
ట్విటర్‌లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభమైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది.
ఈ సందర్భంగా ఓ ట్విటర్ యూజర్ భారత్‌లో ఈ పెయిడ్ వెర్షన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. మరో నెలలో ప్రారంభం కావొచ్చని అన్నారు. ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూ చెక్‌మార్క్‌తో పాటు యాడ్స్ తక్కువ డిస్‌ప్లే చేయడంతో పాటు అదనపు ఫీచర్లను అందిస్తామని వెల్లడించారు.
.@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue
— Prabhu (@Cricprabhu) November 5, 2022
అంతేకాదు ట్విటర్‌లో వర్డ్స్ పరిధిని పెంచనున్నట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్‌లో సుదీర్ఘ సందేశాలు పోస్ట్ చేసేందుకు వీలులేదు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్‌లను సైతం పోస్ట్ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment