ఉద్యోగులకు మీషో భారీ ఆఫర్‌.. 9 రోజులపాటు సెలవులు | Meesho announces company wide reset and recharge break | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు మీషో భారీ ఆఫర్‌.. 9 రోజులపాటు సెలవులు

Published Thu, Oct 10 2024 9:44 PM | Last Updated on Fri, Oct 11 2024 8:57 AM

Meesho announces company wide reset and recharge break

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకుని మళ్లీ రీచార్జ్‌ కావడానికి ఈ సెలవు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాదీ ఇలాంటి ప్రయోజనం కల్పించినట్లు చెప్పింది.

‘‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్‌తో పని లేదు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్‌ కాల్స్‌ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్‌’’ అని మీషో వెల్లడించింది. ఈ ‘రెస్ట్‌ అండ్ రీఛార్జ్’ సెలవులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉండనుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసలతో కామెంట్లు కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement