
వరంగల్ రూరల్: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కావడంతో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి కాటాకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఈనెల 21 వరకు సెలవులో ఉండడంతో ఇన్‌చార్జీ కలెక్టర్‌గా మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనాకు బాధ్యతలు అప్పగించారు.
ఇదిలా ఉండగా.. ఈనెల 18 నుంచి
జనవరి 5 వరకు జేసీ హరిత సెలవు పెట్టారు. కలెక్టర్ పాటిల్ బదిలీ కావడంతో సెలవులు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం జేసీని ఆదేశించింది. ఆమె సెలవులను రద్దు చేసుకుని హైదారాబాద్‌లో భూరికార్డుల ప్రక్షాళన వీడియో కాన్ఫరె న్స్‌కు సోమవారం హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment