బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్‌కుమార్ రావత్‌ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్‌లో ఉంచినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్‌ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్‌లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్‌లలో కూడా పనిచేశారు.
(చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం)
Comments
Please login to add a commentAdd a comment