Paid
-
ఉద్యోగులకు మీషో భారీ ఆఫర్.. 9 రోజులపాటు సెలవులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో తన ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఉద్యోగులకు విశ్రాంతి తీసుకుని మళ్లీ రీచార్జ్ కావడానికి ఈ సెలవు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాదీ ఇలాంటి ప్రయోజనం కల్పించినట్లు చెప్పింది.‘‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్‌తో పని లేదు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్’’ అని మీషో వెల్లడించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ సెలవులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉండనుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసలతో కామెంట్లు కురిపించారు. -
అత్యధిక వేతనాలు అందుకుంటున్న టాప్ టెక్ కంపెనీ సీఈవోలు వీరే.. (ఫొటోలు)
-
కసాయి కొడుకు..తండ్రి హత్యకు రూ. కోటి సుపారీ
సాక్షి, కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఓ కొడుకు కిరాయి హంతకులతో కలిసి తండ్రి హత్యకు ఏకంగా రూ.కోటి సుపారీ ఇచ్చాడు. ఈ ఘటనలో కుమారుడితో పాటు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 13న నారాయణస్వామి (70) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు విచారణ చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. నారాయణస్వామి కుమారుడు మణికంఠ తండ్రిని హత్య చేయాలని కిరాయి హంతకులకు రూ. కోటి ఒప్పందం చేసుకున్నాడు. నారాయణ స్వామిని కిరాయి మనుషులు మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో దారుణంగా నరికి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికంఠతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది. (చదవండి: కిడ్నీ అమ్ముతా.. కొంటారా?) -
యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు!
చాట్ జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు గుబులు పుట్టించేలా వినియోగించడానికి అందుబాటులోకి రాకుండానే కేవలం రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. యూజర్లు వినియోగిస్తే రెండేళ్లలో గూగుల్‌ను దాటేస్తుందని టెక్ నిపుణుల అంచనా. ఈ తరుణంలో చాట్ జీపీటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, భారీగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల్ని అర్జించేందుకు ట్విటర్ తరహాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. చాట్ జీపీటీ సంస్థ కాదు సాఫ్ట్వేర్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఓపెన్ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. ఈ సంస్థ కోఫౌండర్, సీఈవో సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ నిర్వహణ ఖర్చులు కంటి నీరు (eye-watering) తెప్పిస్తున్నాయి. యూజర్లు చేసే ఒక్కో చాట్‌కు కొన్ని సెంట్స్ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని భద్రంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్నాం. ఇది సరిపోదన్నట్లుగా మైక్రోసాఫ్ట్ మరో 10 బిలియన్ల పెట్టుబడులు పెట్టబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెరసీ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ట్విటర్ తరహాలో యూజర్లకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆల్ట్ మాన్ తెలిపారు. చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో చాట్‌జీపీటీ ప్రొఫెషనల్ పేరుతో పెయిడ్ వెర్షన్ సర్వీసుల్ని యూజర్లకు అందించనుంది. 'ప్రో' వెర్షన్‌తో చాట్‌జీపీటీ సేవల్ని యూజర్లకు అందిస్తే తద్వారా మాతృసంస్థ ఓపెన్ఏఐకి ఆదాయాన్ని అర్జించవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం పెయిడ్ వెర్షన్ ప్రారంభ దశలో ఉండగా..పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిన వెంటనే పెయిడ్ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందించనుంది. -
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం.. భారత్‌లో ఎప్పుడంటే?
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభమైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. ఈ సందర్భంగా ఓ ట్విటర్ యూజర్ భారత్‌లో ఈ పెయిడ్ వెర్షన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. మరో నెలలో ప్రారంభం కావొచ్చని అన్నారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూ చెక్‌మార్క్‌తో పాటు యాడ్స్ తక్కువ డిస్ప్లే చేయడంతో పాటు అదనపు ఫీచర్లను అందిస్తామని వెల్లడించారు. .@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue — Prabhu (@Cricprabhu) November 5, 2022 అంతేకాదు ట్విటర్లో వర్డ్స్ పరిధిని పెంచనున్నట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్లో సుదీర్ఘ సందేశాలు పోస్ట్ చేసేందుకు వీలులేదు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్‌లను సైతం పోస్ట్ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. చదవండి👉 ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు -
గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్‌గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ లో అమ్మకాలతో వినియోగదారులకు ఆకట్టుకోవడమే కాదు.. విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్మెంట్లో నైపుణ్యాన్ని పొందవచ్చు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సంక్షోభం మధ్య కీలకంగామారిన ఇకామర్స్ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి లాంచ్‌ప్యాడ్ రూపొందించామనీ, దీర్ఘకాలంలో మంచి అర్హత కలిగిన, బాగా శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన నిపుణులతో తమ సప్లయ్ చెయిన్ వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. (వివాదంలో ఫ్లిప్‌కార్ట్ : క్షమాపణలు) ఫ్లిప్‌కార్ట్ ఇందుకోసం 21 ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తోంది. వాటిలో తెలంగాణలోని మేడ్చల్, మహారాష్ట్రలోని భివాండి, హర్యానాలోని బినోలా, ఉలుబేరియా, డంకుని (పశ్చిమబెంగాల్), కర్నాటకలోని మలూర్ వంటి ప్రాంతాలున్నాయి. సప్లయి చెయిన్ మేనేజ్మెంట్ గురించి ఫ్లిప్‌కార్ట్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యా సేతు యాప్, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటి సంబంధిత కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తామని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు యువ విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. గత ఏడాది ప్రారంభించిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో 'ది బిగ్ బిలియన్ డేస్ 2019' సందర్భంగా దేశవ్యాప్తంగా 2 వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు శిక్షణ పొందారని గుర్తు చేశారు. -
మరో రూ. 8వేల కోట్లు కట్టిన టెల్కోలు
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలకు సంబంధించి టెలికం సంస్థలు మంగళవారం మరో రూ. 8,000 కోట్లు కేంద్రానికి చెల్లించాయి. వొడాఫోన్ ఐడియా రూ. 3,043 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 1,950 కోట్లు, రిలయన్స్ జియో రూ. 1,053 కోట్లు, టాటా టెలీసర్వీసెస్ రూ. 2,000 కోట్లు కట్టాయి. ఇప్పటికే పూర్తి సెటిల్మెంట్ కోసం రూ. 2,197 కోట్లు కట్టామన్న టాటా టెలీసర్వీసెస్.. ఒకవేళ లెక్కల్లో వ్యత్యాసాలేమైనా వచ్చినా సర్దుబాటు చేసేందుకు వీలుగా అదనపు మొత్తం కట్టినట్లు వెల్లడించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా(వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ మరోసారి టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో భేటీ అయ్యారు. అయితే, సమావేశం వివరాలు ఆయన వెల్లడించలేదు. అటు.. వీఐఎల్ ఎప్పట్లోగా బాకీల స్వీయ మదింపు పూర్తి చేస్తుందన్న ప్రశ్నకు స్పందించేందుకు టక్కర్ నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీ (ఎస్‌యూసీ) బాకీల కింద 15 టెలికం సంస్థలు.. సుమారు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. ఏజీఆర్ బాకీల విషయంలో టెల్కోల స్వీయ మదింపు, తమ లెక్కల్లో వ్యత్యాసాలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయా సంస్థలకు టెలికం శాఖ త్వరలోనే లేఖలు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
చంద్రబాబు పెయిడ్ ఉద్యమం
-
టీడీపీ శిబిరాల్లోె ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్ట్ లే
-
‘ఎఫ్ఎంసీజీ’కి ధర దడ!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలు సామాన్యులకే కాదు, ఎఫ్ఎంసీజీ కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేసేదే!. ముడి చమురు ధరలు ఒక్కటే కాదు, కరెన్సీ విలువ ఆటుపోట్లను కూడా గమనిస్తున్నామంటూ బడా ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ చెబుతూనే, దీన్ని ఒక రిస్క్‌గా అభివర్ణించడం గమనార్హం. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకు ముడి పదార్థాల్లో ముడి చమురు కీలకం. పామోలిన్ ఆయిల్ ధరలు అనుకూలంగానే ఉండగా, ముడి చమురు ధరలు మాత్రం గత ఏడాది కాలంలో 50 శాతం పెరిగి బ్యారల్ 72 డాలర్ల స్థాయికి చేరాయి. ముడి చమురు ధరలు పెరిగితే వాటి ఉప ఉత్పత్తులైన లైనియర్ ఆల్కిల్ బెంజేన్ (ఎల్ఏబీ), హై డెన్సిటీ పాలీ ఎథిలీన్ (హెచ్డీపీఈ) ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండూ ఎఫ్ఎంసీజీ కంపెనీలకు కీలకమైన ముడి పదార్థాలు. ముడి చమురు ధరలు పెరగడం కారణంగా తయారీ వ్యయం పెరుగుతుందని, దాంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలపై తమ ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన ఒత్తిడి ఏర్పడుతుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం పేర్కొన్నారు. ధరల పెంపు ద్వారా కంపెనీలు మార్జిన్లు పడిపోకుండా చూసుకోగలవు. సహేతుక స్థాయిలోనే... ఎల్ఏబీని డిటర్జెంట్ తయారీకి వినియోగిస్తారు. హెచ్డీపీఈని ఉపయోగించి ప్యాకింగ్ మెటీరియల్‌ను తయారు చేస్తారు. సబ్బుల నుంచి డిటర్జెంట్ వరకు, క్రీములు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ ఇలా అన్ని ఉత్పత్తుల ప్యాకింగ్‌కు దీన్నే వినియోగిస్తుంటారు. కంపెనీల ఉత్పత్తుల మొత్తం తయారీ వ్యయంలో ప్యాకింగ్ ఖర్చు 15–25 శాతం వరకు ఉంటుంది. హెచ్‌యూఎల్ ఇప్పటికే 2.5 శాతం వరకు ధరల పెంపును ఏప్రిల్, జూన్ క్వార్టర్లో అమలు చేసింది. ముఖ్యంగా డిటర్జెంట్ ధరలను పెంచింది. రానున్న త్రైమాసికాల్లో అన్ని విభాగాల్లో ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. ‘‘సహేతుక స్థాయిలోనే ధరలు పెంచాలన్నది మా విధానం. అన్ని ప్యాక్‌లపై ఒకే స్థాయిలో ధరల పెంపు ఉండ దు. మొత్తం మీద పరిస్థితులను పరిగణనలోకి తీసు కుని, ధరలు, విలువ మధ్య సమానతను దృష్టిలో ఉంచుకుని, రేట్ల పెంపు చేపడతాం’’ అని హెచ్‌యూఎల్ చైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. బడా కంపెనీలకు ఇదో అవకాశం ‘‘వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో డిమాండ్ కారణంగా అమ్మకాలపై ప్రభావం ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీంతో కంపెనీల చేతిలో ఇప్పుడు ధరలను నిర్ణయించే శక్తి ఉంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమస్యలు పెరుగుతాయి’’ అని షేర్‌ఖాన్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కౌస్తుభ్ పవస్కార్ తెలిపారు. ఎడెల్వీజ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్ల కారణంగా చిన్న స్థాయి కంపెనీల నుంచి మార్కెట్ వాటాను హస్తగతం చేసుకునేందుకు పెద్ద కంపెనీలకు అవకాశమని పేర్కొన్నారు. ‘‘కంపెనీలు ధరల్ని సహేతుకంగానే పెంచితే ఇదో అవకాశం. అవి మార్జిన్లను కాపాడుకోవడమే కాకుండా, కస్టమర్లు సైతం వాటికి దూరం కారు. అయితే, కచ్చితంగా ధరల పెంపు భారీగా ఉండకూడదు. కానీ, చిన్న సంస్థల విషయంలో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నం. ధరల్ని తక్కువగా ఉండేలా చూడటమే వాటి వ్యూహం. ఈ తరహా సమయాల్లో చిన్న సంస్థలు కార్యకలాపాలను తగ్గించుకుంటాయి. ఇది పెద్ద సంస్థలకు అనుకూలంగా మార్కెట్‌ను విడిచిపెట్టడమే’’ అని అబ్నీష్ రాయ్ అన్నారు. రేట్లు ఎంత మేర పెరగవచ్చు..! గోద్రెజ్ కన్సూమర్, డాబర్, మారికో, ఇమామి, బజాజ్ కార్ప్, జ్యోతి ల్యాబొరేటరీస్ సంస్థలు వచ్చే కొన్ని నెలల్లో ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఏషియన్ పెయింట్స్, ఇతర రంగుల తయారీ పరిశ్రమలు ధరల్ని ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రంగుల పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థాలు పెట్రోలియం నుంచి వచ్చేవే. -
హ్యాకింగ్ షాక్:హ్యాకర్లకు ఉబెర్ భారీ చెల్లింపులు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్ మరోసారి హ్యాకింగ్బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ ధృవీకరించింది. సంస్థకు చెందిన 57 మిలియన్ల రైడర్లు, డ్రైవర్ల వ్యక్తిగత డేటాహ్యాకింగ్ గురైనట్టు రైడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉబెర్ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు హ్యాక్ అయిన సమాచారాన్ని తొలగించేందుకు హ్యాకర్లకు భారీ ఎత్తున చెల్లింపులు కూడా చేసిందట. హ్యాకర్లకురూ. 1,00,000 డాలర్లు ( సుమారు రూ.65కోట్లు) చెల్లించింది. ఈ వ్యవహారంలో ఉబెర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జో సుల్లివాన్, డిప్యూటీ అధికారి క్రైగ్ క్లార్క్‌లపై వేటువేసింది. హ్యాకింగ్ విషయాన్ని ఉబర్ సీఈవో డారా ఖోస్రోషాహి తన బ్లాగ్ పోస్ట్ లో ధ్రువీకరించారు. 2016 అక్టోబరులో జరిపిన ఉల్లంఘన గురించి ఇటీవలే తెలుసుకున్నామని చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు.. దీన్ని తాము ఉపేక్షించమని డారా స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో హ్యాకర్లు ఈ డేటాను హ్యాక్ చేశారన్నారు. సంస్థ క్లౌడ్ సర్వర్ ద్వారా డేటాను హ్యాక్ చేశారన్నారు. ఇందులో రైడర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లతో పాటు డ్రైవర్ల పేర్లు, వారి లైసెన్స్‌ల వివరాలు ఉన్నట్లు ఉబర్ పేర్కొంది. గతాన్ని తుడిచిపెట్ట లేం. కానీ పొరపాట్లనుంచి నేర్చుకుంటామనీ,ఇందుకు ప్రతి యుబెర్ ఉద్యోగి తరఫున హామీ ఇస్తున్నానని ఖోస్రోషాహి చెప్పారు. ప్రతి అంశంలో వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడానికి కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు. హ్యాకింగ్ గురించి కొన్ని రోజుల క్రితమే మాజీ సీఈవో, ఉబర్ సహా వ్యవస్థాపకుడు ట్రావిక్ కలోనిక్‌కు తెలిసిందట. అయితే సీఈవో అధికారికంగా ప్రకటించేవరకు విషయాన్ని బహిర్గతం చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాదు. దొంగలించిన ప్రస్తుతం సమాచారమంతా సురక్షితంగా ఉందని సీఈవో డారా అన్నారు. ఇకపై డ్రైవర్లు, రైడర్ల డేటాకు మరింత భద్రత అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ హ్యాకింగ్ విషయాన్ని దాచి పెట్టిన ఉబెర్ హ్యాకింగ్‌పై ప్రత్యేక బోర్డు కమిటీతో విచారణ చేపట్టిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు దొంగిలించిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ఆయా సంస్థలు భారీగా చెల్లింపులు చేస్తున్నాయని అమెరికాఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, ప్రయివేట్ సెక్యూరిటీ అధికారులు వ్యాఖ్యానించారు. ఇలాంటి చెల్లింపులు చేస్తున్న సంస్థల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. కాగా 2014 లో గాడ్ వ్యూ అని పిలిచే ఒక సాఫ్ట్వేర్ ద్వారా గతంలో యుబెర్ డ్రైవర్ల, వినియోగదారుల సమాచారం హ్యాకింగ్‌కు గురైంది. -
బాలిక శీలానికి వెల కట్టిన పోలీసులు
-
కాజల్ పారితోషికం రెండున్నర కోట్లా?
అనూహ్య అవకాశాలు నటి కాజల్‌అగర్వాల్‌ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విజయ్, విక్రమ్, జీవా అంటూ ప్రముఖ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలు కాజల్‌ను వరించడం విశేషం. ఇప్పటికే జీవాతో కవలై వేండామ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో విక్రమ్, విజయ్‌లతో జత కట్టనున్నారు. విజయ్‌తో నటించనున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఇది విజయ్‌కి 60వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. చిత్ర నిర్మాత భారతీరెడ్డి,సమర్పకులు బీ.వెంకట్రామరెడ్డి, దర్శకుడు భరతన్, సంగీత దర్శకుడు సంతోష్నారనణ్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తెరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ త్వరలో తన తాజా చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. ఇందులో ఆయన సరసన నటిస్తున్న కాజల్‌అగర్వాల్ రెండున్నర కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు ప్రచారం కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. అంతే కాదు ఈ చిత్రానికి కాజల్‌ను విజయ్‌నే సిఫార్సు చేసినట్లు, అందుకే ఆమె అంత పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే కాజల్ మాత్రం పిచ్చపిచ్చగా ఫ్రీగా ప్రచారం పొందేస్తున్నారు. -
తమన్నా తగ్గించేశారా?
గాసిప్స్ స్వచ్ఛమైన పాల రంగు, తమన్నా ఒంటి రంగు ఒకటే. అందుకే అందరూ ఆమెను ముద్దుగా ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తుంటారు. తెలుగు, తమిళ భాషల్లో ‘మోస్ట్ వాంటెడ్ హీరోయిన్’గా దూసుకెళుతున్న తమన్నా తీసుకుంటున్న పారితోషికం కోటి రూపాయలకు కాస్త ఎక్కువే అని తెలుస్తోంది. ఇటీవల ‘ధర్మ దురై’ అనే తమిళ చిత్రానికి ఆమె కోటిన్నర డిమాండ్ చేశారని సమాచారం. వరుస విజయాలతో స్టార్ హీరోల వరుసలో చేరిపోయిన విజయ్ సేతుపతి హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. విజయ్ సేతుపతితో పోల్చితే తమన్నా స్థాయి చాలా ఎక్కువ. అందుకేనేమో కోటిన్నర అడిగి ఉంటారని చెన్నై టాక్. దాంతో తమన్నాతో నిర్మాత బేరసారాలు సాగించారట. నేను అడిగింది ఇవ్వాల్సిందేనని మంకు పట్టు పట్టకుండా తమన్నా మెట్టు దిగారట. పారితోషికం తగ్గించుకోవడానికి రెడీ అయిపోయారని వినికిడి. ఓ 20, 30 లక్షలు తగ్గించుకుని ఉంటారేమో అనుకుంటే పొరపాటే. ఏకంగా 50 లక్షల వరకూ తగ్గించుకున్నారని భోగట్టా. బహుశా తమన్నాకు కథ, పాత్ర బాగా నచ్చి ఉంటాయేమో!