Ferozkhan
-
ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేం అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. నాంపల్లి ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నాంపల్లిలో 45 వేలకు పైగా బోగస్ ఓట్లున్నాయని.. మరణించిన, ఇళ్లు మారిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించేలా ఈసీని ఆదేశించాలని ఫిరోజ్ ఖాన్ కోరారు. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం విచారణ చేపట్టింది. ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా ఖరారు చేశామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితాలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ధర్మాసనం.. అభ్యంతరాలపై సీఈఓకు ఫిర్యాదు చేయాలని ఫిరోజ్ ఖాన్‌కు సూచించింది. చదవండి: TS: మూడే రోజుల్లో అన్నేసి కోట్లు సీజ్ -
సెర్బియా జైల్లో హైదరాబాద్ వ్యాపారి.. ఆరా తీస్తున్న అధికారులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి వ్యాపార నిమిత్తం సెర్బియాకు వలసవెళ్లిన ఫెరోజ్ ఖాన్ అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. పది నెలలుగా ఆయన విషయంపై సిటీలో ఉంటున్న తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. సెర్బియాలోనే స్థిరపడిన ఫెరోజ్ సోదరి ఆరా తీయగా జైల్లో ఉన్న విషయం బయటపడింది. నేరుగా జోక్యం చేసుకోవడానికి అక్కడి భాతర రాయబార కార్యాలయం నిరాకరించడంతో సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఫెరోజ్ సోదరుడు నూమన్ హుస్సేన్ జునైదీ విదేశాంగ శాఖకు లేఖ రాశాడు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన అధికారులు సోమవారం ఫెరోజ్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. బెల్గ్రేడ్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసి.. ఫస్ట్ లాన్సర్‌లోని ఖాజానగర్ ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్ (44) తండ్రి మాజీ ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం తండ్రి, తల్లి కూడా అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితయ్యారు. పదిహేనేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న ఫెరోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు. సెర్బియాలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఫెరోజ్ బిజినెస్ వీసాపై 2020లో అక్కడికి వలస వెళ్లాడు. బెల్గ్రేడ్లో ఉన్న బ్రాంకోవా–19లో ఇండో–అరబ్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వెళ్లి సెర్బియాలో స్థిరపడిన వారు ఫెరోజ్ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉండే వాళ్లు. నాటకీయ పరిణామాల మధ్య మిస్సింగ్... సెర్బియా నుంచి అనునిత్యం నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడే ఫెరోజ్ ఆఖరుసారిగా గతేడాది మార్చి 10న కాల్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఫోన్లు పని చేయకపోవడంతోపాటు ఆచూకీ లేదు. దీంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కొన్నాళ్లు ఎదురుచూశారు. చివరకు సెర్బియాలో ఉన్న ఫెరోజ్‌కు సోదరి వరుసయ్యే మహిళను సంప్రదించారు. బ్రాంకోవాలోని ఇండో–అరబ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లిన ఆమె అది చాన్నాళ్ల క్రితమే మూతపడినట్లు గుర్తించింది. చుట్టుపక్కల ఆరా తీయగా గతేడాది మార్చి 9న రెస్టారెంట్లో కొందరు భారతీయులు–బంగ్లాదేశీయుల మధ్య గొడవ జరిగిందని, వారికి ఫెరోజ్ సర్దిచెప్పాడని, ఆ మర్నాడే అక్కడి పోలీసులు అతడిని అరెస్టు చేశారని తెలిసింది. ఈ విషయం నగరంలో ఉన్న ఫెరోజ్ తల్లిదండ్రులకు చెప్పిన ఆమె... సెర్బియాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్నీ సంప్రదించింది. ఢిల్లీ నుంచి ఉత్తర్వులు రావాలనడంతో... అక్కడి జైల్లో మగ్గుతున్న ఫెరోజ్ వివరాలు ఆరా తీయడానికి నిరాకరించిన రాయబార కార్యాలయం తాము జోక్యం చేసుకోవాలంటే ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) నుంచి ఆదేశాలు రావాలని స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫెరోజ్ సోదరుడు, ఆలియాబాద్ వాసి నూమన్ శుక్రవారం భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. దీనికి సంబంధించి ఎంబీటీ పార్టీ నేత అమ్జదుల్లా ఖాన్ ఎంఈఏకు ట్వీట్ చేస్తూ ఫెరోజ్‌పై సెర్బియాలో నమోదైన కేసు వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఆయనకు న్యాయం చేయడంతో పాటు భారత్‌కు రప్పించడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. నూమన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఫెరోజ్ జైల్లో ఎందుకు ఉన్నాడో తెలీదు. దీనిపై అక్కడి పోలీసులు కనీసం అతడి తల్లిదండ్రులకూ సమాచారం ఇవ్వలేదు. విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందన మొదలైంది. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చి పూర్తి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఫెరోజ్‌కు న్యాయం చేయాలని కోరుతున్నా’ అన్నారు. చదవండి: డెక్కన్ మాల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. బిల్డింగ్ కూల్చివేతపై సందిగ్ధం -
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. తనియా కక్డే శంషాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై తన స్నేహితుడితో కలిసి I-20 కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని, కారులోని మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు! -
సరి‘హద్దు’లు సామరస్యమేనా?
అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు సమస్య చిలికిచిలికి గాలి వానలా మారింది. ఏకంగా కాల్పుల వరకు వెళ్లి అస్సాం పోలీసులు, సామాన్యులను బలితీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏడేళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణకూ సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాల నుంచి వివాదాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు వివాదాలు జరిగాయి. వికారాబాద్‌లో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బషీరాబాద్ మండలం క్యాద్గిరా, కర్ణాటకలోని సేడం తాలూకా పోతంగల్ మధ్య కాగ్నా నది ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఇసుక తవ్వకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోనైతే విచిత్ర పరిస్థి తులు నెలకొని ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 14 గ్రామాలను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ పరిధిలోనివే నని చెబుతూ ఉంటాయి. 1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని నిర్ణయం తీసుకొని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజుర ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుందని, మరాఠి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్రలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ –శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో మహా రాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాం–మిజోరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేవలం తాము సహాయకారిగా మాత్రమే పనిచేస్తామని లోక్‌సభలో ప్రకటించింది. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దున ఉన్న రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సమస్యలకూ పూర్తిస్థాయి పరిష్కారం దొరకక పోవచ్చు. ప్రయత్నలోపం జరగకుండా చూసుకోవాలి. - ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
ఒక్క మనిషి.. రెండు జీవితాలు
ఐశ్యర్యారాయ్కి రాత్రి ఎవరైనా పరిచయం అయితే మార్నింగ్ కల్లా మర్చిపోతారు. ఆ తర్వాతి రోజు ఉదయం మాత్రమే వాళ్లను గుర్తుపట్టగలరు. అలాగే.. మార్నింగ్ ఎవరైనా పరిచయం అయితే నైట్ కల్లా మర్చిపోతారు. మళ్లీ సేమ్.. అంటే.. తర్వాతి రోజు రాత్రి వస్తే కానీ వారు గుర్తుకురారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వన్ పర్సన్... టూ లైఫ్స్ అన్నమాట. దీన్నే ‘మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఈ కాన్సెప్ట్ పైనే బాలీవుడ్లో ఒకప్పుడు సత్యన్ బోస్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, నర్గీస్, ఫిరోజ్ ఖాన్ ముఖ్య పాత్రల్లో ‘రాత్ ఔర్ దిన్’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌లో ఐశ్యర్యారాయ్ లీడ్ రోల్లో నటించనున్నారని బాలీవుడ్ ఖబర్. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ‘ఫ్యానీ ఖాన్’ సినిమా షూటింగ్ కంప్లీట్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట. ‘ఫ్యానీఖాన్’ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. -
హైదరాబాద్ ఓ మినీ భారత్: నాదెండ్ల భాస్కరరావు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం మినీ ఇండియా వంటిదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అభివర్ణించారు. నాంపల్లి గాంధీభవన్ ప్రకాశం హాలులో నేషనల్ సాలిడారిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల పాకిస్థాన్ సైనికుల చేతిలో మృతి చెందిన అమర సైనికుడు ఫిరోజ్‌ఖాన్ సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఫిరోజ్‌ఖాన్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ సమైక్యతా కమిటీ అధ్యక్షుడు ఎస్కే.అఫ్జలుద్దీన్, పీసీసీ కార్యదర్శి ఎస్.బాలపోచయ్య, భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ స్వరవ ర్షిణి రాజేందర్‌రెడ్డి, సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సభ్యులు ఖలీఖుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశరక్షణలో నేలకొరిగిన పాలమూరు తేజం
నారాయణపేట, న్యూస్‌లైన్: జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లా బాలాకోడ్ ప్రాంతంలోని దేశ సరిహద్దుల్లో సోమవారం రాత్రి పాక్ చొరబాటుదారులు జరిపిన కాల్పుల్లో నారాయణపేటకు చెందిన ఫిరోజ్‌ఖాన్ (33) మృతి చెందాడు. ఫిరోజ్ మృతిని కల్నర్ ఆర్కే పల్లా బుధవారం ధ్రువీకరించారు. 1996లో ఆర్మీలో చేరిన ఫిరోజ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఫిరోజ్ మరణ వార్త తెలియగానే పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి కూడా జవానే... ‘పేట’కు చెందిన అక్తర్‌బేగం, జాఫర్‌ఖాన్ దంపతులకు 1978లో ఫిరోజ్ జన్మించాడు. ఫిరోజ్ తండ్రి జాఫర్‌ఖాన్ కూడా ఆర్మీ జవాన్‌గా దే శ సరిహద్దులో పనిచేసి రిటైరయ్యారు. ఫిరోజ్ స్థానిక ఎంబీ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసిన అతను 1996లో తండ్రి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరాడు. ఏడేళ్లక్రితం అతను న శ్రీన్ బేంగంను వివాహం చేసుకున్నాడు. తండ్రి ఆర్మీలో పనిచేస్తుండడంతో 18ఏళ్ల క్రితం వారు పేట’ను వదిలి హైదరాబాద్ పాతబస్తీ నవాబ్‌సాబ్‌కుంటలో నివాసముంటున్నారు. వరంగల్‌లోని ఓ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జాఫ ర్ సహజ మరణం పొందారు. సైనికుడుగా వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఫిరోజ్ రెండేళ్ల క్రితం కాశ్మీర్లో బదిలీ అయ్యాడు. గత ఏడాది సౌత్ ఇండి యా అటవీశాఖలో డిప్యుటేషన్‌పై పని చేసిన అతను మళ్లీ సరిహద్ద్దుకు వెళ్లాడు. బుధవారం బక్రీద్ వేడుకల్లో ఉన్న పేటలో ఫిరోజ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు ఈ విషాదకర వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే వారు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వీరజవాన్‌కు ఘన నివాళి ఆమనగల్లు: దేశ సరిహద్దులో మృతి చెందిన ఫిరోజ్‌ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని ఆమనగల్లులో ముస్లిం సో దరులు బుధవారం శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌరస్తా వద్ద ఫిరోజ్ఖాన్కు ఘనంగా నివాళులర్పించారు. ‘ఆర్మీ జవాన్ ఫిరోజ్‌ఖాన్ షహిద్హై’ అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఏ పాషా, ఖలీల్, అల్తాఫ్, తాహేర్, రబ్బానీ, అజీం, అలీం, రఫీ, రబ్బానీ, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.