
కరోనా తర్వాత ఓటీటీ చూసేవారి సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ కంటెంట్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ నెల, వార్షిక, ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ వాసులు మాత్రం క్వాలిటీ కంటెంట్‌తో పాటు కాస్త కాస్ట్ తక్కువ ఉండే వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ ధరలో ప్లాన్‌లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట ఓ కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
చవకైన ప్లాన్.... అమెజాన్ ఐడియా అదిరింది
అమెజాన్ ప్రైమ్.... షాపింగ్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, ఇ-బుక్స్ ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon prime) అందిస్తున్న తెలిసిందే. గతంలో తన వార్షిక ప్లాన్ ధరను రూ. 999 నుంచి రూ. 1499కి పెంచేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు తమ ధరల పెంపు కూడా అమెజాన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
దీంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట వార్షిక ప్లాన్‌ను రూ.999కే తీసుకురానుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ తర్వాత, అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ తరహాలోనే లైట్‌లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్న ఈ వెర్షన్‌ను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అనంతరం దశలవారీగా భారత్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ మ్యూజిక్, బుక్స్, గేమ్స్ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్ ఏడాదికి రూ.599కే ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో ఎస్‌డీ క్వాలిటీలో వీడియోలు చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సదుపాయాలేవీ ఉండవు. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ సదుపాయం ఉంది. అయితే త్వరలో రాబోతున్న లైట్ యూజర్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు. ఫ్రీ డెలివరీ, రెండ్రోజుల స్టాండర్డ్ డెలివరీ సదుపాయం మాత్రమే ఉంటుంది.
చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్!
Comments
Please login to add a commentAdd a comment