departmental tests
-
ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈనెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగే టెస్టుల వివరాలను https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్టు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.⇒ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12న ఉదయం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు.⇒ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 25న పరిశీలించనున్నారు. అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ⇒ హోమియో విభాగంలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 23 నుంచి 25 తేదీ వరకు పరిశీలించనున్నారు. ⇒ రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పేర్కొన్నారు. -
ఉద్యోగులకు బాబు మార్క్ దగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం రాసే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో వారు పాసవకుండా గత చంద్రబాబు సర్కారు అడ్డుకుంది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే దాకా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అన్ని డిపార్ట్మెంటల్ టెస్టుల్లోనూ గరిష్టంగా 4 నుంచి 6 శాతం మాత్రమే పాసయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఏటా రెండుసార్లు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తుంది. సరీ్వస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన అభ్యర్థులు ప్రొబేషన్‌లో ఉంటారు. వారి ప్రొబేషన్ పూర్తవ్వాలంటే సరీ్వస్ టెస్ట్ పాసవ్వాలి. ఫెయిలైతే వారు ప్రొబేషన్‌లోనే కొనసాగుతారు. టెస్ట్ పాసైనవారు మాత్రం సీనియారిటీలోకి వెళ్లిపోతారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందేందుకు కూడా డిపార్ట్మెంటల్ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సరీ్వసులో సీనియారిటీలోనూ ముందుంటారు. జీవో నం.101తో ఉద్యోగులకు మేలు ప్రభుత్వ ఉద్యోగుల వయసు రీత్యా గతంలో డిపార్ట్మెంటల్ టెస్టులను ఆఫ్‌లైన్‌లో డ్రి స్కిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం పుస్తకాలను చదివి, సరైన జవాబులను రాసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిపార్ట్మెంట్ టెస్టును మల్టీపుల్ చాయిస్ విధానంలో మార్చి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మైనస్ మార్కు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33 శాతం) మార్కులు కోత విధించారు. దీంతో పెద్ద వయసులో ఉన్న ఉద్యోగులు ఆన్లైన్, మల్టీపుల్ చాయిస్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానంతో 2017–19 సంవత్సరాల మధ్య తాము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోల్పోతున్నామని, నెగిటివ్ మార్కుల విధానం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కులను తొలగించాలని అభ్యరి్థస్తూ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సర్వీస్ కమిషన్‌కు అనేక విజ్ఞప్తులు అందజేశాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసేందుకు మైనస్ మార్కుల విధానం రద్దు చేస్తూ జీవో నం.101 జారీ చేసింది. దీంతో ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్టుల్లో 85 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా.. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకునేందుకు 2017లో జీవో నం.55ను విడుదల చేసి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చారు. దాంతో గతంలో ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4–6 శాతం మించలేదు. కొన్ని విభాగాల డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు తమ పదోన్నతులు, ఇంక్రిమెంట్ అవకాశాలను కోల్పోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. -
సంతోషం ఖరారు!
అనంతపురం రూరల్: రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని డిపార్ట్మెంటల్ పరీక్ష పాసైన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేసింది. వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ పీఆర్సీ ప్రకారం జూలై నుంచి జీతాలు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించింది. ఉద్యోగుల పే స్కేల్‌ను సైతం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ.23,120 నుంచి రూ.74,770, ఇతర ఉద్యోగులకు బేసిక్ పే రూ.22,460 నుంచి రూ.72,810 ఉండేలా నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రొబేషన్ డిక్లరేషన్ పొందిన 7,393 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రూ.15వేల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆగస్టులో పెరిగిన జీతాలు అందుకోనున్నారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విధుల్లోకి చేరిన రెండు సంవత్సరాలకే తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని, ఇక నుంచి మరింత బాధ్యతగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు రాప్తాడు: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులర్ జీతాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి పేర్కొన్నారు. శనివారం హంపాపురం సచివాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. – నదియా, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, రెడ్డిపల్లి సచివాలయం, బుక్కరాయసముద్రం మండలం పారదర్శకంగా సేవలు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు వచ్చాయి. ఎవరి సిఫార్సులూ లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోంది. రెండేళ్లలోనే సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం చాలా గొప్ప విషయం. – జయప్రకాష్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఉదిరిపికొండ, కూడేరు మండలం (చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు) -
డిపార్ట్మెంటల్ టెస్టుల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్ సిటీ: ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంటల్ టెస్టుల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం జారీ చేసింది. వచ్చే నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఈనెల 18 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫీజు వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది.