టెహ్రాన్: దౌత్యపరంగా భారత్‌కు మరో ఘన విజయం దక్కింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌకలో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ మేరకు భారత్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.
వివరాల ప్రకారం.. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ దళాలు ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. సదరు నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. ఇక, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు.
"5 of the Indian sailors on MSC Aries have been released and departed from Iran today evening. We appreciate the Iranian authorities for their close coordination with the Embassy and Indian Consulate in Bandar Abbas," posts India in Iran (@India_in_Iran). pic.twitter.com/umppKnngG4
— Press Trust of India (@PTI_News) May 9, 2024
ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు భారత్ విదేశాంగ శాఖ కసరత్తు చేసింది. మంత్రి ఎస్.జైశంకర్ ఆ మధ్య ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ఇరాన్ విముక్తి కల్పించింది.
ఈ సందర్భంగా భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా..‘ఎంఎస్‌సీ ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్ చేసే ప్రయత్నాలకు ఇరాన్ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది అని పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్ నిన్న విడుదల చేసిందని’ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment