membership
-
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఎన్పీఎస్ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్‌వో పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ‘ఎకోరాప్’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్‌లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్పీఎస్ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్‌పీఎస్‌లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది. 1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్‌లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ విభాగాల రిక్రూట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్ 30 నాటికి ఐఎస్ఎఫ్ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. -
రాహుల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లక్నోకు చెందిన న్యాయవాది అశోక్ పాండే ఈ పిటిషన్ వేశారు. వయనాడ్ ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. కాగా మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్‌పై లోక్‌సభ అనర్హత వేటు తొలిగిస్తున్నట్లు ఆగస్టు 7న లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునురుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ హాజరయ్యారు. చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్, మమతా ట్వీట్లు అసలేం జరిగిందంటే కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్‌సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది -
బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
యునెస్కోలోకి మళ్లీ అమెరికా!
పారిస్: అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచదేశాలతో సత్సంబంధాల్లో ‘పెద్దన్న’ అనే పేరు కోసం తమతో పోటీపడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో అడుగు ముందుకేసింది. యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించడం తెల్సిందే. దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగుతోంది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లు ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటానని బెదిరించింది. 2017లో నాటి ట్రంప్ సర్కార్ యునెస్కో నుంచి వైదొలగింది. ఆనాటి నుంచి దాదాపు రూ.5,100 కోట్ల విరాళాలు ఆపేసింది. తాజాగా ఆ నిధులన్నీ చెల్లిస్తామంటూ యునెస్కో మహిళా డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజౌలేకు అమెరికా ఉన్నతాధికారి రిచర్డ్ వర్మ లేఖ రాశారు. గతంలో యునెస్కోకు అమెరికానే అతిపెద్ద దాతగా ఉండేది. ఇది యునెస్కోకు చరిత్రాత్మక ఘటన అంటూ అమెరికా తాజా నిర్ణయాన్ని ఆండ్రీ స్వాగతించారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
అనర్హతవేటు ఎత్తివేత.. ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
సాక్షి, ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజల్‌పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది లోక్‌సభ. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్‌ను ఉదయమే రిలీజ్ చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, లోక్‌సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో కింది కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించినా, లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం తనను అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారాయన. ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. బుధవారం కూడా వాదనలు వినాల్సి ఉంది. ఈ లోపే లోక్‌సభ సచివాలయం ఆయన అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ ద్వారా ఆసక్తి రేకెత్తింది. -
అమెజాన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక!
కరోనా తర్వాత ఓటీటీ చూసేవారి సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ కంటెంట్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ నెల, వార్షిక, ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ వాసులు మాత్రం క్వాలిటీ కంటెంట్‌తో పాటు కాస్త కాస్ట్ తక్కువ ఉండే వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ ధరలో ప్లాన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట ఓ కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. చవకైన ప్లాన్.... అమెజాన్ ఐడియా అదిరింది అమెజాన్ ప్రైమ్.... షాపింగ్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, ఇ-బుక్స్ ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon prime) అందిస్తున్న తెలిసిందే. గతంలో తన వార్షిక ప్లాన్ ధరను రూ. 999 నుంచి రూ. 1499కి పెంచేసింది. ఇప్పటికే మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు తమ ధరల పెంపు కూడా అమెజాన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట వార్షిక ప్లాన్‌ను రూ.999కే తీసుకురానుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ తర్వాత, అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ తరహాలోనే లైట్‌లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్న ఈ వెర్షన్‌ను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అనంతరం దశలవారీగా భారత్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూజిక్, బుక్స్, గేమ్స్ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్ ఏడాదికి రూ.599కే ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో ఎస్డీ క్వాలిటీలో వీడియోలు చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సదుపాయాలేవీ ఉండవు. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ సదుపాయం ఉంది. అయితే త్వరలో రాబోతున్న లైట్ యూజర్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు. ఫ్రీ డెలివరీ, రెండ్రోజుల స్టాండర్డ్ డెలివరీ సదుపాయం మాత్రమే ఉంటుంది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్! -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం.. భారత్‌లో ఎప్పుడంటే?
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభమైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. ఈ సందర్భంగా ఓ ట్విటర్ యూజర్ భారత్‌లో ఈ పెయిడ్ వెర్షన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. మరో నెలలో ప్రారంభం కావొచ్చని అన్నారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూ చెక్‌మార్క్‌తో పాటు యాడ్స్ తక్కువ డిస్ప్లే చేయడంతో పాటు అదనపు ఫీచర్లను అందిస్తామని వెల్లడించారు. .@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue — Prabhu (@Cricprabhu) November 5, 2022 అంతేకాదు ట్విటర్లో వర్డ్స్ పరిధిని పెంచనున్నట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్లో సుదీర్ఘ సందేశాలు పోస్ట్ చేసేందుకు వీలులేదు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్‌లను సైతం పోస్ట్ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. చదవండి👉 ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు -
యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్!
యూట్యూబ్(Youtube).. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్‌లైన్ ఎక్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్లతో పాటు తమలోని టాలెంట్‌ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్ ప్రీమియం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ యూట్యూబ్‌లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్‌లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్షిప్ వంటి అనేక ఇతర ఫీచర్లను YouTube Kids యాప్‌పై అందిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్ రెడ్ (YouTube Red), మ్యూజిక్ ప్రీమియం (Music Premium), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), గూగుల్ ప్లే (Google Play) సబ్స్క్రైబర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్‌స్క్రైబర్‌కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు. చదవండి: భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది! -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నత్త నడకన సాగడానికి కారణమేంటి ? టీడీపీ సభ్యత్వం అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతోంది? దేశంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు సభ్యత్వాన్ని ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? లక్ష్యం సాధించని సభ్యత్వం మీద పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఎందుకు స్పందించడంలేదు? చదవండి: బీజేపీతో పొత్తు కోసం తహతహ.. ఎల్లో మీడియాకు నిద్ర కరువైందా? ఎందుకీ ఫేక్ న్యూస్ దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సభ్యత్వం ఉన్నది తమకే అంటూ తెలుగుదేశం నాయకులు బాకాలు ఊదేవారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలగం టీడీపీకి ఉందని చంద్రబాబు, లోకేష్ గొప్పలు చెప్పుకున్నారు. టీడీపీకి 70 లక్షల కార్యకర్తల బలం ఉందని అనేవారు. ఈ సారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతాన్ని మించి ఘనంగా జరగాలని నాయకులను కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. గత ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మహానాడు ముగిసే సమయానికి సభ్యత్వ నమోదులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నాయకులకు చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు. 70 లక్షల టార్గెట్ మించి సభ్యులను చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో సభ్యత్వం జరగలేదు. ఈ నాలుగు నెలల వ్యవధిలో టీడీపీ సభ్యత్వం 20 లక్షల కూడా దాటలేదు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కలిసి సభ్యత్వ నమోదుపై స్పీడ్ పెంచాలని ప్రతిరోజు జూమ్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్ ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నాయకులు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు. లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కూడా లోకల్ కేడర్ మాట వినే స్థితిలో లేరు. కుప్పం నియోజకవర్గం అందరికంటే ముందుందని చెబుతున్న చంద్రబాబు ఎంత సభ్యత్వం జరిగింది అనే దాని మీద మాత్రం నోరు విప్పలేదు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు వారి బంధువులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని ప్రతి సమావేశంలోనూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ ప్రతి ఐదు లక్షల సభ్యత్వం పూర్తయిన ప్రతిసారి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేవారు. ప్రస్తుత సభ్యత్వ నమోదు గురించి ఇప్పటివరకు చంద్రబాబు గాని లోకేష్ గాని నోరు విప్పలేదు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ఇస్తున్న విరాళాలు లెక్కలు చెబుతున్నారే తప్ప పార్టీ సభ్యత్వ వివరాల మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు లోకేష్ నానా తంటాలు పడుతున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన యాప్ సహకరించడం లేదంటూ ఎల్లో మీడియాలో లీక్‌లు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి మరొక కారణం ఉందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నారని, ఈ పథకాలు వైఎస్సార్ సీపీని అభిమానించేవారితో పాటుగా.. అదే స్థాయిలో టీడీపీ అభిమానులకు కూడా అందుతున్నాయి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఇక తమకు పార్టీలు ఎందుకని తెలుగుదేశం కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్‌కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్‌లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్‌కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసింది. -
నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వంపై ఉత్కంఠ
-
నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు
కీవ్: నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్లాండ్ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. నాటోలో చేరడం ఫిన్లాండ్ రక్షణను బలోపేతం చేస్తుందని, అదేవిధంగా నాటో కూటమి దేశాలకు బలాన్నిస్తుందని ఆదేశ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ప్రధాని సన్నా మరిన్ చెప్పారు. నాటోలో వెంటనే చేరాలని, ఇందుకు అవసరమైన చర్యలను రాబోయే రోజుల్లో చేపడతామని తెలిపారు. ఫిన్లాండ్ ప్రకటనపై రష్యా హెచ్చరిక స్వరంతో స్పందించింది. ఆ దేశం నాటోలో చేరితే రష్యాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఉత్తర యూరప్‌లో స్థిరత్వం నాశనమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకు తాము తగిన మిలటరీ చర్యలతో స్పందిస్తామన్నారు. రష్యాతో ఫిన్లాండ్ ఎందుకు ఘర్షణ కోరుతుందో, ఎందుకు స్వతంత్రాన్ని వద్దనుకొని వేరే కూటమిలో చేరుతుందో భవిష్యత్ చరిత్ర నిర్ధారిస్తుందన్నారు. నాటో పొరుగుదేశం స్వీడన్ సైతం త్వరలో నాటోలో చేరడంపై నిర్ణయం తీసుకోనుంది. నాటోలో చేరికకు ఈ దేశాలు దరఖాస్తు చేసుకుంటే వాటిని నాటో దేశాల పార్లమెంట్లు ఆమోదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాటోలో చేరాలన్న ఫిన్లాడ్ నిర్ణయాన్ని నాటో సభ్యదేశాలు స్వాగతించాయి. మీ వల్లనే...: నాటోలో చేరాలని తాము భావించేందుకు రష్యానే కారణమని ఫిన్లాండ్ నాయకులు ఆరోపించారు. తమకు హెచ్చరికలు చేసేముందు రష్యా అద్దంలో చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పరోక్షంగా చెప్పారు. ఉక్రెయిన్‌కు మద్దతుపై ఇటీవలే ఫిన్లాండ్ నేతలు జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడి వల్లనే ఇంతకాలం తటస్థంగా ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ నాటోవైపు మొగ్గు చూపాయి. ఆదేశాల్లో ప్రజానీకం కూడా నాటోలో చేరడంపై సుముఖంగా స్పందించింది. రష్యా దాడి మొత్తం యూరప్ భద్రతను సంశయంలో పడేసిందని ఈ దేశాలు ఆరోపించాయి. ఈ దేశాలు నాటోలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని నాటో అధిపతి జనరల్ స్టోల్టెన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తు చేసిన రెండువారాల్లో వీటి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని నాటో అధికారులు చెప్పారు. దాడులే దాడులు..: ఒకపక్క అనుకున్న విజయం దక్కకపోవడం, మరోపక్క తటస్థ దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరాలనుకోవడం.. రష్యాకు అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పుప్రాంతంపై రష్యా తన దాడులు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో మారియుపోల్‌లో మిగిలిన ఉక్రెయిన్ సేనలను తుడిచిపెట్టేందుకు వాయుదాడులు కూడా జరిపింది. ఇది కూడా చదవండి: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం -
కాంగ్రెస్‌కు 2.6 కోట్ల డిజిటల్ సభ్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన దేశవ్యాప్త డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ శుక్రవారంతో ముగిసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ తదితర ప్రముఖులు సహా 2.6 కోట్లమంది డిజిటల్ సభ్యులుగా నమోదయ్యారు. 2022–27 సంవత్సరాలకు పార్టీ సభ్యత్వ నమోదును రాతపూర్వక రశీదులతోపాటు డిజిటల్‌గాను ఈసారి కాంగ్రెస్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పార్టీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మెంబర్షిప్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. -
రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు ఐదో రోజు కొనసాగుతున్నాయి. మరోవైపు బెలారస్‌లోని ఫ్యాఫిట్ వేదికగా ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇరు వర్గాలు పలు డిమాండ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. యూరోపియన్ యూనియన్ ఎదుట కీలక ప్రతిపాదనను ఉంచారు. సోమవారం జెలెన్ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈయూ కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. దీంతో రష్యాపై దాడులను తీవ్రతరం చేసేందుకు ఉక్రెయిన్‌కు ఊహించని మద్దుతు తోడైంది. -
సభ్యత్వం చేయకపోతే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేయనివారికి పార్టీలో భవిష్యత్ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వారికి పదవులు రావడం కష్టమన్నారు. సభ్యత్వ నమోదును ఏఐసీసీ చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని, రోజూ ఢిల్లీస్థాయిలో సమీక్షిస్తోందని చెప్పారు. పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, సమన్వయకర్తలు, బూత్‌స్థాయి ఎన్రోలర్లు సమష్టిగా పనిచేసి 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాం«దీభవన్‌లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో గెలుపునకు సభ్యత్వాలు చాలా కీలకమని, ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. ఫిబ్రవరి 9న మళ్లీ దీనిపై సమీక్షించనున్నారు. 11 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, డిజిటల్ సభ్యత్వ నమోదు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే దాడులా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని మూడేళ్లయినా అమలుపర్చలేదని, ఈ విషయాలను అడిగేందుకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ నేత రవికాంత్గౌడ్పై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అనుచరులు దాడి చేశారని, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: శివసేనారెడ్డి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా వినతిపత్రాలు సమరి్పంచేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశంలోనే నంబర్ 1 నల్లగొండ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 3.50 లక్షల సభ్యత్వం నమోదైందన్నాయి. దీని పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 76,252, సూర్యాపేటలో 73,697, కోదాడలో 55,682, మిర్యాలగూడలో 38,456, దేవరకొండలో 38,380, నాగార్జునసాగర్‌లో 57,260, నల్లగొండలో 8,711 సభ్యత్వాలను ఈ నెల 29 నాటికి పూర్తి చేసినట్టు చెప్పాయి. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. -
మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్.. కొందరు ఆ కోరిక తీరకుండానే
సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్‌గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్‌వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్‌గా ఏర్పడింది. ► నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్లు, థియేటర్ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్‌పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు. ► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది. ► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్‌గా మారింది. ► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు. ► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు సికింద్రాబాద్ క్లబ్లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్ కలిగిన హైదబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’) ► ఈ క్లబ్‌లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా) -
మందు, డ్రగ్స్‌కి దూరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొత్తగా తీసుకోవాలని అనుకునే వారికి ఆ పార్టీ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, పార్టీ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికీ బహిరంగ వేదికలపై విమర్శించబోమని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఇవ్వాలని షరతు విధించింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేపట్టనుంది. సభ్యత్వం కోసం రూపొందించిన దరఖాస్తు పత్రంలో కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఆదాయానికి మించి ఆస్తులు లేవని, పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల కోసం శారీరక శ్రమకు సిద్ధమేనని అంగీకరించాలి. సామాజిక వివక్ష చూపించమని, వివక్ష, అసమానతల నిర్మూలనకు కృషి చేస్తామని ఇలా మొత్తం 10 పాయింట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లభిస్తుంది. -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు అమెజాన్ సైతం త్వరలో ప్రైమ్ ధరల్ని భారీగా పెంచనున్నట్లు తెలిపింది. అమెజాన్ సైతం ముందస్తుగానే 'లాస్ట్ ఛాన్స్ జాయిన్ ప్రైమ్' పేరుతో యాడ్‌ను ప్రమోట్ చేయడంతో ప్రైమ్ ధరలు పెరిగడం నిజమేనని ప్రైమ్ వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రైమ్ ధర సంవత్సరానికి రూ.999 ఉండగా..పెరగనున్న ధరతో ప్రైమ్ ధరతో రూ.1,499కి చేరనుంది. పెరగనున్న ప్రైమ్ ధరలు ఎలా ఉన్నాయి త్వరలో పెరుగుతున్న ప్రైమ్ ధరల్ని చూసుకుంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి పెరగనుంది. క్వార్టల్లీ సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.359కి పెరగనుంది. యానువల్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.1,499కి పెరగనుంది. అమెజాన్ ప్రైమ్‌తో ప్రయోజనాలు అర్హత ఉన్న వస్తువులపై అపరిమిత సంఖ్యలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉచితంగా డెలివరీ. ప్రైమ్ వీడియో,మ్యూజిక్ సబ్స్క్రిప్షన్. అమెజాన్, ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5శాతం రివార్డ్ పాయింట్లు. ఆఫర్ సేల్ సమయంలో ప్రైమ్ మెంబర్లు 30 నిమిషాల ముందుగా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Netflix: నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
భోజన ప్రియులకు జోమాటో బంపర్ ఆఫర్..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తన యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. యూజర్ల కోసం కొత్తగా మరో మెంబర్‌షిప్‌ను తొందరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో తన యూజర్ల కోసం ఇప్పటికే జోమాటో ప్రో పేరిట మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తెచ్చింది. జోమాటో ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 మెంబర్‌షిప్‌ను తీసుకుంటే ఫుడ్ డెలివరీలపై 30 శాతం వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్ డైనింగ్‌లో 40 శాతం వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను అందిస్తోంది. ఈ మెంబర్షిప్ గడువు 90 రోజులుగా ఉంటుంది. తాజాగా జోమాటో తన యూజర్ల కోసం మరో సరికొత్త మెంబర్‌షిప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో ప్రో ప్లస్ పేరిట కొత్త మెంబర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ మెంబర్‌షిప్‌లో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను యూజర్లకు జోమాటో అందించనుంది. అంతేకాకుండా ఎలాంటి సర్జ్ ఛార్జీలు, డిస్టాన్స్ ఛార్జీలు, అన్ని ప్రో మెంబర్షిప్ సేవలను జోమాటో అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్ కోసం జోమాటో ఒక చిన్న మెలిక పెట్టింది. ఈ మెంబర్షిప్ కోసం జోమాటో యాప్ ఈ రోజు(ఆగస్టు 2) సాయంత్రం ఆరు గంటలకు కొంతమంది యూజర్లకు మాత్రమే ఆహ్వానాన్ని పంపనుంది. ఆహ్వానం వచ్చిన యూజర్లు సదరు అమౌంట్‌ను చెల్లించి జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ సేవలను పొందవచ్చును. జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ ధరలను ఇంకా ప్రకటించలేదు. జొమాటో 2008 లో ప్రారంభించగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కంపెనీ రూ. 8,250 కోట్ల వరకు ఐపీవోను దాఖలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. We have 1.8mn Zomato Pro members as of today. And one of the most requested features from our customers has been “Unlimited Free Deliveries” (something like Amazon Prime). So… in a few hours, we are launching our Limited Edition *Pro Plus* membership for select customers… pic.twitter.com/RtL4ftDBpt — Deepinder Goyal (@deepigoyal) August 2, 2021