Pradeep Kumar
-
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
మెరుగైన సదుపాయాలు కల్పించండి
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది. ఎగుమతి నిబంధనలు సడలించాలి.. ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు. అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరిన్ని సబ్సిడీలు కావాలి.. మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్టెక్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు. -
ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్‌తో.. నాలుగేళ్లకి ఇంటికి చేరిన మహిళ!
మహబూబ్‌నగర్: మతిస్థిమితం లేకుండా తిరుగుకుంటూ వెళ్లిన ఓ మహిళా నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరుకుంది. ఈ ఘటన మండలంలోని కానాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకుంట సరళమ్మ, కర్రెన్నల కుమార్తె వివాహిత గిరమ్మ మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతుండేది. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండేళ్లు వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు గిరమ్మను చేరదీశారు. మతిస్థిమితం నుంచి కోలుకునేవిధంగా చికిత్స అందించి గిరమ్మ నుంచి చిరునామా కనుకున్నారు. ఆదివారం శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చిన గిరమ్మను చూసిన కుటుంబ సభ్యులు ఆనందంలో ముగిగిపోయారు. ఫౌండేషన్ సభ్యుడు ప్రదీప్‌కుమార్‌కు గిరమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్–1, గ్రూప్–2లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు (డీఈవో), ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరాలు కలిపి 1,199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వీటితోపాటు 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో గ్రూప్–2 పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలోనూ మార్పులు చేస్తున్నామన్నారు. పాత సిలబస్ పూర్తిగా డూప్లికేషన్‌తో ఉందని.. దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయన్నారు. గ్రూప్–2లో గతంలో మూడు పేపర్లుండగా ఇప్పుడు రెండు పేపర్లుగా మార్చామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టుల భర్తీ కాగా గత నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 1,31,364 పోస్టులను భర్తీ చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టుల భర్తీ జరగలేదని గుర్తు చేశారు. వీటిలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 1,26,728 పోస్టులను భర్తీ చేశామన్నారు. మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు, సుధీర్, సెలీనా, శంకరరెడ్డి, కార్యదర్శి ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లు విడుదల కాగా రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల షెడ్యూళ్లను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. -
ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్‌కుమార్ ఇందుకు నిదర్శనం. కడప నగరం రమేష్ థియేటర్ ఎదురు వీధిలో డాక్టర్ ప్రదీప్ కుమార్ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. 20 ఏళ్లుగా ఉచిత సేవలు పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్ రవికుమార్‌రెడ్డి క్లాస్మేట్. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) సామాజిక బాధ్యతగా భావించాను నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. – డాక్టర్ ప్రదీప్‌కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప పేదలకు ఎంతో మేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం. – సీఆర్వీ ప్రసాద్‌రావు, నాగరాజుపేట, కడప -
వాట్ యాన్ ఐడియా సర్ జీ! అధికారులకు కొత్త రకం ఫోన్లు ఇచ్చిన కలెక్టర్
సాక్షి, చెన్నై: తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని అధికారులతో సమన్వయం కోసం అందరికీ పుష్..టు టాక్ పేరిట కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చా రు. వివరాలు.. ప్రదీప్‌కుమార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిధిలోని అధికారులను ప్రజా సేవలో సమన్వయ పరిచేందుకు, ప్రభుత్వ కార్యాక్రమాల విస్తృతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రయోగంపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం విదేశాల నుంచి పుష్ టు టాక్ పేరిట 35 కొత్త రకం ఫోన్లను కొనుగోలు చేశారు. ఆపదలో రక్షణ కవచం.. తొలి విడతగా జిల్లా పరిధిలోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులకు ఈ పుష్ టు టాక్ ఫోన్లను అందజేశారు. అయితే, ఈ ఫోన్లకు నంబర్లు ఉండవు. ఎవరెవరి చేతిలో ఈ ఫోన్లు ఉన్నాయో కేవలం వారి పేర్లు మాత్రమే ఉంటాయి. సంబంధిత అధికారితో అత్యవసరంగా మాట్లాడదలిచినా, సమాచారం అందజేయాలని భావించినా ఇందులో ప్రత్యేక ఆఫ్షన్లు ఉంటాయి. కలెక్టర్ మాత్రం ఒకేసారిగా 35 మందితో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, ఆయా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో కలెక్టర్ ఇట్టే పసిగట్టేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ఫోన్లు డైరెక్ట్‌గా మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి. మహిళా అధికారులు ఎక్కడైనా తనిఖీలకు వెళ్లిన సమయంలో ఏదేని ప్రమాదం తలెత్తినా, ఆపదలో ఉన్నా.. ఇందులోని ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ బటెన్‌ను నొక్కగానే అందరికీ సమాచారం క్షణాల్లో వెళ్తుంది. సమీపంలోని ఉన్నతాధికారులు తక్షణం అక్కడికి చేరుకుని అండగా నిలుస్తారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, తాను ఏదేనా సమాచారం పంపిన పక్షంలో, అధికారులు ఇతర పనుల్లో ఉంటే ఆ వివరాలు ఈ ఫోన్లలో అట్టే నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా ఆపదలో ఉన్న పక్షంలో ఆరంజ్ కలర్ బట్టన్‌ను నొక్కితే చాలు అని, తనతో పాటుగా అందరం తక్షణం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటామని వివరించారు. సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లేందుకే ఈ ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
ఆకలి చావులు లేని భారత్ కోసం..
మోపిదేవి (అవనిగడ్డ): భారత్‌ను ఆకలి చావులు లేని దేశంగా చూడాలన్నది ఆ యువకుడి కల. దానికోసం తనవంతు ప్రయత్నంగా దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వ్యవసాయానికి దూరమవుతున్న వారిని తిరిగి సాగు వైపు మళ్లించటమే లక్ష్యంగా దేశవ్యాప్త యాత్ర చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈడిగ ప్రదీప్‌కుమార్.. అనంతపురానికి చెందిన యువకుడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రదీప్ ఫిబ్రవరి 23న ఈ యాత్రను చేపట్టాడు. తొలుత పాదయాత్రగా ప్రారంభించినప్పటికీ, యాత్ర నెల్లూరుకు చేరిన సమయంలో అక్కడి స్థానికులు ఆదరించి అతను వద్దని చెప్పినా సైకిల్ కొనిచ్చారు. అప్పటి నుంచి సైకిల్‌పై యాత్ర కొనసాగిస్తున్నాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతని తల్లిదండ్రులు తొలుత ప్రదీప్ యాత్రను వ్యతిరేకించినా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూశాక ప్రోత్సహించటం మొదలుపెట్టారు. జాతీయ జెండా చేబూని, ఆదరించిన వారి నుంచి భోజనం స్వీకరిస్తూ, భోజనం దొరకని రోజున మంచి నీళ్లే ఆహారంగా చేసుకుని ప్రదీప్ తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులను గమనించి, అందుకు గల కారణాలను అన్వేషిస్తూ, సాగు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రదీప్ యాత్ర గురువారం కృష్ణా జిల్లాలోని మోపిదేవికి చేరింది. స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రదీప్‌ను దివిసీమ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
చైనాలో భారత్ కొత్త రాయబారికి క్వారంటైన్
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్‌కుమార్ రావత్‌ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్‌ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్‌లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్‌లలో కూడా పనిచేశారు. (చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం) -
సిబ్బందే.. అటవీ సంరక్షకులు
సాక్షి, అమరావతి: అటవీ సంపదను కాపాడడంలో సిబ్బందిదే కీలకపాత్ర అని అటవీ శాఖ ముఖ్య ప్రధాన సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ అన్నారు. ఇప్పటికే అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరులోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అటవీ శాఖలో కొందరు ఉద్యోగులు అడవులను, అటవీ సంపదను కాపాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసారని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరితగతిన అందజేస్తామని చెప్పారు. కోవిడ్ సమయంలో దురదృష్టవశాత్తూ 38 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందించామని తెలిపారు. -
అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సచివాలయంలో ప్రదీప్ కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరువు కార్యాచరణ ప్రణాళిక అమలు, భూగర్భజలాలు, విద్యుత్ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటాసేకరణ, విశ్లేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్లో అధిక నిధులు ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామని, రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని, ప్రధాన రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, వడగాడ్పులపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కర్ణాటక రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినందుకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్ట్
-
ముగిసిన ప్రదీప్ పోలీసు కస్టడీ
బంజారాహిల్స్: ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్లు (జేఎన్ఆర్ఎం) ఇప్పిస్తానంటూ అమాయక బస్తీవాసులను నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మెరుగు ప్రదీప్‌కుమార్ పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. ఈ నెల 13న ప్రదీప్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా చీటింగ్ కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఈ నెల 22న మరోసారి పోలీసు కస్టడీకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని ఇందిరానగర్ జవహర్‌నగర్‌కు చెందిన జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్‌కుమార్ మూడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–46లోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం పక్కా ఇళ్లను ఇప్పిస్తానంటూ ఇందిరానగర్, జవహర్‌కాలనీ వాసులను నమ్మించాడు. వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీ పేరుతో లెటర్‌హెడ్స్ తయారు చేసి ఇళ్లు మంజూరవుతున్నాయని తనకున్న పరిచయాలతో వాటిని ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల దాకా వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లను ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు నిలదీయగా తాను రామ్మోహన్ అనే వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చానని అతను తనను మోసం చేసినట్లు తెలిపాడు. వసూలు చేసిన డబ్బులు ఇస్తానంటూ కాలం వెల్లదీశాడు. మూడేళ్లు గడిచినా ఇళ్లు రాకపోగా డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు 30 మందిని రూ.36 లక్షల మేర మోసం చేశాడంటూ కృష్ణానగర్‌లో ఉంటున్న వెంకట్ అనే వ్యక్తి ద్వారా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రదీప్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఏసీబీ వలలో ఏపీ ప్లానింగ్ అధికారి
సాక్షి, అమరావతి/ విశాఖ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి చిక్కాడు. కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఆస్తులు కూడబెట్టిన అతడి ‘కంత్రీ’ ప్లానింగ్‌ను ఏసీబీ రట్టు చేసింది. విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ పసుమర్తి ప్రదీప్‌కుమార్, అతడి బంధువులు, స్నేహితుల నివాసాలపై సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించింది. పదోన్నతి పొందిన కొద్ది రోజులకే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఏసీబీ దాడులు చేయడం గమనార్హం. సోదాల్లో పలు విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల కట్టలు, బ్యాంకు పాసు పుస్తకాలను ఆధికారులు స్వాధీనం చేసుకున్నారు. 9.20 ఎకరాల వ్యవసాయ భూమి, ఐదు ఖాళీ స్థలాలు, నాలుగు ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రదీప్‌కుమార్‌కు చెందిన మూడు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలను బట్టి బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.50 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలకు చెందిన ప్రదీప్‌కుమార్ 1984 మే 5న పట్టణాభివృద్ధి సంస్థలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా చేరారు. -
ఒక్క మనిషి.. రెండు జీవితాలు
ఐశ్యర్యారాయ్కి రాత్రి ఎవరైనా పరిచయం అయితే మార్నింగ్ కల్లా మర్చిపోతారు. ఆ తర్వాతి రోజు ఉదయం మాత్రమే వాళ్లను గుర్తుపట్టగలరు. అలాగే.. మార్నింగ్ ఎవరైనా పరిచయం అయితే నైట్ కల్లా మర్చిపోతారు. మళ్లీ సేమ్.. అంటే.. తర్వాతి రోజు రాత్రి వస్తే కానీ వారు గుర్తుకురారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వన్ పర్సన్... టూ లైఫ్స్ అన్నమాట. దీన్నే ‘మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఈ కాన్సెప్ట్ పైనే బాలీవుడ్లో ఒకప్పుడు సత్యన్ బోస్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్, నర్గీస్, ఫిరోజ్ ఖాన్ ముఖ్య పాత్రల్లో ‘రాత్ ఔర్ దిన్’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌లో ఐశ్యర్యారాయ్ లీడ్ రోల్లో నటించనున్నారని బాలీవుడ్ ఖబర్. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ‘ఫ్యానీ ఖాన్’ సినిమా షూటింగ్ కంప్లీట్ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట. ‘ఫ్యానీఖాన్’ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాడు హెచ్ఐవీ పేషెంట్.. నేడు బాడీ బిల్డర్
► ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్ఫూర్తిదాయకం ► పట్టుదలతో హెచ్ఐవీని జయించిన వైనం ► మిస్టర్ మణిపూర్, మిస్టర్ సౌత్ ఏషియా నిలిచిన మణిపూర్ వాసి సాక్షి, మణిపూర్: సంకల్పం మనిషిని ఎన్ని మెట్లు అయినా ఎక్కిస్తుంది.. చేరుకోలేని విజయ తీరాలకు చేరుస్తుంది.. ఈ మాటకు నేడు సజీవ సాక్ష్యంగా నిలిచాడు మణిపూర్‌కు చెందిన బాడీ బిల్డర్ ప్రదీప్ కుమార్ సింగ్. 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియా టైటిల్ గెలిచిన ప్రదీప్ నిజ జీవితంలో ఒక హెచ్ఐవీ పేషెంట్. 2000 సంవత్సరంలో అనుకోకుండా రక్త పరీక్షలు చేయించుకోవడంతో తనలో ఉన్న ప్రాణాంతక వ్యాధి బయట పడిందని ఆయన తెలిపాడు. హెచ్ఐవీ అనే విషబీజం తనలో ఉన్నా.. దానికెప్పుడు భయపడలేదని.. దానిని జయించేందుకు మార్గాలు అన్వేషించానని నేడు గర్వంగా చెబుతున్నాడు. బాడీ బిల్డర్‌గా.. హెచ్ఐవీ ఉందని తెలిశాక ప్రదీప్కుమార్ని బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల, గ్రామస్థులు దాదాపుగా అందరూ వెలివేసినంత పనిచేశారు. ఈ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోని ప్రదీప్ తన సోదరి సూచనతో బాడీ బిల్డింగ్వైపు దృష్టి సారించాడు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, క్రమపద్దతిలో ఆహారం తీసుకోవడంతో శరీరాన్ని పెంచుకున్నాడు. పట్టుదలతో.. హెచ్ఐవీని జయించడంలో శారీరక ఆరోగ్యానిది ప్రధానపాత్ర కావడంతో తీసుకునే ఆహారం మొదలు.. చేసే వ్యాయామం.. అందుకు తగ్గ విధంగా బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజులను పట్టుదలతో చేసేవాడు. తనలో ఒక వైరస్ ఉందన్న విషయాన్ని సైతం మర్చిపోయి బాడీ బిల్డింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఆ క్రమంలోనే 2007లో మిస్టర్ మణిపూర్‌గా, 2012లో మిస్టర్ సౌత్ ఏషియాగా నిలిచాడు. 17 ఏళ్లుగా... ప్రదీప్ కుమార్‌కు హెచ్ఐవీ బయటపడి సరిగ్గా 17 సంవత్సరాలు.. ఇన్నేళ్లలో అతను చిన్నచిన్న అనారోగ్యాలను కూడా గురికాలేదు. తనలాగే హెచ్ఐవీ బాధితులంతా.. మనో నిబ్బరంతో, పట్టుదలతో శరీరాన్నికాపాడుకుంటే వ్యాధిని జయించడం పెద్ద కష్టమేం కాదని ప్రదీప్ చెబుతున్నాడు. హెచ్ఐవీ సోకితే జీవితం ముగిసిపోయిందన్న మాటకు ముగింపు పలకడమే తన లక్ష్యం అని పేర్కొన్నాడు. ఫిజికల్ ట్రయినర్‌గా.. ప్రస్తుతం ప్రదీప్ కుమార్ వయసు 45 ఏళ్లు. బాడీ బిల్డర్‌గా అతను సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మణిపూర్ ప్రభుత్వం అతడిని యువ క్రీడాకారులకు ఫిజికల్ ట్రయినర్‌గా నియమించింది. అంతేకాక హెచ్ఐవీ/ఎయిడ్స్‌కు అతన్ని ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం చేసింది. -
మిస్టరీ డెత్
-
రాజకీయ నిర్ణయమే ఫైనల్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపో తల పథకం కొత్తదా, పాతదా అనే అంశాన్ని కేంద్ర జలసంఘం తేల్చజాలదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ అధికారం సీడబ్ల్యూసీకి లేదని తేల్చిచెప్పింది. కేవలం తాము సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేది కలోని అంశాలపై అభ్యంతరాలుంటే మాత్ర మే చెప్పాలని, వాటిపై వివరణ ఇస్తామని తెలిపింది. ప్రాజెక్టు కొత్తదా, పాతదా అనే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా లు చర్చించుకొని రాజకీయ నిర్ణయానికి వస్తాయని, దానికి అనుగుణంగా కేంద్రం ఎలా చెబితే అలా నడుచుకుంటామంది. సోమవారం ఈ మేరకు సీడబ్ల్యూసీ ముందు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జరిగిన సమీక్ష సందర్భంగా రాష్ట్రం తన అభిప్రాయా న్ని వెల్లడించినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ప్రజెంటేషన్‌లో తెలంగాణ లేవ నెత్తిన అనేక అంశాలను సీడబ్ల్యూసీ సభ్యుడు ప్రదీప్ కుమార్ తప్పుపట్టి నట్లుగా తెలిసింది. ప్రాజెక్టు పూర్తి స్వరూపం, నీటిని తీసు కునే బేసిన్ మార్చాక కొత్త ప్రాజెక్టుగానే భావించాల్సి ఉం టుందని ఆయన అడ్డుపడ్డ ట్లుగా సమాచారం. అయితే ఇక్కడే తెలంగాణ గట్టిగా వ్యతిరేకించినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ‘ప్రాజెక్టు కొత్త దా, పాతదా అనేది రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకొని నిర్ణయానికి వస్తాయి. లేని పక్షంలో కేంద్రం ఈ ప్రాజెక్టుపై తేలుస్తుంది. అంతే తప్ప గోదావరి బోర్డు ద్వారా అనుమ తుల ప్రక్రియ జరగాలని చెప్పజాలరు’ అని పేర్కొన్నాయి. దీంతో తమ అభ్యంతరాల ను లిఖిత పూర్వకంగా తెలియజేస్తామని, వాటిపై సమాధానాలు పంపాక, అను మతు ల అంశమై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ చెప్పింది. కేబినెట్ భేటీ ముగిశాక నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం కు ఈ అంశమై వివరించినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ లేవనెత్తే అంశాలను పరిశీలించాకే తదుపరి కార్యాచరణ సిద్ధం చేద్దామని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. -
సెల్లార్లు పార్కింగ్‌కే పరిమితం
చీరాల అర్బన్ : ప్రైవేట్ హాస్పిటళ్లలో వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్లలో ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 15 ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనాలు నిర్మించే సమయంలో సెల్లార్లుగా రికార్డుల్లో చూపించి అందులో ల్యాబ్‌లు, ఆఫీసులు, స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చీరాల్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లు పార్కింగ్‌కు వినియోగించడం లేదన్నారు. హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్‌లు, రోగుల తరఫు వాహనాలను రోడ్డుపై నిలిపేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. అగ్నిప్రమాదం జరిగితే తీరని నష్టం మిగులుతుందన్నారు. గతంలోనూ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, వారికి మరోమారు నోటీసులిస్తామని చెప్పారు. భవన నిర్మాణం చేసే సమయంలో ఇచ్చిన ప్లానుకు విరుద్ధంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారని, అటువంటి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాను ఆమోదం పొంది ప్లానుకు వ్యతిరేకంగా నిర్మించిన వాటిని తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రీజియన్ పరిధిలో నెల్లూరు జిల్లాలో ఈ నిబంధనలు అమలు చేశామని, ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.బ్రహ్మయ్య, టాస్క్ఫోర్సు సిబ్బంది కె.ఎం.చంద్రశేఖర్, మల్లిఖార్జునరావు, అంకయ్య, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. -
29 మందికి ‘ఇస్కా’ పురస్కారాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జరుగుతున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా 16 మంది శాస్త్రవేత్తలను ఇస్కా 2016–17 బెస్ట్ పోస్టర్ అవార్డులకు ఎంపిక చేశారు. మరో 13 మందికి ఇస్కా యంగ్ సైంటిస్ట్ పురస్కారాలను ప్రకటించారు. కెమికల్ సైన్సెస్‌లో ఏపీకి చెందిన ప్రదీప్‌కుమార్ బ్రాహ్మణ్ బెస్ట్ పోస్టర్ అవార్డును గెలుచుకున్నారు. బెస్ట్ పోస్టర్ అవార్డులు.. పశువైద్య, మత్స్య శాస్త్ర రంగంలో లక్నో వర్సిటీకి చెందిన యషికా అవస్థి, జలగావ్‌లోని నార్త్ యూనివర్సిటీకి చెందిన యోగితా వై ఫలక్... ఆంత్రోపాలజీ, సైకాలజీ విద్యారంగంలో ఢిల్లీ వర్సిటీకి చెందిన సంగీత దే, కోల్‌కతా వర్సిటీకి చెందిన నందినీ గంగూలీ అవార్డులు అందుకున్నారు. కెమికల్ సైన్సెస్‌లో కురుక్షేత్ర యూనివర్సిటీకి చెందిన ఆర్తి దలాల్, ఏపీలోని కేఎల్ వర్సిటీకి చెందిన ప్రదీప్‌కుమార్ బ్రాహ్మణ్... ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సైన్సెస్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వారణాశి)కి చెందిన మయాంక్ అగర్వాల్, మైసూర్‌కు చెందిన అజిత్ కె.అబ్రహం తదితరులు అవార్డులు అందుకున్నారు. యంగ్ సైంటిస్ట్ అవార్డులు వీరికే...: అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ సైన్సెస్‌లో బప్పా దాస్(గోవా), వెటర్నరీ అండ్ ఫిషరీస్ సైన్సెస్‌లో జీబీ శ్రీకాంత్(గోవా), ఆంత్రోపాలజీలో నివేదితా సోమ్(కోల్‌కతా), కెమికల్ సైన్సెస్‌లో సత్యాబడి మోర్తా(భువనేశ్వర్), ఎర్త్ సిస్టమ్ సైన్సెస్‌లో గోవాకు చెందిన షీతల్ పీ గోదాడ్, ఇంజనీరింగ్ సైన్స్‌లో ఖరగ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన నందిన బండారు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ప్రవీణ్ ధ్యాని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో కోల్‌కతా యూనివర్సిటీకి చెందిన అభిరూప్ బెనర్జీ అవార్డులు అందుకున్నారు. అలాగే మెటీరియల్స్ సైన్స్‌లో అంజిలీనా కోర్కెటా(కాన్పూర్), మెడికల్ సైన్స్‌లో సభ్యసాచి దాస్(మెడినిపూర్), న్యూ బయాలజీలో బోధిసత్వ సాహ(కోలకతా), ఫిజికల్ సైన్స్‌లో ధర్మేంద్ర పతాప్ సింగ్(లక్నో), ప్లాంట్ సైన్స్‌లో నేహా పాండే(లక్నో)లు అవార్డులు అందుకున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ పేర్కొంది. -
మళ్లీ మీ కడుపునే పుడతా
హైదరాబాద్(చైతన్యపురి): ''నేను ఉండి ప్రయోజనం లేదు...ఏదీ సాధించలేక పోతున్నా...ఒకటిన్నరేళ్లుగా ఒక్క ఎగ్జామ్‌లో కూడా క్వాలిఫై కాలేదు...అంతా టైం వేస్టు...మనీ వేస్ట్.. అందుకే ఇక సెలవ్..ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నా...'' టూ ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ప్రైవేట్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా శివరాంపూర్ గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్(23) డిగ్రీ పూర్తి చేశాడు. ఏడాదిన్నరగా పోటీపరీక్షలకు సిద్ధమవుతూ లలితానగర్‌లోని చిరంజీవి హాస్టల్లో ఉంటున్నాడు. అయితే ఏ ఒక్క పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్థాపానికి లోనైన అతను శుక్రవారం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ జన్మ ఉంటే మీ కడుపునే పుడతా అంటూ తల్లిదండ్రులకు, అమ్మను..తమ్ముడిని బాగా చూసుకోమని బాబాయిని ఈ లేఖలో కోరాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
చిట్ ఫండ్ పేరు తో కుచ్చుటోపీ
నమ్మకంగా ఉంటూ చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు.. వినియోగదారులకు సంబంధించిన రూ.కోటి వసూలు చేసుకుని కనిపించకుండా పోయిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మారుతి చిట్‌ఫండ్ సంస్థ కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల చిట్టీలు పాడుకున్న వారికి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. గత రెండు రోజులుగా నిర్వాహకులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. అనుమానం వచ్చిన బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సుమారు 50 మంది బాధితులు నేరేడ్మెట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్స్ డైరెక్టర్లు సునీల్ కుమార్, పుష్పరాజ్, ప్రదీప్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వద్ద సుమారు రూ.కోటి వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు. -
హుందా నటుడు...
నాగిన్ స్టార్ హిందీలో ప్రదీప్ కుమార్లో కనిపించే హుందాతనం తెలుగులో హరనాథ్‌లో చూసేవాళ్లమా? చక్కటి రూపాలతో హుందా అయిన నటనతో ఆకట్టుకున్నవాళ్లే ఇద్దరూ. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ వెండితెర మీద ఒక వెలుగు వెలిగి నిశ్శబ్దంగానే తెరమరుగు అయ్యాడు. తొలి రోజుల్లో ఆయన నటించిన ‘ఆనంద్ మఠ్’ క్లాసిక్. అందులో ‘వందే మాతరం’... అంటూ ఆయనపై చిత్రీకరించిన పాట పెద్ద హిట్. బీనాదేవితో చేసిన ‘అనార్కలి’, వైజయంతి మాల తో చేసిన ‘నాగిన్’ ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘తాజ్ మహల్’ వంటి మ్యూజికల్‌కు ఆయనే కథానాయకుడు అన్న విషయం కూడా ఎవరూ మర్చిపోరు. మొదట బెంగాలీ సినిమాల్లో ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించిన ప్రదీప్ కుమార్ ఆ రోజుల్లో లీడింగ్ హీరోయిన్లందరితోనూ నటించాడు. వాళ్లలో మీనా కుమారితో ఆ తర్వాత మధుబాల తో చాలా సినిమాలు చేశాడు. కాని మలిదశ హీరోయిన్లు ఆయన పక్కన కనిపించడానికి పెద్దగా ఇష్టపడలేదు. మీనా కుమారితో ఆయనకు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ‘ఆప్నే యాద్ దిలాయాతో ముఝే యాద్ ఆయా’ (ఆర్తి), ‘హమ్ ఇంతెజార్ కరెంగే తెరా ఖయామత్ తక్’ (బహు బేగమ్), ‘దిల్ జో న కెహ్ సకా’ (భీగీ రాత్)... ఇలా చెప్తే చాలానే ఉన్నాయి. ‘తాజ్ మహల్’ చేశాక ప్రదీప్ కుమార్ రాను రాను జమిందారు, నవాబు వంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది. డబ్బున్న పెద్దమనిషి పాత్ర చేయాలంటే ప్రదీప్ కుమార్‌నే పిలిపించేవారు. అయితే అవేమీ ఆయనకు పేరు తెచ్చిన పాత్రలు కాదు. చివరి వరకూ ఆర్థికంగా కూడా హుందాగానే జీవించిన ప్రదీప్ కుమార్ 2001లో తన 76వ ఏట మరణించాడు. అయినప్పటికీ ఇవాళ్టికీ ఆయన పాట వినిపించకుండా ఈ దేశంలో రోజు గడవదు. ‘జో వాదా కియా ఓ నిభానా పడేగా... నిభానా పడేగా’... -
హైదరాబాద్‌కు భూకంప ప్రభావం లేదు
హైదరాబాద్ : భూకంపాల ప్రభావం హైదరాబాద్ నగరంపై అంతగా ఉండదని ట్రిపుల్ ఐటీ ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (ఈఈఆర్‌సీ) హెడ్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్ రామన్ చర్ల తెలిపారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం సాక్షితో మాట్లాడారు. భూకంపంపై అంతగా భయపడాల్సిన అవసరం లేకపోయినా... నగరంలో ఇళ్ల నిర్మాణం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన నగరవాసులకు సూచించారు. విపత్తులను తట్టుకునే రీతిలో కట్టడాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భూకంపాలపై అవగాహన కల్పించేందుకు ఈఈఆర్‌సీ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు చిన్న పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేశామని చెప్పారు. -
కొలిక్కి వచ్చిన బంగారం చోరీకేసు
యైటింక్లయిన్‌కాలనీ : గోదావరిఖని టూటౌన్పోలీస్స్టేషన్ పరిధి సెంటినరీకాలనీలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసు ఓకొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఈనెల 22న వేకువజామున సెంటినరీకాలనీలోని ఉప్పుల కనకాచారికి చెందిన శ్రీరామ నగల దుకాణంలో చోరీ జరిగింది. షాప్ వెనక తలుపు పగులగొట్టి ఆభరణాలు, అప్పుకాగితాలున్న లాకర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈలాకర్లో కిలో బంగారం, ఆరుకిలోల వెండి, రూ. 7లక్షలు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోదావరిఖని డీఎస్పీ మల్లారెడ్డి, టూటౌన్ సీఐ క్రిష్ణ, కమాన్‌పూర్ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ వెంటనే రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించారు. పరిచయం ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈమేరకు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్ రప్పించి తనిఖీ చేపట్టారు. కొన్ని కీలక ఆధారాలను సేకరించి విచారణ వేగవంతం చేశారు. ఈక్రమంలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. మండలంలోని ఆదివారం పేటకు చెందిన నలుగురితో పాటు సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన మరోఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా అనుమానించారు. గ్రామ శివారులోని పొల్లాల్లో లాకర్‌ను తీసుకెళ్లి పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని లాకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 24గంటల్లోపే చోరీకేసు ఛేదన.. చోరీ జరిగిన 24గంటల్లోపే నిందితుల వివరాలు, లాకర్ గురించి పోలీసులు వివరాలు సేకరించారు. సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి చోరీని సీరియస్‌గా తీసుకున్నారు. కొద్దిరోజులుగా షాపు వద్ద అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి విచారణ జరిపారు. దీంతో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బంగారాన్ని కుదువ పెట్టి అప్పులు తీసుకున్న వ్యక్తులపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఆదివారంపేటకు చెందిన నలుగురు, సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది. అయితే బాధితుడు ఫిర్యాదు చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో బంగారు, వెండి ఆభరాణాలతో పాటు అప్పు పత్రాలు కూడా లాకర్లో ఉన్నట్లుగా సమాచారం. మరికొద్దిరోజులైతే కేసు పీఠముడి విడిపోనుంది. -
ఫేస్బుక్ యాజమాన్యం నుంచి రక్షించండి!
హైకోర్టులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఫేస్‌బుక్‌లోని లోపాలను, నంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు అది చేస్తున్న మోసాలను ఎత్తిచూపినందుకు తనపై ఆ వెబ్సైట్ యాజమాన్యం దాడులు చేయిస్తోందని, వారి నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలంటూ ప్రదీప్ కుమార్ మానుకొండ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైకోర్టును ఆశ్రయించారు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్నప్పుడు ఫేస్బుక్లో డాటా సెంటర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యానని, ఆ సందర్భంగా ఫేస్బుక్ లోపాల గురించి వివరించానన్నారు. ఫేస్బుక్ యాజమాన్యం మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం.. ఒకే వ్యక్తి అనేక అకౌంట్లు సృష్టించుకునేందుకు సహకరిస్తున్నట్లు ఆ సమయంలో తెలుసుకున్నానని, దీంతో ఆ విషయాన్ని బయటపెడతానన్న ఉద్దేశంతో ఐడియాస్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ కోసం దాడులు చేయించారని తెలిపారు. తనకూ అల్‌కాయిదాకు సంబంధాలు ఉన్నట్లు ఫేస్బుక్లో ఫొటోలతో పోస్టులు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. హైదరాబాద్‌కు వచ్చాక తనపై కత్తితో హత్యాయత్నం కూడా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి
తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను వెంటనే తొలగించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత పదవిలో ఉన్నా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, చైర్మన్‌గా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడింది. సంఘం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు గురువారం కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. -
అవసరం మేరకే ఏర్పాట్లు
సాక్షి, రాజమండ్రి : అనుకున్నదొకటి... అయ్యిందొకటి... గోదారమ్మకు పుష్కరాలు సందర్భంగా రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు మహర్దశ పడుతుందన్న పలువురి ఆశలపై దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ నీళ్లు జల్లారు. కేవలం అదనపు రద్దీని తట్టుకునేందుకు మాత్రమే ఏర్పాట్లు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమశాఖ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోందని ఆయన తేల్చి చెప్పారు. టౌన్‌స్టేషన్‌లో అదనంగా రెండు ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లు, తూర్పు రైల్వే స్టేషన్ మరిం త అభివృద్ధి, గోదావరి స్టేషన్‌కు మరోకొత్త ప్లాట్ ఫాం, కొత్తలైను, అదనపు హంగులు వంటివి పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ప్రాతి పదికన రైల్వేస్టేషన్లకు దక్కుతాయని ప్రజాప్రతినిధులు ఊహించారు. వాటికి బ్రేక్ వేస్తూ వా త్సవ స్పందించారు. వచ్చే సంవత్పరం జరగబోయే గోదావరి పుష్కరాలను ఎదుర్కొనేం దుకు చేపట్టాల్సిన పనులపై బుధవారం ఆయ న రాజమండ్రి వచ్చారు. టౌన్, గోదావరి రైల్వేస్టేషన్లను పరిశీలించారు. అదనపు రద్దీని ఎదుర్కొనడానికి ఏవేమి సదుపాయాలు కావాలో వాటినే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనపు హంగులకు తమ వద్ద నిధులు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది రానివ్వం పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని శ్రీవాత్సవ పేర్కొన్నారు. రద్దీకి తగ్గట్టుగా అదనపు బుకింగ్ కౌంటర్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక ప్రాతిపదికన ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేస్తామన్నారు. కొంత రద్దీని తూర్పు ప్రాంత రైల్వేస్టేషన్ నుంచి మళ్లించేందుకు రోడ్డు వెడల్పు వంటి అంశాలను ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. అవసరమైతే తమ స్థలాన్ని విస్తరణకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల అసంతృప్తి కాగా రైల్వేస్టేషన్లో ప్లాట్ ఫాంలు శాశ్వత ప్రాతిపదికన విస్తరించాలంటే అదనపు నిధులు అవసరమన్నారు. శాశ్వత విస్తరణ దిశగా జీఎం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయనను కలిసిన ప్రజాప్రతినిధులు నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్లో తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, పుష్కర పనుల్లో కూడా ఇలాగైతే ఎలా అని రాజమండ్రి రూరల్, సిటీ ఎమ్మెల్యేలతో పాటు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు ఎమ్మెల్యేలు జీఎం ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. జీఎం పర్యటన సాగిందిలా.... దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ హైదరాబాద్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రాజమండ్రి చేరుకున్నారు. ముందుగా డీఆర్ఎం ప్రదీప్‌కుమార్ ఇతర వివిధ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తొమ్మిది గంటలకు టౌన్స్టేషన్లోని మొదటి, రెండో ప్లాట్ ఫాంలను పరిశీలించారు. అక్కడి నుంచి తూర్పు రైల్వే స్టేషన్‌కు చేరుకుని మూడో ప్లాట్ ఫారం నుంచి తూర్పు స్టేషన్ మధ్యలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్తగా ప్లాట్ ఫారాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించారు. దిగిన ప్రయాణికులు మొదటి ప్లాట్ ఫాంకు ఎలా వెళ్లాలి, ఫుట్ ఓవర్ ప్లాట్ ఫాంలు ఎక్కడ వేయాలి అనే విషయాలను స్థానిక అధికారులు జీఏంకు వివరించారు. తూర్పు రైల్వేస్టేషన్ వద్ద అదనంగా మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలతో పాటు, ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. రైలు దిగిన తర్వాత ప్రయాణికులు నేరుగా బయటకు వచ్చేందుకు మెట్లు, అడ్డంకులు లేని విధంగా ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదావరి కీలకం గోదావరి స్టేషన్ నుంచి పుష్కర్‌ఘాట్ సహా పలు స్నానఘట్టాలు అతి దగ్గరలో ఉన్నందున సాధారణ ప్రయాణికులు ఇక్కడ దిగేలా ఏర్పాట్లు చేయాలని జీఏం అధికారులను కోరారు. టౌన్‌స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో గోదావరి స్టేషన్‌కు చేరుకున్న శ్రీవాత్సవ అక్కడి ఏర్పాట్లపై కూడా పలు సూచనలు చేశారు. స్టేషన్లో ఉన్న ఖాళీ స్థలం వినియోగించుకుని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కోటగుమ్మం వైపున ఉన్న మార్గాన్ని పుష్కరాలకు ప్రధాన ముఖ ద్వారంగా అభివృద్ధి చేస్తే ప్రజలు కాలినడకన నేరుగా స్నానఘట్టాలకు వెళ్లిపోయే వీలుంటుందన్నారు. ఇదే ప్రాంతంలో అదనంగా మరుగుదొడ్లు, మంచినీరు, ఆహార పదార్థాల విక్రయ స్టాళ్లు ఏర్పాటు చేయాన్నారు. అవసరమైనన్ని బుకింగ్ కౌంటర్లు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జీఎంను కలిసిన నేతలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టౌన్‌స్టేషన్‌లో జీఎంను కలసి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని కోరారు. రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా కలుసుకుని పుష్కర పనులపై వినతులు చేశారు. జీఎం వెంట సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు చీఫ్ కమర్షియల్ మేనేజర్ జేపీ షా, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ, విజయవాడ డివిజన్లోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, రాజమండ్రి టౌను, గోదావరి స్టేషన్ సూపరింటెండెంట్లు బీసీహెచ్ శాస్త్రి, జి.వాసు ఉన్నారు. -
సిగరెట్‌కోసం హత్య
న్యూఢిల్లీ: సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో ఓ యువకుడిని కాల్చి చంపారనే ఆరోపణలపై ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటన జూలై 1న, సియానీ గేట్ ప్రాంతంలో జరిగింది. సిగరెట్ ఇచ్చేందుకు నిర్మల్ నిరాకరించడంతో ప్రదీప్‌కుమార్, రాహుల్‌లు అతణ్ని నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని దర్యాప్తులో తేలింది. నిర్మల్‌ను కాల్చి ఘటనా స్థలం నుంచి ఇద్దరూ పారిపోయారు. దీనిని గమనించిన స్థానికులు నిర్మల్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అప్పటికే నిర్మల్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లభించిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సోమవారం ఇద్దరు పట్టుబడ్డారు. వారి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. -
ఒంగోలులో డీఆర్ఎం విస్తృత తనిఖీలు
ఒంగోలు : విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ప్రదీప్‌కుమార్ గురువారం ఉదయం ఒంగోలు రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దాదాపు మూడుగంటల పాటు స్టేషన్‌లోని అన్ని విభాగాలను కలియతిరిగారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఒంగోలు చేరుకున్న ఆయనకు స్టేషన్ సూపరింటెండెంట్ తూనుగుంట సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ రమణారావు, ట్రాక్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ప్లాట్‌ఫారాలను పరిశీలించిన డీఆర్ఎం.. పలుచోట్ల టైల్స్ ఎత్తుపల్లాలుగా ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గమనించి సంబంధింత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి కుళాయిలు తిప్పినప్పుడు నీరు ప్లాట్‌ఫారంపై పారడంతో ప్రయాణికులు జారిపడితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. పలుచోట్ల సీలింగ్ దెబ్బతినడాన్ని గుర్తించారు. వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. అనంతరం మెటల్ డిటెక్టర్ల పనితీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి వల్ల ఉపయోగం లేకపోగా ప్రయాణికులకు అడ్డంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఆర్ఎం పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో పార్కులు పెంచాలని, పార్కులు స్వచ్ఛందంగా నిర్వహించేందుకు ముందుకొచ్చేవారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రయాణికులతో మాటామంతీ.. అనంతరం ప్రయాణికులతో డీఆర్ఎం ప్రదీప్‌కుమార్ మాట్లాడారు. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? లోపాలు ఏమైనా ఉన్నాయా? సౌకర్యాలు ఇంకా పెంచాలా..? అని అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ స్టేషన్లో తాగేందుకు మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇప్పుడు సరఫరా అవుతున్న నీరు తాగేందుకు పనికి రావని చెప్పారు. టాయిలెట్ల వద్ద ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా జనరల్ టికెట్ కొన్న ప్రయాణికులు నేరుగా జనరల్ వెయిటింగ్ హాలులోని టాయిలెట్లను వినియోగించుకోవచ్చని డీఆర్ఎం చెప్పారు. లిఫ్ట్ సౌకర్యం గురించి మాట్లాడగా ఒంగోలుకు రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్ మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆటోవాలాల నుంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్పీఎఫ్ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని ఉన్నతాధికారులను డీఆర్ఎం ఆదేశించారు. -
రైల్వే సిబ్బంది పనితీరుపై డీఆర్ఎం ఆగ్రహం
సామర్లకోట, న్యూస్‌లైన్ :రైల్వే సిబ్బంది పనితీరుపై డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శని వారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట వచ్చిన ఆయన అన్నవరానికి కుటుంబ సభ్యులతో కారులో వెళ్లా రు. తిరిగి వచ్చిన అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్ మధ్య డ్రెయిన్‌లో మురుగు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి ద్వా రా మురుగు పోయేలా ఏర్పాటు చే యాలని ఆదేశించారు. దీనిపై ఇం జనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బం దిని మందలించారు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్నల్ సెక్షన్ ఇంజ నీర్ అన్వర్‌బాషాను పనితీరు మెరు గు పర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై పార్సిల్ కార్యాలయం వద్ద తాగునీరు వేడిగా రావడం, కుళాయిలు సక్రమంగా పనిచేయక పోవడంపై మండిపడ్డారు. రైల్వే లిఫ్టు వద్ద ఉన్న తాగునీటి ప్రదేశానికి బోర్డు లేకపోవడం, చెత్త ఎక్కువగా ఉండడంతో సిబ్బందిని మందలించారు. స్టేషన్ మేనేజర్ కార్యాలయం, విశ్రాంతి గ దులు, ప్లాట్ఫారంను పరిశీలించి, లిఫ్టు పనితీరుపై ఆరా తీశారు. కాగా జిల్లా మీదుగా ప్రయాణించే రైళ్లకు అదనపు బోగీలు కేటాయించడంపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుం దని ప్రదీప్‌కుమార్ అన్నారు. పలువురు ప్రయాణికులు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. రైలుకు కనీసం 4 సాధారణ బోగీలు ఏర్పా టు చేసి, ముఖ్యమైన రైళ్లు నాలుగు నిమిషాలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీని యర్ డివిజనల్ మేనేజర్ అమిత్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్వీవీ సత్యనారాయణ, ఎస్డీఎం (ఆపరేషన్స్) కె. సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఏడీఈఎన్ సీహెచ్ తులసీరామ్, పబ్లిక్ వే ఇన్స్పెక్టర్ ఆర్.సత్యం, ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, కె.కామేశ్వరరావు, ఆర్పీఎఫ్ సీఐ బి.రాజు, ఏఎస్సై డీవీ నరసింహరావు, రైల్వే ఎస్సై ఎస్.గోవిందరెడ్డి తదితరులు ఉన్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఆయన సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లారు. -
త్వరలో పుష్పుల్ రైలు
వికారాబాద్, న్యూస్‌లైన్: ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు ఇప్పట్లో వికారాబాద్‌కు అందే అవకాశం లేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ అన్నారు. దీనికి ప్రత్యమ్నాయంగా హైదరాబాద్ నుంచి తాండూరు వరకు త్వరలో పుష్పుల్ రైలును నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రాతో కలిసి మంగళవారం వికారాబాద్ రైల్వే జంక్షన్‌ను జీఎం తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలు వికారాబాద్ వరకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 50 శాతం నిధులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఆ నిధులు అందిన తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పరు. ఈ నేపథ్యంలో వికారాబాద్ నుంచి తాండూరు వరకూ పుష్పుల్ రైలును కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ఆదర్శ రైల్వేస్టేషన్లు వికారాబాద్, శంకర్పల్లి, లింగంపల్లి, తాండూరు స్టేషన్లను అంచలంచెలుగా అభివృద్ధి చేయనున్నట్టు జీఎం శ్రీవాస్తవ పేర్కొన్నారు. వికారాబాద్‌లో లోకోషెడ్ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్నారు. పరిశీలనలో సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు... ధారూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఎనిమిది లైన్ల సైడింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల వారు కోరుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జీఎం శ్రీవాత్సవ చెప్పారు. ఈ స్టేషన్ నుంచి సిమెంట్, బొగ్గు సంబంధ వ్యాపార లావాదేవీల ద్వారా ప్రతి నెల రూ.3కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని పలు సంస్థల ప్రతినిధులు రైల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సాధ్యమైనంత తొందరగా సైడింగ్ ట్రాక్‌ల ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ప్రముఖ న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, తరిగోపుల సంగమేశ్వర్, నవాబ్‌పేట్ మాణిక్‌రెడ్డి తదితరులు కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వికారాబాద్‌లో ఆపాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. జీఎం వెంట చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సాహు, ఏజీఎం సునీల్‌కుమార్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రవిపాడి, చీఫ్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్) కె.వి.శివప్రసాద్, సీటీఈ శ్రీనివాస్, రైల్వే ఆస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుమిదేవ్, ఎడీఎన్ వికారాబాద్ గోవిందరాజులు తదితరులు ఉన్నారు. బషీరాబాద్: ఈ ఏడాది బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు అధిక ప్రాధాన్యం లభించిందని రైల్వే శాఖ జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ జోన్లో ప్రయాణికులకు త్వరలో మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. మంగళవారం నవాంద్గి(బషీరాబాద్) స్టేషన్‌ను రైల్వే శాఖ అధికారులు పరిశీలించారు. జీఎం వెంట డీఆర్ఎం సుశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ డీసీఎం రవిపాడి, ఏజీఎం ఎస్కే అగర్వాల్ తదితరులున్నారు. నవాంద్గితోపాటు మంతట్టి, కర్ణాటకలోని కురుగుంట, సేడం, చితాపూర్, వాడి తదితర రైల్వే స్టేషన్లను కూడా అధికారులు తనిఖీ చేశారు. లింక్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నవాంద్గి రైల్వే స్టేషన్లో నిలపాలని, మధ్యాహ్న సమయంలో మరో రైలును ఇక్కడినుంచి నడపాలని జీఎంకు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. జీఎంను కలిసిన వారిలో గ్రామ సర్పంచ్ జయమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు అజయ్ ప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ కులకర్ణి ఉన్నారు. -
ప్లాట్‌ఫాంలు ఇలాగేనా ఉండేది!
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు రైల్వే స్టేషన్లో నెలకొన్న అపరిశుభ్రత, ప్రయాణికులకు కల్పించాల్సిన వసతుల లేమిపై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఎస్.కె. మిశ్రా ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన తాండూరు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ప్లాట్‌ఫాంలపై తిరుగుతూ పలు చోట్ల అపరిశుభ్రతను గుర్తించారు. ప్రయాణికులు కూర్చునేందుకు ప్లాట్‌ఫాంలపై ఏర్పాటుచేసిన ఓ దిమ్మె టైల్స్ పగిలిపోయి ఉండటంపై సంబంధిత అధికారులపై మిశ్రా మండిపడ్డారు. అనంతరం స్టేషన్‌లోని మరుగుదొడ్లను పరిశీలించారు. ప్లాట్‌ఫాంల సమీపంలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ప్లాట్‌ఫాం చివరలో ఉన్న పసుపురంగు బోర్డును తొలగించి దాని స్థానంలో రేడియంతో చేసిన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. పాదచారులే కాకుండా పలు ద్విచక్రవాహనాలు అనుమతి లేని చోట రైలు పట్టాలను దాటుతున్నారని, ఎలాంటి వాహనాలు అటువైపుగా రాకుండా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మిశ్రా మాట్లాడారు. ఫిబ్రవరి 18న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ తాండూరు నుంచి వాడి వరకు సిగ్నలింగ్ వ్యవస్థ, ఇతరత్రా అంశాలపై తనిఖీలు చేయనున్నారన్నారు. దీనిలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్‌కు కూడా వస్తారని చెప్పారు. తాండూరు రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా త్వరలో పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. తాండూరు -సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడవనున్న పుష్పుల్ రైలు ప్రారంభ తేదీని రైల్వే బోర్డు సభ్యులు నిర్ణయించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ జరిపామని, త్వరలోనే పట్టాలెక్కుతుందన్నారు. ఎదురెదురుగా ఒకే పట్టాలపై వచ్చిన రైళ్లు ఢీకొనకుండా కొంతకాలంగా కొనసాగుతున్న టికాస్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని ఆయన తెలిపరాఉ. సిగ్నలింగ్ సమస్యతో తాండూరు ప్యాసింజర్ కొద్ది ఆలస్యంతో నడుస్తున్న మాట వాస్తవమేనన్నారు. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. డీఆర్ఎంతో అడిషనల్ డీఆర్ఎం సింగయ్య, తాండూరు స్టేషన్ సూపరింటెండెంట్ రవిప్రకాష్ తదితరులున్నారు. -
రైల్వేస్టేషన్లను పరిశీలించిన డీఆర్ఎం
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ :వచ్చేనెల 6న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ జిల్లాలోని రైల్వేస్టేషన్లను తనిఖీ చేయనున్న నేపథ్యంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ప్రదీప్‌కుమార్ సోమవారం భీమవరం టౌన్, జంక్షన్, తణుకు రైల్వేస్టేషన్లను పరిశీలించారు. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాలను, ఆరు బయట ప్రాంతాలను, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫారంపై చేస్తున్న పనులను, లిఫ్ట్ వద్ద చేస్తున్న టైల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా నిర్మించిన ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) భవనాన్ని ఆయన పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. భవనంలో చేయాల్సిన మార్పులను వివరించారు. ప్రయాణికుల కోసం అదనంగా నిర్మిస్తున్న కుళాయిలను త్వరితగతిన నిర్మించాలని చెప్పారు. స్టేషన్ ఆవరణలో బ్యూటిఫికేషన్ కోసం చేపట్టాల్సిన చర్యలను స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు సూచించారు. పెండింగ్ మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భీమవరం టౌన్ ైరైల్వేస్టేషన్‌లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచినందుకు డీఆర్ఎం ప్రదీప్‌కుమార్ స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు రూ.3 వేలు రివార్డును అందించారు. భీమవరం డివిజన్లో రైల్వే ఆస్తులను పరిరక్షించడంలో కృషి చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) సీఐ హులీనాయక్‌కు రూ.2 వేలు రివార్డును అందించారు. డీఆర్ఎం వెంట పలువురు అధికారులు ఉన్నారు. -
పేదోడి గూడు ‘భారం’
సాక్షి, మచిలీపట్నం : గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన బకాయిలు పెరుకుపోయాయి. ఫలితంగా ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం 123మంది ఉద్యోగులకు గానూ ముగ్గురు మినహా 120మంది సమ్మె చేస్తున్నారు. డీఈ, ఏఈ, వర్క్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. కాగా, హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్(పీడీ) ప్రదీప్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ ఆఫీసర్, ఈ నెలాఖరున రిటర్మెంట్ కానున్న ఉద్యోగి ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 26,496ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,643ఇళ్లు ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 23,853ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓసీ, బీసీలకు ఒక్కో ఇంటికి రూ.70వేలు, పట్టణ ప్రాంతాల్లోని ఓసీ, బీసీలకు రూ.80వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05లక్షలు మంజూరు చేస్తారు. మంజూరైన మొత్తంలోనే ఒక్కో ఇంటికి 70బస్తాల వరకు సిమెంట్ ఇస్తారు. ఆ ఇళ్లకు వాటికి పునాది, బేసమెంట్, రూఫ్, పైకప్పు స్థాయిల్లో ఎప్పటికప్పుడు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి దశల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తేనే లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలుగుతాడు. నెల రోజులకుపైగా గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సమ్మెలో ఉండటంతో బిల్లులు మంజూరు కాలేదు. సుమారు రూ.3కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సమ్మె సడలించిన వెంటనే బిల్లులు.. జిల్లాలో గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు సమ్మె సడలించిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ ప్రదీప్‌కుమార్ చెప్పారు. బిల్లుల పెండింగ్‌పై ఆయన్ను సాక్షి వివరణ కోరింది. తమ శాఖకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో ఉన్నందునా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. సమ్మె సడలించిన వెంటనే బిల్లులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.