
ఐశ్యర్యారాయ్‌కి రాత్రి ఎవరైనా పరిచయం అయితే మార్నింగ్ కల్లా మర్చిపోతారు. ఆ తర్వాతి రోజు ఉదయం మాత్రమే వాళ్లను గుర్తుపట్టగలరు. అలాగే.. మార్నింగ్ ఎవరైనా పరిచయం అయితే నైట్ కల్లా మర్చిపోతారు. మళ్లీ సేమ్.. అంటే.. తర్వాతి రోజు రాత్రి వస్తే కానీ వారు గుర్తుకురారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వన్ పర్సన్... టూ లైఫ్స్ అన్నమాట. దీన్నే ‘మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు.
ఈ కాన్సెప్ట్ పైనే బాలీవుడ్‌లో ఒకప్పుడు సత్యన్ బోస్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, నర్గీస్, ఫిరోజ్ ఖాన్ ముఖ్య పాత్రల్లో ‘రాత్ ఔర్ దిన్’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌లో ఐశ్యర్యారాయ్ లీడ్ రోల్‌లో నటించనున్నారని బాలీవుడ్ ఖబర్. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ‘ఫ్యానీ ఖాన్’ సినిమా షూటింగ్ కంప్లీట్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట. ‘ఫ్యానీఖాన్’ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment