట్లోనూ నోట్లోకి జారే తీపి పులుపుతో కూడిన స్ట్రాబెర్రీ టేస్ట్‌ను ఆరగించాల్సిందే. అయితే స్ట్రాబెర్రీ పండ్ల మాదిరి గానే, ఆకుల్లోకూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. మరి అవేంటో చూద్దాం రండి!స్ట్రాబెర్రీ ఆకులు విటమిన్ సీ విషయంలో స్ట్రాబెర్రీ పండుతో పోటీపడతాయట. సాధారణ ఆకు కూరల మాదిరిగానే, స్ట్రాబెర్రీ ఆకులూ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఎలాజిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది.రోగనిరోధక శక్తి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఈ ఆకులు మంచిది. విటమిన్ ఏ, కే, ఇనుము, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీ ఆకుల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకుల అంచనా.స్ట్రాబెర్రీ ఆకులలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలకు, శక్తివంతమైన సెల్ ప్రొటెక్టర్లుగా పనిచేస్తాయి. స్ట్రాబెర్రీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. హైపర్ గ్లెసీమియా (ప్రమాదకర అధిక రక్త చక్కెర స్థాయిలు) టైప్ 2 డయాబెటిస్ వంటి పరిస్థితులతో ఉన్న వారికి మేలు చేస్తాయి. డైజెస్టివ్ ఎయిడ్‌గా ఉపయోగపడతాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపర్చి, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సన్నగా తరిగిన ఆకులు సలాడ్లలో యాడ్ చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే హెర్బల్ టీలో కూడా వాడవచ్చు. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. స్ట్రాబెర్రీ ఆకుల్లోని ఆంథోసైనిన్స్ వంటి పాలీఫెనాల్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.నోట్: సేంద్రీయంగా పండించిన తాజా స్ట్రాబెర్రీ ఆకులను వాడటం ఉత్తమం. లేదా వీటి ఆకులను వాడే ముందు పురుగుమందుల అవశేషాలనుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. -
చింత చిగురు.. నోరూరు
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్‌గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. ఉపయోగాలివీ.. 👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. 👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. 👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. 👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. 👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. 👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. 👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. 👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురంచింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం -
జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
జామపండుకు పేదల ఆపిల్ అని పేరు. అయితే పండే కాదు... ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు... ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయి.ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది అధిక బరువును తగ్గించడంలో జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. స్త్రీలు నెలసరి సమయంలో కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి.కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో జామ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ ముప్పు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది. జామ ఆకులు శరీర మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. -
అరటి ఆకులతో హల్వా ట్రై చేశారా?
హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి హల్వాని సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా వివిధ పండ్లతో, కూరగాయాలతో చేయటం చూశాం. ఎన్నో రకాల మేళవింపులతో కూడిన హల్వాలను రుచి చూశాం. అయితే ఇలా ఆకులతో చేసే హల్వాని మాత్రం చూసి ఉండరు. అందులోనూ అరటి ఆకులతో చేయడం గురించి విన్నారు. ఎలా చేస్తారంటే..అత్యంత ప్రజాధరణ పొందిన స్వీట్సలో హల్వా ఒకటి. దాని రుచే అదిరిపోతుంది. అలాంటి హల్వాని ఆకులతో చేయడం ఏంట్రాబాబు అనుకుంటున్నారా..!. అందుకు సంబంధించిన ఆసక్తికర వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అందులో ఓక వ్యక్తి ఈ వైరైటీ హల్వాని చేసి చూపించాడు. అతను అరటి ఆకులను చక్కగా శుభ్రం చేసి మద్యలోని కాండాన్ని తొలగించాడు. ఆ తర్వాత ఆకులన్నింటిని చక్కగా చదును చేసి రోల్ చేశాడు. ఇక దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. వాటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్‌లా. ఆ తర్వా స్టవ్‌పై కడాయి పెట్టి నెయ్యి వేసి, అందులో ఈ జ్యూస్‌ని వేసి పచ్చి వాసన పోయి దగ్గర పడేలా మరిగించాడు. ఆ తర్వాత పంచాదర కలిపి మరింత దగ్గర పడేలా చేశాడు. ఈలోగా కార్న్‌ఫ్లోర్‌ని చక్కగా నీటిలో కలిపి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో కలపాడు. ఇకి హల్వాల దగ్గర పడుతుందనంగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాడు. చివరిగా ఆ హల్వాని టేస్ట్ చేసి వ్యక్తి పైకి బాగుందని అన్నా..అతని ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాలేదన్నట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు బాస్ ఏంటి చెత్త ప్రయోగాలు..బాగుందంటూ హవభావాలు వేరేలా ఉన్నయేంటీ అని చివాట్లు పెడుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Great Indian Asmr (@great_indian_asmr) (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
ఒడిశా కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ!
ఒడిశాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్‌కు అంజేశారు. ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం. ఖాడియాల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాతనే తాను కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని అధిరాజ్ మీడియాకు తెలిపారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే ఆయన బీజేడీలో చేరుతారంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయనకు 59,308 ఓట్లు వచ్చాయి. బీజేడీ నేత లంబోధర్ నియాల్‌కు 56,451 ఓట్లు వచ్చాయి. 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పాణిగ్రాహి ఓటమి చవిచూశారు. -
బరువు పెరిగితే సెలవులు కట్!
సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. -
Anubhav Dubey: చాయ్ సుట్ట సహృదయం
ప్రముఖ చాయ్ కంపెనీ ‘చాయ్ సుట్ట’ పెయిడ్ మెనుస్ట్రుయేషన్ లీవ్‌ను అమలు చేస్తోంది. ఈ సెలవు గురించి కంపెనీ ఫౌండర్ అనుభవ్ దూబే మహిళా ఉద్యోగులతో నిర్వహించిన చర్చా కార్యక్రమం తాలూకు విషయాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. చర్చలో పాల్గొన్న వారి నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి. కొందరు ‘సెలవు అనివార్యం కాదు’ అన్నట్లుగా మాట్లాడారు. ‘ఆ రోజుల్లో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి సెలవు తప్పనిసరి’ అని కొందరు మాట్లాడారు. చర్చ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండోర్‌కు చెందిన ఎంటర్ప్రెన్యూర్, చాయ్ సుట్ట ఫౌండర్ అనుభవ్ దూబే లింక్డ్ఇన్లో ఇలా రాశారు... ‘భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ ఆరోగ్యకరమైన చర్చ నడిచింది. మెనుస్ట్రువల్ లీవ్ ఇవ్వాలి అనుకోవడం కఠినమైన నిర్ణయం కాదు. కొన్ని విషయాలను స్త్రీలు మాత్రమే అర్థం చేసుకోగలరు’ -
కృత్రిమ ఆకులతో మంచినీటిని తయారు చేయొచ్చు.. సైంటిస్టుల వెల్లడి
ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అసాధ్యాన్ని కూడా సుసాధ్యమని నిరూపిస్తున్నారు మన సైంటిస్టులు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎడారి ప్రాంతంలోనూ మంచినీళ్లు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు. కృత్రిమ ఆకులతో స్వచ్చమైన తాగునీటితో పాటు హైడ్రోజన్ ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తాగునీరు, ఇంధనం వంటి సంక్లిష్ట ఇబ్బందులకు ఆర్టిఫిషియల్ లీఫ్ పద్దతి మంచి పరిష్కారమని కేంబ్రిడ్జి యూనివర్సిటీ సైంటిస్టులు వివరించారు. ఆ సరికొత్త ఆవిష్కరణ ఎడారి వంటి ప్రాంతాల్లో సరైన పరిష్కారణమని వారు తెలిపారు. మొక్కలకు నీరు, సూర్యరశ్మే ప్రధాన ఆహారం. గాలిలోని కార్భన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని మొక్కలు మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. అచ్చం ఇదే పద్దతిలో ఇప్పుడు(Artificial Leaf) ఆర్టిఫిషియల్ ఆకులను సృష్టించారు. ఇవి నిజమైన వాటి మాదిరిగానే ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు). ఇవి నీరు, సూర్యరశ్మిని తీసుకొని ఇంధనంతో పాటు స్వచ్చమైన మంచినీటిని అందిస్తుంది. ప్రపంచంలో సుమారు 1.8 బిలియన్ల మందికి ఇప్పటికి తాగునీరు అందుబాటులో లేదు. ఆర్టిఫిషియల్ లీఫ్స్ టెక్నాలజీ ద్వారా నీటి సంక్షోభం నుంచి ఉపశమనం పొందొచ్చు.ఇది విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ లీఫ్‌పై ఉన్న చతురస్రాకారపు గ్రీన్ ఫొటోనోడ్.. సన్‌లైట్‌ను కలెక్ట్ చేస్తుంది. సూర్యుడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కృత్రిమ ఆకుల్లోని కనెక్టెడ్ సిలిండర్స్ సాధారణ మొక్కల థియరీ కిరణజన్య సంయోగ క్రియ తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది.ఆర్టిఫిషియల్ లీఫ్స్ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి ఏకకాలంలో స్వచ్చమైన మంచినీటితో పాటు ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా గాలి కూడా శుభ్రమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం.. సంవత్సరానికి మూడు మిలియన్ల మరణాలకు కాలుష్యమే కారణమని తేలింది. ఈ నేపథ్యంలో అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రొఫెసర్ ఎర్విన్ రీస్నర్ అన్నారు.వాతావరణంలో పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
త్వరలో కొత్త కార్మిక చట్టాలు: ఉద్యోగుల జీతాల్లో వచ్చే మార్పులు ఇవే?
ఉద్యోగులకు శుభవార్త. పని-జీవిత సమతుల్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేస్తూ.. వాటిని అమల్లోకి తెచ్చేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే లీవ్‌ల విషయంలో ఉద్యోగులు మరింత లబ్ధి పొందనున్నారు. 30 రోజులకు మించి సెలవుల్ని (leave) క్లయిమ్ చేయకపోతే ఉద్యోగులకు కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని మార్పులు చేసిన కార్మిక చట్టంలో ఉంది. కేంద్రం గత ఏడాది వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్ పేరుతో రూపొందించింది. నాలుగు కోడ్లకు పార్లమెంట్లో సైతం ఆమోదం పొందింది. అయితే, అవి ఇంకా అమల్లోకి రాలేదు. చట్టాల అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఉద్యోగుల సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. అయితే లేబర్ కోడ్లలో మార్పులకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. ఉద్యోగులకు ఉపయోగమే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ 2020 ప్రకారం.. లీవ్ బ్యాలెన్స్ 30 దాటితే అదనపు సెలవులను కార్మికులు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఈ ఎన్‌క్యాష్ అనేది ప్రతి ఏడాది క్యాలెండర్ ఇయర్ చివరిలో జరుగుతుంది. లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌లు వినియోగించుకోకపోతే నిర్విర్యం కావు. వాటిని మరుసటి ఏడాదికి పొడిగించుకోవచ్చు. లేదంటే ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. కానీ సంస్థలు వార్షిక (ఏడాది annual) ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్ చేసుకునేందుకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో కేంద్రం మార్పులు చేసిన కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. లీవ్ ఎన్ క్యాష్మెంట్ అంటే? కార్మిక చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్దిష్ట సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు లీవ్‌లు ఇస్తుంటాయి. సంస్థలు అందించే మొత్తం లీవ్‌లను ఉద్యోగులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు మరుసటి ఏడాది లీవ్‌లను వినియోగించేలా పొడిగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. తన చట్టబద్ధమైన సెలవులను ఉపయోగించుకోని (ప్రైవేట్) ఉద్యోగులు.. ఆ సెలవులకు బదులుగా ఆ మేరకు నగదును పొందడాన్నే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) అంటారు. న్యాయ వాద నిపుణులు ఏమంటున్నారు? అయితే, కార్మిక చట్టాల్లోని మార్పులపై న్యాయవాద నిపుణులు స్పందిస్తున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 32 (ఓఎస్‌హెచ్ కోడ్) సెక్షన్ 2020లో వార్షిక సెలవులు పొందడం, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్ ఇలా సంబంధించి అనేక షరతులు ఉన్నాయి. సెక్షన్ 32(30) ప్రకారం ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల వరకు వార్షిక సెలవులను మరుసటి ఏడాదికి ట్రాన్స్ఫర్ (క్యారీ ఫార్వర్డ్) చేసుకోవచ్చు. క్యాలెండర్ ఇయర్ చివరిలో వార్షిక సెలవుల బ్యాలెన్స్ 30 దాటితే, ఉద్యోగి అదనపు సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడానికి లేదంటే మరో ఏడాదికి పొడిగించుకోవడానికి అర్హత ఉందని ప్రముఖ న్యాయ సంస్థ ఇండస్‌లా ప్రతినిధి సౌమ్య కుమార్ తెలిపారు. కొత్త కార్మిక చట్టాల్ని రూపొందించింది.. కానీ గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం 4 కొత్తగా కార్మిక చట్టాల్ని రూపొందించింది. వాటిల్లో కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్లుగా మార్చింది. ఇందులో నాలుగు చట్టాలను వేతన కోడ్, 9 చట్టాలను సోషల్ సెక్యూరిటీ కోడ్, 13 చట్టాలను ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, మరో 3 చట్టాలను ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లుగా రూపొందించింది. వాటిని జులై 01, 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. -
ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ మొత్తం ఎన్ని సెలవులు తీసుకున్నారంటూ పూణేకు చెందిన ఓ పౌర హక్కుల కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేయగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం సమాధానమిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పొందుపరుస్తూ మా ప్రధాని మా గర్వకారణం అని రాశారు. పూణేకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పి సర్దా ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి రెండు అంశాలపై ఆరా తీశారు. మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని? రెండవది ప్రధాని ఇంతవరకు విధులకు హాజరైన మొత్తం రోజులు, వివిధ కార్యక్రమాలకు హాజరైన దినాలు ఎన్ని? ఈ వివరాలు తెలపమని కోరారు. ప్రధాని కార్యాలయంలో ఆర్టీఐ అర్జీల వ్యవహారాలను సమీక్షించే కార్యాలయ సెక్రెటరీ పర్వేశ్ కుమార్ ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూ.. మొదటిగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రెండవదిగా ఆయన ప్రతిరోజూ విధులకు హాజరవుతూనే ఉన్నారని ఈ తొమ్మిదేళ్లలో సుమారు 3000 కార్యక్రమాలకు హాజరయ్యారని.. అంటే కనీసం రోజుకొక కార్యక్రమంలోనైనా ఆయన పాల్గొంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం తెలిపిన ఈ వివరాలను అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మరో కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రధానితో కలిసి పనిచేయడాన్ని క్రికెట్ పరిభాషలో చెబుతూ.. కెప్టెన్ మోదీతో పని ఉదయాన్నే 6 గంటలకు మొదలై.. చాలా ఆలస్యంగా ముగుస్తుందని అన్నారు. ఆయన మనకు అవకాశమిస్తే మనము వికెట్ తీస్తామని ఆయన అంచనా వేస్తుంటారని అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని.. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నారని గానీ ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని గానీ నేను ఈ మాట చెప్పడంలేదన అన్నారు జయశంకర్. గతంలో కూడా 2016లో ప్రధాని సెలవుల గురించి మరొకరు ఇలాగే ఆర్టీఐ ద్వారా ఆరా తీశారు. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం ఇదే సమాధానాన్నిచ్చింది. #MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke — Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023 ఇది కూడా చదవండి: మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
టమాట వల్ల భర్తను వదిలేసిన భార్య
-
మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్‌కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే.. బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు. ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా! -
ఆ కంపెనీలో తప్పకుండా లీవ్స్ తీసుకోవాల్సిందే...లేదంటే ?
-
సెలవులు తీసుకోవాల్సిందే.. ఈ కంపెనీ పెట్టిన రూల్ భలే ఉందే!
సాధారణంగా ఉద్యోగులు తమ యాజమాన్యాలు ఎన్ని సెలవులిస్తే అంత మేలని భావిస్తుంటారు. కానీ కొందరుంటారు.. అస్సలు లీవ్స్ తీసుకోరు. ఏడాదంతా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసేవారూ ఉన్నారు. అయితే ఈ స్టార్టప్ కంపెనీలో సెలవులు పెట్టకుండా పనిచేస్తామంటే కుదరదు. యునైటెడ్ స్టేట్స్కు చెందిన గో నింబ్లీ అనే స్టార్టప్ తమ సంస్థలో నూతన సెలవు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి సంవత్సరం కనీసం 20 సెలవులు తీసుకోవడం తప్పనిసరి. సంస్థ ఉద్యోగులు చాలా కాలంగా లీవ్‌లకు సంబంధించి మరింత అనువైన ప్లాన్ కోసం అభ్యర్థిస్తున్నారని, వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ కంపెనీ రూపొందించిన సెలవుల విధానాన్ని గురించి తెలియ జేస్తూ గో నింబ్లీ కంపెనీ పీపుల్ ఆపరేషన్స్ డైరెక్టర్ కైల్ లాసీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. కొత్త విధానం పర్యవసానంగా గత త్రైమాసికంతో పోల్చితే సెలవుల వినియోగం 19 శాతం పెరిగిందని తెలిపారు. కొత్త విధానంలోని ముఖ్యాంశాలు ఒక ఉద్యోగి సంవత్సరానికి తీసుకోవలసిన కనీస సెలవుల సంఖ్య 20 రోజులు నూతన సెలవు విధానానికి అనుగుణంగా ఇన్సెంటివ్ ప్లాన్. ఉద్యోగుల సెలవులను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బంది నియామకం పేరెంటెల్ లీవ్స్ కోసం ప్రత్యేక విధానం ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? -
ఆరుసార్లు అమ్మాయి.. మళ్లీ అదే పరిస్థితి.. కన్నీరు పెట్టిస్తున్న ‘అమ్మ’ ఉత్తరం
‘ఇప్పటికే నాకు ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. మళ్ల అమ్మాయే పుట్టింది. మా అత్త నన్నెంతో ఇబ్బంది పెడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నాను. మీకు అనుకూలంగా ఉంటే నా కుమార్తెను పెంచండి. నన్ను క్షమించండి’.. అత్యంత నిస్సహాయ పరిస్థితిలో ఒక మాతృమూర్తి చేసుకున్న అక్షర వేదన ఇది. ఆ తల్లి తన నవజాత ఆడ శిశువును ఒంటరిగా ఆ మహిళా ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఆమెకు ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏడవ సంతానం కూడా ఆడపిల్లే కలిగింది. అత్తింటిలో పోరు పడలేక ఆ మహిళ తన కుమార్తెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఒక లెటర్‌ను కూడా అక్కడ ఉంచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కాగా ఆసుపత్రిలో రోదిస్తున్న శిశువును గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అలాగే ఆ చిన్నారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. నవజాత శిశువును వైద్యులు వార్డుకు తరలించారు.ఈ సందర్భంగా భరత్పూర్ జనతా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హిమాంశు గోయల్ మాట్లాడుతూ ఈ చిన్నారి 3 రోజుల క్రితమే జన్మించిందని అన్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అది చరిత్రలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే -
ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు పాక్ ప్రభుత్వం గట్టి వ్యూహమే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులగా ఖాన్ అరెస్టు కోసం ఆయన నివాసం వద్ద పెద్ద హైడ్రామానే సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి పోలీసులు ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. అదీ కూడా ఖాన్ అవినీతి కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్లగానే ఆయన ఇంట్లోకి పోలీసులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయన భార్య బుష్రా బేగం ఒక్కరే ఇంట్లో ఉన్నట్ల సమాచారం. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా.. నా భార్య బుష్రా బేగం ఒంటరిగా ఉన్న జమాన్పార్క్లోని నా ఇంటిపై పంజాబ్పోలీసులు దాడికి పాల్పడ్డారు. అసలు ఇది ఏ చట్టం ప్రకార ఇలా చేస్తున్నారో చెప్పండని అని నిలదీశారు. పరారీలో ఉన్న నవాజ్ షరీఫను క్విడ్ ప్రోకోగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు లండన్ ప్లాన్‌లో భాగంగా ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాగా ఖాన్ని అరెస్టు చేసేందుకు ఆయన మద్దతుదారులు పోలీసులు మధ్య చాలా రోజులపాటు జరిగిన ప్రతిష్టంభన, తీవ్రమైన ఘర్షణలను అన్నింటిని పక్కన పెట్టి ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుక సంబధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Worst kind of torture in Zaman Park right now. If something happens, will you paint it as accident again!? #چلو_چلو_عمران_کے_ساتھ pic.twitter.com/5S45UDVvMZ — PTI (@PTIofficial) March 18, 2023 (చదవండి: నన్ను అపహరించి, చంపేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం) -
టికెట్ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!
టెల్అవీవ్: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్ టెర్మినల్ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్ఎయిర్ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు. -
చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: మాంసం.. చేపలు.. రొయ్యలు.! చింత చిగురు ధర ముందు ఇవన్నీ దిగదుడుపే. పల్లెల్లో అంతగా పట్టించుకోని ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది. నగర మార్కెట్లలో కిలో రూ.500 ధర పలుకుతోందంటే దీనికున్న డిమాండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే.. రెండు కిలోల చికెన్, రెండు కిలోల రొయ్యలు, మూడు కిలోల చేపలకు సమానమన్న మాట! చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలుండడంతో నగరవాసులు వీలైనంత మేర కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు మంచి రుచి తెస్తుందన్న భావనతో పల్లెల్లో చింత చిగురును కాయగూరల్లోనే కాదు.. చేపలు, రొయ్యలు, మటన్ వంటి మాంసాహార వంటకాల్లోనూ జత చేసేవారు. చదవండి: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! ఇంకా దీనితో చెట్నీ, పులిహోర, రసంలను తయారు చేసేవారు. కాలక్రమంలో పల్లెటూళ్లలో చింత చిగురు వినియోగాన్ని తగ్గించారు. కానీ మారిన జీవనశైలి, ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా, టీవీల్లో ప్రసారమయ్యే వంటకాల్లో చింత చిగురులో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల గురించి విరివిగా ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు పల్లెలుకంటే పట్టణాలు, నగరాల్లోనే దీని వినియోగం బాగా పెరిగింది. ఏడాదిలో జూన్, జులైలో మాత్రమే ఇది దొరుకుతోంది. గతంకంటే అర్బన్ ప్రాంతాల్లో ఏటికేడాది డిమాండ్‌తో పాటు ధర కూడా పెరుగుతోంది. మార్కెట్లు, రైతుబజార్లలో రెండేళ్ల కిందట కిలో చింత చిగురు రూ.100–150కే లభ్యమయ్యేది. ఈ సంవత్సరం ఏకంగా రూ.400 నుంచి 500 వరకు ఎగబాకింది. సేకరణ కష్టతరం గతంలో చింత చెట్లు పల్లె ప్రాంతాల్లోనూ, రోడ్ల పక్కన విరివిగా ఉండేవి. గ్రామాలు, రోడ్ల విస్తరణతో ఆయా చోట్ల వీటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా ఎక్కడా చింత చెట్లను నాటడం లేదు. ఫలితంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దీంతో పల్లెలకు దూరంగా ఉంటున్న చింత చెట్ల నుంచి చిగురు సేకరణకు ఆసక్తి చూపడం లేదు. చిగురు కోయడానికి ఎక్కువ కూలీ సొమ్ము చెల్లించి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నామని కె.కోటపాడుకు చెందిన దేవుడమ్మ అనే మహిళ ‘సాక్షి’కి చెప్పింది. అందుకే గతంకంటే చింత చిగురు ధర పెరిగిందని తెలిపింది. చింత చిగురు ఆరోగ్య ప్రదాయిని చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ మోతాదులో ఔషధ గుణాలుంటాయి. ప్రతి వంద గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లిగ్రాముల కాల్షియం, 140 మి.గ్రా.ల ఫాస్పరస్, 26 మి.గ్రా.ల మెగ్నీషియం, విటమిన్–సి 3 మి.గ్రా.లు ఉంటుంది. యాంటీ బాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలుండడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. జీర్ణ క్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని సుగుణాలున్న చింత చిగురును ఈ సీజన్లో కూరల్లో వండి తీసుకోవడం చాలా మంచిది. – ఎం.రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం, ఏయూ -
వలస కార్మికులకు ఖతర్‌లో సెలవులు రద్దు ! కారణమిదే ?
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌లో పని చేస్తున్న విదేశీ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. వారం రోజుల నుంచి అమలవుతున్న సెలవుల రద్దును ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందే ఎత్తివేయనున్నారు. ఖతర్‌లో 2022 నవంబర్‌లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను తిలకించడానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో ఖతర్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు రద్దు చేసిన సెలవులను అప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఖతర్ ప్రభుత్వం సెలవులపై మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీలు పాటిస్తున్నాయి. అత్యవసరం ఉన్న కార్మికులనే సెలవులపై సొంతూర్లకు పంపిస్తున్నారు. మిగతావాళ్లు ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందు స్వదేశాలకు వెళ్లి 4 నెలల పాటు సెలవులపై ఉండిరావచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి. చదవండి: కనీస వేతనం, విదేశీ భవన్.. ఇంకా మరెన్నో.. -
తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మందికి రావాల్సిన సరెండర్ సెలవుల డబ్బులను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా 30 రోజుల పాటు ఉండే సరెండర్ (ఆర్జిత సెలవులు) లీవులను ఉపయోగించుకోలేని వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి జూన్ నెలలో చెల్లించాల్సిన సరెండర్ లీవుల డబ్బులు ఇప్పటివరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్ల చుట్టూ తిరిగి అలసి పోతున్నామే తప్ప సమస్య మాత్రం తీరడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్ ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి పోలీస్ శాఖ అంటేనే అత్యవసరమైన విభాగం. పండుగలు, అనుకోని ఘటనలు, సభలు, సమావేశాలప్పుడు రోడ్డుపై బందోబస్తు నిర్వహించాల్సిందే. అది శాంతి భద్రతల విభాగమైనా, బెటాలియన్లు అయినా.. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిందే. దీని వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఉండే సాధారణ సెలవులనే వాడుకునే అవకాశం దక్కదని, కనీసం సరెండర్ లీవులకు సంబంధించిన డబ్బులైనా చెల్లిస్తే పిల్లల ఫీజులు లేదా ఇతరత్రా ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. ప్రతీ పోలీస్ ఉద్యోగికి రెండు సార్లు సరెండర్ లీవ్‌లకు డబ్బులు చెల్లిస్తారు. చదవండి: కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా.. ఏటా మొదటి ఆరునెలల కాలానికి వచ్చే 15 సెలవులకు జూన్ లేదా జూలైలో, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఉండే 15 రోజుల సెలవులకు జనవరిలో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది సిబ్బందికి జనవరి నుంచి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మంది సిబ్బందిలో 80 శాతం మందికి సరెండర్ సెలవుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను
మనం చాలా సార్లు ఏదైనా పని ఉంటే ఆఫీస్‌లో బాస్‌ని సెలవు అడగాలంటే చాలా ఇబ్బంది పడతాం. మరీ తప్పదు చాలా అత్యవసరం అనుకుంటే తప్ప అడగలేని సందర్భాలు ఉంటాయి.. కానీ కొంతమంది మాత్రం చీటికి మాటికి భలే సెలవులు అడుగుతారు. పైగా వాళ్లు చెప్పే కారణాలు చూస్తే నమ్మబుద్ధి కూడా కాదు. ఒక్కొసారి ఆ కారణాలు వింటుంటే నవ్వు వస్తుంది. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటుచేసుకంది. విషయమేమిటంటే ఒక ఉద్యోగి అతని బాస్ కెన్కి ఒక మెసేజ్ పెడతాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) ఆ ఉద్యోగి మెసేజ్సారాంశం ఏమిటంటే " సార్ నేను ఆఫీస్‌కి రాలేను నా సాక్స్ బాగా మురికిగా ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ సాక్స్ ఉతకలేదు. పైగా నేను సాక్స్ లేకుండా రాలేను అలాగే నా షూస్‌లో రంధ్రాలు కూడా ఉన్నాయి అందువల్ల నేను ఆఫీస్‌కి వచ్చి పనిచేయలేను" అంటూ మెసేజ్ పెడతాడు. దీంతో సదరు బాసు కెన్ ఆ మెసేజ్‌ని చూసి అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. పైగా అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఆ తర్వాత కాసేపటి కెన్ తిరిగి ఆ ఉద్యోగికి పంపించిన మెసేజ్‌లో " మీరు నవ్వుతున్నారు కదా, సాక్స్ లేకపోడమేమిటి.. ఏంటి కామెడినా. సరే రేపు కలుద్దాం. మరోకరైతే గనుక ఇక రేపటి నుంచి ఆఫీస్‌కి రావల్సిన అవసరం లేదని చెప్పేవాడిని" అని పెట్టాడు. పైగా కెన్ ఈ మెసేజ్‌లను స్క్రీన్ షార్ట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు బాస్ మీరు సాక్స్‌లు ఇస్తానని చెప్పాల్సింది అని ఒకరు, అతను సాకు అనే పుస్తకంలోంచి ఈ సాకున కనుగొన్నాడంటూ సదరు వ్యక్తిని విమర్శిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. (చదవండి: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత) -
ఏపీ: కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజులు సెలవు
సాక్షి, అమరావతి: కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకి ఆస్పత్రిలో ఉన్నవారికి, హోంఐసోలేషన్లో ఉన్నవారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఉద్యోగి కుటుంబ సభ్యులకు కరోనా సోకినా.. వారికి 15 రోజుల సెలవు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. మార్చి 25 తర్వాత కోవిడ్ సోకిన ఉద్యోగులకు ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!
సాక్షి, ఊట్కూర్: చిన్నారులకు చాక్లెట్లు.. ఐస్‌క్రీంలు.. బిస్కెట్లు అంటేనే ఎంతో ఇష్టం.. వాటి కోసం అల్లరి చేయడం పరిపాటి. అలాంటిది ఓ బుడతడు మాత్రం మూడు పూటలా పది చొప్పున వేపాకులు తింటూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన ఉమాదేవి, సూరం ప్రకాశ్ దంపతులకు కుమారుడు తనిష్క్ (15 నెలల బాలుడు) ఉన్నాడు. ఆరు నెలలుగా వేపాకును తింటున్నాడు. తండ్రి ఉదయం, సాయంత్రం వేళ వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ.. వాటికున్న పూలను చిన్నోడు ముందు వేసేవారు. ఆ చిన్నో డు ఆడుతూ.. పాడుతూ.. ఆ వేప పూలు తినేవాడు.. ప్రస్తుతం ఆకులు తినే అలవాటు చేసుకున్నాడు. రోజూ వేపాకు తింటే ఏమైనా అలర్జీ వచ్చిందా అనుకుంటే పొరపాటే.. అలాంటిదేమీ లేదంటున్నారు తల్లిదండ్రులు.. బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నట్లుగా వేపాకును నములుతున్నాడని చెబుతున్నారు. దీనిపై నారాయణపేటలోని డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించగా వేపాకులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రావన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యాంటీబాడీలు పెరుగుతాయన్నారు. చదవండి: కరోనా: వివాహంలో.. మాస్కులే పూల దండలు -
4సార్లు పెళ్లి..మూడు సార్లు విడాకులు..32 సెలవులు
ఆఫీసుల్లో సాధారణంగా సెలవు కావాలంటే.. పంటి నొప్పి నుంచి ఈ లోకంలో లేనివారి చావు వరకూ చాలా కథలే వినిపిస్తుంటాయి. అయితే తైవాన్ కి చెందిన ఓ బ్యాంక్ క్లర్క్.. కేవలం సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకుని, మూడు సార్లు విడాకులు ఇచ్చాడు. తైవానీస్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి వివాహానికి 8 రోజుల వేతన సెలవులు(పెయిడ్ లీవ్స్) పొందే హక్కు ఉంది. దాని ప్రకారం సదరు హీరో.. గత ఏడాది ఏప్రిల్ 6న పెళ్లి చేసుకుని పెయిడ్ లీవ్స్ పొందాడు. అయితే.. 8వ(చివరి) రోజు తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆ మరునాడే మళ్లీ పెళ్లి అంటూ మరో 8 రోజుల పెయిడ్ లీవ్స్‌కి అప్లై చేసుకున్నాడు. ఇలా 37 రోజుల్లో 4 సార్లు పెళ్లి, 3 సార్లు విడాకులతో 32 రోజులు సెలవులు తీసుకున్నాడు. ఇతగాడి గారడీలను గుర్తించిన సదరు బ్యాంక్.. ఆ సెలవులకు అనుమతించకపోవడంతో న్యాయం చెయ్యాలంటూ తైపీ సిటీ లేబర్ బ్యూరోని ఆశ్రయించాడు ఆ పెళ్లికొడుకు. దర్యాప్తు ప్రారంభించిన బ్యూరో.. బ్యాంక్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిందని అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో యజమానికి 7వందల డాలర్లు జరిమానా కూడా విధించింది. ‘లేబర్ లీవ్ రూల్స్’ ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టంలోని లూప్ హోల్స్ ఉపయోగించుకున్నప్పటికీ.. దాన్ని కారణంగా తీసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే వాదోపవాదాల నడుమ బ్యాంక్‌కి, క్లర్క్‌కి జరిగిన సమరంలో ఈ ఏడాది ఏప్రిల్ 10న బ్యూరో మరో తీర్పునూ వెలువరించింది. బ్యాంక్ క్లర్క్ ప్రవర్తన అనైతికం అయినప్పటికీ.. గతంలో ఇచ్చిన తీర్పును అయిష్టంగానే సమర్థించుకుంటూ ‘అతను చట్టాన్ని ఉల్లంఘించలేదు’అని స్పష్టం చేసింది. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వాళ్ల పెళ్లి ఏకంగా పది రోజుల సెలవులిచ్చింది!
‘పెళ్లి కుదిరింది. ఓ పదిహేను రోజులు సెలవి’మ్మంటేనే కొరకొరా చూసే బాస్లున్న కాలమిది. పైగా ‘వారం సరిపోతుందిలే’ అంటూ సలహాతో కూడిన ఆర్డరూ సరేసరి. ఇక రక్త సంబధీకులు కాని వారి పెళ్లికి సెలవంటే అంతెత్తున లేచి ‘గయ్’మనడం మామూలే. అలాంటిది మనం అభిమానించే నటీనటులో, గాయనీ గాయకులో, ఆటగాళ్లో వృత్తి నుంచి రిటైరవుతున్నారనో, లేక పెళ్లి చేసుకుంటున్నారనో లీవ్ అడిగితే? ఇంకేముంది ఉద్యోగానికి నీళ్లొదిలేసుకోవడమే అంటారా! నిజమే కానీ.. మేమిస్తాం అంటోంది జపాన్‌లోని హిరోరో కంపెనీ. టోక్యోలో ఉంటుందిది. టీవీ యాడ్సు, మ్యూజిక్ వీడియోలూ చేస్తుంటుంది. ఇటీవల ఈ సంస్థ అధిపతి షిజెన్ సురుమి తన ఉద్యోగుల కోసం కొత్త పద్ధతిలో సెలవులివ్వనున్నట్లు ప్రకటించాడు. దీనికి ‘ఓషి వెకేషన్ సిస్టమ్’ అని పేరు పెట్టాడు. దీని ప్రకారం కంపెనీలోని ఉద్యోగి తనకు ఇష్టమైన గాయనీ గాయకుల పెళ్లి లేదా రిటైర్మెంట్కు సెలవు తీసుకోవచ్చు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజులు. ఒకవేళ సదరు ఉద్యోగికి ఒకరికంటే ఎక్కువ అభిమాన గాయనీ గాయకులు ఉన్నా ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే, ఇలాంటప్పుడు సెలవుల సంఖ్య మూడు రోజులకు మించదు. సురుమి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి రెండు సంఘటనలు కారణం. ఓ రోజు ఆఫీసులో ఉద్యోగి ఒకరు పనిలో అన్యమనస్కంగా ఉండడం గమనించాడు సురుమి. ఆరా తీస్తే ఆ రోజు సదరు ఉద్యోగి అభిమానించే పాప్ గాయని, డబ్బింగ్ కళాకారిణి పెళ్లి చేసుకుంటోందని తేలింది. మరో రోజు ఇంకో ఉద్యోగి సైతం పనిపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం సురుమి గుర్తించాడు. దానికి కారణం అతనికిష్టమైన పాప్ గాయని ఆ రోజు రిటైర్ అవుతుండడమే. దీనితో బాగా ఆలోచించిన సురుమి కొత్త రకం లీవులకు తెరతీశాడు. సాధారణంగా జపాన్‌లో పాప్ మ్యూజిక్ ప్రదర్శనలకు, బ్యాండ్లకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. అందులో పాటలు పాడుతూ అభినయించే గాయక నటీనటులను ఆరాధించేవాళ్లూ ఎక్కువే. తనది మ్యూజిక్కు సంబంధించిన కంపెనీ కావడం, తన ఉద్యోగుల్లోనూ అనేక మందికి పాప్ మ్యూజిక్ సింగర్లంటే విపరీతమైన అభిమానం ఉండడంతో సురుమి ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం అభిమాన పాప్ సింగర్ల పెళ్లికే కాదు, వారి రిటైర్మెంట్కూ, ఏదైనా మ్యూజిక్ బ్యాండ్‌లోని సభ్యులు విడిపోయి మరో జట్టుగా ఏర్పడినప్పుడూ సెలవు ఇస్తారన్నమాట. ఈ కొత్త సెలవు విధానంలో ఇంకో సౌకర్యమూ ఉంది. ఎవరైనా ఉద్యోగి తనకు లభించిన పది రోజుల సెలవులను తనకు అనుకూలమైన సమయాల్లో వినియోగించుకోవచ్చు. అయితే, అదీ పాప్ మ్యూజిక్ ప్రదర్శనలు చూడ్డానికి మాత్రమే వాడుకోవాలి. చదవండి: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్‌డ్రింక్ ప్రిజర్వేటివ్ -
నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి..
వివాహం అనగానే ఉద్యోగులకు సహజంగానే సెలవులు ఇస్తారు. అయితే అది ఎన్ని రోజులనేది మనం పని చేసే సంస్థని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఉంటున్న దేశం, అక్కడ అనుసరిస్తున్న చట్టాలకు అనుగుణంగా కూడా సెలవులు ఇస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా.. ఓ ఘనుడు ఎక్కువ పెయిడ్ లీవ్‌లను పొందడం కోసం ఒకే మహిళను ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆ బ్యాంకుకు అతని నిర్వాకం తెలియడంతో లీవ్ పొడిగింపును నిరాకరించింది. ఒకే మహిళను 4 సార్లు వివాహం తైవాన్ రాజధాని తాయ్‌పెయ్ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరి. దీన్నే అడ్డంగా పెట్టుకుని ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన సెలవుతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. ఏదేమైనా ఈ క్లర్క్‌కు చట్టాన్ని వాడుకోవడం బాగానే తెలిసినట్టు ఉంది. ( చదవండి: ఈ వ్యక్తి పందెం కోసం ఏకంగా పాములతో... ) -
తప్పుకున్న సేతుపతి
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి టైటిల్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. అయితే తమిళ నాట ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. శ్రీలంక ఆటగాడు అయినప్పటికీ మురళీధరన్‌కు తమిళ మూలాలున్నాయి. అయితే తమిళ ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మురళీధర న్ తమిళుల వైపు ఎప్పుడూ నిలబడలేదనే వివాదం తెరమీదకొచ్చింది. అందుకే విజయ్ సేతుపతి ఈ సినిమా చేయకూడదని సోషల్ మీడియాలో పలువురు హల్చల్ చేశారు. కొందరు తమిళ సినీ ప్రముఖులు కూడా విజయ్ సేతుపతి ఈ సినిమా చేయడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. అందులో సీనియర్ దర్శకులు భారతీరాజా, చేరన్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మురళీధరన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నా వల్ల నీలాంటి గొప్ప నటుడు ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు. ఎటువంటివంటి ఇబ్బందులు పడొద్దు’ అని ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖకు ‘ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చారు విజయ్ సేతుపతి. ఇప్పుడు విజయ సేతుపతి స్థానంలో ఎవరొస్తారో చూడాలి. -
ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!
ఒకప్పుడు ఏ కొద్ది మందికో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే ఉద్యోగ విధులు) భాగ్యం ఉండేది. కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అన్నది ఐటీ ఉద్యోగులకు పరిచయమే. కానీ, కరోనా మహమ్మారి వచ్చి.. ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేసుకునేలా చేసింది. తప్పనిసరైన ఏ కొద్ది మందో తప్పించి మిగిలినవారు ప్రస్తుతానికి ఈ విధానంలోనే కొనసాగుతున్నారు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగుల జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అత్యాధునిక టెక్నాలజీలు, ఇంటర్నెట్ సదుపాయాల విస్తరణ ఇందుకు అనుకూలిస్తున్నాయి కూడా. కానీ, నాణేనికి రెండో కోణం కూడా ఉన్నట్టే.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను అధిగమించడమే కాదు.. పన్ను పరమైన అంశాలను కూడా ఉద్యోగులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం వల్ల తీసుకుంటున్న కొన్ని రకాల అలవెన్స్‌లు ఇంటి నుంచి చేయడం కారణంగా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ విషయమై ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక మినహాయింపులు, వివరణలు వస్తే తప్ప పన్ను చెల్లింపుల బాధ్యత ఉద్యోగులపై ఉంటుంది. ఈ అంశాల గురించి తెలియజేసే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. ప్రస్తుతమున్న ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. పనిచేసే సంస్థ నుంచి ఉద్యోగి అందుకుంటున్న వేతనం, అలవెన్స్‌లు (మినహాయింపుల్లో ఉన్నవి కాకుండా) పన్ను పరిధిలోకే వస్తాయి. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) అన్నవి నిర్దేశిత పరిమితుల వరకు పన్ను మినహాయింపు కలిగినవి. కానీ, బయటకు వెళితే కరోనా రిస్క్ ఉంటుందన్న కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నప్పుడు.. పర్యటనలకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇంటి నుంచి కార్యాలయానికి రోజువారీ రవాణా కూడా తక్కువగానే ఉంటుంది. మరి వీటికి సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లను ఖర్చు చేసే పరిస్థితి లేప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. మినహాయింపులపై ప్రభావం.. వేతనంలో హెచ్ఆర్ఏ ఒక భాగం. ఉద్యోగులు అద్దె ఇంట్లో ఉంటూ.. అద్దె చెల్లింపులు చేస్తున్నట్టయితే నిర్దేశిత పరిమితి మేరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వేతనంలో నిర్ణీత శాతం, వాస్తవంగా తీసుకున్న హెచ్ఆర్ఏ, వాస్తవంగా చెల్లించిన అద్దె వీటిల్లో ఏది తక్కువ అయితే దానిని మినహాయింపుగా చూపించుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారికి మూల వేతనంలో 50 శాతం, ఇతర పట్టణాల్లో ఉంటున్నట్టు అయితే మూల వేతనంలో 40 శాతాన్ని క్లెయిమ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కారణంగా చాలా మంది నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించడంతో.. వారికి ఈ వెసులుబాటు లభించింది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాస్తంత రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వారిది. సొంత ఇల్లు... హెచ్ఆర్ఏ! కొందరు ఇప్పటి వరకు ఉంటున్న అద్దె ఇళ్ల నుంచి తక్కువ అద్దె ఇళ్లలోకి మారుతున్నారు. హెచ్ఆర్ఏ తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండని వారు కచ్చితంగా ఆ మొత్తంపై పన్ను చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు చెల్లించిన అద్దెతో పోలిస్తే తక్కువ అద్దెకు మారిన వారిపైనా పన్ను భారం ఆ మేరకు పడుతుంది. అలాగే, తమ నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చుకున్న వారి విషయంలోనూ నిబంధనలు మారిపోతాయి. ఎందుకంటే మెట్రో నగరాల్లో, పట్టణాల్లో నివసిస్తున్న వారికి మినహాయింపుల పరంగా స్వల్ప వ్యత్యాసం ఉందన్న విషయాన్ని గమనించాలి. ట్రూఅప్ౖపై దృష్టి... ఆర్థిక సంవత్సరం ప్రారంభం లోనే (ఏప్రిల్) ఉద్యోగులు తమ పెట్టుబడులు, ట్యూషన్ ఫీజుల అంచనాలు, ఇంటి అద్దె చెల్లింపుల వివరాలను పనిచేస్తున్న సంస్థకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే సంబంధిత సంవత్సరంలో ఉద్యోగి పన్ను బాధ్యతను కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా పన్ను మొత్తాన్ని నెలవాయిదాల రూపంలో వేతనం నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు కంపెనీలు చెల్లింపులు చేస్తాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగి సమర్పించిన డిక్లరేషన్.. అదే విధంగా ఆర్థిక సంవత్సరం చివర్లో (జనవరి తర్వాత) ఉద్యోగి ఇచ్చే తుది డిక్లరేషన్, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత అదనంగా పన్ను వసూలైందా లేక తక్కువ పన్ను వసూలైందా అన్న నిర్ధారణకు వస్తాయి. దీన్నే ట్రూఅప్‌గా పేర్కొంటారు. కనుక ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఉద్యోగి తప్పకుండా సంస్థకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంటి అద్దెలో మార్పులు జరిగినా లేక నివాసిత ప్రాంతం మారిపోయినా చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో పన్ను వసూలు పరంగా మార్పులు, చేర్పులకు వీలు కలుగుతుంది. ఎల్‌టీఏ... ప్రయోజనం పోయినట్లే! ఎల్‌టీఏ విషయంలో నాలుగు సంవత్సరాలను ఒక బ్లాక్‌గా పరిగణి స్తారు. ఒక బ్లాక్ కాలంలో రెండు పర్యటనల కోసం వాస్తవంగా చేసిన ఖర్చుకు పన్ను మినహాయింపును కోరొచ్చు. ప్రస్తుత బ్లాక్ 2018–2021గా అమల్లో ఉంది. ఎల్‌టీఏ మినహాయింపును ఒక బ్లాక్‌లో వినియోగించుకోని పరిస్థితుల్లో తదుపరి బ్లాక్‌కు దాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే తదుపరి బ్లాక్‌లో మొదటి సంవ్సరంలోనే దీన్ని వినియోగించుకోవాలి. అయినప్పటికీ.. ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనల పట్ల ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, కరోనా ఎప్పుడు సమసిపోతుందో తెలియని పరిస్థితుల్లో.. సమీప కాలానికీ పర్యటనల ప్రణాళికలు పెట్టుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు ఎల్‌టీఏ అలవెన్స్‌పై పన్ను చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా.. అనువైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు, కరెంటు, ఇంటర్నెట్ వినియోగం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్‌ల రూపంలో మద్దతుగా నిలుస్తున్నాయి. కానీ, ఇటువంటి ప్రోత్సాహకాల గురించి ఆదాయపన్ను చట్టంలో స్పష్టంగా ఇప్పటి వరకు అయితే నిర్దేశించలేదు. కనుక ఈ విధమైన అలవెన్స్‌లు కూడా పన్ను పరిధిలోకే వస్తాయి. -
జీతాల పెంపు.. వారానికి మూడు రోజులు సెలవు
లండన్ : ఉద్యోగం అంటే వారానికి ఆరు రోజులు పని చేస్తే.. ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజు మిగతా పనులతో గడిచిపోతుంది. ఇక కుటుంబంతో తీరిగ్గా గడిపే సమయం ఎక్కడ. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతా వారంతా 6 రోజులు పని చేయాల్సిందే. అయితే ఈ విషయంలో బ్రిటన్ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెలకు ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది. ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న పోర్ట్‌కలిస్ అనే లీగల్ కంపెనీ ఈ కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. ఇక మీదట తన ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేస్తే చాలంటుంది. ఇందుకు గాను జీతంలో ఎలాంటి కోతలు ఉండవని చెప్తుంది. ఈ విషయం గురించి కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుంది. అలసట కూడా తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారని వెల్లడించారు. పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట. దాంతో తాము కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రేవర్ తెలిపారు. -
మా వేప చెట్టు పువ్వు
మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది! గుత్తులు గుత్తులుగా తెల్లని పువ్వులు. చిట్టి చిట్టి పువ్వులు. చిన్ని చిన్ని పువ్వులు. తల్లిని గట్టిగా పట్టుకున్న చంటిబిడ్డల్లా కొమ్మల కొంగులను చుట్టేసిన పువ్వులు. పచ్చని ఆకుల పరదాలను దాటుకొని గాలికి అటూ ఇటూ ఊగుతుండే ఆ పువ్వులను చూస్తుంటే ఊయలను పట్టుకొని ఊగే గడుగ్గాయిల్లా అనిపిస్తున్నాయి! అలారం మోగుతున్న శబ్దం వింటూనే ఉలికిపాటుతో మెలకువ వచ్చింది. అటూ ఇటూ చూసి అది కల అని తెలిశాక కళ్లలో తడి చేరింది. ఎంత అందమైన చెట్టు, ఎంత పొడవాటి చెట్టు, ఎన్ని చిట్టి చిట్టి పువ్వులు... కల కళ్లను వదలడం లేదు. మనసు వేగంగా వెళ్లి ఊళ్లో ఇంటి ముందున్న మా వేపచెట్టును చుట్టుకుపోయింది. ఎప్పుడు పుట్టిందో కానీ ఆకాశమంతా తానే అన్నట్టు గర్వంగా నాతో చూపులు కలిపేది మా వేపచెట్టు. ఉగాది రావడానికి రెండు నెలల ముందునుంచే వాకిలంతా ఎండుటాకులతో కప్పేసేది. రోజూ ఉదయ సాయంత్రాలు శుభ్రం చేసుకోవడానికి పడే మా పాట్లను చూసి గుంభనంగా నవ్వుకునేది. ఆ తర్వాత కొమ్మలకు వచ్చిన కొత్త చివుళ్లు, ఆ వెనకే వచ్చే పూల సొగసును చూపించి అందంగా నవ్వేది. గాలి తాకినప్పుడల్లా వచ్చే పూల చిరు వగరు వాసనతో నాతో దోస్తీ కట్టేది. ఉగాది రోజున పనులన్నీ అయ్యాక ‘ఇంకా ఎంతసేపు పచ్చడికి వేప పూత కావాలిగా. నాలుగు కొమ్మలు తెండి’ అని అమ్మ కేకతో నాన్న తన పంచెను మడిచి కొడవలి మాదిరి వంకీలా ఉండే పొడవాటి కట్టె పట్టుకొని ఇంటి ముందున్న వేపచెట్టు దగ్గరకు వెళ్లేవాడు. ఆ కట్టె సాయంతో వేప కొమ్మలను వంచి మరోచేత్తో అందిన నాలుగు కొమ్మలను విరిచి తీసుకొచ్చేవాడు. నాన్న చేతి నుంచి ఆ కొమ్మలను అందుకున్న అమ్మ ఆకుల మధ్య నుంచి విడిగా చిట్టి చిట్టి పూలున్న సన్నని పొడవాటి పుల్లలను పట్టుకొని పూతనంతా చేటలోకి దూసేది. కొమ్మలను మామిడి తోరణం కట్టిన గుమ్మానికి అటూ, ఇటూ రెండువైపులా గుచ్చి, పువ్వును మాత్రం నేర్పుగా కొద్దిగా నలిపి రేకలను విడదీసేది. ఆ పూల రేకలను గుప్పిట్లోనే పట్టుకొని తీసుకెళ్లి ఉగాది పచ్చడి చేసిన కుండలో వేసేది. మర్రి ఆకు డొప్పల్లో వేసిన ఉగాది పచ్చడి ప్రసాదాన్ని వేప పూలతో సహా మరి మరి అడిగించుకొని తాగేవాళ్లం. ఈ ఉగాదికి ‘వేప పూత తీసుకురండి పచ్చడికి’ అని అమ్మ అంటే నాన్న ఎక్కడిదాక వెళ్లాలో. ఊళ్లో నాలుగు నెలల కిందట ఇంటి ముందు నుంచి కాంక్రీట్ రోడ్డు వేశారట. పెద్ద వాహనాలు వెళ్లడానికి అడ్డంగా ఉందని వేపచెట్టును కొట్టేశారట. అమ్మ విషయం చెప్పగానే ఇంటి మనిషిని కోల్పోయానన్న బాధ గుండెను తాకింది. ఆధునికత ఇస్తున్న కాంక్రీట్ బహుమానం మా వేప పూతను నిర్దాక్షిణ్యంగా సమాధి చేసిందని, నా ఆకాశమంత గర్వం కుప్పకూలిందని మనసు మూగబోయింది. నిర్మలారెడ్డి -
‘రెండాకులు’ ఎక్కువే చదివాయి!
ఇంట్లో రోజంతా కరెంటు ఉంటే గొప్ప కాకపోవచ్చు. కానీ... నెల తిరిగినా బిల్లు రాకపోతే అదీ గొప్ప! బాగానే ఉందిగానీ..ఇదేమీ అయ్యే పని కాదు అనుకుంటున్నారా? సాధ్యం చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు... కృత్రిమంగా తయారు చేసిన ఆకుల శక్తిని పదింతలు పెంచేశారు! కృత్రిమ ఆకులేమిటి? వాటి సామర్థ్యం పెంచేయడం ఏమిటి? ఇవేనా మీ ప్రశ్నలు. ఒక్కసారి చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న ‘కిరణజన్య సంయోగక్రియ’ను నెమరేసుకుందాం. మొక్కల ఆకుల్లోని పత్రహరితం సూర్య కిరణాల సాయంతో శక్తిని తయారు చేసుకుంటుందని.. దీన్ని మొక్క పెరుగుదలకు వాడుకుంటుందని మనం చదివే ఉంటాం. ఈ క్రమంలో మనం వదిలేసే కార్బన్డయాక్సైడ్ (సీఓ2)ను పీల్చేసుకుని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అచ్చం ఇదే పద్ధతిలో పనిచేసే కొన్ని పరికరాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారుగానీ.. వాటి సామర్థ్యం తక్కువ.. ఖర్చు బోలెడంత ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్త మినీశ్ సింగ్ బృందం చేసిన తాజా పరిశోధనలు.. వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు) పదింతలు ఎక్కువ విద్యుత్‌ను లేదా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వినూత్నమైన డిజైన్‌ను సూచిస్తున్నారు. నమూనాలను కూడా రూపొందించి ఈ విషయాన్ని నిరూపించారు కూడా.. సమస్య ఏమిటి ? శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ తయారు చేసిన కృత్రిమ ఆకులు ఒత్తిడితో కూడిన కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. ఇది వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యం. ఎందుకంటే.. గాల్లోంచి వాడుకోవాలంటే.. కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేయాలి.. ఒత్తిడికి గురి చేసి ట్యాంకుల్లో భద్రపరచాలి. ఆ తర్వాతగానీ ఇంధనం తయారు కాదన్నమాట. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. మినీశ్ సింగ్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కృత్రిమ ఆకులను నీటితో నిండిన ఓ పెట్టెలో పెట్టడం.. ప్రత్యేకమైన లక్షణాలున్న పదార్థాన్ని కృత్రిమ ఆకు చుట్టూ ఏర్పాటు చేయడం ఇందులో కీలకం. సూర్యరశ్మి తాకిడికి నీరు వేడెక్కి ఆవిరైనప్పుడు అదికాస్తా.. ప్రత్యేక లక్షణాలున్న కవచం గుండా బయటకు వెళ్లిపోతూంటుంది. అదే సమయంలో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను లోపలికి పీల్చుకునేలా ఈ ప్రత్యేక పదార్థంపై సూక్ష్మస్థాయి రంధ్రాలు ఉంటాయి. కృత్రిమ ఆకుపైన పూసిన పూత కారణంగా కార్బన్డయాక్సైడ్ కాస్తా కార్బన్ మోనాక్సైడ్గా మారిపోతుంది. కొంత మోతాదులో ఆక్సిజన్ కూడా విడుదల అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల తయారీకి ముడిసరుకుగా పనిచేస్తుందన్నది తెలిసిందే. గాలినీ శుభ్రం చేస్తాయి.. మినీశ్ సింగ్ బృందం సిద్ధం చేసిన డిజైన్‌తో కొత్త తరం కృత్రిమ ఆకులను వాడటం వల్ల గాలి కూడా శుభ్రమవుతుంది. ఒక్కోటి 1.7 మీటర్ల పొడవు, 0.2 మీటర్ల వెడల్పు ఉండే కొత్త కృత్రిమ ఆకులను 500 చదరపు మీటర్ల వైశాల్యంలో అమర్చి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాల్లోని కార్బన్డయాక్సైడ్ 10 శాతం వరకూ తగ్గిందని రుజువైంది. భవనాల పైకప్పులు మొదలుకుని అన్ని ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆదిత్య ప్రజాపతి అంటున్నారు. దాదాపు 360 కృత్రిమ ఆకులతో ఉత్పత్తి అయ్యే కార్బన్‌మోనాక్సైడ్ 500 కిలోల వరకూ ఉంటుందని.. చౌకైన, అందుబాటులో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తుండటం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆదిత్య చెబుతున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను నిరపాయకరంగా తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సీవో2.. హాంఫట్!
ఇంట్లో రోజంతా కరెంటు ఉంటే గొప్ప కాకపోవచ్చు. కానీ... నెల తిరిగినా బిల్లు రాకపోతే అదీ గొప్ప! బాగానే ఉందిగానీ.. ఇదేమీ అయ్యే పని కాదు అనుకుంటున్నారా? సాధ్యం చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు... కృత్రిమంగా తయారు చేసిన ఆకుల శక్తిని పదింతలు పెంచేశారు! కృత్రిమ ఆకులేమిటి? వాటి సామర్థ్యం పెంచేయడం ఏమిటి? ఇవేనా మీ ప్రశ్నలు. ఒక్కసారి చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న ‘కిరణజన్య సంయోగక్రియ’ను నెమరేసుకుందాం. మొక్కల ఆకుల్లోని పత్రహరితం సూర్య కిరణాల సాయంతో శక్తిని తయారు చేసుకుంటుందని.. దీన్ని మొక్క పెరుగుదలకు వాడుకుంటుందని మనం చదివే ఉంటాం. ఈ క్రమంలో మనం వదిలేసే కార్బన్డయాక్సైడ్ (సీఓ2)ను పీల్చేసుకుని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అచ్చం ఇదే పద్ధతిలో పనిచేసే కొన్ని పరికరాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారుగానీ.. వాటి సామర్థ్యం తక్కువ.. ఖర్చు బోలెడంత ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మినీశ్ సింగ్, చేసిన తాజా పరిశోధనలు.. వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు) పదింతలు ఎక్కువ విద్యుత్‌ను లేదా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వినూత్నమైన డిజైన్‌ను సూచిస్తున్నారు. నమూనాలను కూడా రూపొందించి ఈ విషయాన్ని నిరూపించారు కూడా.. సమస్య ఏమిటి? శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ తయారు చేసిన కృత్రిమ ఆకులు ఒత్తిడితో కూడిన కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. ఇది వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యం. ఎందుకంటే.. గాల్లోంచి వాడుకోవాలంటే.. కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేయాలి.. ఒత్తిడికి గురి చేసి ట్యాంకుల్లో భద్రపరచాలి. ఆ తర్వాతగానీ ఇంధనం తయారు కాదన్నమాట. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. మినీశ్ సింగ్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కృత్రిమ ఆకులను నీటితో నిండిన ఓ పెట్టెలో పెట్టడం.. ప్రత్యేకమైన లక్షణాలున్న పదార్థాన్ని కృత్రిమ ఆకు చుట్టూ ఏర్పాటు చేయడం ఇందులో కీలకం. సూర్యరశ్మి తాకిడికి నీరు వేడెక్కి ఆవిరైనప్పుడు అదికాస్తా.. ప్రత్యేక లక్షణాలున్న కవచం గుండా బయటకు వెళ్లిపోతూంటుంది. అదే సమయంలో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను లోపలికి పీల్చుకునేలా ఈ ప్రత్యేక పదార్థంపై సూక్ష్మస్థాయి రంధ్రాలు ఉంటాయి. కృత్రిమ ఆకుపైన పూసిన పూత కారణంగా కార్బన్డయాక్సైడ్ కాస్తా కార్బన్ మోనాక్సైడ్గా మారిపోతుంది. కొంత మోతాదులో ఆక్సిజన్ కూడా విడుదల అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల తయారీకి ముడిసరుకుగా పనిచేస్తుందన్నది తెలిసిందే. గాలినీ శుభ్రం చేస్తాయి.. మినీశ్ సింగ్ బృందం సిద్ధం చేసిన డిజైన్‌తో కొత్త తరం కృత్రిమ ఆకులను వాడటం వల్ల గాలి కూడా శుభ్రమవుతుంది. ఒక్కోటి 1.7 మీటర్ల పొడవు, 0.2 మీటర్ల వెడల్పు ఉండే కొత్త కృత్రిమ ఆకులను 500 చదరపు మీటర్ల వైశాల్యంలో అమర్చి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాల్లోని కార్బన్డయాక్సైడ్ 10 శాతం వరకూ తగ్గిందని రుజువైంది. భవనాల పైకప్పులు మొదలుకొని అన్ని ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆదిత్య ప్రజాపతి అంటున్నారు. దాదాపు 360 కృత్రిమ ఆకులతో ఉత్పత్తి అయ్యే కార్బన్‌మోనాక్సైడ్ 500 కిలోల వరకూ ఉంటుందని.. చౌకైన, అందుబాటులో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తుండటం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆదిత్య చెబుతున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను నిరపాయకరంగా తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పాపం.. మనోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగం చేస్తున్న భారతీయులు సెలవులుపెట్టి పండుగలకు పబ్బాలకు ఊర్లకు వెళ్లడం, కాశి, కన్యాకుమారి యాత్రలకు వెళ్లడం, ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఊటి, కొడై కెనాల్‌కు పయనం అవడం మనకు తెల్సిందే. అయితే ప్రపంచంలో అతి తక్కువగా సెలవులు వాడుకునేది భారతీయ ఉద్యోగులేనట. ఈ విషయాన్ని 19 దేశాల్లో సర్వేచేసి అమెరికాలోని పర్యాటక సంస్థ ‘ఎక్స్పీడియా’ తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఉద్యోగులు 75 శాతం మంది సెలవులపై వెళ్లలేదట. అదే స్పెయిన్‌లో 48 శాతం మంది, బ్రిటన్‌లో 47 శాతం మంది సెలవులపై వెళ్లలేదు. ఈ 75 శాతం మందిలో ఆరెనెలల నుంచి ఏడాది వరకు, ఏడాదికిపైగా ఒక్క రోజు కూడా సెలవులు పెట్టని వారు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక రోజు నుంచి పది రోజుల వరకు సెలవు తీసుకున్న భారత ఉద్యోగులు 41 శాతం కాగా, అదే స్పెయిన్‌లో ఇరవై ఒక్క రోజు నుంచి 30 రోజుల వరకు సెలవులు తీసుకున్న వారి సంఖ్య 64 శాతం. సర్వేలో పాల్గొన్న భారత ఉద్యోగుల్లో ఏడాదికిపైగా సెలవు తీసుకోని వారు 17 శాతంకాగా, ఆరు నెలల నుంచి ఏడాది వరకు సెలవు తీసుకోని వారి సంఖ్య 36 శాతం, మూడు నుంచి ఆరు నెలల వరకు సెలవు తీసుకోని వారు 27 శాతం, నెల నుంచి మూడు నెలల వరకు సెలవులు తీసుకోని వారి సంఖ్య 17 శాతం, తరచుగా సెలవులు తీసుకునే వారి సంఖ్య ఆరు శాతమని అధ్యయనంలో తేలింది. సెలవులు తీసుకోక పోవడానికి కారణాలు 1. మున్ముందు అత్యవసరం రావచ్చనే ఉద్దేశంతో సెలవులు తీసుకోని ఉద్యోగుల సంఖ్య 46 శాతం. 2. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల సెలవులు తీసుకోని వారి సంఖ్య 35 శాతం. 3. నాకు, నా జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు ఒకేసారి సెలవులు ప్లాన్ చేసుకోవడం కుదరకపోవడం వల్ల సెలవులకు దూరం అవుతున్న వారి సంఖ్య 33 శాతం. 4. వ్యక్తిగత షెడ్యూల్ సెలవులకు అనుమతించకపోవడం అంటున్న వారి సంఖ్య 31 శాతం. 5. డబ్బు కోసం సెలవులను అమ్ముకోవడం వల్ల వెళ్లలేకపోతున్న వారి సంఖ్య 31 శాతం. 6. నేను లేకుండా ఆఫీసులో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న కారణంతో 25 శాతం 7. డబ్బులేక, సెలవులకు ఖర్చుపెట్టే స్థోమత లేక 24 శాతం. 8. కెరీర్లో పైకి రావాలంటే వృత్తికి అతుక్కుపోయి పనిచేయాలనుకోవడం వల్ల సెలవులకు దూరం అంటున్న వారి సంఖ్య 18. 9. సెలవులపై వెళ్లేందుకు సమయమే దొరకదు అంటున్న వారి సంఖ్య పది శాతం. 10. సెలవులను వాడుకుంటామంటున్న వారు ఆరు శాతం. సెలవులపై వెళ్లాలనుకుని బాస్‌లు సెలవులు ఇవ్వకపోవడం వెల్లని వారి సంఖ్య కూడా భారతీయుల్లో ఎక్కువగానే ఉంటుంది. వారి గురించి తెలియలేదంటా సర్వేలో పాల్గొన్న వారిని ఈ ప్రశ్న అడిగి ఉండకపోవచ్చు. సెలవుపై వెళ్లి కూడా ఆఫీసు పనులు చూసుకునే వారి సంఖ్య 32 శాతమని తేలింది. మొత్తం 19 దేశాల్లో సర్వే చేశామని చెప్పిన అమెరికా పర్యాటక ఏజెన్సీ ‘ఎక్స్పీడియా’ భారత్, స్పెయిన్, బ్రిటన్ దేశాల పేర్లను మినహా మిగతా 13 దేశాల పేర్లను వెల్లడించలేదు. ఇక్కడ అవసరం లేదని అనుకోవచ్చేమో! -
సమ్మె ‘సెలవు’పై నీలిమేఘాలు!
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవులుగా పరిగణిస్తామన్న ప్రభుత్వ హామీ నేటికీ నెరవేరకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. దాదాపు 27 రోజులు సమ్మెలో పాల్గొన్న తమను తెలంగాణ రాష్ట్రం వచ్చాక విస్మరించడం సరికాదని వాపోతున్నారు. సమ్మె ముగిసి ఏడేళ్లు గడుస్తున్నా.. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన శాఖలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తింపజేసిన ప్రభుత్వం తమకు సవతి ప్రేమ చూపుతోందని ఆరోపిస్తున్నారు. నేపథ్యం ఇదీ! తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. 27 రోజులు (19–09–2011 నుంచి 15–10–2011 వరకు) సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె అనంతరం కార్మికులు ఆర్జిత సెలవులను వేతనంగా మలుచుకున్నారు. తెలంగాణ వచ్చాక.. ప్రభుత్వం సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికీ సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవులుగా పరిగణిస్తూ జీఓ01–2016ను జారీ చేసింది. దీని ప్రకారం ఇతర విభాగాల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్ పరిగణించారు. కానీ ఆర్టీసీలో అమలు కాలేదు. దీంతో వీరికి రావాల్సిన ఆర్జిత సెలవులు జత కాలేదు. మంత్రులు అంగీకరించినా.. గత జూన్‌లో మధ్యంతర భృతి కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగిన చర్చల్లోనూ స్పెషల్ క్యాజువల్ లీవ్ విషయం ప్రస్తావనకు వచ్చింది. చర్చల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి, కేటీఆర్ తదితరులు స్పెషల్ క్యాజువల్ లీవులను ఇచ్చేందుకు, సమ్మెలో పాల్గొన్న కాలానికి వేతనం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ మేరకు దాదాపు రూ.80 కోట్లు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ కూడా సుముఖత తెలిపారు. కానీ ఆ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోంది. సీఎం ఆదేశాలను అమలు చేయాలంటూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సునీల్ శర్మ సర్క్యులర్ జారీ చేసినా ఉపయోగం లేకుండాపో యిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి ఈఎల్స్ ఎన్‌క్యాష్‌మెంట్ ఓ వైపు సకల జనుల సమ్మె సమయంలో రావాల్సిన స్పెషల్ క్యాజువల్ లీవుల అమలు జరగలేదు. మరోవైపు సంస్థలో 2013లో ఉద్యోగులు వాడుకోకుండా మిగిలిపోయిన ఆర్జిత సెలవులను నగదు రూపంలోకి మార్చుకునే వీలు కల్పిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. 2014 సంవత్సరం లీవుల చెల్లింపులు సెప్టెంబర్‌లో ఉంటాయని సమాచారం. ఇందులోనూ రిటైర్డ్ కార్మికుల ప్రస్తావన ఉండదన్న ప్రచారం విశ్రాంత ఉద్యోగులను కలవరపెడుతోంది. రిటైర్డ్ కార్మికుల ఊసే లేదు సకల జనుల సమ్మె తర్వాత ఆర్టీసీలో దాదాపు 7,000 మందికిపైగా కార్మికులు రిటైర్ అయ్యారు. సమ్మె కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్జిత సెలవుల విషయంలో వీరికి ఎలాంటి చెల్లింపులు ఉండవన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రిటైరయ్యారన్న కారణంతో స్పెషల్ క్యాజువల్ లీవులను వర్తించే విషయంలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రచారం కూడా మొదలైంది. ఉద్యమంలో పాల్గొన్న తమకు రిటైరయ్యామన్న కారణంతో చెల్లింపులు చేయకపోవడం తగదని వారు వాపోతున్నారు. ఇది నిధుల దారి మళ్లింపే.. ఇది ముమ్మాటికీ నిధుల దారి మళ్లింపే. సకల జనుల సమ్మె సమయంలో ఇచ్చిన స్పెషల్ క్యాజువల్ లీవుల విషయం, వేతన హామీలు అమలు చేయకుండా 2013 ఆర్జిత సెలవులను నగదుగా ఎలా మారుస్తారు. స్పెషల్ క్యాజువల్ లీవుల విషయాన్ని కార్మికులు మర్చిపోయేందుకే ఈ విషయాన్ని సంస్థ తెరపైకి తీసుకువస్తోంది. కార్మికులకు రూ.80 కోట్లు చెల్లిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకాకపోవడం శోచనీయం. ఇది అధికార టీఎంయూ వైఫల్యమే. – అశోక్, ఎన్ఎంయూ ఉప ప్రధాన కార్యదర్శి ,– హన్మంత్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వారిది అసత్య ప్రచారం సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్లు వస్తాయి. అందులో సందేహం లేదు. ఈ విషయంలో ఇతర యూనియన్లు కార్మికులను తప్పదోవ పట్టిస్తున్నాయి. ఇటీవల సీఎం విడుదల చేసిన రూ.80 కోట్ల విషయంలో స్పష్టత లోపించడంతో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన మాట వాస్తవమే. వీటిని ఇలాగే వదిలేస్తే.. నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముంది. అందుకే ఆ నిధులతోనే 2013 ఆర్జిత సెలవులను నగదుగా మార్చే వీలు కల్పించేలా కృషి చేశాం. త్వరలోనే సకల జనుల సమ్మెకు సంబంధించిన స్పెషల్ క్యాజువల్ లీవుల సమస్య కూడా సమసి పోతుంది. రిటైర్డ్ కార్మికుల సమస్య తీరేలా కృషి చేస్తాం. – అశ్వత్థామరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు,థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ అన్నీ వస్తాయి ప్రస్తుతం జరుగుతున్న చెల్లింపులపై కార్మికులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అందరికీ అన్ని చెల్లింపులు అందుతాయి. సంస్థ ఎవరినీ విస్మరించరాదన్న విషయాన్ని గమనించాలి. స్పెషల్ క్యాజువల్ లీవుల విషయం త్వరలోనే పరిష్కరిస్తాం. రిటైర్డ్ కార్మికులకూ అన్యాయం చేయం. – సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్ -
సెలవుల వెనుక మతలబు!
42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా మే నెలలోనే జ్ఞానధార కార్యక్రమం నిర్వహించింది విద్యాశాఖ. ఇప్పుడు అదే విద్యాశాఖ 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమానికి పిల్లల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోన్న సమయంలో ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచకపోవడం వెనుక వాటికి పరోక్షంగా మేలు చేసే ఉద్దేశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు సిటీ : వేసవి సెలవులు ముగిసి వారం క్రితమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల మొదటి వారంలో మూడు రోజులు మినహా పెద్దగా వాతావరణంలో మార్పులు కూడా కనిపించలేదు. అయినా, విద్యాశాఖ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని మూడు రోజులు (19, 20, 21 తేదీలు) సెలవులు ప్రకటించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పుతో రాష్ట్రంలోని సముద్ర తీరానికి సమీప ప్రాంతాల్లో పగలు వేడి తీవ్రత ఉంది. అయితే, ఈ వేడి ప్రమాదకరమని వాతావరణ శాఖ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయినా, స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. గత 20 రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో ఒక్క రోజు కూడా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, మరి ఎందుకు సెలవులు ఇచ్చారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రైవేట్‌కు మేలు చేసేందుకేనా? ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో కావడం లేదు. పరోక్షంగా వారికి మేలు చేయడం కోసమే సర్కారు స్కూళ్లకు ఆకస్మిక సెలవులు ఇచ్చారని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .సెలవులు ప్రకటిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పొందుపరచక పోవడం అందులో భాగమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరిగేలా ప్రోత్సహించాల్సిన విద్యాశాఖే అసంబద్ధ నిర్ణయాలతో అందుకు విరుద్ధంగా వ్యవహస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థులు మండిపడుతున్నారు. సెలవుల అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్ర విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు అన్ని చోట్ల అలాగే ఉండవు. స్థానికంగా ఉండే పరిస్థితులకు తగ్గట్లు సెలవులు ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వాలి. స్కూళ్ల పునఃప్రారంభమైన వారం రోజులకు సెలవులు ఇవ్వడం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు ఆటంకంగా మారుతోంది. – వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
సెలవు దినాల్లోనూ పని.. కారణమేంటంటే?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంత తక్కువ పని గంటలుండి, అంత ఎక్కువ జీతమిస్తే ఆనందపడే వారు ఎందరుంటారోగానీ తక్కువ పని గంటలుండి ఎక్కువ సెలవులుంటే ఆనంద పడేవారు ఎక్కువే ఉంటారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలలో 15, 18 గంటలు పని చేయించుకునేవారు. శారీరకంగా, మానసికంగా అన్ని గంటలు పనిచేయడం కష్టమవడంతో అమెరికాలో మేడే ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా కార్మికులకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. రాను, రాను సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందడంతో కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గుతూ సెలవు దినాలు పెరుగుతూ వచ్చాయి. కార్మికులు లేదా ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని భావించిన ఐటీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు క్రీడల లాంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వచ్చాయి. రానురాను సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడం వల్ల 2030 సంవత్సరానికి పని గంటలు వారానికి 15 గంటలకు చేరుకుంటుందని జాన్ మేనర్డ్ కీనెస్ వంటి ఆర్థిక వేత్తలు ఆశించారు. ఉద్యోగల నుంచి అధిక దిగుబడిని రాబట్టేందుకు పెట్టుబడుదారులు వారి పని గంటలను తగ్గించి, సెలవుదినాలను పెంచుతారని వారు అంచనా వేశారు. ఎందుకంటే తక్కువ పని వల్ల ఉద్యోగులు ఎక్కువ ఆరోగ్యంతో ఉంటారని వారు భావించారు. ఎక్కువ పని గంటల వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువై కార్మికులు అస్వస్థులవడం చూసి వారు అలా భావించారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలవడం నిజమేగానీ తక్కువ పని గంటల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. ఆరోగ్యంపై ఇతర సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువ పని గంటల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువేనని కూడా అధ్యయనాల్లో తేలింది. ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు కార్మికుల నుంచి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా కార్మికులు సెలవుల్లో కూడా పనిచేయడం, అస్వస్థతతో ఉండి కూడా పనిచేయడం ఎక్కువైంది. ఈ అస్వస్థతతో పనిచేసే వారి సంఖ్య 2010 సంవత్సరంలో 26 శాతం ఉండగా, ఇప్పుడు 86 శాతం ఉందని ‘చార్టెట్ ఇనిస్టిట్యూడ్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్’ అనే సంస్థ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా సెలవు దినాల్లో పనిచేసేందకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, అందుకు పనిపట్ల ఉన్న అంకిత భావం కాదని, సెలవుల్లో కూడా పనిచేస్తున్నారనే గుర్తింపు కోసమని ఈ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ మనస్థత్వం ఎక్కువగా మధ్యతరగతి ఉద్యోగుల్లోనే ఉందని తెలిపింది. పని పట్ల అంకిత భావం ఉన్నట్లు కనపడకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో కూడా ఎక్కువ మంది సెలవుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు విధులకు హాజరవుతున్నారని తెల్సింది. ఏదేమైనా ఈ పద్ధతి మారక పోతే ఎక్కువ గంటల పని వల్ల అనారోగ్యానికి గురై, మత్యువాత పడక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. -
ప్రైవేట్ ఉద్యోగులూ ...మీ సెలవులు ఇలా
కడప : ఎవరికైనా ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితం ముఖ్యమే. వ్యక్తిగత కుటుంబ అవసరాలకు కూడా ఉద్యోగి తగినంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకోసమే ఉద్యోగులకు సెలవుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఫాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ సంస్థల్లో కొన్ని రకాల సెలవులను అమలు చేయాల్సి ఉంటుంది. కనీసం ఏడాదిలో ఏడు రోజులను జాతీయ దినాలు, పర్వదినాలు కింద సెలవులు ఇవ్వాలని చట్టం చెబుతోంది. వాటిలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి తప్పని సరిగా సెలవులు ఇవ్వాలి. జాతీయ దినాలు జనవరి26, ఆగష్ట్ 15, అక్టోబర్ 2 వారాంతపు సెలవులు: వారంలో ఏడు రోజులకు గాను ఒకటి లేదా రెండు రోజులు సెలవుగా ఇస్తుంటారు. కంపెనీ పాలసీని బట్టి ఒకటా, రెండా అన్నది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం ఒక్క రోజే సెలవుగా ఉంటుంది. పండుగ దినాలు: వివిధ మతాలకు సంబంధించి ముఖ్యమైన పండగ రోజులోనూ సెలవులు ఉంటాయి. ఎర్న్డ్ లీవ్స్–ప్రివిలేజ్ లీవ్స్: ప్రతి ఉద్యోగికి ఏడాదిలో ఇన్ని రోజులు అంటూ ఈఎల్స్ అంటూ ఉంటాయి. గడిచిన ఏడాదిలో ఎన్ని పని దినాలు ఉద్యోగి పని చేశాడన్న దానిపై ఆధారపడి ఈ సెలవులు ఉంటాయి. ఈఎల్స్‌ను వాడుకోనట్టయితే దాని కింద అదనపు వేతనాన్ని పొందవచ్చు. ఈ సెలవులు వాడుకుంటే ఆ రోజుల్లో వేతనాన్ని ( మూలవేతనం ప్రకారం ) యథావిధిగా పొందవచ్చు. అయితే సెలవు తీసుకోవాలా, లేక పని చేసి వేతనాన్ని పొందాలా అన్నది కంపెనీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. క్యాజువల్ లీవ్: ఏడాదిలో 12 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో ఇన్ని రోజుల పాటు క్యాజువల్ లీవ్ అని ఇస్తుంటారు. గరిష్టంగా మూడు రోజుల వరకు ఉంటుంది. కొన్ని సంస్థల్లో నెలకు ఒక్కటే క్యాజువల్ లీవ్ ఆప్లయి అవుతుంది. సిక్‌లీవ్ , మెడికల్ లీవ్: కార్యాలయానికి రాలేని అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో వాడుకునేందుకు నెలకు ఒక్క రోజైనా సిక్ లీవ్ ఉంటుంది. ఒక్క నెలలో వాడుకోకపోతే అవసరం వచ్చినప్పుడు ఒకటికి మించి వాడుకోవచ్చు, ఈ లీవ్ కింద ఎన్ని రోజులు సెలవులు ఇవ్వాలన్న విషయాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు నిర్దేశిస్తున్నాయి. కాంపెన్సేటరీ ఆఫ్ (సీఆఫ్): సెలవు రోజుల్లో కూడా వచ్చి పని చేసినట్టయితే అందుకుగాను వేతనం చెల్లిస్తారు. లేదా ఒక రోజు సెలవు ఇస్తారు. ఈ సెలవునే ఆఫ్ లీవ్ అంటారు. మెటర్నిటీ లీవ్: మహిళా ఉద్యోగుల సంతాన అవసరం కోసం (గర్బధారణ నుంచి డెలివరీ వరకు లేదా మరికొంత కాలం మెటర్నిటీ లీవ్ ఇస్తారు. కాకపోతే తక్కువ రోజుల పాటు ఉంటుంది. 1988 ఏపీ యాక్ట్ ప్రకారం కనీస డెలివరీకి ముందు ఆరువారాలు డెలివరీ తర్వాత ఆరువారాలు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. పేటర్నిటీ లీవ్: పైన చెప్పుకున్న తరహాలో ఉద్యోగి భార్య డెలివరీ అయిన సందర్భంలో వారి అవసరాలు చూసుకునేందుకు వీలుగా కొన్ని రోజుల పాటు ఉద్యోగులకు ఈ సెలవులు ఇస్తుంటారు. క్యారంటైన్ లీవ్: ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధికి లోనైన ఉద్యోగి వల్ల ఆ వ్యాధి కంపెనీలో ఇతర ఉద్యోగులకు కూడా వచ్చే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో సదరు ఉద్యోగికి ఈ సెలవు ఇస్తారు. స్టడీ లీవ్: ఉద్యోగి ఉన్నత చదువులు , వృత్తిపరమైన నాలెడ్జ్ పెంచుకునేందుకు గాను ఈ సెలవు ఇస్తారు. ఈ సెలవులో వేతనం ఉండదు. అంటే ఉద్యోగం విడిచి పెట్టకుండా కొంతకాలం పాటు సెలవు తీసుకొని చదవుకోవచ్చు. ఇవే కాకుండా వివిధ రంగాలు కంపెనీలను బట్టి చైల్డ్‌కేర్ లీవ్, హాస్పిటల్ లీవ్, స్పెషల్ డిజెబిలిటీ లీవ్, లాస్‌ఆఫ్ పే (వేతనం లేకుండా తీసుకునే సెలవు) ఇలా భిన్న రకాలు సెలవులు కూడా ఉన్నాయి. -
సెలవులో అమ్రపాలి
వరంగల్ రూరల్: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కావడంతో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి కాటాకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈనెల 21 వరకు సెలవులో ఉండడంతో ఇన్చార్జీ కలెక్టర్‌గా మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనాకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 18 నుంచి జనవరి 5 వరకు జేసీ హరిత సెలవు పెట్టారు. కలెక్టర్ పాటిల్ బదిలీ కావడంతో సెలవులు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం జేసీని ఆదేశించింది. ఆమె సెలవులను రద్దు చేసుకుని హైదారాబాద్‌లో భూరికార్డుల ప్రక్షాళన వీడియో కాన్ఫరె న్స్‌కు సోమవారం హాజరయ్యారు. -
బతుకునిచ్చినవాడు భారమయ్యాడు
ఉపయోగం లేదని భావించి తండ్రిని వదిలించుకున్న తనయులు మురుగుగుంట వద్ద వదలివెళ్లిన వైనం అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న సోదరుడు తాళ్లరేవు (ముమ్మిడివరం) : కన్నతండ్రి బిడ్డలకు బరువయ్యాడు. తండ్రి వల్ల పైసా ఉపయోగం లేదనుకున్న ఆ కుమారులు ఆయనను రోడ్డున పడేసారు. ప్రమాదంలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధ తండ్రిని ఏ మాత్రం కనికరంలేకుండా ఒక మురికిగుంట వద్ద పడవేసిన ఘటన స్థానికులను కలిచివేస్తుంది. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామానికి చెందిన కొల్లాటి తాతారావు చేపల వేట ఆధారంగా జీవించేవాడు. అతనికి భార్య ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లై వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో చాలా ఏళ్ల క్రితమే అతని భార్య ధవళేశ్వరంలోని కుమారుడి వద్దకు వెళ్లిపోయింది. గ్రామంలో ఒంటరిగా ఉండలేక కాకినాడలో ఉంటున్న మరో కుమారుడి వద్దకు గతంలో వెళ్లిపోయినట్లు తాతారావు చెపుతున్నాడు. ఇలా ఉండగా ఇటీవల డ్రెయినేజీలో పడిపోవడంతో కాలు విరిగిపోయింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ కాలు పనిచేయకపోవడంతో లేవలేని స్థితిలో ఉన్న అతన్ని నీలపల్లి తీసుకువచ్చి వదిలి వెళ్లారు. తాతారావుకు చెందిన స్థలంలో ఉన్న మురికిగుంట పక్కనే కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి అక్కడ వదిలి చేతులు దులుపుకొన్నారు. తాతారావు సోదరుడు నూకరాజు అక్కడే నివసిస్తుండడంతో సమయానికి తిండి పెడుతుండడంతో ఎలాగోలా జీవితం సాగిస్తున్నాడు. గతంలో దర్జాగా బ్రతికిన తాతారావు ప్రస్తుత పరిస్థితి చూసి స్థానికులు చలించిపోతున్నారు. స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకురాలు రేవు మల్లేశ్వరి, వైఎస్సార్సీపీ నీలపల్లి గ్రామ కమిటీ కన్వీనర్ కట్టా దుర్గారావులు అతన్ని పరామర్శించి వివరాలు తెలుసుకుని ఆర్థిక సాయం అందజేశారు. పురుగులమందు తాగి చచ్చిపోవాలని ఉంది.. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలూ పట్టించుకోకపోవడంతో ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉందని తాతారావు విలపిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుందామన్నా కాలు సహకరించడంలేదని, తనకుగల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అన్నీ అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలి అవసాన దశలో కష్టాలు పడుతున్న తాతారావును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ రేవు మల్లేశ్వరి డిమాండ్ చేశారు. ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న అతనికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. అతని పరిస్థితి చూసి చలించిన ఒక దాత షెడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. -
అమానుషమా.. పేదరికమా..?
-
బ్యాంకులకు సెలవులు.. జనాలు ఎటుపోతారో?
-
బ్యాంకులకు వరుస సెలవులు.. జనాలు ఎటుపోతారో?
టిక్..టిక్..టిక్మంటూ గడియారం చప్పుళ్లు రాజకీయ నేతలకు, సంపన్నులకు, బడాబాబులకు వినిపించడంలేదేమోగానీ సామాన్యుడికి, మధ్యతరగతి పౌరుడికి మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని వీరి బతుకులు బ్యాంకుల పాలయ్యాయి. బ్యాంకులు తెరిచే రేపటికోసం ఈ రాత్రి నుంచే గడియలు లెక్కబెట్టుకుంటున్నవారైతే కోకొల్లలు.. రేపు ఎలాగైనా ముందు వెళ్లి డబ్బు చేజిక్కించుకోవాలని అలారం పెట్టుకొని మరి మేల్కొంటున్న పరిస్థితి. పథకం ఫలితం ఎవరికి దక్కేనో? ఎప్పుడు దక్కేనోగానీ, బ్యాంకుల వద్ద పడిగాపులుగాయడం మాత్రం గత నెలరోజులుగా నిత్యకృత్యంగా మారింది. ఆ బ్యాంకు వరుసల్లోనే కూలిపోతున్నవారు కొందరైతే.. అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నవారు ఇంకొందరు. చిరాకుతో పరస్పరం నాకంటే నాకంటూ నాదంటే నాదంటూ ముష్టిఘాతాలకు దిగుతున్నవారు కూడా వీరిలో మినాహాయింపుకాదు. ఇది చాలదన్నట్లూ పోలీసుల లాఠీ దెబ్బలు అదనపు బహుమానం. దీంతో త్యాగాలు ప్రజలవి.. బోగాలు నాయకులవి అన్నచందాన పరిస్థితి మరోసారి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు మావైపే ఉన్నారంటూ ప్రధాని, ఇతర నాయకులు ఏకపక్షంగా అభిప్రాయాలు ప్రకటించడం కూడా బ్యాంకులముందు పడిగాపులుగాస్తున్న వారిని విస్మయ పరుస్తోంది. బ్యాంకుల ముందు నిల్చున్న సెక్యూరిటీలతోటి బ్యాంకు ఉద్యోగులు, మేనేజర్లతోటి జనాలు ఓ చిన్నపాటి యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఆశ్చర్యం కాదు. కనీసం ఆర్బీఐ విధించిన షరతుల ప్రకారమైనా ప్రజలకు బ్యాంకులు డబ్బు చెల్లిస్తున్నాయా అది కూడా లేదు. దీంతో చాలిచాలని డబ్బుతో కొన్ని అవసరాలు తీరి.. ఇంకొన్ని తీరక తీవ్ర పరిస్థితులతోనే జనాలు అల్లాడిపోతుంటే ఇప్పుడు గుదిబండలాగా.. బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులొచ్చాయి. రెండో శనివారం, ఆదివారం, సోమవారం ముస్లింల పర్వదినం మిలాద్-ఉన్-నబి సందర్భంగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఈ 72గంటలు ఎలా గడుస్తాయా అని ఆలోచనలో పడ్డారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఈ మూడురోజులు మారనుంది. పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8 తెల్లవారి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల ముందు ప్రజల అవస్థలు ఏమాత్రం మారని పరిస్థితి. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పోనీ ఏటీఎంలలో డబ్బు నింపుతున్నారా అంటే అది శూన్యం. బ్యాంకులు నడిచే రోజుల్లో మాత్రమే కొన్ని చోట్లల్లోనే చాలిచాలనంత డబ్బు పెడుతున్నారు. అది కూడా అలాపెట్టి పెట్టగానే అయిపోతోంది. సాఫ్ట్ వేర్ సమస్య అంటూ, డబ్బు అందడం లేదంటూ బ్యాంకులు వివరణ ఇస్తూ వస్తున్నాయి. ఈ తీరు ఇప్పటికే ప్రజానీకానికి తీవ్ర చిరాకులు తెప్పిస్తోంది. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా మొదలవుతున్నాయి. జనాలు రోడ్లెక్కి బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాంకులపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మూడు రోజుల సెలవులు రావడం, అది కూడా వీకెండ్‌కావడంతో మరోసారి జనాల పరిస్థితి అధ్వాన్నంగా కనిపించనుంది. సెలవులను దృష్టిలో పెట్టుకునైనా అందుబాటులో ఉన్న ఏటీఎంలలో డబ్బులు నింపేస్తే పూర్తి స్థాయిలో కాకున్నా కొంతమేరకైనా తమకు ఉపశమనం కలిగించినట్లవుతుందని ప్రజలు వాపోతున్నారు. -
సెలవుల నిర్ణయాధికారం హెచ్ఎంలకు ఇవ్వాలి
ఎస్టీయూ డిమాండ్ భానుగుడి (కాకినాడ) : పాఠశాలల్లో స్థానిక సెలవుల నిర్ణయాధికారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాలకే ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్టీయూ భవ¯ŒS ఆదివారం సమావేశమైన కార్యవర్గ సభ్యులు ఈ విషయమై తీర్మానం చేశారు. దీనిపై డీఈఓ స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటివరకు సెలవుల నిర్ణయాధికారం ఎంఈఓ లేదా డీవైఈఓల ప్రత్యేక అనుమతితో తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై ఉపా«ధ్యాయులకు సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఈ నిబంధనను మార్చాలని కోరింది. దీనిపై డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, ఆయన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్టీయూ జిల్లా అ««దl్యక్షుడు పి.సుబ్బరాజు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్, కార్యవర్గ సభ్యులు పి.రాంబాబు, ఎం.శివప్రసాద్, డి.వెంకటరావ్, పి.వి.వి.సత్యనారాయణరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీపై ధిక్కార స్వరం
–ఆందోళన బాటపట్టిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు –17న చలో ఢిల్లీ –అదే రోజున విధులకు మూకుమ్మడి సెలవులు తాడేపల్లిగూడెం: గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలు విషయంలో వాణి జ్య పన్నుల శాఖ ఉద్యోగులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ శాఖ ఉద్యోగులు తమ వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈనెల 17న చలో ఢిల్లీ పేరిట దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు, అదే రోజున జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించారు. ఉనికికే ప్రశ్నార్థకమంటున్న ఉద్యోగులు జీఎస్టీ అమలు విషయంలో తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్రాల స్వాతంత్య్రానికి భంగం కలిగించే విధంగా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల భవిష్యత్‌కు పాతరేసే విధంగా ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగం ఉద్యోగులు యూనిఫామ్ వేసుకుని విధులు నిర్వర్తిస్తారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సాధారణ దుస్తుల్లోనే విధులు నిర్వర్తిస్తారు. కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తే తామంతా యూనిఫామ్ డ్యూటీ చేసే ఉద్యోగుల కింద పని చేయాలా లేక తమకూ యూనిఫామ్ విధానం ప్రవేశ పెడతారా అనే మీమాంస ఉద్యోగుల్లో నెలకొంది. జీఎస్టీ చట్టంగా మారుతున్న తరుణంలో జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు వాణిజ్య పన్నుల శాఖ ఉనికి, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయనే చర్చ సాగుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతోపాటు సర్వీస్ ట్యాక్స్ వసూలు అంశం కేంద్రం చేతిలోకి వెళుతుందనే బెంగ వారిలో మొదలైంది. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ వసూళ్లతో పోల్చుకుంటే సర్వీస్ ట్యాక్స్ వసూళ్లను తక్కువ చూపించే ప్రమాదం ఉంటుందనేది ఉద్యోగుల వాదన. వసూళ్లు తగ్గాయనే కారణంతో వాణిజ్య పన్నుల శాఖను చిన్నచూపు చూసినా.. ఈ కారణంతో ఉద్యోగులను కుదించాలనే ఆలోచన చేసినా వారి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. జిల్లాలో ఉన్న 9 సీటీవో సర్కిల్స్ పరిధిలో ఉన్న డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ సహా 300 మంది ఉద్యోగులు ఈనెల 3వ తేదీ నుంచి భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ‘నిరసన తప్పదు’ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే సర్వీస్ ట్యాక్స్, రూ.కోటిన్నరకు పైగా ఉన్న టర్నోవర్ టాక్స్ చెల్లింపుదారుల నుంచి పన్నుల వసూలును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహిస్తారని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు దిగక తప్పలేదని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ అధ్యక్షుడు ఎస్.రవిశంకర్ చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల వల్ల సర్వీస్ ట్యాక్స్ విధానంతోపాటు రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల విధానంలోనూ మార్పులు వస్తాయని, ఈ కారణంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. టర్నోవర్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని వాణిజ్య పన్ను ల ఉద్యోగులకు పనిలేకుండా పోతుందన్నారు. మరోవైపు రాష్ట్రాలకు సర్వీస్ ట్యాక్స్ ఆదాయం దక్కకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత
రోమ్ లోని వాటికన్ సిటీలో అట్టహాసంగా జరగనున్న మదర్ థెరిస్సా 'సెయింట్ హోదా' బహుకరణ కార్యక్రమానికి భారత ప్రతినిధి బృందం తరలి వెళ్లింది. వీరితోపాటు దేశ రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు తరలి వెళుతున్నారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కేంద్రమత్రి సుష్మా స్వరాజ్, ఈ రోజు (శుక్రవారం) బయలు దేరారు. ఈ విషయాన్ని ఇద్దరు నేతలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మదర్ థెరిస్సా కాననైజేషన్ కార్యక్రమానికి రోమ్ కు బయలుదేరినట్టు ట్విట్ చేశారు. భారత ప్రతినిధి బృందంతో రోమ్ కు బయలుదేరినట్టు ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. అనాథల పాలిట ఆశాదీపంగా వెలుగొందిన మదర్ థెరిస్సా కాననైజేషన్ (మత గురువుల జాబితాలో చేర్చుకార్యక్రమానికి) మిషనరీస్ అఫ్ ఛారిటీ ఆహ్వానం మేరకు తాను పవిత్ర వాటికన్ సిటీ కి బయలు దేరినట్టు మమత ట్విట్ చేశారు. మానవత్వానికి మాత, దీనుల పాలిట అమ్మ...ఆపన్నులకు అభయహస్తాన్నందించి జీవితాంతం వారి సేవకే అంకితమైన మదర్ థెరిస్సా ప్రేమ అపరిమితమని తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. మదర్ బెంగాల్ లో నివసించడం తమకు గర్వకారణమని మమత పేర్కొన్నారు. వాటికన్ సిటీ పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 5 న రోమ్ తొలి మహిళా మేయర్ వర్జీనియా రాగి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ పాలుపంచుకుంటారు. అనతరం అక్కడినుంచి మ్యూనిచ్ కి బయలుదేరి వెళతారు. 12 మంది అధికారిక ప్రతినిధిబృందం, పారిశ్రామికవేత్తలతో కలిసిమమతా జర్మనీలో పర్యటించనున్నారు. పెట్టుబడిదారులతో సమావేశంకానున్నారు. అనంతరం సెప్టెంబర్ 10 న తిరిగి కోలకతా చేరుకుంటారు. కాగా మదర్ థెరిస్సాను ' సెయింట్'గా ధ్రువీకరిస్తున్నట్టు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మార్చి 15 న ప్రకటించారు. సెప్టెంబర్ 4న మదర్‌కు సెయింట్ హోదాను ఇవ్వనున్నారు. ఈ హోదాతో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరిస్తారు. At the invitation of Missionaries of Charity I am leaving for the holy Vatican City to participate in canonization ceremony of Mother Teresa — Mamata Banerjee (@MamataOfficial) September 2, 2016 Bengal is more proud as Mother lived and worked here and showered us with her abundant love and care — Mamata Banerjee (@MamataOfficial) September 2, 2016 Indian delegation leaving for Rome to attend the canonisation of Mother Teresa. pic.twitter.com/Z3eEz07PRQ — Sushma Swaraj (@SushmaSwaraj) September 2, 2016 -
ఆరునెలల లోపే ట్విట్టర్‌కు అధికారి గుడ్ బై
యాపిల్ పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి, మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్లో కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరిన నటాలీ కెరిస్ తన పదవికి గుడ్ బై చెప్పనున్నారు. కెరిస్ కంపెనీ నుంచి నిష్క్రమించబోతున్నట్టు ట్విట్టర్ ధృవీకరించింది. అయితే గత ఆరు నెలల క్రితమే కెరిస్ ఈ బాధ్యతలు చేపట్టారు. జాయిన్ అయిన ఆరునెలల లోపే తన పదవిని వీడటం ప్రస్తుతం గమనార్హంగా మారింది. ట్విట్టర్ స్టోరీని ప్రపంచానికి షేరు చేయడంలో తన వంతు కృషిచేసినందుకు నటాలీ కెరిస్కు ట్విట్టర్ అభినందనలు తెలిపింది. తన పదవీ కాలంలో కమ్యూనికేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించినట్టు పేర్కొంది. తక్కువ సమయంలోనే ఎంతో ఉత్సాహంతో పనిచేశారని, ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతమైన వ్యక్తిగా వెలుగొందాలని ఆశిస్తున్నట్టు శుభాకాంక్షలు తెలిపింది. 14ఏళ్లపాటు టెక్ దిగ్గజం యాపిల్‌లో పనిచేసిన నటాలీ కెరిస్ గత ఫిబ్రవరిలోనే ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఎంతో కీలకమైన సమయంలో యాపిల్‌కు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారని టెక్ వెబ్సైట్ 9టూ5 మ్యాక్ రిపోర్టు పేర్కొంది. నటాలీ కెరిస్ రాజీనామాతో ప్రస్తుత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విట్టర్ కమ్యూనికేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్విట్టర్ సీఈవోగా జాక్ దోర్సీ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటనుంచీ కంపెనీకి చెందిన పలువురు సీనియర్ అధికారులు గుడ్ బై చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిలిచిపోయిన యూజర్ వృద్దిని పెంచుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణలో ప్రస్తుతం ట్విట్టర్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఎలాగైనా రెవెన్యూలను పెంచుకోవాలని తాపత్రయ పడుతోంది. -
కిచెన్ టిప్స్
మామిడి ఊరగాయ చట్నీ ఎర్రగా కనిపించాలంటే పోపులో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, వేరుసెనగ నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. అరటిపండును ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తొక్క నల్లబడక పండు తాజాగా ఉంటుంది. వర్షాకాలం ఒకోసారి పెరుగు తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు ఆ పాలగిన్నెను ఫ్రిజ్ స్టెబిలైజర్పై ఉంచితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. వర్షాకాలంలో సోంపుగింజలు, గసగసాలు, నువ్వులు వంటి వాటిని వేయించి భద్రపరుచుకుంటే అవి త్వరగా పురుగుపట్టవు. -
చేత్తోనే ఎందుకు తినాలి?
పూర్వకాలంనుంచీ అవలంబిస్తున్న సంస్కృతీ, సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత ఉన్నట్లు అనేకసార్లు రుజువైంది. పాతకాలంవారు పాటించిన ప్రతి పద్ధతి వెనుకా సైన్స్ దాగున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భోజనం చేయడం విషయంలో ప్రస్తుతం అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులకు కేరళ వాసులు మాత్రం నేటికీ దూరంగానే ఉన్నారు. భోజనం చేసేందుకు స్పూన్లు, ఫోర్కులు వాడకుండా నియమంగా చేత్తో కలుపుకొని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ అలవాటు వెనుక అంతరార్థం ఆరోగ్యమేనంటున్నారు. ఆహార పదార్థాలను చేతులతో కలిపి తినడంవల్ల శరీరానికే కాక, మనస్సుకు, ఆత్మకు కూడ బలాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనానికి వాడే అరటి ఆకు అనుభవం వెనుక వేద జ్ఞానం కూడ ఇమిడి ఉందంటున్నారు. భారతీయ సంప్రదాయ భోజన విధానంలో చేత్తో కలుపుకొని తినడం వెనుక అనేక రకాల ఆరోగ్య రహస్యాలున్నట్లు కేరళలో కొలువైన రిసార్ట్ లోని ఛెఫ్ లు చెప్తున్నారు. కేరళ ఉత్తర కాసర్గోడ్ జిల్లాలోని 26 ఎకరాల్లో సుందరమైన, సద్గుణాలు కలిగిన పాకశాస్త్ర పరిజ్ఞానంతో కూడిన రిసార్ట్ ను తాజ్ బెకాల్ కు చెందిన వివంతా ఛెప్స్ అభివృద్ధి పరిచారు. ముఖ్యంగా కేరళ సంప్రదాయ వంటకాలతో కూడిన భోజనాన్ని, చేత్తో తినడం వల్ల కలిగే ప్రయోజనాలను, లాభాలను పాశ్చాత్యులకు సైతం వివరిస్తూ, తినే విధానాన్ని పద్ధతిగా నేర్పిస్తున్నారు. చేతులతో తినడం వెనుక వేదజ్ఞానం ఉందని నిరూపిస్తూ... వారు స్వాధీనం చేసుకొన్న ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లోని వివరాలను, కాగితంపై ముద్రించి అక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఆయుర్వేద గ్రంథాల్లోని వివరాల ప్రకారం మన చేతి, కాళ్ళ వేళ్ళు వాహక నాళానికి మూలాలుగా పని చేస్తాయని, ముఖ్యంగా బొటన వేలు వల్ల కలిగే అగ్న.. జీర్ణక్రియకు సహకరించే స్వభావం కలిగి ఉంటుందని చెప్తున్నారు. మిగిలిన నాలుగు వేళ్ళలో చూపుడు వేలు వాయువును, మధ్యవేలు ఆకాశాన్ని, ఉంగరంవేలు భూమిని, చిటికెన వేలు నీటికి మూలకాలుగా వ్యవహరిస్తాయని అందుకే చేతి వేళ్ళతో ఆహార పదార్థాలు కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని అక్కడి కాగితాల్లోని వివరాల ఆధారంగా వివరిస్తున్నారు. దీనికి తోడు ముఖ్యంగా శాకాహార సంప్రదాయ భోజనానికి వాడే అరటి ఆకులో కూడ ఎన్నో సద్గుణాలు ఉన్నాయని అక్కడి ఛెఫ్ లు చెప్తున్నారు. అంతేకాక భోజనాపికి వాడే ముడి బియ్యంలో కూడ కీళ్ళనొప్పులు, అల్సర్లతో పాటు అనేక రకాల నరాలకు సంబంధించిన రోగాలను నివారించే శక్తి ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి ప్రాశస్త్ర్యం కలిగిన సంప్రదాయ భోజనానాన్ని చేత్తో తినేందుకు ఇప్పుడు విదేశీయులు సైతం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. -
రైల్వే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన అల్ కాయిదా!
భారత రైల్వేలకు చెందిన ఓ వెబ్‌సైట్‌ను అల్ కాయిదా ఉగ్రవాదులు హ్యాక్ చేయడం సంచలనం రేపింది. సెంట్రల్ జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని భుసావల్ డివిజన్‌కు చెందిన వెబ్‌సైట్‌ను ఆల్ కాయిదా టెర్రరిస్టులు హ్యాక్ చేశారు. ఆ సైట్లో 11 పేజీలున్న ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారతీయ రైల్వేకు తొలిసారి ఇలాంటి పరిణామం ఎదురు కావడం ఆందోళన రేపింది. రైల్వేశాఖ వెబ్సైట్ హ్యాకింగ్ ద్వారా విద్రోహ చర్యలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రవాద నేత అసీమ్ ఉమర్ సందేశాన్ని అందులో పోస్ట్ చేశారు. భారత ముస్లింలు జిహాద్ పాఠాలు మర్చిపోతున్నారని... వారికి మళ్లీ పాఠాలు నేర్పి యుద్ధరంగానికి కదిలేలా చేస్తామని ఆ సందేశంలో హెచ్చరించారు. ప్రజలు 'జిహాద్' లో పాల్గొనేందుకు, అమెరికా దాని మిత్రపక్షాలను ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ రైల్వేలో 115 రైల్వే స్టేషన్లు ఉన్న భుసావల్ డివిజన్ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ రద్దీ ఎక్కువే. ఈ డివిజన్ పరిధిలో సుమారు 15 శాతం ముస్లిం జనాభా ఉంది. ఈ నేపథ్యంలోనే తమ భావజాల విస్తరణకు అల్ కాయిదా ఈ చర్యకు పూనుకుందని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసీమ్ ఉమర్ (సనౌల్ హక్) అల్ కాయిదా దక్షిణాసియా విభాగానికి చీఫ్. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత అల్ కాయిదాలో చేరిన ఉమర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. -
ఫేస్ బుక్ వదిలేస్తే కొండంత సంతోషం!
న్యూయార్క్: ఇప్పుడు సంతోషం ఎక్కడుందంటే సామాజిక మాధ్యమాల్లో అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఆటపాట, మాటాముచ్చట అన్నీ మర్చిపోయి అందుబాటులో మొబైల్‌తోనో, ఆఫీస్ లో ఉంటే కంప్యూటర్లతోనే వెంటనే ఫేస్ బుక్, ట్విట్టర్, చాటర్ బాక్సెస్ వంటి ఎన్నో సోషల్ వెబ్ సైట్లలోకి దూరేస్తుంటారు. ఇక ఫేస్ బుక్ మాత్రం దిన చర్యగా మారింది. అయితే, ఎంత దినచర్యగా మారినా అది వ్యసనంగా ఉన్నా, ఒక్కసారి ఫేస్ బుక్ ను వదిలేసి బయటకు వస్తే ఆ వచ్చిన వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నవారిని, అప్పటికే ఫేస్ బుక్ వదిలేసిన వారిని ప్రశ్నించగా.. వారి రియాక్షన్ అధ్యయనకారులను ఆశ్చర్యపరిచాయి. డెన్మార్క్ లో చేసిన ఈ అధ్యయనంలో మొత్తం 1095మందిని తీసుకొని రెండు గ్రూపులుగా చేసి వారిని ప్రశ్నించగా 88శాతంమంది తాము ఫేస్ బుక్ వదిసేశాకే సంతోషంగా ఉన్నామని చెప్పారు. 81శాతంమంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకపోయినా ఫేస్ బుక్‌ను ప్రతి రోజు తనిఖీ చేసుకుంటున్నామని తెలిపారు. మరికొందరు మాత్రం ఫేస్ బుక్‌లో గడపడం చాలా ఆహ్లాదంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నామనే భావన అస్సలు తెలియదని చాలా తక్కువ మాత్రమే బాధపడిన సందర్భాలున్నాయని చెప్పారు. ఎక్కువమంది మాత్రం ఫేస్ బుక్ వదిలేసిన తర్వాతనే కాస్త ఎక్కువ ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో అధ్యయనకారులు ఫేస్ బుక్ ప్రతినిధులను ప్రశ్నించగా వాస్తవానికి అందులో ఖాతా తెరిచినవారు తమకు ఏం కావాలో అనే విషయంపై స్పష్టత లేకుండానే గడిపి అనవసర ఒత్తిడికి లోనవుతుంటారని, ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలేవీ అందులో ఉండవని అన్నారు. -
కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది!
ముంబై: నటి కాజోల్‌ను కలవరపాటుకు గురిచేసిన ఫోన్ కాల్ గురించే ప్రస్తుతం ముంబై సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాజోల్కు ఫోన్ చేసింది ఎవరు? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముంబైలోని ప్రముఖ నాటకక్షేత్రంలో శనివారం తన సోదరి తనీషా ప్రధాన పాత్ర ధరించిన 'ద జురీ' అనే నాటకాన్ని తిలకించిన కాజోల్.. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ ను అలా రిసీవ్ చేసుకున్నారో లేదో.. 'క్షమించండి' అని విలేకరులతో అంటూ చకచకా వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె ఒకింత ఆందోళనకు గురయినట్లు కనిపించారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కారు దగ్గర డ్రైవర్ కనిపించకపోవడంతో కొద్దిగా అసహనానికి గురైన ఆమె.. 'త్వరగా రా' అంటూ మరాఠీలో డ్రైవర్‌కు ఫోన్ చేసింది. అతను రాగానే తాళాలు తీసుకుని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కాజోల్ చర్య.. ఆమె సోదరి తనీషా సహా అక్కడున్నవాళ్లందరినీ కలవరపెట్టింది. జూహీ చావ్లా, లారా దత్తా, మహేశ్ భూపతి, క్రికెటర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ తదితరులు ఆ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు. -
వీక్లీఆఫ్.. ఉఫ్..
గుంటూరు క్రైం : రాత్రనక, పగలనక అహర్నిశలు ప్రజా సేవలో నిమగ్నమై విధి నిర్వహణలో తలమునకలవుతున్న పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని గతంలో పనిచేసిన ఎస్పీలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీక్లీ ఆఫ్ అమలులోకి రావడంతో అప్పటివరకు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురైన సిబ్బందికి కొంతమేరకు ఊరట కలిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని కొద్దిరోజులు మాత్రమే అమలు పరిచారు. తర్వాత క్రమేపీ ఆ విధానానికి అధికారులు కొంద రు స్వస్తి పలికారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బం దికి రోస్టర్ విధానంలో వీక్లీ ఆఫ్‌ను కేటాయించారు. ఈ విధానం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. అమల్లోకి వచ్చిన కొద్ది నెలలకే సిబ్బంది కొరత, తదితర సమస్యల కారణంగా వీక్లీ ఆఫ్ విధానానికి అధికారులు స్వస్తి పలికారు. రూరల్ జిల్లా పరిధిలోని కొద్ది పోలీస్ స్టేషన్లలో మాత్రమే ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ కారణంగా మళ్లీ కొద్ది నెలల నుంచి సెలవులు లేక, అధికారుల ఆదేశాలను కాదనలేక కొట్టుమిట్టాడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుందని పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విధి నిర్వహణలో మానసిక ప్రశాంతతను కోల్పోవడంతో పాటు ,కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం తో ప్రాణాలను పణంగా పెట్టి విధు లు నిర్వహించాల్సి వస్తుంద ని, సిబ్బంది సమస్యలను గుర్తించి వీక్లీ ఆఫ్ విధానాన్ని పునరుద్ధరించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. -
అన్బిలీఫ్బుల్!
కళ రెండు సంవత్సరాల క్రితం మాంచెస్టర్‌లోని ఒక తోటలో భార్య ఎల్హమ్తో కలిసి విహారానికి వెళ్లాడు ఒమిద్ అసాది. ఉన్నట్టుండి గాలి వీచడం మొదలైంది. గాలికి ఆ తోటలో పెద్ద పెద్ద ఆకులు నేలరాలుతున్నాయి. వాటిని చూస్తే ఆసాదికి భలే ముచ్చటేసింది. వాటిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. పుస్తకాలలో దాచాడు. ఇక ఆ విషయం మరిచేపోయాడు. కొన్ని రోజుల తరువాత పేపర్‌తో తయారుచేసిన కళాకృతుల ప్రదర్శనకు వెళ్లినప్పుడు తాను దాచుకున్న పత్రాలు ఆసాదికి గుర్తుకువచ్చాయి. వాటిని కాన్వాస్‌గా చేసుకొని రకరకాల బొమ్మలు వేయాలనే ఆలోచన వచ్చింది. ఒక సూదితో రోజూ రెండు నుంచి మూడు గంటల వరకు ఈ పత్రాల మీద చిత్రాలను లిఖించడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికైతే కొన్నిరోజుల తరువాత అసాది ప్రయత్నం గాడిలో పడింది. జంతువులు, పక్షులు, మనుషులు... కోరు కున్న చిత్రమల్లా పత్రంపై ప్రత్యక్షమయ్యేది. ఈ పత్రాలపై చెట్టు జిగురు తప్ప రసాయనాలేవీ వాడేవారు కాదు. ‘‘పత్రాల మీద చిత్రాలను చెక్కుతున్నప్పుడల్లా నా బాల్యం గుర్తుకు వస్తుంది’’ అంటున్నాడు అసాది. ఇరాన్‌కు చెందిన అసాది భార్యతో కలిసి మాంచెస్టర్‌లో స్థిరపడ్డాడు. తాను అభిమానించే వ్యక్తుల పోట్రయిట్లను పత్రాల మీద చెక్కి వారికి కానుకగా ఇస్తుంటాడు. ‘‘ఎంత టైమ్ తీసుకున్నామనే దానికంటే ఎంత అందంగా వచ్చింది అనేది ముఖ్యం’’ అంటాడు అసాది. ఇటీవల మొదటిసారిగా తన కళాకృతులను ప్రదర్శనకు పెడితే అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘చెట్టు మీది నుంచి యాపిల్ పడితేనే కాదు... ఆకు పడినా కొత్త ఆలోచనలు వస్తాయి’’ అని తరచుగా అంటుంటాడు సరదాగా అసాది. పచ్చనాకు సాక్షిగా నిజమే కదా మరి! -
అమ్మఒడికి దూరమైంది...
-
ప్రేమ పేరుతో మోసపోయిన యవతి