సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్‌లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్‌గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్‌కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్‌పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment