సాక్షి, హైదరాబాద్: ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. నాంపల్లి ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నాంపల్లిలో 45 వేలకు పైగా బోగస్ ఓట్లున్నాయని.. మరణించిన, ఇళ్లు మారిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రత్యేక సవరణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్ ఖాన్ కోరారు. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ధర్మాసనం.. అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ ఖాన్‌కు సూచించింది.
చదవండి: TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్
Comments
Please login to add a commentAdd a comment