Indian Embassy
-
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్‌కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్‌సర్‌లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
సిరియాలో విధ్వంసం.. స్వదేశానికి బయలుదేరిన భారతీయులు
డెమాస్కస్/బీరూట్: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్‌లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.Pics of 75 Indians evacuated from war torn #Syria, they are reaching home soon. https://t.co/uw6TWEtIUP pic.twitter.com/wNqagbh758— Abhishek Jha (@abhishekjha157) December 10, 2024 -
అమెరికాలో ఇండియన్ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో విషాదం చోటు చేసుంది. కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న (శుక్రవారం) ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మృతి చెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడిచలేదు.‘‘భారత రాయబార కార్యాలయ ప్రాంణంలో 18 సెప్టెంబర్ 2024 (బుధవారం) రోజు సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు మేము ధృవీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి పంపిచడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక.. కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించి అదనపు వివరాలను వెల్లడించటం లేదు. ఈ విషాద సమయంలో ఆ అధికారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.మరోవైపు.. ఈ ఘటపై స్థానిక పోలీసులు, సిక్రెట్ సర్వీస్ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మ హత్య చేసుకున్నా? లేదా హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చదవండి: లెబనాన్ పేజర్ల పేలుళ్ల కేసులో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే.. -
లావోస్‌లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
బంగ్లాలో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్ కీలక నిర్ణయం
ఢాకా: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో శాంతి భద్రతలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో భారత్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు.వివరాల ప్రకారం.. బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్న సందర్భంగా అనేక మంది పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్‌లో ఓ మెసేజ్‌ను పెట్టారు. ఈ క్రమంలో..‘బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నాం. అస్థిర పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిస్తాం అని తెలిపారు. ఇక, భారత్‌కు ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి. Indian visa application centre at Bangladesh will remain closed till further notice and Bangladesh is set to form new interim government headed by Muhammad Yunus. The oath taking ceremony will be held at 8 pm on 08.08.2024.#MuhammadYunus #BangaldeshUnderAttack pic.twitter.com/Zanj8z3LfH— Lokendra Dixit (@LokendraDixit12) August 8, 2024ఇదిలా ఉండగా.. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఇప్పటికే పలువురు మన దేశంలోకి వచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ, బీఎస్ఎఫ్ దళాలు వారిని అడ్డగించినట్టు సమాచారం. మరోవైపు.. ఒడిశా తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పటిష్ట నిఘాను ఏర్పాటుచేశారు. -
Russia-Ukraine war: రష్యా యుద్ధక్షేత్రంలో మరో భారతీయుడు మృతి
చండీగఢ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యారు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుడిని పొట్టనబెట్టుకుందని హరియాణాకు చెందిన అజయ్ మౌన్ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్ జనవరి 13న రష్యా వెళ్లారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్ ఆరోపించారు. రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.11.50 లక్షలు ఖర్చుపెట్టామని వాపోయారు. రవి మరణవార్తను మాస్కోలోని భారతీయ ఎంబసీ ధ్రువీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపేస్తామంటూ ప్రధాని మోదీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ విషాదం వెలుగుచూడటం గమనార్హం. యుద్ధంలో పనిచేయడం రవికి సుతరామూ ఇష్టంలేదని, ఫోన్లో ముభావంగా మాట్లాడేవారని మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్‌లోనే ఉన్నామని సోదరుడు అజయ్ చెప్పారు. మృతదేహం గుర్తింపు కోసం డీఎన్ఏ నమూనాలను పంపాలని డిమాండ్ చేస్తున్నారని, అంత సొమ్ము తమ వద్ద లేదని, మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్ సాయం చేయాలని ఆయన వేడుకున్నారు. -
USA: టీమిండియాను సత్కరించిన ఇండియన్ ఎంబసీ(ఫొటోలు)
-
ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయుల మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరగుతున్న యుద్ధంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. వారు రష్యా ఆర్మీ సైనికులుగా సేవలు అందిస్తున్న క్రమంలో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశి వ్యవహారాల శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారి బాడీలను ఇండియాకు పంపించాలని రష్యాను భారత విదేశాంగశాఖ కోరింది. మృతి చెందినవారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ‘‘ భారత్‌లోని రష్యన్ అంబాసిడర్ ద్వారా మాస్కోలోని ఇండియన్ ఎంబసి ఈ విషయంపై చర్యలు చేపట్టింది. అదే విధంగా రష్యన్ ఆర్మీలో ఉన్న భారతీయులను విడుదల చేసి ఇండియాకు తిరిగి పంపించాలని కోరాం. భవిష్యత్తులో రష్యన్ ఆర్మీలో భారతీయులను చేర్చుకోవటం నిలిపివేయాలని డిమాండ్ చేశాం’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.రష్యాలో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ‘‘ రష్యా ఆర్మీలో సహాయకులుగా పనిచేసే ఉద్యోగాలకు భారతీయులు వెళ్లవద్దు. ఇటువంటి నియామకాలు నకిలీవి, చాలా ప్రమాదకరమైవి’’ అని ఆయన తెలిపారు.మార్చిలో భారత విదేశాంగ శాఖ.. రష్యాలో వెళ్లే భారతీయులను హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా మిలిటరీలో ప్రమాదకరంగా ఉండే ఉద్యోగాలు చేరటం మానుకోవాలని తెలిపింది. ఇటువంటి నియామకాల్లో చాలా జగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది. -
ఆపరేషన్ కంబోడియా సక్సెస్.. శభాష్ వైజాగ్ పోలీస్!
సాక్షి, విశాఖ: ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. -
కిర్గిజిస్తాన్‌లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
ఢిల్లీ: కిర్గిజిస్తాన్ దేశంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం బిష్కెక్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీ విద్యార్థులు ఎవ్వరూ బయటకు రావద్దని అక్కడి భారతీయ ఎంబసీ ‘ఎక్స్’వేదికగా అడ్వైజరీ విడుదల చేసింది.‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చింది. విద్యార్థులు ఎంబీసీ అధికారులతో టచ్‌లో ఉండాలని సూచిస్తున్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎదైనా సమస్య వస్తే.. 0555710041 నంబర్‌ను సంప్రదించండి’ అని పేర్కొంది.Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024విదేశీ విర్థులపై దాడుల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ‘కిర్గిజిస్తాన్ బిష్కెక్లోని భారతీయ విద్యార్థుల పరిస్థితిని భారతీయ ఎంబీసీ ఎప్పటికప్పుడు కనుకుంటోంది. అక్కడి పరిస్థితి ప్రసుతం సద్దుమణిగింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావోద్దు’ అని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.మే 13న కిర్గిజిస్తాన్, ఈజిప్ట్ దేశాల విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఇక.. మెడికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద చెలరేగిన విద్యార్థుల హింసలో పాకిస్తాన్‌ను చెందిన పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. -
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
టెహ్రాన్: దౌత్యపరంగా భారత్‌కు మరో ఘన విజయం దక్కింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌకలో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ మేరకు భారత్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ దళాలు ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. సదరు నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. ఇక, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. "5 of the Indian sailors on MSC Aries have been released and departed from Iran today evening. We appreciate the Iranian authorities for their close coordination with the Embassy and Indian Consulate in Bandar Abbas," posts India in Iran (@India_in_Iran). pic.twitter.com/umppKnngG4— Press Trust of India (@PTI_News) May 9, 2024 ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు భారత్ విదేశాంగ శాఖ కసరత్తు చేసింది. మంత్రి ఎస్.జైశంకర్ ఆ మధ్య ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ఇరాన్ విముక్తి కల్పించింది.ఈ సందర్భంగా భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా..‘ఎంఎస్సీ ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్ చేసే ప్రయత్నాలకు ఇరాన్ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది అని పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్ నిన్న విడుదల చేసిందని’ చెప్పుకొచ్చింది. -
వీసా ఉంటే చాలు.. రూ. 1.25 లక్షల జీతం!
ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఇంకా ఏమేం ఉండాలంటే.. ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అరబిక్‌లో ప్రావీణ్యం అదనపు అర్హత. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024లోపు ఏప్రిల్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది. -
Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు
లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ విదేశాంగ శాఖ ఉద్యోగి. ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎస్ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు. కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్‌కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్‌లోని ఫీల్డ్ యూనిట్‌కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్‌పై ఐపీసీ సెక్షన్ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ వివరించింది. ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు -
300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత
ప్యారిస్: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బస్ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్ వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది. అక్రమ చొరబాటు కోసమే? అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్ ఎంబసీ ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. -
యుద్ధ భయం.. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం సూచనలు
ఇజ్రాయెల్, గాజా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిన పాలస్తీనా హమాజ్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. ఆపరేషన్ అల్-అక్సా’ పేరుతో శనివారం ఉదయం నుంచి 5 వేల మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతంలోని సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించి వీధుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 22 మరణించగా.. 500 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఆకస్మిక దాడులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జెరూసలెంతో సహా ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు తెలిపింది. దక్షిణ, మధ్య ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలపింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది. హమాజ్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్’ పేరుతో గాజాలోని హమాజ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.గాజా సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశం యుద్ధంలో పోరాడుతుందని, తప్పకుండా విజయం సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ పౌరులను రక్షించుకుంటామని పేర్కొన్నారు. దాడులకు ప్రతిఫలంగా హమాజ్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. We are at war. We will protect our citizens. We will not give in to terror. We will make sure that those who harm innocents pay a heavy price. — Israel ישראל 🇮🇱 (@Israel) October 7, 2023 భారతీయ పౌరులకు అడ్వైజరీ.. ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ నివసిస్తున్న భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌ను పాటించాలని కోరింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే బాంబ్ షెల్టర్ల వద్ద ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించండంటూ టెల్ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. Just surreal! Footage of Palestinian Hamas terrorists who infiltrated into Israel from Gaza, firing at residents in Sderot from an SUV. pic.twitter.com/ffUO5XwG1I — Arsen Ostrovsky (@Ostrov_A) October 7, 2023 గాజా సరిహద్దులోకి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాజ్ ఉగ్రవాదులు పౌరుల నివాసాలపై కాల్పులకు తెగబడుతున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దులోని వందలాది మంది జనాలు ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులు చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. Palestine has invited its doom! In today’s episode of f*Ck around & find out,brought to you by #Mossad/ #Israel. We Indians know it’s not Islamists vs Zionists;it’s Humanity vs Terrorists. May Allah help Netanyahu finish off Islamic terrorism from #Gazapic.twitter.com/9CJ5Vh3mBp — Pranav Pratap Singh (@PranavMatraaPPS) October 7, 2023 ఎందుకీ ఘర్షణలు ఇదిలా ఉండగా.. 2007లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి గాజాలో హమాజ్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గజాన్ కార్మికులకు సరిహద్దులను మూసివేసిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీయులు మరణించారు. వీరిలో సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. -
చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్‌లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు. ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
‘ఉక్రెయిన్ నుంచి వెంటనే వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక
కీవ్: రష్యాలోని కీలకమైన కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఇదీ చదవండి: బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది! -
కాంబోడియా వస్తున్నారా.. జర జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని కాంబోడియాలోని భారత దౌత్యకార్యాలయం సూచించింది. కరీంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ స్కాంలకు పాల్పడే చైనా వారి చేతిలో బందీలుగా మారిన విషయం తెలిసిందే. వారిని కాపాడాలంటూ ఎంపీ బండి సంజయ్ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఆయన ఫిర్యాదుకు ఈ నెల 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి’కథనాన్ని జోడించారు. కాంబోడియా రాజధాని పెనామ్ పెన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంబోడియాకు వస్తున్న భారతీయులు మానవ అక్రమ రవాణా, ఇతర అసాంఘిక ముఠాల చేతుల్లో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. భారత్ నుంచి వచ్చే నిరుద్యోగులు టూరిస్టు వీసాలపై ఉపాధి కోసం పంపించే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది. -
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
చైనాలో వైద్య విద్యపై జాగ్రత్త
బీజింగ్: చైనాలో కరోనాతో కారణంగా ఆగిన వైద్య విద్యను కొనసాగించాలనుకునే, అక్కడ కొత్తగా మెడిసన్ చేయాలనుకునే భారత విద్యార్థులకు చైనాలోని ఇండియన్ ఎంబసీ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. అక్కడ చదివిన వారిలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం, చైనా భాషను నేర్చుకోవడం, తిరిగొచ్చాక కఠినమైన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష (ఎఫ్ఎంజీ) పాసవడం వంటివి దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ► 2015–2021 కాలంలో 40,417 మంది ఎఫ్ఎంజీ పరీక్ష రాస్తే 6,387 మందే గట్టెక్కారు. ► వీరంతా చైనాలోని 45 వర్సిటీల్లో చదివినవారే. ► ఇక నుంచి చైనాకు వెళితే ఈ 45 కాలేజీల్లోనే చదవాలి. అదీ ఇంగ్లీష్ మాధ్యమంలోనే. ► చైనీస్ భాషలో మెడిసన్ చేయకూడదు. ఇంగ్లీష్–చైనీస్ ద్విభాషగా చేసినా చెల్లుబాటు కాదు. ► చైనా అధికారిక భాష పుతోంగ్వాను హెచ్ఎస్కే–4 లెవల్ వరకు నేర్చుకోవాలి. లేదంటే డిగ్రీ ఇవ్వరు. ► చైనాలోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మళ్లీ లైసెన్స్‌ను సాధించాలి. ఐదేళ్ల మెడిసిన్ తర్వాత ఏడాది ఇంటర్న్‌షిప్ చేయాలి. తర్వాత చైనీస్ మెడికల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ► చైనా నుంచి మెడికల్ క్వాలిఫికేషన్ పొందాలంటే ముందు భారత్‌లో నీట్–యూజీ పాసవ్వాలి. ► చైనా నుంచి వచ్చే వారూ నీట్–యూజీలో ఉత్తీర్ణత సాధించాకే ఎఫ్‌ఎంజీఈకి అర్హులౌతారు. ► కనుక విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగా సంబంధిత పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి. -
Russia War: భారత్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆక్రమణలపర్వం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో మూసివేసిన భారత రాయబార కార్యాలయాన్ని ఈనెల 17వ తేదీ నుంచి తిరిగి ఓపెన్ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా భయంకరమైన బాంబు దాడుల నేపథ్యంలో కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తరలించారు. మార్చి 13వ తేదీ నుండి పోలాండ్లోని వార్సా నుంచి తాత్కాలికంగా భారత రాయబార కార్యాలయం సేవలను కొనసాగించారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి భారతీయులను తరలించారు. మరోవైపు.. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైన రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఆస్తి నష్టం, ప్రాణా నష్టంతో ఉక్రెయిన్ విలవిలాడుతోంది. ఇక, రష్యాపై ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జపాన్ అతిపెద్ద ఎనర్జీ కార్పొరేషన్ ఈఎన్‌ఈవోఎస్(ENEOS) రష్యకు చమురు కొనుగోలును నిలిపివేసింది. Indian Embassy to resume operation in Kyiv from next week Read @ANI Story | https://t.co/xWRqrz0ji9#IndianEmbassy #India #Ukraine #Kyiv #Poland #UkraineConflict pic.twitter.com/MgK6X8LrBL — ANI Digital (@ani_digital) May 13, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియాలో కరోనా కలకలం.. టెన్షన్లో కిమ్ జోంగ్ ఉన్ -
భారత్‌కు రుణపడి ఉంటా: పాక్ విద్యార్థిని
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. రాజధాని కీవ్, సుమీ లాంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైతం విద్యార్థుల్ని తరలించినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో బయటపడిన పాకిస్థాన్ విద్యార్థిని మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలనికి, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెప్పింది ఆస్మా షఫీక్. ఉక్రెయిన్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయాబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, భారత ప్రధానికి కూడా. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది. #WATCH | Pakistan's Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her. Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp — ANI (@ANI) March 9, 2022 -
చైనాలో భారత్ కొత్త రాయబారికి క్వారంటైన్
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్‌కుమార్ రావత్‌ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్‌ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్‌లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్‌లలో కూడా పనిచేశారు. (చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం) -
యుద్ధభూమిలో ఉన్నాం... నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పు
సాక్షి హైదరాబాద్: ‘ఉక్రెయిన్ పౌరులపై రష్యా ప్రస్తుతం అత్యంత దారుణంగా యుద్ధానికి పాల్ప డుతోంది. ఈ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కొందరు భార తీయ విద్యార్థులు నిబంధనలకు అతిక్రమించి బంకర్ల నుంచి బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధగా ఉంది’ అని ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న లీదియా జురావ్వోలా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, చెన్నైలలో చదువుకున్న ఆమె భారతీయ సంస్కృతి, కళల పట్ల మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి నృత్యాలను నేర్చుకున్నారు. లీదియా ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కర్ణాటక విద్యార్థి నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ భవనం వద్ద బాంబు దాడిలో మృతి చెందిన సంఘటన తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు.. రష్యన్ బలగాలు ఏ వైపు నుంచి విరుచుకుపడతాయో తెలియదు. కొందరు విద్యార్థులు ఉక్రెయిన్ ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ ఆదేశాలను బేఖాతరు చేసి రోడ్ల మీదకు వస్తున్నారు. ఏజెంట్లను నమ్మి సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా బంకర్లలోనే ఉండాలి. ప్రతి విదేశీ విద్యార్థి పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతోంది. మా వలంటీర్లు బంకర్ల వద్దకు వెళ్లి ఆహారం, మందులు ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు ముందే ఫిబ్రవరి 15న భారత ప్రభుత్వం తమ వాళ్లను స్వదేశానికి రావాలని సూచించింది. కానీ చాలా మంది విద్యార్థులు ఫిబ్రవరి 24 వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చివరకు అంతర్జాతీయ రాకపోకలు స్తంభించడంతో చిక్కుల్లో పడ్డారు. స్థానిక రేడియోలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరైనా సరే కర్ఫ్యూ సడలించినప్పుడే బంకర్ల నుంచి బయటకు రావాలి. ఉక్రెయిన్‌లో 180 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. యుద్ధం కారణంగా అందరూ కష్టాల్లోనే ఉన్నారు. వారికి బంకర్లే సురక్షిత స్థావరాలు. ఆయా దేశాల ఎంబసీలు, ఉక్రెయిన్ ప్రభుత్వం అనుమతించే వరకు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. భారతీయ సంస్కృతిపై ప్రేమతో.. వినితియా నగరానికి చెందిన లీదియాను చిన్నప్పటి నుంచే విషాదం వెంటాడుతోంది. చెర్నోబిల్ అణు ధార్మికత ప్రభావంతో ఆమె వెన్నెముక దెబ్బతిన్నది. నాలుగుసార్లు సర్జరీలు జరిగాయి. కానీ యోగ, ధ్యానం, ప్రాణాయామంతో ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 2014లో జరిగిన యుద్ధంలో ఆమె తల్లిదండ్రులను, కుటుంబాన్ని కోల్పోయారు. అంతకుముందే 2011లోనే ఆమె భారత్‌కు వచ్చారు. నాట్యశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. ‘బెల్ నాట్యం కథా కల్పం’ అనే నూతన నృత్యరీతిని పరిచయం చేశారు. ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఆ కోణంలోనే తన పేరులో చివరకు ‘లక్ష్మి’ వచ్చేలా పెట్టుకున్నట్లు లీదియా జురావ్వోలా లక్ష్మి పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో లీదియా.. ఆపదలో ఉన్న వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను అందుకొని అవసరమైన సహాయ సహకారాలను అందజేసే విధి నిర్వహణలో లీదియా ఉన్నారు. ఉక్రెయిన్ లోని ఏ మూల నుంచైనా ఇలాంటి అత్యవసర ఫోన్‌కాల్స్ రావచ్చు. వెంటనే వలంటీర్లను అక్కడికి తరలిస్తారు. లీదియాకు మాతృభాష ఉక్రెయిన్‌తో పాటు రష్యన్ భాష కూడా తెలుసు. అందుకే ఎస్ఓఎస్ విధులు అప్పగించారు. విభిన్న రంగాలకు చెందిన మేమంతా ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకొనే పనిలో ఉన్నాం. సైనికులు, పోలీసులు, సాధారణ పౌరులు అందరం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాం.మాకు ప్రపంచం మద్దతు కావాలి అని ఆమె చెప్పారు. (చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం) -
‘భారతీయులు తక్షణమే ఖార్కివ్‌ను వీడండి.. లేదంటే’
ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రష్యా బాంబుల దాడిని తీవ్రతరం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయులు ఖార్కివ్‌లో ఉండటం క్షేమం కాదని ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ వరుస ట్వీట్లతో భారతీయులు వెంటనే ఖార్కివ్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో భారతీయులను ఉక్రెయిన్‌లోని పెసోచిన్, బెజ్లిడోవ్కా,బబయే ప్రాంతాలకు వెంటనే వెళ్లాలన్న భారత ఎంబసీ.. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు సమయంలోపు చేరుకోవాలని సూచించింది. ప్రస్తుతం పరిణామాల దృష్ట్యా ఆ ప్రాంతాలకు రైల్వే స్టేషన్లో వాహనాలు లేదా బస్సులు దొరకని విద్యార్థులు, పరిస్థితులు తీవ్రతరం అర్థం చేసుకుని కాలినడకనైనా చేరుకోవాలంటూ సూచించింది. 2nd Advisory to Indian Students in Kharkiv 2 March 2022.@MEAIndia @PIB_India @DDNewslive @DDNational pic.twitter.com/yOgQ8m25xh— India in Ukraine (@IndiainUkraine) March 2, 2022 -
ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మా.. నువ్వు లేని లోటు!
ఉక్రెయిన్ సంక్షోభాన్ని అంచనా వేయడంలో భారత ప్రభుత్వం తడబడింది. నెలన్నర కిందట.. కేవలం ఉక్రెయిన్‌లోని భారతీయుల క్షేమసమాచారాల సేకరణకే పరిమితం అయ్యింది అక్కడి మన ఎంబసీ. మరోవైపు ఆ సంక్షోభంలోనూ తరగతులు నిర్వహించి ఉక్రెయిన్ యూనివర్సిటీలు తప్పు చేస్తే.. విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో భయభయంగానే అక్కడే ఉండిపోయారు భారతీయ విద్యార్థులు. అవే ఇప్పుడు ఆపరేషన్ గంగకు అవాంతరాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చిన్నమ్మ ‘సుష్మాస్వరాజ్’ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన సమయంలో.. భారత ప్రభుత్వం స్పందించి ఉక్రెయిన్‌లోని మన రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులకు సూచించింది. అయితే అప్పటికే చాలా దేశాల పౌరులు తమ తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆపై పరిస్థితి విషమిస్తున్న.. నాలుగైదు రోజుల ముందు కూడా అమెరికా సహా పలు దేశాలు తిరిగి వచ్చేయాలంటూ ఆయా దేశాల పౌరులకు సూచించాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉండిపోయిందని, ఆ ఆలస్యమే భద్రత భయాందోళనలకు కారణమన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ భారత విద్యార్థులు ఆమె ఉండి ఉంటేనా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ‘చిన్నమ్మ’ సుష్మా స్వరాజ్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు, సీనియర్ దౌత్యవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా.. వేచిచూసే ధోరణికి ఆమె పూర్తి వ్యతిరేకమని గుర్తు చేసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా పని చేసిన టైంలో.. దౌత్యపరంగానే కాదు, సహాయచర్యల్లోనూ ఆమె దూకుడు ప్రదర్శించేవారు. అనుమతుల కోసం ఎదురు చూడకుండా.. ఎంఈఏ ట్విటర్ హ్యాండిల్ ద్వారా స్వయంగా సుష్మాజీనే రంగంలోకి దిగేవారు. పరిస్థితి ఎలాంటిదైనా.. ఎంతటి క్షిష్టమైన సమస్య అయినా సామరస్యంగా, చాకచక్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించేది ఈ చిన్నమ్మ. అందుకే ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. I have got the report. As per medical advice, your brother cannot travel at this stage.Your mother is with him in Georgia. /1 https://t.co/QOwtXsgmz2 — Sushma Swaraj (@SushmaSwaraj) February 1, 2017 సింగిల్ హ్యాండ్ సుష్మా.. యుద్ధం మొదలైన తర్వాతే భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను మొదలుపెట్టింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు విమానాలు పంపించి.. వాటి సరిహద్దులకు చేరుకున్న భారతీయులను, విద్యార్థులను తరలిస్తోంది. ఆయా దేశాలతో సమన్వయ చర్చలు ప్రారంభించి.. ఇక్కడి నుంచి నలుగురు కేంద్ర మంత్రుల్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని పంపించింది మోదీ ప్రభుత్వం. అయినా తరలింపులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అఫ్కోర్స్.. అక్కడున్న పరిస్థితులే అందుకు కారణం అనుకోండి. అది వేరే విషయం. అయితే.. సుష్మా స్వరాజ్ ఈ పరిస్థితిలో ఉండి ఉంటే పరిస్థితిని ఎలా డీల్ చేసి ఉండేవారో? అనే చర్చను లేవనెత్తారు పలువురు నెటిజన్లు. I have asked for a report from Indian Embassy in Dubai. Indian Walked 1,000 Km To Dubai Court https://t.co/kbvwVV67QP via @ndtv @templetree1 — Sushma Swaraj (@SushmaSwaraj) November 30, 2016 వాస్తవానికి సోషల్ మీడియా వేదికగా సుష్మాజీ జోక్యం చేసుకునే తీరు చాలాసార్లు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇతర దేశాలతో డిజిటల్ దౌత్యం ద్వారా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సుష్మాజీ. తెలంగాణ యువత కేటీఆర్ లాంటి ఎంతో మందికి ఒకరకంగా ఇదే స్ఫూర్తి అనే అనుకోవచ్చు. ఆపదలో ఉన్నామని, సాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే చాలు.. ట్విటర్ ఎంఈఏ హ్యాండిల్ ద్వారా నేరుగా రంగంలోకి దిగేవారామె. అలా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులకు సాయం అందించి.. వాళ్ల ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు అందుకున్నారామె. వ్యక్తిగత సాయాలను పక్కనపెడితే.. 2015 ఆపరేషన్ రాహత్ గుర్తించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఆపరేషన్ రాహత్ నాటి ఫొటో ఒకవైపు సౌదీ అరేబియా-మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ఉద్రిక్త వాతావరణం నడుమ ఐదు వేలమంది భారతీయులను, ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు రప్పించిన ఘనత కచ్చితంగా ఆమె టీందే. ముఖ్యంగా బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించిన తీరు.. విరామం తీసుకోకుండా దగ్గరుండి ఆమె పర్యవేక్షించడంపై అప్పట్లో హర్షం వ్యక్తం అయ్యింది. ఇదే కాదు.. 2018 అగ్నిప్రమాదంలో పాస్‌పోర్టులు తగలబడి పోయి ఇబ్బందులు పడ్డ ఇల్లినాయిస్ యూనివర్సిటీ(అమెరికా) విద్యార్థులను చట్టమైన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా భారత్‌కు రప్పించిన ఘటనా గుర్తు చేస్తున్నారు కొందరు. ఉక్రెయిన్ పరిస్థితులు వేరు కావొచ్చు.. కానీ, ఈ పరిస్థితుల్లో గనుక ఆమె ఉండి ఉంటే మాత్రం పరిస్థితి కచ్చితంగా వేరేలా ఉండేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వ్యక్తం అవుతోంది. వీ మిస్ యూ చిన్నమ్మ. Repatriating our diaspora during difficult times is a competence & commitment of India that most citizens will acknowledge.I respectfully recall Smt Sushma Swaraj who became a powerful symbol of this commitment. 🙏🏽 https://t.co/lmmPQhhOm6 — anand mahindra (@anandmahindra) August 22, 2021 ::: సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
కీవ్ నుంచి బయటపడండి.. భారత ఎంబసీ హెచ్చరికలు
ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో.. రాజధాని కీవ్‌లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, తక్షణమే కీవ్‌ను వీడాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. రష్యా బలగాలు భారీగా కీవ్ నగరం వైపుగా కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రైళ్లు, ఇతర మార్గాల ద్వారా అత్యవసరంగా కీవ్ నుంచి బయటపడాలని భారత పౌరులకు(విద్యార్థులతో సహా) ఎంబసీ ద్వారా సూచించింది కేంద్ర ప్రభుత్వం. పరిస్థితి ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని.. జాగ్రత్తగా సరిహద్దులకు చేరాలని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని పౌరులను తక్షణమే తరలించేలా సీ-17 విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరగతిన తరలింపు ప్రక్రియను కొనసాగించాలని అనుకుంటోంది. మరోవైపు అమెరికా సహా పలు దేశాలు కీవ్‌లోని రాయబారులను తరలించింది. Advisory to Indians in Kyiv All Indian nationals including students are advised to leave Kyiv urgently today. Preferably by available trains or through any other means available. — India in Ukraine (@IndiainUkraine) March 1, 2022 -
‘ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకువస్తాం’
న్యూడిల్లీ: ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తామని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్స్‌పాల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. ఈ రాత్రి(శనివారం)కి ప్రత్యేక విమానంలో కొద్దిమంది విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకునే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏపీ ప్లకార్డులు పట్టుకుని అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంటారని చెప్పారు. సుమారు వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు సమాచారం. కానీ ఎంతమంది వస్తున్నారో కచ్చితంగా తెలియదన్నారు. ఆధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుని వారికి ఢిల్లీలోని ఏపీ భవన్లో వసతి కల్పించి, ఆ తర్వాత వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పూర్తిగా వారిని ప్రభుత్వ ఖర్చులతోనే తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే వారిని రిసీవ్ చేసుకుని పంపించే ఏర్పాట్ల చేస్తామని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారని అన్నారు. ఎక్కడివారు అక్కడే సురక్షితంగా ఉండాలని సూచించారని అన్నారు. ఎలాగోలా సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే భారత్‌కు తీసుకువెళ్తారనే ఉద్దేశంలో ఎటువంటి సాహసాలు చేయెద్దని సూచించారని చెప్పారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు గమనించే విదేశాంగశాఖ ఎప్పటికప్పుడూ సూచనలు ఇస్తుందని వాటిని తప్పక పాటించాలని కూడా చెప్పారని తెలిపారు. -
ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం
Indian Medical Students Walk 8 km To Poland Border: ఉక్రెయిన్ రష్య యుద్ధ బీభత్సం నుంచి తప్పించుకునేందుకు వైద్యా విద్యార్థులు ప్రాణాలను అరచేత పట్టుకుని కాలినడకన పోలాండ్ సరిహద్దుల వెంబడి పయనమయ్యారు. ఈ మేరకు సరిహద్దుకు సుమారు 8 కి.మీ దూరంలో తమ కళాశాల బస్సు నుంచి దిగిన 40 మంది వైద్యా విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి పోలాండ్ సరిహద్దుకు వెళ్లారని స్థానిక మీడియా తెలిపింది. పోలాండ్ సరిహద్దుకు సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఎల్వివ్లోని ఒక వైద్య కళాశాల విద్యార్థులు ఉక్రెయిన్ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కైవ్‌లోని అడుగు పెట్టేయడమే కాక అక్కడ ఉన్న ఉక్రెయిన్ డిఫెండర్లతో పోరాడుతున్నాయి. మరో రెండు గంటల్లో నగరం రష్యా అధినంలోకి వచ్చే అవకాశం ఉందని ఉక్రెయిన పశ్చిమ పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత వైద్య విద్యార్థుల పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు వరకు సుదీర్ఘ నడకను సాగించారు. అంతేకాదు కొంతమంది విద్యార్థుల తాము ఉక్రెయిన్‌ని విడిచి కాలినడకన ఒక సముహంగా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల కూడా పెట్టారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారు, పైగా వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. రష్యా బాంబు దాడులు, క్షిపిణి దాడుల భయంతో భూగర్భ మెట్రో స్టేషన్లు, నేల మాళిగలు వంటి షెల్టర్ల నుంచి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీలలో క్యాంపు కార్యాలయాలను ప్రారంభించింది. పోలాండ్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులకు సహాయం చేసేందుకు ఇండియన్ ఎంబసీ మరింత మంది రష్యన్ మాట్లాడే అధికారులను ఈ క్యాంపు కార్యాలయాలకు పంపింది. విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు కూడా బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకోగలిగిన భారతీయుల కోసం ప్రభుత్వం విమానాలను పంపించడమే కాక ఈ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు రెండు చార్టర్డ్ విమానాలు ఈరోజు బుకారెస్ట్‌కు బయలుదేరే అవకాశం ఉందని ఒక విమానం రేపు బుడాపెస్ట్‌కు బయలుదేరుతుందని వెల్లడించారు. హంగరీ, రొమేనియాలోని సరిహద్దు చెక్ పాయింట్లకు దగ్గరగా ఉన్నవారు ముందుగా బయలుదేరాలని సూచించారు. విద్యార్థి కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విద్యార్థులను కోరింది. (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?) -
ముఖ్య గమనిక! హంగేరీ వచ్చే వాళ్లు ముందుగా ఈ వివరాలు ఇవ్వండి
ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హంగేరీ, రోమేనియా సరిహద్దులకు చేరుకోవాలంటూ భారతీయులకు సూచనలు జారీ చేసింది. భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కేపీపీ టైసా సరిహద్దు వద్ద హంగేరిలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే వారి కోసం హంగేరీలో ఉన్న ఇండియన్ ఎంబసీ కొన్ని విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా కేపీపీ టైసా సరిహద్దుకు చేరుకోవాడనికి ముందే ఆన్లైన్లో కొన్ని పత్రాలు ఫిల్ చేయాలంటూ కోరింది. Imp Notice! Students wanting to cross border through Kpp Tysa may please fill the form -https://t.co/jmkFl3Nahn Students and other stranded in Ukraine should follow advisory & alerts issued by @IndiainUkraine @MEAIndia @BshBudapest — Indian Embassy in Hungary (@IndiaInHungary) February 24, 2022 ఉక్రెయిన్ నుంచి హంగేరీ వచ్చే భారతీయులు ముందుగా పేరు, జెండర్, పుట్టినరోజు, ఉక్రెయిన్‌లో కాంటాక్ట్ నంబర్, భారత్‌లో కాంటాక్ట్ నంబర్, ఇండియాలో అడ్రస్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఎక్స్పైరీ తేది, ఉక్రెయిన్‌లో అడ్రస్, దగ్గరగా ఉన్న హంగేరి సరిహద్దు తదితర వివరాలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్య గమనికగా హాంగేరీ లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. చదవండి: హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు -
ఎప్పుడు ఏం జరుగుతోందో..?
సాక్షి, అమరావతి: ‘గత వారంలో స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చని ఇండియన్ ఎంబసీ చెప్పింది. అయితే, అప్పుడు పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. దీంతో ఏం కాదులే అనుకున్నాం. కానీ, ఇంత తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదు’.. అని ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు చెబుతున్నారు. తాజాగా.. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుకావడంతో వీరంతా అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో ఇక్కడున్న వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలకు ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న తెలుగు విద్యార్థులతో ‘సాక్షి’ మాట్లాడింది. వారేమన్నారంటే.. ఏం కాదులే అనుకున్నాం.. నేను వినిచా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్వదేశానికి వెళ్లాలనుకున్న వారు వెళ్లచ్చని గత వారం ఇండియన్ ఎంబసీ చెప్పింది. అయితే, అప్పట్లో యుద్ధం జరగదనుకున్నాం. కానీ, ఇప్పుడు మొదలైంది. దీంతో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఎందుకైనా మంచిదని బుధవారమే సరుకులు తెచ్చిపెట్టుకున్నాం. స్వదేశానికి రావడం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నాను. విమానాలు ఏర్పాటుచేస్తే వచ్చేస్తాను. – భానుప్రకాశ్, ఉక్రెయిన్‌లోని గుంటూరు జిల్లా చిర్రావూరు యువకుడు రెండో ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తే.. నేను కీవ్‌లో ఉంటాను. వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళనతో ఫోన్లు చేస్తున్నారు. గురువారం ఉదయం మొదటి ఎమర్జెన్సీ సైరన్ మోగించారు. ప్రజలు బయటకు వెళ్లకూడదు. రెండో ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తే బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. తొలి ఎమర్జెన్సీ సైరన్ మోగించడంతో ప్రజలు ముందస్తుగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. – జయంత్, ఉక్రెయిన్‌లోని వరంగల్ యువకుడు యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి నేను కీవ్ యూనివర్సిటీలో మెడికల్ పీజీ చదువుతున్నా. గురువారం తెల్లవారుజామున పెద్ద శబ్దాలు వచ్చాయి. ఏమైందో అర్థంకాలేదు. ఇక్కడి విమానాశ్రయం పరిసరాల్లో మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలిసింది. ఉదయం స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరూ బయటకు రావద్దని చెప్పారు. మేం ఉంటున్న ప్రాంతంలో యుద్ధ విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో వేరే దేశాలకు వెళ్లే విమాన చార్జీలు విపరీతంగా పెంచారు. సాధారణంగా భారత్‌కు రావడానికి వన్ వే చార్జీ రూ.25వేల నుంచి రూ.30వేల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు గంట గంటకు రేట్లు మారుతున్నాయి. రూ.70 వేల నుంచి రూ.1.20లక్షల వరకూ తీసుకుంటున్నారు. అయినా శనివారానికి టికెట్ బుక్ చేసుకున్నా. ఇంతలోనే సైనిక చర్య ప్రారంభం కావడంతో విమానాలు నిలిపేశారు. – ముకుంద్, ఉక్రెయిన్‌లోని అనంతపురం జిల్లా కదిరి యువకుడు -
ఉక్రెయిన్: గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత.. వీడియో ఇదిగో
ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కైవ్‌లో ఉండటానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం తాజా సలహాను జారీ చేసింది. "సమీపంలోని బాంబు షెల్టర్ల జాబితాను పంచుకుంటూ,..వాటిలో చాలా భూగర్భ మెట్రోలలో ఉన్నాయని, సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించడానికి గూగుల్ మ్యాప్‌లను కూడా సంప్రదించమని రాయబార కార్యాలయం విద్యార్థులను కోరింది. అంతేకాదు దయచేసి మీ పరిసరాల గురించి తెలుసుకుని సురక్షితంగా ఉండండి. అవసరమైతే తప్ప మీ ఇళ్లను విడిచిపెట్టవద్దు. ఉక్రెయిన్ యుద్ధ చట్టాలు గురించి మీకు తెలుసు అందువల్ల మీ పత్రాలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి అని రాయబార కార్యాలయం సూచించింది. కైవ్‌లో బస చేయడానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షిత ప్రాంతంలో ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాయబార కార్యాలయం వెలుపలికి వచ్చారని, అయితే వారందరికీ ఎంబసీ ప్రాంగణంలో వసతి కల్పించలేదని పేర్కొంది. అయితే వారి కోసం సమీపంలోని సురక్షిత ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్లు ఎంబసీ వెల్లడించింది. కైవ్‌లోని గ్రౌండ్ పరిస్థితిని బట్టి ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టిందని కూడా తెలిపింది. అంతేకాదు ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం కొనసాగిస్తోంది అని రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రియాంక చతుర్వేది, మనీష్ తివారీతో సహా పలువురు రాజకీయ నాయకులు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఎంబీసీ వద్ద ఉన్న విద్యార్థులకు కనీసం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను అభ్యర్థిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ అంశంపై ప్రభుత్వ ప్రణాళికను విమర్శించారు. సమయం ఉన్నప్పుడే ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సింది అన్నారు. ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖం తిప్పుకోవడం.. మౌనంగా ఉండడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ చురకలు అంటించారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారత యువత భయం భయంగా ప్రాణాంతక పరిస్థితులతో పోరాడవలసి వస్తుందని అన్నారు. ఇదేనా మీ 'స్వయం-అధారిత' మిషన్" అని సుర్జేవాలా అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. Indian students outside Indian Embassy in Kyiv, Ukraine requesting officials to make atleast sitting arrangement inside embassy as they r standing outside since morning in minus two degree cold but they are asked to find hotels themselves. @DrSJaishankar #RussiaUkraineConflict pic.twitter.com/Kj5reAm76C — Hemant Rajaura (@hemantrajora_) February 24, 2022 This is what I have been raising with MEA and Civil Aviation Ministry. Now our Indians are stranded and are feeling helpless. pic.twitter.com/9sAt8W6TSf — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 24, 2022 (చదవండి: నా కుమారుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు, ఓ తండ్రి ఆవేదన) -
రష్యా వార్: ప్రమాదంలో ఇండియన్స్.. మోదీ సర్కార్ అలర్ట్
కీవ్: ఉక్రెయిన్‌లో భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, మిస్సెల్స్‌తో దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కాగా, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరులకు, విద్యార్థులకు ఎంబసీ కీలక సూచనలు అందించింది. దాడులు కొనసాగుతున్న కారణంగా ఉక్రెయిన్ నుంచి అన్ని విమానాలు రద్దయ్యాయి. ప్రత్యేక విమానాలు సైతం రద్దు చేయబడినట్టు ఎంబసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు తాము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపింది. ప్రజల తరలింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం కాగానే భారత ఎంబసీ సమాచారం అందిస్తుందని వెల్లడించింది. (ఇది చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..) ఈ క్రమంలోనే భారతీయులు వారి పాస్‌పోర్ట్, ఇతర అత్యవసర పత్రాలను ఎల్లప్పుడు తమ వద్దే భద్రపరుచుకోవాలని సూచించింది. భారత పౌరులు ఎంబీసీకి సంబంధించిన వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టులను ఫాలో అవుతూ ఉండాలని పేర్కొంది. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. కాగా, అంతకు ముందు భారత పౌరులు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని కోరింది. ఇళ్లు, హాస్టల్స్‌ను వీడి బయటకు రావద్దని హెచ్చరించింది. @IndiainUkraine issues a fresh advisory for all Indian Nationals/Students in Ukraine. Alternative arrangements are being made for evacuation of our citizens. 📞 Additional 24*7 helplines: +38 0997300428 +38 0997300483 +38 0933980327 +38 0635917881 +38 0935046170 pic.twitter.com/95EHCPSOKy — Arindam Bagchi (@MEAIndia) February 24, 2022 -
నా కుమారుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు: ఓ తండ్రి ఆవేదన
రష్యా ఈరోజు ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో ఆ దేశం తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఎయిర్ ఇండియా విమానాన్ని మధ్యలోనే వెనక్కి తిప్పవలసి వచ్చంది. అంతే తన కొడుకు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు అంటూ ఆందోళన చెందిన తండ్రి ప్రభుత్వం నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆ తండ్రి రవి మాట్లాడుతూ..."నా కొడుకు కైవ్ నుండి ఢిల్లీకి విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ పౌర గగనతలం మూసివేయబడింది. వారికి విమానాశ్రయంలో బాంబులు వినిపించాయి. వారిని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇప్పుడు వారు కైవ్ వీధుల్లో చిక్కుకున్నారు. మీకు వీలైతే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించమని చెప్పగలిగితే తాను తన కొడుకు నెంబర్ని ఇస్తానని మొరపెట్టుకుంటున్నాడు. తన కుమారుడి పరీక్షలు బుధవారంతో ముగిశాయని, అయితే అతను ఈరోజుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడని చెప్పాడు. ఇలా జరుగుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. అతను పరీక్షలు ముగియడంతో అతను ఈ రోజు తన ఫ్లైట్‌లో వెళ్లాలని అనుకున్నాడు. తన కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి రావలనే ఉద్దేశంతోనే టిక్కెట్ ధర రెట్టింపు అయినా సరే చెల్లించి మరీ ఫ్లైట్ టికెట్ బుక్ చేశానని చెప్పాడు. ఉక్రెయిన్ను విడిచిపెట్టమని పౌరులకు ప్రభుత్వం ఇచ్చిన సలహా కూడా ఆలస్యంగా వచ్చింది. కానీ ఇప్పుడు వారు చిక్కుకుపోయారు ప్రభుత్వం వారికి సహాయం చేయాలి" అని బాధితుడి తండ్రి ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. నిజానికి ఉక్రెయిన్‌లో సుమారు 15,000 మందికి పైగా భారతీయులు ఉన్నారు. భారతీయుల భద్రతోపాటు ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని భారతీయులను ఉద్దేశించి భారత్ .. ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా, సురక్షితంగా ఉండండి. అది మీ ఇళ్లలో, హాస్టళ్లలో, వసతిలో లేదా ప్రయాణంలోనై సరే " అని సూచించింది. ఈ మేరకు కైవ్‌కి ప్రయాణించే వారందరూ, కైవ్‌లోని పశ్చిమ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారితో సహా, తాత్కాలికంగా తమ తమ నగరాలకు, ముఖ్యంగా పశ్చిమ సరిహద్దు దేశాలలో సురక్షితమైన ప్రదేశాలకు తిరిగి రావాలని సూచించారు." ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడిన తర్వాత ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా తిరిగి వచ్చింది. అంతేకాదు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అనేక విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియాతో సహా ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 18 వేల మంది భారతీయులు ? ఆగిపోయిన ఎయిర్ లిఫ్ట్) -
ఉక్రెయిన్ వీడి భారత్‌కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన
All Indian students, are advised to leave Ukraine temporarily: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని భారత రాయభార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో సహా తమ పౌరులను తూర్పు ఐరోపా దేశంలో ఉండడం అవసరమని భావించకపోతే తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అంతేకాదు భారతీయ పౌరులు, విద్యార్థులను ఉక్రెయిన్ను తాత్కాలికంగా విడిచిపెట్టిరావాలని సూచించింది. అలాగే భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించి అప్డేట్ల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను కూడా సంప్రదించాలని, అలాగే ఎంబసీ ఫేస్బుక్, వెబ్సైట్, ట్విట్టర్లను అనుసరించాలని సూచించింది. సమాచారం, సహాయం అవసరమైన ఉక్రెయిన్‌లోని భారతీయులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ని సంప్రదించాలని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నిరోదించే విషయమై ఈరోజు చివరి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లో పరిస్థితి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య టెలిఫోన్ సంభాషణ ప్రారంభమైందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా నాటోలో ఉక్రెయిన్ ఎప్పటికీ చేరనన్న రాతపూర్వక హామీపై బలగాలు వెనక్కు తగ్గతాయంటూ పునరుద్ఘాటించటం గమనార్హం. ADVISORY FOR INDIAN NATIONALS IN UKRAINE.@MEAIndia @DrSJaishankar @PIBHindi @DDNewslive @DDNewsHindi @IndianDiplomacy @PTI_News @IndiainUkraine pic.twitter.com/i3mZxNa0BZ — India in Ukraine (@IndiainUkraine) February 20, 2022 (చదవండి: యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు) -
భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు
న్యూఢిల్లీ: తాలిబన్ల మాటలకు చేసే చేష్టలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో విదేశీ ప్రతినిధులకు, కార్యాలయాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన వారు తమ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని కార్యాలయాల్లో అణువణువూ గాలించారు. కాందహార్, హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్లలో బుధవారం తాలిబన్లు సోదాలు నిర్వహించి కార్యాలయం అంతటినీ చిందరవందర చేసి పడేశారు.ఆ కార్యాలయాల ఆవరణల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలను తమ వెంట తీసుకువెళ్లినట్టు శుక్రవారం దౌత్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. (చదవండి: ‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’) ‘‘మేము ఈ విషయం ముందే ఊహించాం. తాలిబన్లు భారత కాన్సులేట్లను అణువణువు తనిఖీ చేశారు. కీలక పత్రాలేమైనా లభిస్తాయేమోనని గాలించారు. మేము పార్క్ చేసిన వాహనాలను తీసుకువెళ్లి పోయారు’’అని అ అధికారి వెల్లడించారు. సోదాలకు కొద్ది రోజుల ముందే అఫ్గాన్‌లో భారత రాయబారి సిబ్బందికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తాలిబన్ రాజకీయ విభాగం నుంచి సందేశం వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారత్ దౌత్య సిబ్బంది, భద్రతా అధికారుల్ని వెనక్కి తీసుకు వచ్చేసింది. 31 వరకు వేచి చూసే ధోరణి అఫ్గానిస్తాన్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై తాలిబన్లకు ఈ నెల 31 వరకు ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని అఫ్గాన్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తన సైనిక బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరిస్తామని చెప్పడంతో అప్పటివరకు వారు వేచి చూసే ధోరణిలో ఉంటారని ఆ అధికారి తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు వరకు తాలిబన్లు చేసేదేమీ లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కొత్త ప్రభుత్వంలో చేర్చుకుంటామని తాలిబన్లు చెప్పినా మాటపై నిలబడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. -
క్షణక్షణం.. భయంభయంగా గడిపాం
లక్సెట్టిపేట(మంచిర్యాల): ‘‘తాలిబన్ల చేతిలోకి అఫ్గానిస్తాన్ వెళ్లడంతో అక్కడ ఉంటున్న భారతీయులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఇండియన్ ఎంబసీలో కమాండోలుగా ఉన్న మేం కూడా అవస్థలు పడ్డాం. తాలిబన్లకు అధికారం రావడంతో ఇండియన్ ఎంబసీని పట్టించుకునేవారే కరువయ్యారు. చివరి రెండ్రోజులు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగడానికి నీరు, తినడానికి తిండి, ఏ ఇతర సౌకర్యాలనూ తాలిబన్లు కల్పించలేదు’’అంటూ అక్కడి ఇండియన్ ఎంబసీ సెక్యూరిటీ కమాండోగా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎంబడి సురేశ్ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు. ‘‘నిత్యం అధికారులకు రక్షణ కల్పించడంలో ఇబ్బందులుండేవి. ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయంభయంగా గడిపేవాళ్లం. ఎటు నుంచి దాడులు, బాంబులు పడతాయోనని అప్రమత్తంగా ఉండేవాళ్లం. అన్ని దేశాల ఎంబసీలు వెళ్లిపోయిన తర్వాతే, చివరగా ఇండియన్ ఎంబసీ ఇక్కడికి వచ్చేసింది. అప్పటివరకు విధుల్లో నిర్విరామంగా ఉన్నాం. ఇండియన్ ఎంబసీ తీసుకున్న నిర్ణయంతో 130 మంది కమాండోలు, 70 మంది భారతీయులతో సీ–17 బోయింగ్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానంలో 17న ఢిల్లీకి చేరుకున్నాం’’అని సురేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని హెడ్ ఆఫీస్ క్యాంపు భవ నంలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. -
Afghanistan: భారత రాయబార కార్యాలయం మూసివేయలేదు!
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని మంగళవారం వివరణ ఇచ్చింది. భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని, దాదాపు 1650 మంది భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని ప్రకటించింది. మరోవైపు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది తమ సేవలను కొనసాగిస్తున్నారు. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. మిగిలిన సిబ్బందికి రక్షణగా అక్కడే ఉండనున్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని ఐటీబీపీ కమాండింగ్ ఆఫీసర్ రవి కాంత్ గౌతమ్ అన్నారు. అయినా ప్రజలను విజయవంతంగా తరలించగలిగాము, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. తమ దళాలు 3-4 రోజులు నిద్రపోలేదనీ, ఈ రాత్రి హాయిగా నిద్రపోతామంటూ సంతోషం ప్రకటించారు. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత) కాగా తాలిబన్ల ఆక్రమణ, అఫ్గన్ పరిస్థితుల నేపథ్యంలో వేలాదిమంది పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీశారు. మరోవైపు అఫ్గన్లకు అండగా నిలుస్తామని ప్రభుత్వం సోమవారం తెలిపింది. కాబూల్ నుండి వాణిజ్య విమానాలు ప్రారంభం తర్వాత హిందువులు, సిక్కులను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రాధాన్యతనిస్తామని, భారత పౌరుల భద్రతకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan:ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిక్షేపం తాలిబన్ల చేతుల్లోకి!) ITBP personnel who were securing the Indian embassy in Kabul get back home. At the Hindan airforce station pic.twitter.com/ceoE8sxSvk — Abhishek Bhalla (@AbhishekBhalla7) August 17, 2021 The situation is bad in #Afghanistan but we managed to successfully evacuate our people, which is a matter of pride for all of us. Our troops have not slept for 3-4 days. We will sleep comfortably tonight: Ravi Kant Gautam, Commanding Officer of ITBP troops in Afghanistan pic.twitter.com/eiWmeP4Wev — ANI (@ANI) August 17, 2021 -
గల్ఫ్‌లో టీకా సర్టిఫికెట్ల తిప్పలు
ఇండియా నుంచి గల్ఫ్ కు వెళ్లే భారతీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోవీషీల్డ్ టీకా తీసుకుంటే ఇబ్బంది లేదన్న ధైర్యంతో ఉన్న ప్రవాస భారతీయులకు ఊహించిన సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం కోవిన్ యాప్ ద్వారా జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ని కొన్ని గల్ఫ్ దేశాలకు చెందిన యాప్‌లు స్వీకరించడం లేదు. ఇబ్బందులు కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రతీ దేశానికి వేర్వేరుగా యాప్‌లు ఉన్నాయి. మన ప్రభుత్వం కోవిన్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు కొన్ని గల్ఫ్ దేశాల ఆరోగ్య శాఖ యాప్ లలో తమ ఆరోగ్య స్థితిని నమోదు చేసుకునే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి యాప్‌లు కోవిన్‌ను స్వీకరించడం లేదు. ఆర్థిక భారం గల్ఫ్ దేశాల యాప్‌లలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఢిల్లీలోని గల్ఫ్ దేశాల ఎంబసీలతో కోవిడ్ టీకా సర్టిఫికేట్ అటెస్ట్ చేసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.6,500 నుంచి రూ.8,000 ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ‘తవక్కల్నా' యాప్‌లో ఆరోగ్య స్థితిని మోసపూరితంగా అప్డేట్ చేసినందుకు గాను అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, విదేశీ కార్మికులతో సహా 122 మంది ఇటీవల సౌదీలో అరెస్టు అయ్యారు. ఎంబసీలు చొరవ చూపితే భారతీయ టీకా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్ పోర్టల్ ను గల్ఫ్ దేశాలు గుర్తించేలా మన ఎంబసీ అధికారులు కృషి చేయాలని గల్ఫ్‌లో ఉన్న భారతీయులు కోరుతున్నారు. కోవిన్ క్యూఆర్ స్కాన్ కోడ్ ఉపయోగించి టీకా సర్టిఫికెట్ ను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భారత ఎంబసీపై డ్రోన్ చక్కర్లు
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై గతవారం ఒక డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటన భారత్ స్పందించింది. ఆ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఈ ఘటనపై పాక్‌లోని భారత హై కమిషన్ కూడా పాకిస్తాన్‌కు ఘాటుగా లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై జూన్ 26న ఒక డ్రోన్ ఎగురుతుండడాన్ని గుర్తించాం. దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పాకిస్తాన్ విచారణ జరుపుతుందని, ఇలాంటి భద్రతాపరమైన లోపాలు మళ్లీ తలెత్తకుండా చూస్తుందని భావిస్తున్నాం’ అని శుక్రవారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్ బాగ్చీ మీడియాకు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్ 27న జరిగిన డ్రోన్ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యేనని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం పేర్కొన్నారు. అది భారత్ తప్పుడు ప్రచారం భారత హైకమిషన్ కార్యాలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. అది భారత్ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై ఎలాంటి డ్రోన్లు తిరగలేదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధరి చెప్పారు. డ్రోన్ చక్కర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా భారత్ తమకు అందించలేదన్నారు. జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిపై ఆయన స్పందించలేదు. కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒక డిస్ట్రిక్ట్ కమాండర్ కూడా ఉన్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒక జవాను, అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొది లారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, రాజ్‌పొరా ప్రాంతంలో ఉన్న హంజిన్ గ్రామం వద్ద భద్రత బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు చేరుకుని టెర్రరిస్ట్‌లపై కాల్పులు జరిపాయన్నారు. ఈ కాల్పుల్లో లష్కరే జిల్లా కమాండర్ నిషాజ్ లోన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. హతుల్లో ఒక పాకిస్తానీ కూడా ఉన్నాడన్నారు. పాక్ డ్రోన్‌పై కాల్పులు జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఒక డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. అది పాకిస్తానీ నిఘా డ్రోన్‌గా అనుమానిస్తున్నారు. జమ్మూ శివార్లలోని ఆర్ని యా సెక్టార్లో శుక్రవారం తెల్లవారు జామున ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ డ్రోన్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం, ఆ డ్రోన్ మళ్లీ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంపై నిఘా వేసేందుకు ఆ డ్రోన్‌ను ప్రయోగించి ఉంటారని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని కీలక రక్షణ స్థావరాలపై సోమ, మంగళ, బుధవారాల్లో రాత్రి సమయంలో పలు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. -
పాకిస్తాన్‌లోని ఇండియన్ ఎంబసీలో డ్రోన్ కలకలం
-
సెలవు అడిగితే గన్‌తో కాల్చాడు
దోహా/పట్నా: సెలవు అడిగాడన్న కారణంతో ఓ భారతీయ వ్యక్తిని అతడి యజమాని గన్‌తో కాల్చిన ఘటన ఖతార్ దేశ రాజధాని దోహాలో జరిగింది. బిహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లా బేలా గ్రామానికి చెందిన 35ఏళ్ల హైదర్ అలీ ఉద్యోగ నిమిత్తం దోహాలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను చూసి రావడం కోసం సెలవు కావాలని యజమానిని అడగగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా గన్‌తో హైదర్‌ను షూట్ చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని సహచరులు దోహాలోని హమాద్ జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్టోబర్ 30న ఇండియా వచ్చేందుకు అతడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడని, అయితే ఆ ముందు రోజు 29న ఈ ఘటన జరిగినట్లు హైదర్ అలీ సోదరుడు అఫ్సర్ అలీ తెలిపాడు. దోహాలో నివసించే తమ బందువు జావేద్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడని అఫ్సర్ తెలిపాడు. ఆ తర్వాత దోహాలో ఉన్న భారత దౌత్య కార్యాలయ అధికారి ధీరజ్ కుమార్‌ను ఫోన్లో సంప్రదించగా తమకు సహాయం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఆయన భరోసా కల్పించారని పేర్కొన్నాడు. హైదర్‌కు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపాడు. విషయం తెలిసినప్పటి నుంచి హార్ట్ పేషెంట్ అయిన తన తండ్రితో పాటు మొత్తం కుటుంబం షాక్‌లో ఉందన్నాడు. ప్రస్తుతం తన అన్న మంచానికే పరిమితమయ్యే దుస్థితి ఏర్పడిందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వచ్చే సమాచారం కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని, తన సోదరుడికి జరిగిన అన్యాయానికి ఖతార్ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అఫ్సర్ కోరుతున్నాడు. కాగా, హైదర్ గత ఆరేళ్లుగా దోహాలో వెల్డర్‌గా పని చేస్తూ.. అతడి యజమాని ఇంట్లో వ్యక్తిగత పనులు సైతం చేస్తున్నాడు. 2018 నుంచి అతడు ఇంటికి రాలేదని, ఇప్పుడు రావాలనుకుంటే ఇలా జరిగిందని అఫ్సర్ ఆవేదన వ్యక్త చేశాడు. కేరళలో పీహెచ్డీ చేస్తున్న అఫ్సర్ లాక్డౌన్ మెదలైనప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. -
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ
మాస్కో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వామ్య పక్షాలకు చట్టబద్ధంగా కలిగే ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, అన్ని దేశాలకు మంచి జరిగేలా, పటిష్టమైన కొత్త ప్రపంచం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఉండాలని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్ స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలు కాపాడాలి : వాంగ్ యీ రష్మా, భారత్, చైనా కలసికట్టుగా సమస్యాత్మక అంశాలను ఎదుర్కోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. 3 దేశాల సంబంధాల పరిరక్షణ కోసం అన్నిదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యహరించాలన్నారు. మహాత్ముడికి రాజ్‌నాథ్ నివాళులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాస్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్‌నాథ్.. చైనా రక్షణమంత్రి వీ ఫెంగ్‌తో సమావేశం కావడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే 11 దేశాల సైనిక బలగాల పెరేడ్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. -
కిర్గిస్తాన్‌లో తెలుగు విద్యార్థుల యాతన
గుత్తి: తమను స్వస్థలాలకు పంపాలంటూ కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కిర్గిస్తాన్‌లోని మెడికల్ కాలేజీల్లో వందల మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్కడి కాలేజీలతో పాటు హాస్టళ్లనూ మూసేశారు. ఈ నేపథ్యంలోనే తమను స్వస్థలాలకు పంపాలంటూ 20 రోజులుగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శనివారం భారత ఎంబసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎంబసీ అధికారులు తామేమీ చేయలేమని, మీ రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పుకోవాలంటూ తేల్చి చెప్పడంతో విద్యార్థులు వెనుదిరిగారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన 45 మంది ఉన్నారు. తిండి, నిద్ర లేక నానాయాతన పడుతున్నామని తమకు న్యాయం చేసేలా, ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటూ అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు హర్షవర్దన్‌రెడ్డి, రవితేజారెడ్డి, సాయిచరణ్, సాయివెంకటకృష్ణ, మేఘన, ప్రియాంకలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మరికొందరు విద్యార్థులు వాట్సాప్ ద్వారా ‘సాక్షి’ విలేకరికి విన్నవించారు. -
ఈ ఘటన దురదృష్టకరం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు. మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి.. ‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ ట్వీట్‌కు కత్తెర... సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన! జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
తెలుగు ఐఏఎస్ రవి కోటకు కీలక పదవి
న్యూఢిల్లీ: తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోటకు కీలక పదవి దక్కింది. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా ఆయన నియమితులయ్యారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకనమిక్ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి కోట.. భారత్ తరపున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట.. 1993 బ్యాచ్ అసోం క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గత రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ గురువారం.. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చదవండి: వడ్డీ రద్దుపై కేంద్రం వివరణ కోరిన సుప్రీం -
అమెరికాలో చిక్కుకున్న భారతీయుల కోసం..
న్యూఢిల్లీ/లండన్: ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అమెరికా, బ్రిటన్, యూఏఈ సహా 12 దేశాల్లో చిక్కుకుపోయిన వారిలో తొలి విడతగా 15 వేల మందిని తీసుకురానున్నారు. అందులో భాగంగా అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న వారి కోసం ఎయిర్ ఇండియా నాన్ షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులను మే 9 నుంచి 15 వరకు నడపనుంది. ముఖ్యంగా విద్యార్థులు, గర్భిణీ మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ మేరకు ప్రయాణికుల జాబితాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా భారతీయ కాన్సులేట్లు రూపొందిస్తున్నాయి. (లాక్డౌన్: విమానాలు ఎగరబోతున్నాయ్!) వీరు స్వదేశానికి వచ్చే సమయంలో అనుసరించాల్సిన విధివిధానాల గురించి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ముందుగా స్క్రీనింగ్ చేసిన తర్వాతే విమానాల్లో ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపింది. అలాగే వారు భారత్‌కు చేరుకున్నాక కూడా ఇక్కడి అధికారులు మరోసారి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొంది. అనంతరం వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది. టికెట్ చార్జీలు ప్రయాణికుడే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక భారత్‌కు చేరుకున్న తరువాత ప్రతీ ప్రయాణికుడు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లౌడ్ చేసుకుని అందులో వారి వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. (64 విమానాల్లో 15 వేల మంది..) -
లాక్డౌన్ నిబంధనలు వారి ఆశలను చిదిమేసింది
ఢిల్లీ : తాము కష్టపడైనా సరే కొడుకును ఉన్నత స్థానంలో ఉంచాలని భావించారు ఆ తల్లిదండ్రులు. అందుకు తగ్గట్టుగానే కొడుకు ఎదికి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే అతను ఎదుగుతున్న తీరును చూసి విధికి కన్ను కుట్టిందేమో.. చిన్న వయసులోనే మృత్యువాతపడ్డాడు. గుండెలవిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకుందామనుకున్నారు. కానీ అధికారుల నిబంధనలు వారి పాలిట శాపమయింది. చివరకు కొడుకు మృతదేహాన్ని చూడాలనుకునే లోపే అధికారులు రూల్స్ పేరుతో మృతదేహాన్ని తిరిగి పంపించేశారు. ఈ హృదయవిధారక ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. (వైరల్‌గా మారుతున్న కరోనా పాటలు) వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కమలేష్ భట్ అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వారం క్రితం గుండెపోటు రావడంతో కమలేష్ అక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి అధికారులు కమలేష్ బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తున్నట్లు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కమలేష్ బందువులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అయితే యూఏఈ నుంచి వచ్చిన కమలేష్ మృతదేహానికి అక్కడి భారతీయ ఎంబసీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో వారు కమలేష్ మృతదేహాన్ని అప్పగించేదుకు నిరాకరించారు. అధికారులు నిరాకరించిన కొద్ది గంటల్లోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన విమానంలోనే తిరిగి యూఏఈకి తరలించారు. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించడంతో పాటు అన్ని రకాల విమాన సేవలను రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విదేశాల నుంచి ఎలాంటి విమానాలను అనుమతించొద్దని విదేశాల్లోని అన్ని భారత విదేశాంగ రాయభార కార్యాలయాలకు నివేదికను అందించంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యూఏఈ నుంచి వచ్చిన విమానాన్ని తాము తిరిగి పంపించినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. అయితే కమలేష్ సోదరుడు విమలేష్ భట్ మాట్లాడుతూ.. ఇరు దేశాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. అయితే కమలేష్ మృతి పట్ల యూఏఈ ఉన్న ఇండియన్ ఎంబసీ కార్యాలయం కమలేష్ మృతిపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఏప్రిల్ 17న కమలేష్ పని చేస్తున్న కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మాకు సమాచారం అందించిందన్నారు. కమలేష్ మృతదేహాన్ని తిరిగి వెనక్కి రప్పించాలంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఎన్వోసీ తేవాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నట్లు విమలేష్ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి రావడంతో వారు స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. -
జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి!
‘‘జగనన్నా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామం. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్ లక్ష్మణరావు అక్కడి మహిళలకు మాయమాటలు చెప్పి కువైట్ పంపించి, అరబ్ షేక్‌లకు అమ్మేస్తున్నాడు. మమ్మల్ని అమ్మేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మా పాస్‌పోర్టులు లాక్కున్నారు. జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి. ఇక్కడ కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)లో వందల మంది బాధితులు ఉన్నారు’’ – కారెం వసుంధర అనే మహిళ శుక్రవారం వాట్సాప్‌లో పంపించిన వీడియో సందేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు/అత్తిలి : ఉపాధి కోసం ఏజెంట్ల మాయమాటలు నమ్మి పొట్ట చేతపట్టుకుని పరాయి దేశాలకు వెళ్లిన మహిళల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పనులు ఇప్పిస్తామని నమ్మ బలికి అరబ్ షేక్‌లకు అమ్మేస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కువైట్ వెళ్లిన కొందరు మహిళలు అక్కడి యజమానుల బారి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చేందుకు వారి వద్ద పాస్‌పోర్టులు కూడా లేవు. తమను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరుతూ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని వాట్సాప్‌లో తమ బంధువులకు పంపించారు. కారెం వసుంధరతోపాటు మరికొందరు మహిళలు అందులో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గుత్తుల శ్రీను అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా ఇండియా తిరిగి వెళ్లే దిక్కు లేకుండా పోయిందని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బి.ఏటికోట గ్రామానికి చెందిన ప్రకాశ్‌రాజ్ అనే ఏజెంట్ మోసం చేసి అమ్మేశాడని కొత్తపేటకు చెందిన ఇంకో మహిళ, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గుంటూరు జిల్లా రేపల్లె పట్టణాలకు చెందిన మహిళలు కూడా తమను కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వెంటనే స్పందించింది. బాధిత మహిళలను వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్ లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించి, బాధితులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
31న బహ్రెయిన్‌లో ఓపెన్ హౌస్
గల్ఫ్ డెస్క్: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ నెల 31న ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు. సీఫ్‌లోనిఇండియన్ కాంప్లెక్స్‌లో ఉన్న రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతున్న ప్రవాస భారతీయులు తమకు ఇమిగ్రేషన్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకుని హాజరుకావాలని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. -
‘ఆత్మహత్యే దిక్కు.. వద్దు నేనున్నాను’
న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేక విదేశాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇదే మాట చెబుతుంటారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయులైన సరే తన సమస్య గురించి ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే రెస్పాన్స్ అవుతారు చిన్నమ్మ. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి చోటు చేసుకుంది. అలీ అనే వ్యక్తి సౌదీ వెళ్లి దాదాపు రెండు సంవత్సరాలు కావోస్తుంది. ఇండియా తిరిగి రావాలని అనుకుంటున్నాడు. కానీ అతని దగ్గర విక్మా(ఉద్యోగ వీసా) తప్ప పాస్‌పోర్ట్, వీసాలాంటి ఇతర ఐడీలు ఏం లేవు. ఈ క్రమంలో తనకు సాయం చేయమని ఇండియన్ ఎంబసీని కోరాడు. తాను ఇక్కడకు వచ్చి దాదాపు 21 నెలలు కావోస్తుందని.. ఇంతవరకూ సెలవు తీసుకోలేదని తెలిపాడు. ప్రస్తుతం ఇంట్లో సమస్యలున్నాయి.. అందుకే ఇండియా వెళ్లాలి అనుకుంటున్నాను అన్నాడు. కానీ వర్క్ వీసా తప్ప మరే ఐడీ తన దగ్గర లేదని సాయం చేయమని కోరాడు. ఇలా ఏడాది నుంచి అభ్యర్తిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో ఆఖరి ప్రయత్నంగా మరోసారి ‘నన్ను ఇండియా పంపించి పుణ్యం కట్టుకొండి. నాకు ఇంటి దగ్గర నలుగురు పిల్లలున్నారు. సంవత్సరం నుంచి సాయం కోరుతున్నాను. కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం నాకు సాయం చేస్తారో లేదో చెప్పండి. మీరు సాయం చేయకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం’ అని ట్వీట్ చేశాడు. అలీ అభ్యర్థన కాస్తా సుష్మా స్వరాజ్ దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ‘వద్దు ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయకండి. మేం మీకు సాయం చేస్తాం’ అని తెలపడమే కాక ఈ కంప్లైంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తనకు పంపించాల్సిందిగా రియాద్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. దాంతో మరో సారి నెటిజనుల సుష్మా స్వరాజ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. (చదవండి : అంతా మేడమ్ దయ వల్లే..!) -
15 రోజుల్లో పెళ్లి.. పాస్‌పోర్టు పోయింది!
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా సాయం కోరితే ఆమె వెంటనే స్పందిస్తారు. తాజాగా రవితేజ అనే వ్యక్తికి కూడా ఆమె సాయం చేశారు. ‘వాషింగ్టన్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నాను... వచ్చే నెల(ఆగస్టు) 13- 15 మధ్య నా వివాహ తేదీని ఖరారు చేశారు. అందువల్ల ఆగస్టు 10న బయల్దేరాలి కాబట్టి తత్కాల్లో పాస్‌పోర్టు జారీ చేయాలని’ అతడు ట్విటర్ వేదికగా సుష్మాను సాయం కోరాడు. రవితేజ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారు. ‘రవితేజ.. మీరు చాలా రాంగ్ టైమ్‌లో పాస్‌పోర్డు పోగొట్టుకున్నారు. అయినప్పటికీ మీ పెళ్లి సమయానికి మండపానికి చేరేలా మేము సాయం చేస్తామని’ ట్వీట్ చేసిన సుష్మా.. మానవతా దృక్పథంతో అతడికి సాయం అందించాలంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీని కోరారు. ఆమె ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు మాత్రం.. ‘మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు హ్యాట్సాప్ మేడమ్.. మీరు మా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం’ అంటూ ప్రశసంలు కురిపిస్తున్నారు. Devatha Ravi Teja - You have lost your Passport at a very wrong time. However, we will help you reach for your wedding in time. Navtej - Let us help him on humanitarian grounds. @IndianEmbassyUS https://t.co/wxaydeqCOX — Sushma Swaraj (@SushmaSwaraj) 30 July 2018 -
ఖట్మాండు; ఇండియన్ ఎంబసీ వద్ద పేలుడు
ఖట్మాండు: నేపాల్ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరత్‌నగర్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు . పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఘటన జరిగిందని, పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైందని, అయితే ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని నేపాల్ పోలీసులు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు గల కారణాలను కనిపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారతీయ రాయబార కార్యాలయంలో సాధారణ స్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. -
భారతీయుల డబ్బు కాజేస్తున్న నేరగాళ్లు
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయులకు కొందరు సైబర్ నేరగాళ్లు రాయబార కార్యాలయం (ఎంబసీ) ఫోన్ నంబర్ల నుంచే కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్న సంఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పాస్‌పోర్టులు, వీసాల్లో తప్పులు ఉన్నాయనీ, వాటిని సరిదిద్దుకోకపోతే అమెరికా నుంచి పంపించి వేయడం లేదా అక్కడే జైలులో పెడతారంటూ నేరగాళ్లు అక్కడి భారతీయ అమెరికన్లకు ఫోన్లు చేస్తున్నారు. తమ ఖాతాలోకి డబ్బులు జమచేస్తే లేదా క్రెడిట్/డెబిట్ కార్డుల వివరాలు, ఓటీపీ చెబితే ఆ తప్పులను తామే సరిదిద్దుతామని వారు నమ్మబలుకుతున్నారు. సాంకేతికతను వాడి రాయబార కార్యాలయం ఫోన్ల నుంచే కాల్స్ వస్తున్నట్లు మాయ చేసి నమ్మిస్తున్నారు. ఈ తరహా మోసాలు రాయబార కార్యాలయం దృష్టికి రావడంతో అలాంటి వాటిని నమ్మవద్దని అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. అమెరికా ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. -
భారత ఎంబసీ పేరిట భారీ మోసాలు
వాషింగ్టన్ : భారత ఎంబసీ పేరిట భారీగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నారైల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పలువురి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రాగా.. అత్యున్నత దర్యాప్తునకు భారత రాయబారి కార్యాలయం ఆదేశించింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం పేరిట కొందరు ఫేక్ కాల్స్ చేస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు. పాస్ పోర్టులో పోరపాట్లు ఉన్నాయని, వీసా ఫామ్స్, ఇమ్మిగ్రేషన్ ఫామ్‌లకు సంబంధించిన వ్యవహారాల పేరిట ఆ ఫోన్ కాల్స్ వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. మరికొందరి నుంచైతే క్రెడిట్ కార్డులకు సంబంధించిన విషయాలు కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తు దారులకు కూడా ఈ తరహా కాల్స వచ్చినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయం నంబర్ల నుంచే ఆ కాల్స్ రావటంతో బాధితులు కూడా అదంతా నిజమే అని నమ్మేశారు. వారు చెప్పినట్లు అకౌంట్లో డబ్బును జమ చేశారంట. ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఈ వ్యవహారాన్ని భారత రాయబార కార్యాలయం సీరియస్‌గా తీసుకుంది. విషయాన్ని యూఎస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అధికారులేవరూ వ్యక్తిగత సమాచారంపై అలాంటి ఫోన్లు చెయ్యరని.. అమెరికాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బాధితులు డబ్బును జమ చేసిన అకౌంట్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరహా మోసాలు జరగటం ఇదే మొదటిసారి అయి ఉండొచ్ఛని ఎంబసీ భావిస్తోంది. -
శ్రీదేవి మృతి కేసులో అనేక అనుమానాలు
-
మరణం వెనుక..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీదేవి బాత్రూమ్లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్‌కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్ నివేదికను బట్టి తెలుస్తోంది. బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సందేహాలు.. - పెళ్లి జరిగింది ఈ నెల 20న అయితే శ్రీదేవి 24 వరకు ఎందుకు దుబాయిలోనే ఉన్నారు? - 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 24 వరకు శ్రీదేవి అసలు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి? ఆల్కహాల్ తీసుకొని స్పృహ లేకుండా ఉందా? - గది నుంచి శ్రీదేవి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది వెళ్లి చూశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబీకులు ఎందుకు స్పందించడం లేదు? - శ్రీదేవిని సర్ప్రైజ్ చేసేందుకు బోనీకపూర్ నిజంగానే 24న సాయంత్రం ముంబై నుంచి దుబాయి వెళ్లారా? లేదా శ్రీదేవి మృతి వార్త తెలిశాక వెళ్లారా? - గతంలో శ్రీదేవికి ఎప్పుడూ గుండెపోటు రాలేదని సంజయ్ కపూర్ మీడియాకు వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె గుండెపోటుతోనే మరణించారన్న ప్రచారం ఎందుకు జరిగింది? - బోనీ కపూర్ తన స్నేహితుడికి కాల్ చేసి ఆ తర్వాత హాస్పి టల్‌కు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవ మెంత? అసలు శ్రీదేవిని హాస్పిటల్‌కు ఎవరు తీసుకెళ్లారు? ఫోరెన్సిక్ రిపోర్టులో ఇదెలా సాధ్యం? శ్రీదేవి మృతికేసులో ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన రిపోర్టుపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మన దేశంలో అయితే నీటిలో మునిగి చనిపోతే.. ఫోరెన్సిక్ రిపోర్టులో అంతవరకే ప్రస్తావిస్తారు. ప్రమాదవ శాత్తూ మునిగిపోయారా? లేదా ఎవరైనా బలవంతంగా నీటిలో ముంచి చంపేశారా అన్నది తేల్చాల్సింది పోలీసులే! కానీ దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు వారే ‘ప్రమాదవశాత్తూ మునిగిపోవడం’ (యాక్సిడెంటల్ డ్రౌనింగ్) వల్ల చనిపోయినట్టు తేల్చారు. ఇది సందేహాత్మకంగా కనిపిస్తోందని రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదమా కాదా అన్నది ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాల్సిన అంశం కాదని, అది పూర్తిగా పోలీసు దర్యాప్తులో తేలాల్సిన వ్యవహారమని వారు చెబుతున్నారు. అలాగే రిపోర్టులో ‘డ్రౌనింగ్’ అన్న పదం స్పెల్లింగ్‌ను ‘డ్రావింగ్’ అని తప్పుగా ప్రచురించారు. ఒక సెలబ్రెటీ కేసులో ఇలా అచ్చు తప్పుతో నివేదిక రూపొందించడం కూడా ఫోరెన్సిక్, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే శ్రీదేవి తూలి బాత్‌టబ్‌లో పడిపోతే తలకు లేదా మరేదైనా ప్రాంతంలో గాయాలై ఉండాలి. కానీ ఇలాంటి ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్న అంశాలను కూడా రిపోర్టులో వెల్లడించలేదు. దుబాయిలో ఇవి నిబంధనలు... - డెత్ రిపోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మృతిచెందిన వ్యక్తికి తప్పనిసరిగా పాస్‌పోర్టు, వీసా ఉండాలి. వీటితో పాటు పోలీసులిచ్చే నివేదిక తప్పనిసరి. - సాధారణంగా డెత్ సర్టిఫికెట్ కోసం ఫీజుగా 60 దిరమ్స్ కట్టాలి. అరబ్ భాషలో కాకుండా ఇంగ్లిష్‌లో సర్టిఫికెట్ కావాలంటే 100 దిరమ్స్ చెల్లించాలి. ఎంబసీ నుంచి సర్టిఫికెట్ కోసం 700 దిరమ్స్ కట్టాలి. - డెడ్‌బాడీని మాతృదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా దుబాయి పోలీసుల నుంచి ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. ఆ ఎన్ఓసీని ఎయిర్‌పోర్టు అథారిటీకి అందించాలి. ఇదే సమయంలో ఎంబసీకి దరఖాస్తు చేస్తే మృతిచెందిన వ్యక్తి పాస్‌పోర్టు రద్దు చేస్తారు. తర్వాత డెడ్‌బాడీని మాతృదేశానికి పంపించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. - మాతృదేశంలోని హోంశాఖ కూడా మృతదేహాన్ని తీసుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలి. సాధారణంగా ఈ ప్రక్రియను భారత ఎంబసీ చూసుకుంటుంది. కుటుంబీకులు ఎందుకు మాట్లాడడం లేదు? శ్రీదేవి మృతి విషయంలో బోనీ కపూర్ కుటుంబం గానీ, కపూర్ ఫ్యామిలీ గానీ ఎక్కడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు. మృతి విషయంలో వస్తున్న అనేకానేక పుకార్లను ఖండించే ప్రయత్నం కూడా చేయడంలేదు. తీవ్ర విభేదాలు, తగాదాలు వస్తే తప్పా ఇంతటి పరిస్థితి రాదన్నది కపూర్ కుటుంబ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అద్దం ముందు నిలబడి... శ్రీదేవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆమె నటించిన మిస్టర్ ఇండియా, చాల్బాజ్, లమ్హే సిని మాలు అంటే పిచ్చి. ఒక గ్రేస్‌తో కామెడీని పండిం చిన.. పండించగల నటి ఆమె ఒక్కరే. మిస్టర్ ఇండియాలోని చార్లీ చాప్లిన్ రోల్, కాటే నహీ పాట, లమ్హేలోని డ్యుయల్ రోల్, చాల్బాజ్ పాటలను ఇంట్లో నేను అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎక్స్ప్రెషెన్స్లో శ్రీదేవీని ఇమ్మిటేట్ చేసేదాన్ని. ఎంత ట్రై చేసినా వచ్చేవి కావు. అలా చిన్నప్పటి నుంచీ నేను ఆరాధించిన నటితో నటించే అవకాశం నా మూడో సినిమాకే వచ్చింది. ఆ సినిమా లాడ్లా. అప్పటికే ఆమె సూపర్‌స్టార్. చాలా భయపడ్డా. కాని ఆమె చాలా ఈజీ చేసేశారు. శ్రీదేవి ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. సెట్లో కూడా చాలా కామ్‌గా ఉంటారు అని అంటుంటారు. కాని లాడ్లా షూటింగ్ అప్పుడు నాతో చాలా క్లోజ్‌గా ఉన్నారు. తను వచ్చి.. ‘రెడీ అయిపోయావా? రా.. నా వ్యాన్‌లో కూర్చుని మాట్లాడుకుందాం’’ అని నన్ను తన వానిటీవ్యాన్లోకి తీసుకెళ్లేవారు. చిట్‌చాట్, జోక్స్, డిస్కషన్స్ చేసేవారు. నా జీవితంలో మరిచిపోలేని రోజులవి. – రవీనా టాండన్. కహానీ కోరిక... విశ్రాంతి సమయంలో పుస్తకాలు చదవడం, నిద్రపోవ డం, పెయింటింగ్ అంటే శ్రీదేవికి ఇష్టం. అవే చేసేవారు కూడా. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాల నుంచి తీసు కున్న పదిహేనేళ్ల బ్రేక్‌ను ఇంటిని, పిల్లలను చూసుకోవడానికే ఆసక్తి చూపారు. కాని బోనీకపూర్, జాన్వి, ఖుషీల బలవంతం, ప్రోత్సాహంతో గౌరీ షిండే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. గౌరీ అంటే శ్రీదేవికి చాలా అభిమానం. ఆమె తన చిన్నకూతురు ఖుషీలాగే చురుకుగా, అల్లరిగా,చలాకీగా ఉంటుందని గౌరీని ‘ఖుషీ’ అని పిలిచేవారట. సెట్స్‌లోకి రాగానే ‘‘వేర్ ఈజ్ మై ఖుషీ’’ అంటూ గౌరీని వెదుక్కునేవారట. ప్రతి సినిమాను కొత్తగా.. మొదటి సిని మా అనుకొనే చేస్తారు. తన నటన పట్ల పూర్తి సంతృప్తిని ఎప్పుడూ కనబర్చ లేదు. ఇంట్లోవాళ్లు, స్నేహితులు చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నా.. శ్రీదేవి మాత్రం ఇంకా చేసుండాల్సింది అని అనుకునేవారట. అదే ఆరాటం, అంతే జిజ్ఞాస చివరి సినిమా వరకు కనబర్చారు. బహుశా ఆ తపనే ఆమెను దేశంలోనే ఫస్ట్ ఫీమేల్ సూపర్‌స్టార్‌గా నిలబెట్టిం దేమో! ఎవరితో ఎక్కువగా మాట్లా డకుండా తన పని తాను చేసుకుపోయే ఈ స్టార్‌కు కామెడీ సినిమాలు చేయడం అంటే ఇష్టం. అయితే బయట గంభీరంగా కనిపించే శ్రీదేవి ఇంట్లో, దగ్గరి వాళ్లతో జోక్స్ వేస్తూ, వాళ్లను సరదాగా ఆటపట్టిస్తూ చాలా జోవియల్‌గా ఉంటారు. చక్ దే ఇం డియా, తారే జమీన్ పర్, విక్కీ డోనర్ , కహానీ సినిమాలంటే ఇష్టం. కహానీ లాంటి సినిమా చేయాలని ఆమె కోరిక. బాలీవుడ్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పట్ల ఇప్పుడు వచ్చిన మార్పు పట్ల చాలా సంతోషపడేవారు. స్క్రిప్ట్ ముఖ్య భూమిక పోషించడం, నటనకు స్కోప్ ఉండడాన్ని ఆమె ప్రశంసించారు. కూల్ మామ్... ‘‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్. అయితే మా అమ్మ నాతో ఉన్నట్టుగా నేను నా పిల్లల దగ్గర ఉండలేను. కాలంతో మారాలి కదా! అందుకే పట్టూవిడుపులూ చూపిస్తా. లైఫ్‌లో బేసిక్ ఎథిక్స్ ఉండాలని చెప్పేదాన్ని. వాళ్లు టీన్స్‌లో ఉన్నప్పుడు లేట్ నైట్స్ రావాల్సి వస్తే వాళ్లతో పాటు నేనూ వేళ్లేదాన్ని. పిల్లలు వచ్చే వరకు కార్లో వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు పెరిగారు. వాళ్ల మంచి చెడ్డలు చూసుకోగలరు. పిల్లల విషయంలో నేను, బోనీ ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటాం. నేను స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు ఆయన.. ‘‘పిల్లలు కదా.. కొన్ని విషయాల్లో మనం చూసీచూడనట్టు ఉండాలి. అంత కఠినంగా ఉండకు వదిలెయ్’’ అని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను అలా చెప్తుంటాను బోనీకి (నవ్వుతూ). మామూలుగా నేను షూటింగ్లో ఉన్నా గ్యాప్ దొరికినప్పుడల్లా పిల్లలకు ఫోన్ చేస్తుంటా. అయితే మామ్ సినిమా అప్పుడు మాత్రం చేయలేదు. ఖుషీ.. అందిట జాన్వితో. ‘ఇదేంటి అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు’ అని. మామ్ సినిమాలోని దేవకీ పాత్ర అలాంటిది. కంప్లీట్‌గా.. నా పిల్లలను కూడా మరిచిపోయేంతగా లీనమయ్యా అందులో. – మామ్ ప్రమోషనల్ సమయంలో శ్రీదేవి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ డాక్టర్.. సినిమాల్లో! జాన్వి సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు శ్రీదేవేమీ షాక్ అవలేదట. జాన్వి చిన్నప్పుడు బంధువులు ఆమెను పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగారట. ‘డాక్టర్’ అని జవాబిచ్చిందట జాన్వి. అక్కడే ఉన్న శ్రీదేవి ఆ ఆన్సర్‌కి ఆనందపడి ఉబ్బితబ్బిబ్బయ్యే లోపే ఆ పిల్ల ‘కాని సినిమాల్లో’ అని చెప్పిందట. తాను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటుందో కూతురు మెస్సేజ్ ఇచ్చేసిందని గ్రహించారట శ్రీదేవి. అందుకే ‘‘నేను యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలేదట. నా పనైపోయిందనుకున్నా.. అందరిలాగే ఫర్హాన్ అక్తర్కూ శ్రీదేవి అంటే పిచ్చి. ఆమె నటించిన లమ్హే సినిమా ప్రొడక్షన్ వర్క్‌లో ఫర్హాన్ కూడా పాలు పంచుకున్నాడు. నిజానికి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫర్హాన్. ఓ పాట షూటింగ్ కోసం శ్రీదేవి రిహార్సల్స్ చేస్తోందట. వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న చోట ఫ్లోర్ పాలీష్ పోయి నల్లగా ఓ మచ్చలా కనపడుతోంది. డైరెక్టర్ వచ్చి అక్కడ పెయింట్ వేయమని ఫర్హాన్‌కు పురమాయించాడు. దాంతో పెయింట్ వేశాడు ఫర్హాన్. శ్రీదేవి ఆరిపోని ఆ పెయింట్ మీద కాలు వేసి జారి పడ్డారట. దెబ్బకే సెట్లో అంతా సైలెంట్. అందరిలో భయం. ఫర్హాన్లో ఇంకా భయం. తన పనైపోయింది.. ఇక సినిమాలకు తనకూ గుడ్ బై అనుకున్నాడట. అంతలోకే శ్రీదేవి పెద్దగా నవ్వడం మొదలెట్టారట. దాంతో సెట్లో అంతా ఊపిరిపీల్చుకొని వాళ్లూ ఆమె నవ్వుతో జతకలిపారు. అయోమయంగా చూస్తున్న ఫర్హాన్ దగ్గరకు వచ్చి.. ‘కూల్’ అంటూ అతని భుజం తట్టారట శ్రీదేవి. అలా ఆమె తన కెరీర్‌ను కాపాడారు అని ట్వీట్ చేశాడు ఫర్హాన్ అక్త్తర్. -
కువైట్ నుంచి స్వదేశం వస్తున్న వారికి ఉచిత టికెట్స్
కువైట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష ద్వారా స్వదేశం వెళుతున్న కోడూరు వాసులకు ఉచిత టికెట్స్ ఇప్పించారు. భారత రాయబార కార్యాలయం వద్ద కమిటీ సభ్యుల సహాకారంతో పోలి బుజ్జమ్మ (వెంకటరెడ్డి పల్లి, అరుంధతి వాడ), పెంచల సురేష్ (వెంకటరెడ్డి పల్లె, గిరిజన కాలనీ), గంపల నారాయణ (బైనపల్లి, ఎస్పీ కాలనీ) భారత కార్యాలయ అధికారి సెకండ్ సెక్రెటరీ నారాయణ స్వామి వీరికి టికెట్స్ ఇప్పించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ , కువైట్ కన్వీనర్లు ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ గత నెల 29 నుంచి అకామా ( రెసిడెన్సీ) లేని వారు స్వస్ధలాలకు వెళ్లిపోవచ్చని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి రోజు భారత కార్యాలయము వద్దకు వచ్చే తెలుగు వారికి సహాకారం అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ముగ్గురికి కూడా అవుట్ పాస్‌లు ఇప్పించామని చెప్పారు. కమిటీ సభ్యులు, దాతల సహాకారంతో ఈ ముగ్గురికి ఉచిత టికెట్స్ ఇప్పించిన ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందక పోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు కువైట్ వచ్చి తెలంగాణ వారికి సహాకారం అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసా రెడ్డి, గవర్ణింగ్ కౌన్సిల్ సభ్యుడు పీ రెహమాన్ ఖాన్, మీడియా ఇంచార్జ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, లలితారాజ్, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, మైనారిటీ సభ్యుడు షేక్ రహామతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ ఎంబసీపై పడిన రాకెట్
కాబుల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో గల భారతీయ ఎంబసీపై క్షిపణి పడింది. ఈ ఘటనలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంబసీలోని ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఐటీబీపీ భద్రతా బలగాలు ఉండే మూడు బరాక్‌లకు చేరువలో రాకెట్ పడినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. అయితే, భారతీయ ఎంబసీ టార్గెట్‌గానే రాకెట్ ప్రయోగం జరిగిందా? అన్న విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. -
సిక్కు బాలుడిపై దాడి : సుష్మా స్వరాజ్ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల సిక్కు బాలుడిపై విద్వేషపూరిత దాడి జరిగింది. వాషింగ్టన్లో అతని సహ విద్యార్థి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. భారతీయ సంతతికి చెందడం వల్ల తమ కుమారుడిని టార్గెట్ చేశారని, ఇది కచ్చితంగా విద్వేషపూరిత దాడేనని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్నాప్‌చాట్‌లో పోస్టు అయిన ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సీరియస్ అయ్యారు. వెంటనే తనకు రిపోర్టు అందజేయాలని భారత రాయబార కార్యాలయాన్ని సుష్మాస్వరాజ్ ఆదేశించారు. ఈ ఘటనపై స్థానిక అథారిటీలు కూడా విచారణ జరుపుతున్నాయి. ఆ బాలుడి సంతతికి, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్కూల్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఇది క్లాస్రూమ్ గొడవేనని అంటున్నారు. అయితే దాడికి పాల్పడ్డ సహ విద్యార్థితో తమ కొడుకు అసలు మాట్లాడడని బాలుడి తండ్రి ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పారు. ''నా కొడుకుకు ఇలాంటి ఘటన జరుగడం నిజంగా నాకు చాలా బాధకరంగా ఉంది. అతనితో నా కొడుకు అసలు మాట్లాడడు. అతని పేరు కూడా తెలియదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే నేను సహించను'' అని బాలుడి తండ్రి అన్నారు. ఇటీవల నెలలో విద్వేషపూరిత దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. సిక్కు కమ్యూనిటీలపై ఈ దాడులు మరింత జరుగుతున్నాయి. సెప్టెంబర్ 11 దాడి అనంతరం సిక్కు కమ్యూనిటీని విపరీతంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. -
అక్కడ అప్రమత్తంగా ఉండండి: భారత్
దుబాయ్: ఖతర్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది. టెర్రరిజానికి ఖతర్ మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ పలు గల్ఫ్ దేశాలు ఆ దేశంతో తమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఖతర్‌తో రవాణా సంబంధాలను కూడా తాము తెగదెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్, ఈజిప్టు దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటించాలనుకునే ఖతర్‌లోని భారతీయులు తమ ప్రయాణప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఖతర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, భారతీయుల రక్షణ, భద్రత వంటి అంశాలపై ఆ దేశ అధికారిక వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
కాబూల్ రక్తసిక్తం..
-
కాబూల్ రక్తసిక్తం..
ట్రక్కు బాంబుతో ఆత్మాహుతి దాడి ∙ 90 మంది మృతి.. - 400 మందికి గాయాలు ∙భారత ఎంబసీకి వంద మీటర్ల దూరంలోనే పేలుడు - స్వల్పంగా దెబ్బతిన్న ఎంబసీ భవనం.. సిబ్బంది సేఫ్ ∙ దాడిని ఖండించిన ప్రధాని మోదీ కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. రాజధాని కాబూల్‌లో ఓ ఉగ్ర వాది భారీ పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ హింసాకాండలో చిన్నారులు, మహిళలు సహా 90 మంది మృత్యువాతపడగా.. మరో 400 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వివిధ దేశాల ఎంబసీలు ఉండే చోట బుధ వారం ఉదయం 8.30 సమయంలో ఈ ఘట న చోటు చేసుకుంది. పేలుడు ధాటికి కిలో మీటర్ పరిధిలో ఉన్న భవనాల అద్దాలు, కిటి కీలు ధ్వంసమయ్యాయి. భారత రాయబార కార్యాలయానికి వంద మీటర్ల దూరం లోనే ఈ దాడి జరిగింది. దాడిలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. భయానక వాతావరణం.. పేలుడు తర్వాత ఎటుచూసినా మృతదేహా లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ప్రాణాలు దక్కించుకునేందుకు గాయపడిన వారు, మహిళలు, స్కూల్ విద్యార్థినులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. పేలు డు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ కమ్మేయడంతో ఏం జరుగుతుందో తెలి యని పరిస్థితి ఏర్పడింది. తమ వారి గురించి ఆరా తీస్తూ చాలా మంది కన్నీరుమున్నీర య్యారు. సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ‘దాడి మృతుల, బాధితుల్లో చాలా మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు’ అని అఫ్గాన్ ఆరోగ్య , హోం శాఖలు వెల్లడించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. ఉదయం 8.30 సమయంలో జాన్‌బాగ్ స్క్వేర్ ప్రాంతం లో భారీగా పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు తో ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ దురా గతానికి పాల్పడ్డాడని, ఈ దాడిలో 50 వాహ నాలు ధ్వంసమయ్యాయని వివరించాయి. బాధితులను ఆదుకునేందుకు కాబూల్ వాసులు ముందుకు రావాలని, రక్తానికి తీవ్ర కొరత ఉన్న దృష్ట్యా రక్త దానం చేయాలని కోరాయి. దాడిలో బీబీసీ చానల్‌కు చెందిన డ్రైవర్ మృతిచెందగా.. నలుగురు జర్నలిస్టులకు స్వల్ప గాయాలయ్యాయి. మా పని కాదు: తాలిబాన్ ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే తాలిబాన్ ఈ దాడి తాము చేయలేదని స్పష్టం చేసింది. రంజాన్ మాసం కావడంతో ప్రస్తుతం దాడులకు విరామం ప్రకటించామని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. భారతీయులంతా క్షేమం పేలుడులో భారత ఎంబసీ కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఎంబసీకి సమీపంలోనే పేలుడు సంభవిం చిందని, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆఫ్గాన్‌లోని భారత రాయబారి మన్‌ప్రీత్ వోహ్రా తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలతో పాటు ఎంబసీ తలుపులు, కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. జపాన్ ఎంబసీ కూడా స్వల్పంగా దెబ్బతినగా, అక్కడి ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయప డ్డారు. దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న మోదీ.. మృతుల కుటుంబ సభ్యులకు ట్విట్టర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భారత ఎంబసీ అధికారులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. -
భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!
-
భారత ఎంబసీ వద్ద భారీ పేలుడు!
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున బాంబు పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడులో భారతీయ ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదు. కానీ ఈ పేలుడులో పెద్ద ఎత్తున 65 మంది ప్రాణాలు విడిచినట్టు అఫ్ఘాన్ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 325మంది గాయపడ్డారని తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలోనే సంభవించిన ఈ పేలుడు ఈ ప్రాంతమంతా నెత్తుటి చారికలతో, క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారింది. ఈ పేలుడు ఘటనతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయం కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. జర్మన్ గేటు వద్ద పేలుడు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. వివిధ దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్న ఈ ప్రదేశానికి జర్మన్ గేటు ముఖద్వారంగా ఉంటుంది. దీనికి సమీపంలోనే జర్మనీ రాయబార కార్యాలయం నెలకొని ఉంది. అయితే, దేవుని దయవల్ల ఈ పేలుడులో భారత ఎంబసీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని, వారు సురక్షితంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. -
ఇరాక్‌లో ఇరుక్కున్న వారు ఇంటికి..
⇒ బాధితులను పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి ⇒ నెలాఖరు లోగా పంపించేందుకు ఎంబసీ హామీ జన్నారం(ఖానాపూర్): ఇరాక్‌లో చిక్కు కున్న బాధితులను స్వగ్రామాలకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరాక్‌లోని భారత రాయ బార కార్యాలయ అధికారులపై ఒత్తిడి తెచ్చాయి. ఈ నెలాఖరు లోగా వారిని తిరిగి పంపించేం దుకు అక్కడి రాయబార కార్యాలయ అధికారి దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బసంతరెడ్డి, తపాలపూర్వాసి మాటేటి కొమురయ్య ఆదివారం ‘సాక్షి’కి వివరించారు. ‘ఇరాక్‌లో ఇరుక్కున్నాం.. ఆదుకోండి’ శీర్షికన ఈ నెల 10న ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా లకు చెందిన సుమారు 300 మంది విజిట్ వీసాపై వెళ్లి అక్కడ ఇబ్బందులు పడుతున్న విష యాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసు కొచ్చింది. ఈ కథనానికి స్పందిం చిన ఢిల్లీ భారత రాయబార కార్యాలయ ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాటు... బసంతరెడ్డితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆయనకు ఫోన్ చేసి వివరాలు సేకరించారు. ఇరాక్‌లోని ఎర్బిల్ భారత రాయబార సంస్థలో రాజు అనే అధికారిని డిప్యూటీ కౌన్సిలర్‌గా నియమించి, ఈ సమస్య పరిష్కరించాలని ఢిల్లీ కార్యాలయం నుంచి ఆదేశించారు. ఈ క్రమంలో బాధితులను ఈ నెలాఖరు వరకు తిరిగి పంపిస్తామని దీపక్ విజ్ఞాని హామీ ఇచ్చి నట్లు తెలిపారు. ‘సాక్షి’ కథనంతోనే స్పం దించారని, తాము ‘సాక్షి’ పేపర్‌ను మరువబోమని బాధితులు పేర్కొన్నట్లు కొమురయ్య ఫోన్ ద్వారా తెలిపారు. -
‘వంశీ కుటుంబానికి సాయం అందిస్తాం’
న్యూఢిల్లీ: అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి మామిడాల వంశీరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వంశీ కుటుంబానికి మంత్రి సుష్మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అతని కుటుంబానికి తమ మంత్రిత్వ శాఖ సాయం అందిస్తుందని భరోసానిచ్చారు. ( చదవండి : అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత ) ప్రభుత్వ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని వంశీ కుటుంబానికి సుష్మా సూచించారు. భారత ఎంబసీ అధికారులు అందుబాటులో ఉంటూ సాయం చేస్తారని పేర్కొన్నారు. శాన్ఫ్రాన్సిస్కో లోని భారత అధికారుల నుంచి ఈ ఘటనపై నివేదిక అందిందని సుష్మా చెప్పారు. వంశీని కాల్చి చంపిన నిందితుడిని కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్‌కు చెందిన వంశీరెడ్డి శుక్రవారం ఓ దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. మాదక ద్రవ్యాలకు బానిసైన ఆ వ్యక్తి ఓ మహిళను బెదిరిస్తుండగా అడ్డుకోబోయిన క్రమంలో వంశీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. I am pained to know about the tragic death of your brother Vamshi Mamidala. My heartfelt condolences to your family./1 @mula_mahipal @CGISFO — Sushma Swaraj (@SushmaSwaraj) 13 February 2017 The culprit has been arrested. Our Consulate is in touch with your family. We assure you of all help and assistance. /3 — Sushma Swaraj (@SushmaSwaraj) 13 February 2017 -
ఆమెను తీసుకొచ్చే విమానమే దొరకలేదు
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాలపాటు మంచానికే పరిమితమై ఎట్టకేలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో వైద్యం చేయించుకునే అవకాశం దక్కినప్పటికీ ఈజిప్టుకు చెందిన ఎమాన్ అహ్మద్ (36)ను మరో సమస్య వెంటాడుతోంది. దాదాపు అరటన్నుతో ప్రపంచంలోనే అధిక బరువున్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఎమాన్‌ను ఈజిప్టు నుంచి ఎలా ముంబయికి తీసుకురావాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏ విమానం ఆమె ప్రయాణికి అనుమతిస్తుందనేది పెద్ద సమస్యగా మారింది. ఏ చార్టర్ విమానం కూడా ఆమెను తరలించేందుకు ఒప్పుకోవడం లేదు.. ముందుకు రావడం లేదు. ప్రస్తుతం కైరోలోని తన ఇంట్లోనే 25 ఏళ్లుగా ఉంటున్న ఆమె కనీసం ఒక్క అడుగుకూడా బయటకు వేయలేని పరిస్థితి. ముంబయికి చెందిన వైద్యులు ఆమెకు చికిత్స చేసేందుకు అంగీకరించడంతో తనకు జీవితంపై కొండంత ఆశ కలిగింది. అయితే, మొన్నటి వరకు వీసా దొరకలేదు. చివరకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారతతో ఆ సమస్య తీరింది. కానీ, ఇప్పుడు ఆమెను తీసుకోచ్చే విషయంలో మాత్రం ఏం చేయాలని ఆ కుటుంబ సభ్యులు మదనపడుతున్నారు. ఈజిప్టు నుంచి ముంబయికి నేరుగా విమానాలు లేవు. అలాగే చార్టర్ విమానాలు కూడా అందుబాటులో లేవు. ఒక వేళ ఆమెను తరలించాలని నిర్ణయించినా ఆ విమానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ నిబంధనల ప్రకారం 136 కేజీల లోపు బరువున్న రోగులను మాత్రమే స్ట్రెచర్ ద్వారా అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ బరువును అనుమతించరు. అయితే, ఏయిర్ ఇండియాకు మాత్రం అలాంటి సమస్య లేదు. అయితే, ముంబయి నుంచి ఆఫ్రికాకు నేరుగా విమాన సర్వీసు లేదని, జర్నీలోని ఫ్రాంక్ ఫర్డ్ వరకు అవకాశం ఉందని, వారి విజ్ఞప్తిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహానీ తెలిపారు. ఈమెకు సర్జరీ చేసి బరువు తగ్గించడాన్ని ముంబయి వైద్యులు చాలెంజ్‌గా తీసుకున్నారు. -
అరటన్ను మహిళకు సుష్మా వరం
న్యూఢిల్లీ: దాదాపు అరటన్ను బరువుతో మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా మంజూరు చేసింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్ అహ్మద్(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం 500 కేజీల బరువుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది. అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వాలని బేరియాట్రిక్ సర్జన్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన సుష్మా ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెకు మేం తప్పకుండా సహాయం చేస్తాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆ మాట ప్రకారమే మంగళవారం భారత రాయబార కార్యాలయం ఎమాన్‌కు వీసా మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఆమె భారత్‌కు వచ్చి ముంబయిలో చికిత్స పొందనుంది. ప్రస్తుతం సుష్మా స్వరాజ్ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. -
భారత ఎంబసీల వెబ్సైట్లు హ్యాక్
లండన్/న్యూఢిల్లీ: ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని 7 భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌కు గురైన వాటిలో రొమేనియా, దక్షిణాఫ్రికా, లిబియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మలావీ, మాలి కార్యాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ ముందుగా హ్యకింగ్ కు గురైంది. 22 టేబుళ్ల డేటాను హ్యాక్లర్లు బహిర్గతం చేశారు. లాగిన్, పాస్ వర్డ్ వివరాలు బయటపెట్టేశారు. 161 మంది భారతీయుల పేర్లు, పాస్ పోర్టు నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు బహిర్గతం చేశారు. మిగతా ఆరు దేశాల్లోని భారత ఎంబసీల కార్యాలయాల వెబ్సైట్లను ఇదేవిధంగా హ్యాక్ చేశారు. సమస్యను గుర్తించామనీ, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. -
భారతీయులూ.. అప్రమత్తంగా ఉండండి!
న్యూఢిల్లీ: సైనిక తిరుగుబాటుతో టర్కీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడి భారతీయులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టర్కీలో నివసిస్తున్న భారతీయులెవరు వీధుల్లోకి రావొద్దని, స్థానికంగా ఉన్న భారత రాయబార కార్యాలయంతో వారు నిత్యంలో టచ్ లో ఉండాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సూచించారు. టర్కీలో పరిస్థితులు కుదుటపడేవరకు ఆ దేశానికి భారతీయులు వెళ్లకూడదని, అక్కడికి ఏమైనా ప్రయాణాలు తలపెడితే మానుకోవాలని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో బహిరంగ ప్రజాప్రదేశాలకు వెళ్లకుండా ఇంట్లో ఉండటమే మంచిదని భారతీయులకు సుష్మ సలహా ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఈ హెల్ప్లైన్లు: అంకారా: +905303142203, ఇస్తాంబుల్ +905305671095 ద్వారా భారత రాయబార కార్యాలయ అధికారులను సంపద్రించాలని సుష్మ సూచించారు. టర్కీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా అంచనా వేస్తున్నామని, అక్కడ ఉన్న భారతీయుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ తెలిపారు. -
భారతీయులూ... బహుపరాక్
మోసగాళ్ల వలలో పడొద్దని ఇండియన్ ఎంబసీ హెచ్చరిక దుబాయ్: మోసగాళ్ల వలలో పడొద్దని ఇక్కడి భారతీయులను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. తాము భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులమని చెప్పుకుంటూ కాల్స్ చేసేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై స్థానిక అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారంటూ బెదిరించి బాధితుల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని తెలిపింది. భారతీయ రాయబార కార్యాలయం నియమించిన న్యాయవాది లేదా కన్సల్టెంట్ ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయాలని బాధితులకు సూచిస్తారని, అదే సమయంలో ఈ మొత్తాన్ని భారతీయ రాయబార కార్యాలయం రీయింబర్స్ చేస్తుందని చెబుతారని ఓ ప్రకటనలో తెలిపింది. తాము టార్గెట్‌గా ఎంచుకున్నవారి వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ఈ నయవంచకులు హ్యాకింగ్ స్కిల్స్‌ను వినియోస్తారని, రాయబార కార్యాలయం నుంచే ఫోన్ చేస్తున్నట్టు చెబుతారని తెలిపింది. -
బొద్దుగుమ్మ 'బుజ్జిమా' కష్టాలు తీరిపోయాయి!
దేశం కాని దేశంలో హ్యాండ్‌బ్యాగ్, పాస్‌పోర్టు పోగొట్టుకొని.. పీకల్లోతు కష్టాల్లో పడిన తెలుగు, తమిళ చిత్రాల హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కష్టాలు తీరిపోయాయి. ఆమెను ఆదుకోవడానికి వియన్నాలోని భారత రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. స్వదేశం వచ్చేందుకు ఆమెకు తాత్కాలిక ట్రావెల్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపిన విద్యుల్లేఖ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి - చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా') స్నేహితులతో కలిసి వియన్నాలో విహారానికి వెళ్లిన విద్యుల్లేఖను ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె ఉన్న హోటల్ లాబీలో ఆమె హ్యాండ్‌బ్యాగును దొంగలు కొట్టేశారు. దీంతో పాస్‌పోర్టు, క్యాష్ కార్డ్స్, డబ్బు అంతా కోల్పోయి విద్యుల్లేఖ చిక్కుల్లో పడింది. స్నేహితులతో కలిసి ఈ దేశానికి రావడమే తప్పయిందని ట్విట్టర్లో వాపోయింది. ఇదంతా తలరాత అయి ఉంటుందని వైరాగ్యం ప్రకటించింది. వియన్నాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో తనకు వెంటనే భారత రాయబార కార్యాలయం సాయం చేసిందని, ఎంతో స్నేహపూర్వకంగా రాయబార సిబ్బంది తనను అర్థం చేసుకున్నారని, ఇది ఎంతో ఆనందం కలిగిస్తున్నదని విద్యుల్లేఖ తాజాగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పీఎంవోను ట్యాగ్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. తనకు జరిగింది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి హాని జరగనందుకు కృతజ్ఞురాలై ఉంటానని, తాను సురక్షితంగా ఉన్నానని విద్యుల్లేఖ తెలిపింది. టూరిస్టులు లక్ష్యంగా ఎప్పుడూ దాడులు జరుగుతాయని, వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తన అనుభవపూర్వకంగా సూచించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'సరైనోడు' సినిమాలో సాంబారు చబ్బీ బ్యూటీగా, 'రాజుగారి గది' చిత్రంలో బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు తమిళ, తెలుగు చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. A big thanks 2 everyone who gave me info and helped me out. The Indian Embassy in Vienna has issued a temporary travel permit 2 travel today — Vidyu (@VidyuRaman) 4 May 2016 .@SushmaSwaraj @PMOIndia the Indian Embassy in Vienna was extremely friendly, understanding and helped me immediately. I am safe. Thank you — Vidyu (@VidyuRaman) 4 May 2016 -
అఫ్ఘాన్‌లో దాడి వెనుక పాక్ సైనికాధికారుల ప్రమేయం!
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని మజార్ ఏ షరీఫ్‌లోని భారత ఎంబసీపై టైస్టు దాడి వెనుక పాక్ సైనికాధికారుల పాత్ర స్పష్టంగా ఉన్నట్లు అఫ్గాన్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. ‘ఈ వ్యవహారాన్ని మన సొంత కళ్లతో చూస్తే నిజం తేటతెల్లమవుతుంది.. దాడి చేసిన వారు పాక్ మిలటరీకి సంబంధించిన దాడిలో వారి ఎత్తుగడలన్నీ పాక్ మిలటరీవే’ అని బల్ఖ్ రాష్ట్ర పోలీస్ చీఫ్ సయ్యద్ సదత్ తెలిపారు. దాడి చేసిన ముష్కరులు సరిహద్దులు దాటి వచ్చారని, వారు మిలటరీ శిక్షణ పొందినవారేనని.. బాగా చదువుకుని, నిఘాపై పూర్తి అవగాహన ఉన్నవారని సదత్ తెలిపారు. వారు అఫ్గాన్‌లోని ‘దరి, పష్తు’ భాషలు మాట్లాడలేదని.. ఉర్దూలోనే మాట్లాడారని చెప్పారు. ఈ నెల మూడున మజర్ ఎ షరీఫ్‌లోని భారత మిషన్ బిల్డింగ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఓ పోలీసు అధికారి చనిపోగా, 9 మంది గాయపడడం తెలిసిందే. -
భారత ఎంబసీ వద్ద బాంబు పేలుడు
జలాలాబాద్: అప్గానిస్తాన్‌లో భారతీయ సంస్థలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జలాలాబాద్ నగరంలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సమీపంలో మంగళవారం బాంబు పేలింది. కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు భారత దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని అప్గాన్ అధికారులు తెలిపారు. భారత కాన్సులేట్ సమీపంలోనే పాక్, ఇరాన్ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని విదేశాంగ ప్రతినిధి వికాశ్ స్వరూప్ అన్నారు. దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు. -
అయ్యో.. ఎంత కష్టం..
కూటి కోసం సౌదీకి వెళితే..చిత్ర హింసలకు గురి చేశారు ఉపాధి చూపించని ఏజెంట్ ఇండియన్ ఎంబసీలో రోదిస్తున్న మహిళ వారిది కడు పేదరికం.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో డబ్బు సంపాదించేందుకు ఆమె సౌదీకి వెళ్లాలని భావించింది. ఎట్టకేలకు ఒక ఏజెంట్‌తో ఒప్పందం కుదుర్చుకొని సౌదీ అరేబియాకు వెళ్లింది. అక్కడ ఆమెకు పని చూపలేదు. ఆమె ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. దిక్కుతోచని స్థితిలో సౌదీ వీధుల్లోకి వచ్చింది. అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇండియన్ ఎంబసీకి తరలించారు. తనను విముక్తి చేయండంటూ ఆమె అక్కడి అధికారులను ప్రాధేయపడుతోంది. ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న దుర్గం పుల్లయ్య పాత చీరెల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. అతని భార్య పర్వీన్ ఇటుకల ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్లేది. వారికి మాబుచాన్, చాందిని అనే కుమార్తెలు, రహీం అనే కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరు కష్టపడుతున్నప్పటికీ అంతంత మాత్రమే డబ్బు వస్తోంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కారణంగా వారి పోషణ నిమిత్తం కొంత డబ్బు సంపాదించాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సౌదీకి వెళ్తానని భర్తతో చెప్పగా అతను సరేనని ఒప్పుకున్నాడు. సౌదీకి వెళ్లేందుకు ఏజెంటుతో ఒప్పందం మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ సమీపంలో ఉంటున్న ఓ ఏజెంటుతో ఆమె మాట్లాడుకుంది. సౌదీలోని సేఠ్ ఇంటిలో పని చేయడానికి పర్వీన్‌ను పంపిస్తానని అతను చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె తన వద్ద ఉన్న కొంత డబ్బు ఇవ్వగా మిగిలిన డబ్బు ఏజెంటే భరించి గత నెల 26న పర్వీన్‌ను సౌదీకి పంపించాడు. మిగిలిన డబ్బు సౌదీలో జీతం వచ్చిన వెంటనే తనకు ఇవ్వాలని ఏజెంటు ఆమెతో అన్నాడు. సౌదీకి పంపించిన అతను అక్కడున్న తన మరో ఏజెంటుకు ఆమెను అప్పగించాడు. అయితే అతను పర్వీన్‌ను ఇంటిలో పనికి కాకుండా ఓ గోడౌన్లో వదిలాడు. అక్కడున్న వారు ఆమెను కొరడాలతో కొడుతూ చిత్ర హింసలకు గురి చేశారు. దీంతో ఆమెను తనను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారని అడిగే సాహసం చేయలేక రెండు వారాల తర్వాత ఆమె వారికి చెప్పకుండా సౌదీ వీధుల్లోకి వచ్చింది. అయితే ఆమె వద్ద పాస్‌పోర్టు, వీసా లేకపోవడంతో అనుమతి లేకుండా సౌదీలో తిరుగుతోందన్న కారణంగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఆమెను ఎంబసీకి తరలించారు. నన్ను కాపాడుకోండి ఎంబసీలో ఉన్న మరో మహిళ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పర్వీన్ రెండు రోజుల క్రితం తన సోదరుడు షాహుసేన్కు ఫోన్ చేసింది. పని చూపిస్తానని తీసుకెళ్లిన ఏజెంటు పనిలో వదలకుండా చిత్రహింసలకు గురిచేశాడని ఆమె రోదిస్తూ ఫోన్లో చెప్పింది. ఆమె మాటలు విన్న పిల్లలు బోరున విలపించారు. ఎలాగైనా తనను ఇండియాకు పిలిపించుకోవాలని ఆమె తన సోదరున్ని వేడుకుంది. ఈ విషయంపై షాహుసేన్ ఏజెంటును ప్రశ్నించగా తనకు రూ.లక్షన్నర దాకా ఖర్చయిందని, ఆ డబ్బు ఇస్తే కానీ పర్వీన్‌ను ఇండియాకు తీసుకుని వచ్చేది ఉండదని చెప్పాడు. కావాలంటే ఇప్పుడు టికెట్ డబ్బులు ఇస్తాం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు బతిమాలినా అతను వినిపించుకోలేదు. ఏజెంటు బెదిరించడంతో పర్వీన్ భర్త దుర్గం పుల్లయ్య కూడా గత కొద్ది రోజుల నుంచి కనిపించకుండా పోయాడని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. దీంతో షాహుసేన్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా వారి పిల్లలు ముగ్గురు ఆమె జేజి దస్తగిరమ్మ వద్ద ఉంటున్నారు. అమ్మ కావాలి అంటూ ఆ పిల్లలు ఏడుస్తుంటే వారికి ఏం జవాబు చెప్పాలో దిక్కుతోచక ఆమె క న్నీళ్లు దిగమింగుకుంటోంది. పోలీసులు స్పందించి ఆమెను సౌదీ నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది. -
భారత రాయభార కార్యాలయ ఉద్యోగి కుమార్తె మృతి
న్యూఢిల్లీ/ఖాట్మండు: భారీ భూకంపం సృష్టించిన బీభత్సం కారణంగా ఇక్కడి భారత రాయభార కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. రాయభార కార్యాలయం ఉద్యోగి కుమార్తె మృతి చెందినట్లు భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు. రాయభార కార్యాలయం కాంప్లెక్స్‌లోని వారు నివాసం ఉండే ఇల్లు కూలిపోవడంతో దురదృష్టవశాత్తు మన ఉద్యోగి మదన్ కుమార్తె మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన అతని భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నేపాల్‌కు భారత్ అపన్న హస్తం అందిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయిదు రెస్క్యూ బృందాలను ఖాట్మండు పంపినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయానికి ఈ బృందాలు ఫోఖారా చేరుకుంటాయని తెలిపింది. భారీ భూకంపం ధాటికి ఖాట్మండులో వేయి భవనాలు కుప్పకూలిపోయాయి. కూలిపోయినవాటిలో చారిత్రక ప్రాధాన్యత గల భవనాలు కూడా ఉన్నాయి. రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. -
అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి
సంగం: పర్వాతారోహకుడు మస్తాన్‌బాబు మృతదేహాన్ని అర్జెంటీనా నుంచి ఆయన స్వగ్రామానికి తరలిస్తుండడంతో అక్కడి భారత ఎంబసీ అధికారులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మస్తాన్‌బాబు సోదరి దొరసానమ్మ ఫేస్బుక్లో వివరాలను పొందుపరిచారు. మువ్వన్నెల జెండా పక్కన మస్తాన్‌బాబు ఫొటోలను పుష్పగుచ్ఛాల మధ్య ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మస్తాన్‌బాబు సాహసాలను వారు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దొరసానమ్మతో పాటు అర్జెంటైనాలోని భారతీయ ప్రతినిధుల బృందం పాల్గొంది. -
అమెరికాలో అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్ యూనివర్సిటీ, న్యూయార్క్‌లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం ఆదివారం ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని భారత దౌత్యవేత్త జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ భాషకు అగ్రస్థానం కల్పిస్తోందని జ్ఞానేశ్వర్ కొనియాడారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సమ్మేళనంలో హిందీ భాషకు ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తారు. హిందీ రచనలు, రచయితలకు భారతదేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాలేదని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అమెరికాలోని భారతీయ విద్యాభవన్‌కు చెందిన సీకే రావు, జయరామన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సత్యనారాయణ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ హిందీ ప్రొఫెసర్ డా. గార్నెనితో పాటు వివిధ దేశాల నుంచి ఎంపికైన 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
న్యూయార్క్: న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం, రాత్గేర్స్ విశ్వ విద్యాలయం, న్యూయార్క్‌లోని హిందీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హిందీ సమ్మేళనం స్థానిక రాత్గేర్స్ విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనంలో ప్రపంచంలో హిందీ భాష ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని ఎలా అధిగమించాలో చర్చిస్తారు. భారత దౌత్య అధికారి జ్జ్ఞానేశ్వర్ ములే మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం హిందీ భాషకు అగ్ర స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. విదేశాలలో సైతం మోదీ హిందీలోనే ప్రసంగాలు చేస్తున్నారన్నారు. హిందీ మాతృభాషగా కలిగిన వివిధ ప్రాంతాల వారు, హిందియేతర ప్రాంతాల రచయితలు వారి రచనలను, అదేవిధంగా విదేశాల నుండి వెలువడుతున్న హిందీ సాహిత్యానికి, భారత దేశంలో సముచిత స్థానం కల్పించకపోతే హిందీ ఎప్పటికీ విశ్వ భాష కాదని, కేవలం భారత దేశంలోని 10 రాష్ట్రాలకే పరిమితం అవుతుందని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హెచ్చరించారు. ప్రయాగలోని త్రివేణి సంగంలో కనిపించని సరస్వతి నదితో పాటు గంగ, యమునల సంగమాన్ని భారతీయులు అందరు భక్తీ భావనతో చూస్తారని చెప్పారు. కానీ దక్షిణాదిలో వున్న కన్యాకుమారిలో మూడు సముద్రాలూ సంగమమై ఉన్నాగాని దక్షిణ భారత దేశపు ప్రాశస్త్యతను ఉత్తరాది వారు గుర్తించడం లేదని చెప్పారు. అదే విధంగా దక్షిణాదికి చెందిన రామానుజాచార్యులు, శంకరాచార్యులు, వల్లభాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారి ఆధ్యాత్మిక ప్రసంగాలే లేకపోతే హిందీ సాహిత్యంలోని స్వర్ణయుగంగా భావించబడే భక్తి సాహిత్యానికి మనుగడే వుండేది కాదని లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నల్ల సత్యనారాయణ, హిందీ భాష సాహిత్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలను వివరించారు. చార్లెస్ మాబ్రేల్స్, అషార్ దత్తర్, అమెరికాలోని భారతీయ విద్యా భవన్‌కు చెందిన డాక్టర్ సి.కె. రావు, జయరామన్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం హిందీ ఆచార్యులు, న్యూయార్క్‌లోని హిందీ ఆచార్యులు డాక్టర్ గార్నెని, డాక్టర్ వితూరి పొవెల్, హిందీ సంఘం ఫౌండేషన్ చైర్మన్ అశోక్ ఓజా, ఆంధ్ర విశ్వవిద్యాలయంకు చెందిన నల్లా సత్యనారాయణతో సహా అమెరికా, కెనడా, బ్రెజిల్, భారత దేశానికి చెందిన 200 మంది నిష్ణాతులైన ఆచార్యులు ఇందులో పాల్గొన్నారు. -
కువైట్‌లో 25 మంది భారతీయుల అరెస్టు
ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో 25 మంది భారతీయులను కువైట్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అరెస్టయిన భారతీయులను రక్షించాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీ, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్‌లకు అక్కడి భారతీయులు, వాళ్ల సహోద్యోగులు సందేశాలు పంపారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సంఘటన తర్వాత 15 మంది భారతీయులను ఆస్పత్రిలో చేర్చడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు వాళ్లను పరామర్శించారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. కువైట్‌లో దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులున్నారని, వాళ్లంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. అయితే.. భారతీయులు ఎక్కడున్నా అక్కడి స్థానిక చట్టాలకు కూడా కట్టుబడి ఉండాలని తెలిపారు. -
ఇరాక్‌లో బిక్కు బిక్కు
హెల్ప్లైన్లు ఇవే... ఇరాక్‌లో యుద్ధం వల్ల వలస కార్మికుల కుటుంబాల సమాచారం తెలుసుకునేందుకు రాజధాని బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. 009647704444899, 00964770484324 నంబర్లను సంప్రదించాలని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రకటన విడుదల చేశారు. రాయికల్ : ఇరాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతుండగా అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమానులు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు. రెండు రోజులుగా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరి మితమయ్యారు. జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియో జకవర్గాల నుంచి దాదాపు 1000 మంది వరకు ఇరాక్‌లో ఉంటారు. ఏం జరుగుతోంది? ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు. -
కారా‘ఘోరం’.. సౌదీ జైలులో వలస కార్మికులు
నాలుగు నెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్న వలస కార్మికులు ఆదుకోవాలంటూ ‘న్యూస్‌లైన్’కు ఫోన్ చేసిన బాధితులు కామారెడ్డి, న్యూస్‌లైన్: బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లిన యువకులు అక్కడి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో నాలుగు నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఫోన్లో తమ గోడును వెళ్లబోసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన మిరిదొడ్డి అనిల్ గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. ‘నతాఖత్’ చట్టం అమలులోకి రావడంతో పలు కంపెనీలు చాలా మంది కార్మికులను బయటకు పంపించాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా సౌదీలో ఉంటున్నారంటూ తనతోపాటు దాదాపు రెండు వందల మంది జైలులో వేశారని తెలిపారు. మాచారెడ్డి మండలం రాజఖాన్పేటకు చెందిన విజయ్, ఎల్లంపేటకు చెందిన మోహన్, సదాశివనగర్ మండలం కన్నాపూర్‌కు చెందిన భిక్షపతి, తాడ్వాయి మండలం అర్గొండకు చెందిన సాయిలు, కొండాపూర్‌కు చెందిన రాంచందర్‌తోపాటు వివిధ ప్రాంతాలవారు ఇందులో ఉన్నారని వివరించారు. జైలులో సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గోడును భారత రాయబార కార్యాలయం అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి నాయకులకు ఫోన్లు చేసి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తా: దేవయాని తండ్రి
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని దేవయాని ఖోబ్రగడే తండ్రి, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే స్పష్టం చేశారు. దేవయాని తండ్రి ఉత్తమ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో వస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇందులో కొత్త విషయమేమీ లేదన్నారు. త్వరలో తన రాజకీయ ఆరంగేట్రం జరుగుతుందన్నారు. తప్పకుండా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటానన్నారు. కాగా ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న అంశంపై మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. తగిన సమయం చూసుకుని ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అమెరికాలో భారత దౌత్త్యవేత్త గా సేవలందించి పని మనిషి వీసా కేసుకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఆమె గత వారం భారత్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కూతురు అమెరికాలో ఉన్న పిల్లల్ని భారత్ కు తీసుకు వచ్చే యత్నాల్లో నిమగ్నమైందన్నారు. వారు ఫిబ్రవరి నెలలో భారత్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల విద్యకు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. -
మళ్లీ మా దేశం రావద్దు!
దేవయానికి అమెరికా ఆదేశం కోర్టు విచారణకు తప్ప భవిష్యత్‌లో వీసా ఇవ్వం వాషింగ్టన్/న్యూయార్క్: భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేను శుక్రవారం దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించిన అమెరికా.. తాజాగా శనివారం ఆమెను తిరిగి అమెరికాలోకి రాకూడదంటూ నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఆమెకు వీసా జారీ చేయకుండా తమ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థను అప్రమత్తం చేస్తామని పేర్కొంది. అమెరికా నుంచి వెళ్లినంత మాత్రాన దేవయానిపై నమోదైన అభియోగాల్లో మార్పేమీ ఉండబోదని, ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ చేసే అవకాశం కూడా ఉందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జెన్‌సాకి స్పష్టం చేశారు. అమెరికా నుంచి శుక్రవారం భారత్ చేరుకున్న దేవయానికి ఇకపై దౌత్యరక్షణ కూడా ఉండబోదన్నారు. ‘ఇకపై దేవయాని అమెరికాకు తిరిగి రాకూడదన్న ఆదేశాలను భారత్‌కు బయల్దేరే ముందే ఆమెకు, భారత ప్రభుత్వానికి తెలియజేశాం. కోర్టు విచారణ నిమిత్తం మాత్రమే ఆమెను అమెరికాలో మళ్లీ అడుగుపెట్టేందుకు అనుమతిస్తాం’ అన్నారు. దీన్ని బట్టి దేవయానిని అమెరికా బహిష్కృత వ్యక్తి(పర్సోనా నాన్ గ్రాటా)గా నిర్ధారించినట్టు స్పష్టమవుతోంది. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్న దేవయానికి ఆరు, మూడేళ్లున్న ఇద్దరు కూతుర్లున్నారు. వారిని కూడా త్వరలో ఆమె భారత్‌కు రప్పించాలనుకుంటున్నారు. ఒప్పందం ఫలితంగానే.. దేవయాని విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో.. భారత్, అమెరికాలు ఒక ఒప్పందానికి రావడం వల్లనే దేవయాని భారత్‌కు వచ్చేసిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల అధికారులు, న్యాయవాదుల మధ్య సమస్య సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయని.. అయితే, దేవయానిపై చేసిన నేరాభియోగాల తీవ్రతను తగ్గిస్తామని, వాటిని పూర్తిగా వెనక్కు తీసుకోలేమని అమెరికా.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిందే అని భారత్.. భీష్మించుకోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గురువారం నాటికి ఇరుదేశాలుఅంగీకారానికి రావడం వల్లనే అమెరికా దేవయానిని భారత్ పంపించిందని వెల్లడించాయి. అయితే, దేవయానిపై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకునేందుకు అమెరికా ససేమిరా అంటోందని, తీవ్ర నేరం స్థాయి నుంచి ‘తప్పుడు నడవడిక’ స్థాయి నేరానికి ఆ అభియోగాలను తగ్గించేందుకే అంగీకరించిందని తెలిపాయి. అయితే దేవయానిపై అభియోగాలను అంగీకరించబోమని భారత్ వాదిస్తోందన్నారు. కాగా, ఐరాస శాశ్వత మిషన్‌కు తన బదిలీని అంగీకరించడం ద్వారా అమెరికా తనకు పూర్తి దౌత్యరక్షణకు ఆమోదం తెలిపిందని, అందువల్ల తనపై కేసు కొట్టేయాలని దేవయాని న్యూయార్క్ కోర్టును కోరారు. విదేశాంగ మంత్రితో దేవయాని భేటీ న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి భారత్ తిరిగివచ్చిన దేవయాని శనివారం విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని వారిని కోరారు. -
దేశం విడిచి వెళ్లండి: అమెరికా
వీసా కేసులో దేవయానికి అమెరికా ఆదేశం భారత్ ప్రతిచర్య.. అమెరికా దౌత్యవేత్త ‘బహిష్కరణ’ ఖోబ్రగడేపై నేరాభియోగాలు నమోదు చేసిన అమెరికా కోర్టు యూఎన్ మిషన్‌కు దేవయూని బదిలీకి ఎట్టకేలకు యూఎస్ ఆమోదం న్యూయూర్క్/న్యూఢిల్లీ: భారత్-అమెరికా దౌత్య సంబంధాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత దౌత్యవేత్త దేవయూని ఖోబ్రగడే (39) ‘వీసా కేసు’లో.. తాజాగా చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. దేవయూనిని అమెరికా బహిష్కరించడం, ఇందుకు ప్రతిచర్యగా భారత్ సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించడం.. తదితర పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయూరుు. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిం దిగా దేవయూని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అమెరికా కోర్టు.. తాజాగా శుక్రవారం ఆమెపై ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగాలు నమోదు చేసింది. దీనికిముందు.. అరెస్టు నేపథ్యంలో భారత్ దేవయూనిని ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేయడాన్ని అమెరికా ఎట్టకేలకు ఆమోదించింది. తద్వారా ఆమెకు పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయూల్సిందిగా కోరిన అమెరికా.. భారత్ అందుకు నిరాకరించడంతో ఖోబ్రగడేను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయూని న్యూ యూర్క్ నుంచి భారత్‌కు పయనమయ్యూరు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతి చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని పేరు తెలియని డెరైక్టర్ స్థారుు (దేవయూని హోదాతో సమానమైన హోదా) అమెరికా దౌత్యవేత్తను బహిష్కరించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఆయన పేరు వెల్లడి కానప్పటికీ పనిమనిషి రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి అమెరికాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన దౌత్యవేత్తపైనే బహిష్కరణ వేటు పడినట్లు సమాచారం. అరుుతే ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించేందుకు భారత అధికారులు నిరాకరించారు. అమెరికా ఎంబసీలోని ఓ దౌత్యవేత్తను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కార్యాలయూన్ని కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. భారత్ ఈ విధంగా ‘దెబ్బకు దెబ్బ’ వంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. 33 ఏళ్ల క్రితం అమెరికా ప్రభాకర్ మీనన్ అనే భారత దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు.. ఇండియూ కూడా ఢిల్లీలోని అమెరికా పొలిటికల్ కాన్సులర్‌ను బహిష్కరించింది. దేవయూనిపై అమెరికా కోర్టు నేరారోపణలు నమోదు చేయడాన్ని భారత్ ఓటమిగా బీజేపీ అభివర్ణించింది. అమెరికాలో కేసు పెండింగ్‌లోనే ఉంటున్నందున ఇది మన ఓటమేనని, విజయం కాదని బీజేపీ నేత, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. అభియోగాలు అలాగే ఉంటారుు: యూఎస్ అటార్నీ పూర్తిస్థారుు దౌత్యరక్షణ ఉన్న నేపథ్యంలో దేవయూని భారత్ తిరిగి వెళ్తున్నప్పటికీ దేవయూనిపై మోపిన అభియోగాలు అలాగే ఉంటాయని అమెరికా కోర్టు విస్తృత ధర్మాసనం (గ్రాండ్ జ్యూరీ) స్పష్టం చేసింది. దౌత్య రక్షణ లేకుండా దే వయూని కనుక అమెరికా తిరిగివచ్చిన పక్షంలో విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని యూఎస్ అటార్నీ ప్రీత్ బరారా చెప్పారు. జిల్లా జడ్జి షీరా షీండ్లిన్కు రాసిన లేఖలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారంలో.. మోసం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి రెండు నేరాలు కోర్టు దేవయూనిపై మోపినట్టు బరారా వివరించారు. దేవయూనికి దౌత్య రక్షణ హోదా ఇటీవలే కల్పించిన విషయం తమకు తెలుసునని చెప్పారు. పనిమనిషి రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడంతో పాటు దేవయూని ఆమెకు తగిన వేతనం చెల్లించడం లేదని, ఇతర ఆరోపణలతో మొత్తం 21 పేజీలతో ఖోబ్రగడేపై చార్జిషీట్ దాఖలైంది. తప్పుడు, ఆధారరహిత అభియోగాలు: దేవయూని తనపై మోపిన అభియోగాలు తప్పు, ఆధార రహితమని 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అరుున ఖోబ్రగడే పేర్కొన్నారు. భారత్‌కు విమానం ఎక్కేముందు ఆమె పీటీఐతో మాట్లాడారు. ఈ పరిణామాలు తన కుటుంబంపై, ముఖ్యంగా ఇప్పటికీ అమెరికాలోనే ఉన్న తన పిల్లలపై ఎలాంటి దుష్ర్పభావాన్నీ చూపబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన భారత విదేశాంగ శాఖ మంత్రికి, సహచరులకు, రాజకీయ నాయకత్వానికి, మీడియూకు.. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశ ప్రజానీకానికి ఆమె కృతజ్ఞత లు తెలిపారు. పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించిన నేపథ్యంలో దేవయూని అమెరికా బయ ట కూడా పర్యటించవచ్చని, ఈ నేపథ్యంలోనే భారత్ వెళుతున్నారని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ చెప్పారు. మౌనం వీడిన సంగీత దేవయూని ఇటు ఇండియూ విమానమెక్కగానే పనిమనిషి సంగీత రిచర్డ్ మౌనం వీడారు. దౌత్యవేత్త వద్ద పనిచేస్తుండగా తానెన్నో బాధలు పడ్డట్టు చెప్పారు. తనలా బాధలకు గురికాకుండా చూసుకోండంటూ ఇతర పని మనుషులకు సూచించారు. కుటుంబం కోసం కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి తిరిగి ఇండియూ వెళ్లిపోవాలనుకున్నట్టు సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ‘సేఫ్ హారిజాన్’ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాజీ నిరాకరించిన దేవయూని దేశ సార్వభౌమాధికారాన్ని సమున్నత స్థారుులో నిలిపేందుకు పోరాటం కొనసాగిస్తున్న తన కుమార్తె.. కేసులో రాజీ పడి అమెరికాలోనే ఉండాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనను నిరాకరించినట్లు దేవయూని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. పనిమనిషికి పరిహారం చెల్లించడం, జరిమానా కట్టడం, దర్యాప్తు చేసిన వ్యక్తికి కూడా చెల్లింపులు చేస్తే ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటామని, తద్వారా అమెరికాలోనే ఉండవచ్చని చెప్పారన్నారు. ఈ రాజీ ప్రతిపాదనను దేవయూని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. పరిణామాల క్రమం.. వీసా కేసులో డిసెంబర్ 12న దేవయూనిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దుస్తులు విప్పి మరీ ఆమెను సోదా చేశారు. నేరగాళ్లతో కలిపి లాకప్‌లో ఉంచారు. అరెస్టు నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిన్నర రూపాయల పూచీకత్తుతో ఖోబ్రగడే విడుదలయ్యూరు. దేవయూని అరెస్టు భారత్, అమెరికాల మధ్య వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేసింది. తద్వారా ఆమెకు డిప్యూటీ కాన్సులర్ హోదాలో పాక్షిక దౌత్య రక్షణ కాకుండా పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే అమెరికా ఈ విధమైన యూఎన్ గుర్తింపునకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేసింది. ఎట్టకేలకు భారత్, అమెరికా ప్రధాన కార్యాలయూల ఒప్పందాన్ని అనుసరించి ఈ నెల 8న దేవయూనికి పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. ఈ నెల 9న ఆ హోదాను రద్దు చేయూల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. తద్వారా ఖోబ్రగడేను కోర్టులో విచారించేందుకు వీలవుతుందని ఆ దేశం ఆశించింది. -
వివాదానికి పరిష్కారం కనుగొంటాం: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: భారత్ - అమెరికాలు పరస్పర వ్యవహారాల్లో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ఇరు దేశాలూ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుందని.. రెండు దేశాల మధ్య సంబంధాలను పరిరక్షించటం ముఖ్యమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత దౌత్యవేత్త దేవయాని అరెస్ట్ వివాదానికి ఒక పరిష్కారం కనుగొంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘కేవలం ప్రభుత్వాలే కాకుండా, ప్రయివేటు రంగం, వ్యక్తుల బృందాలు, సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన సంబంధాలివి. పరస్పర వ్యవహారాల్లో రెండు పక్షాలూ ఈ భిన్నమైన కోణాలను గమనంలో ఉంచుకోవాలని నేను భావిస్తున్నా. న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్త పట్ల అమెరికా బాధించే విధంగా, అవమానకరంగా వ్యవహరించినప్పటికీ.. మేము రెండు దేశాల మధ్య ఉన్న విలువైన సంబంధాలను గమనంలోనే ఉంచుకున్నాం. వారు కూడా గమనంలో ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నా’’ అని ఖుర్షీద్ పేర్కొన్నారు. మరోవైపు.. భారతదేశంలో అమెరికా దౌత్యాధికారులకు తాము ఎలాంటి గౌరవమర్యాదలు అందిస్తున్నామో.. అమెరికా కూడా తన దేశంలోని భారత దౌత్యాధికారులతో అలాగే వ్యవహరించాలని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ సూచిం చారు. ఆమె శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేవయాని విషయంలో అమెరికా అధికారుల చర్యలను ఆమె తప్పుపట్టారు. ఒక సీనియర్ దౌత్యాధికారితో వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. -
దేవయానిని వదిలేసే ప్రసక్తే లేదు
వాషింగ్టన్: వీసా అక్రమాల అభియోగాలపై అరెస్టు చేసిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడేపై కేసును ఉపసంహరించుకోవాలని, ఆమెను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని భారతదేశం చేసిన డిమాండ్లను అమెరికా తోసిపుచ్చింది. దేవయానిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఆమెను విచారించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని శుక్రవారం స్పష్టంచేసింది. దేవయానిని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి తరలించిన తర్వాత ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉంటుందనటం.. అక్కడికి పంపించకముందు ఉన్న కేసులకు వర్తించదని విదేశాంగ శాఖ ప్రతినిధి మారీహార్ఫ్ శుక్రవారం వాషింగ్టన్లో మీడియాతో పేర్కొన్నారు. న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయానిని ఈ నెల 12వ తేదీన అత్యంత అగౌరవంగా నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటమే కాక, తనిఖీల పేరుతో కూడా తీవ్రంగా అవమానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాలు, దౌత్యాధికారులకు అందిస్తున్న భద్రతను, ప్రత్యేక సదుపాయాలను తగ్గించిన విషయమూ విదితమే. దేవయానిపై కేసును ఉపసంహరించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమెరికాను భారత్ డిమాండ్ చేసింది. అయితే.. ‘‘దేవయానిపై ఆరోపణలను మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ ఆరోపణలపై కానీ, అభియోగాలపై కానీ మేం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇది చట్టపరమైన అంశం’’ అని మారీహార్ఫ్ ఉద్ఘాటించారు. ఒకవేళ దేవయానిపై ఆమె పనిమనిషి ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ తమ ప్రభుత్వం ఆమెపై అభియోగాలను ఉపసంహరించుకుంటుందని తాను చెప్పలేనన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీతో తన సంభాషణకు సమయాన్ని నిర్ణయించనున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ చేసిన ప్రకటనతో హార్ఫ్ విభేదించారు. అటువంటి ప్రణాళిక ఏదీ ఇప్పటివరకూ లేదన్నారు. జాన్‌కెర్రీ ఫోన్ చేసినపుడు తాను అందుబాటులో లేనని, నేడో రేపో ఆయనతో తాను మాట్లాడతానని ఖుర్షీద్ మీడియాతో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ.. కెర్రీ కుటుంబంతో కలసి సెలవులు గడపటం కోసం ఫిలిప్పీన్స్‌లో ఉన్నారని.. సెలవులు పూర్తయ్యాకే ఆయన వాషింగ్టన్ తిరిగి వస్తారని హార్ఫ్ వివరించారు. జూలై నుంచి భారత్‌తో చర్చిస్తున్నాం... చట్టాన్ని నిర్వచించటంలో అమెరికా, భారత్‌ల మధ్య తేడాలు ఉన్నాయని మారీహార్ఫ్ అంగీకరించారు. అయితే.. దేవయానిపై ఆమె పనిమనిషి సంగీత రిచర్డ్స్ చేసిన ఆరోపణల్లో భారత్ దర్యాప్తు వివరాలను తమకు తెలియజేయాలని, ఆరోపణలపై చర్చించేందుకు దేవయానిని తమకు అందుబాటులో ఉంచాలని తాము చేసిన డిమాండ్లను భారత్ నెరవేర్చలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం తమను సంప్రదించలేదన్న భారత్ ఆరోపణను ఆమె తిరస్కరించారు. సంగీత తన యజమాని దేవయానికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి, తన న్యాయవాదితో కలసి విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసిన జూలై నెల నుంచి ఈ అంశమై ఇరు దేశాల ప్రభుత్వాల మధ్యా చర్చ నడుస్తోందని హార్ఫ్ పేర్కొన్నారు. అయితే.. పని మనిషి చేసిన ఆరోపణలు వివరిస్తూ, వీటిపై దర్యాప్తు చేయాలంటూ సెప్టెంబర్ 4వ తేదీన అమెరికా నుంచి ఒక లేఖ తప్పితే మరెలాంటి సమాచారమూ తమకు అందలేదని వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం స్పష్టంచేసింది. సంగీత గురించి తాము అమెరికా ప్రభుత్వానికి చెందిన న్యూయార్క్ పోలీసు విభాగం, విదేశాంగ విభాగం, న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాలను పలుమార్లు సంప్రదించినప్పటికీ.. ఏ విభాగమూ స్పందించలేదని ఆరోపించింది. దర్యాప్తు మొదలైనందునే సమాధానం ఇవ్వలేదు... ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా మారీహార్ఫ్ బదులిస్తూ.. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆప్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ దర్యాప్తు ప్రారంభించటం.. ఆ విభాగంతో పాటు, ఇతర విభాగాల అధికారులను కూడా.. భారత ప్రభుత్వం, ఆ దేశ విదేశాంగ శాఖ, ఆ దేశ రాయబార కార్యాలయం అడిగిన సమాచారం ఇవ్వకుండా నిరోధించిందని పేర్కొన్నారు. ‘‘బాధితురాలు (సంగీత)కు చెందిన న్యాయవాది నుంచి.. వీసా అక్రమాలు, ఇతర ఆరోపణలతో జూలై 9వ తేదీన మాకు నోటిఫికేషన్ అందింది. ఆ సమయంలో బ్యూరో ఆఫ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఈ ఆరోపణలపై తన దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి దర్యాప్తు మొదలైతే.. మేం ప్రయివేటుగా కానీ, బహిరంగంగా కానీ ఏం చెప్పాలనేదానిపై పరిమితులు ఉంటాయి. మేం చట్టాన్ని సంపూర్ణంగా పాటించాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
అఫ్ఘాన్‌లో భారత ఎంబసీపై ఆత్మాహుతి దాడి
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పెంచిపోషిస్తున్న హక్కానీ నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం మేరకు.. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని ముగ్గురు ఉగ్రవాదులు.. జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వైపు ఒక కారులో దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు ప్రారంభించారు. భారీగా పేలుడు పదార్థాలను ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కారు దిగి రాయబార కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కాల్చేశారు. దాంతో మరో ఉగ్రవాది కారులో ఉన్న బాంబులను పేల్చేశాడు. అదే సమయంలో సమీపంలోని మసీదుకు వెళుతున్న చిన్నారులతోపాటు, వీసాల కోసం వచ్చినవారు మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యిపడింది. అయితే.. భారత అధికారులకు, రాయబార కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ఢిల్లీలోని భారత అధికారవర్గాలు వెల్లడించాయి. రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడుల వంటి ఘటనలతో భారత్ భయపడబోదని, అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం తాము అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.