
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వం రద్దుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసు వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్‌రెడ్డి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ప్రకాష్ రెడ్డి స్థానంలో సుప్రీంకోర్టు నుంచి ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కేసు వాదించడానికి వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు జరిగిన వీడియోలను, ఒరిజినల్ సీడీలను కోర్టుకు సమర్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే.
మంగళవారం సమర్పిస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కోర్టుకు ఈరోజు సమర్పిస్తారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల స్థానంలో సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించనున్నారు. అయితే ఇద్దరు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ప్రారంభం కాకుండానే ప్రధాన న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment