ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ విడుదల | APPSC Departmental Test Schedule Released | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ విడుదల

Published Fri, Jul 5 2024 4:33 AM | Last Updated on Fri, Jul 5 2024 4:33 AM

APPSC Departmental Test Schedule Released

సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను  https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.

⇒ ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ విభాగంలో శాంపిల్‌ టేకర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీ­లించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరి­జినల్‌ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

⇒  ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్ల పోస్టుల­కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25­న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించి­న తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 

⇒ హోమియో విభాగంలో మెడికల్‌ ఆఫీ­సర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. 

⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చే­సింది. వివరాలను సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement