ship hijack
-
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
టెహ్రాన్: దౌత్యపరంగా భారత్‌కు మరో ఘన విజయం దక్కింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న వాణిజ్య నౌకలో బంధీలుగా ఉన్న ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈ మేరకు భారత్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.వివరాల ప్రకారం.. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ దళాలు ఓ వాణిజ్య నౌకను హైజాక్ చేసింది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి తమ ఆధీనంలోకి తీసుకుంది. సదరు నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. ఇక, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. "5 of the Indian sailors on MSC Aries have been released and departed from Iran today evening. We appreciate the Iranian authorities for their close coordination with the Embassy and Indian Consulate in Bandar Abbas," posts India in Iran (@India_in_Iran). pic.twitter.com/umppKnngG4— Press Trust of India (@PTI_News) May 9, 2024 ఈ నేపథ్యంలో వీరిని విడిపించేందుకు భారత్ విదేశాంగ శాఖ కసరత్తు చేసింది. మంత్రి ఎస్.జైశంకర్ ఆ మధ్య ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ఇరాన్ విముక్తి కల్పించింది.ఈ సందర్భంగా భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా..‘ఎంఎస్సీ ఏరిస్‌లోని భారత సిబ్బందిలో ఐదుగురిని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్ చేసే ప్రయత్నాలకు ఇరాన్ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది అని పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్ నిన్న విడుదల చేసిందని’ చెప్పుకొచ్చింది. -
15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’
సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ హైజాక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఎంవీ లీలా నార్ఫోక్(MV LILA NORFOLK) అనే లైబీరియన్ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న భారత నేవి అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు పేర్కొన్నారు. హైజాక్ అయిన షిప్, అక్కడి పరిస్థితులకు తెలుసుకోవడానికి కమ్మూనికేషన్ లింక్‌ను సృష్టించామని తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఇండియన్ నేవి పేర్కొంది. లైబీరియాన్ షిప్ హైజాక్ అయినట్లు గురువారం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్( UKMTO)కు సందేశం వచ్చిందని ఇండియాన్ నేవి తెలిపింది. ఆ షిప్లో ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు ఉన్నట్లు పోర్టల్‌కు వచ్చిన సందేశంలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ నేని.. ఎయిర్ క్రాఫ్ట్తో పర్యవేక్షిస్తూ ఐఎన్ఎస్ చెన్నైను సోమలియా సముద్ర తీరానికి పంపినట్లు తెలిపింది. చదవండి: అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు -
నువ్వు వస్తావని..!
గాజువాక : హైజాకర్లు నౌకను విడిచిపెట్టారన్న సమాచారంతో కూర్మన్నపాలేనికి చెందిన ఉక్కు ఉద్యోగి దొడ్డి కృష్ణాజీ ఇల్లు అవధుల్లేని ఆనందోత్సాహాలతో నిండిపోయింది. నౌకలో తమ కుమారుడు కూడా ఉండడంతో ఇన్నాళ్లు ఉత్కంఠకు గురైన ఆ కుటుంబం ఉద్వేగానికి గురైంది. తాజా వార్తతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. బంధువులు ఆ కుటుంబాన్ని పరామర్శలతో ముంచెత్తారు. ‘సాక్షి’తో కృష్ణాజీ మాట్లాడారు. కృష్ణాజీ రెండో కుమారుడు సతీష్ 2009 నుంచి సెయిలర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తు తం ఆయన థర్డ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయనకు 2014లో పెళ్లవగా, భార్య, ఏడాదిన్నర బాబు ఉన్నారు. గతేడాది నవంబర్ 1న నౌకలో విధులకు వెళ్లా డు. డిసెంబర్ 31, జనవరి 1న ఈ–మెయిల్ద్వారా సంభాషించాడు. సౌత్ ఆఫ్రికాలోని బెనిన్ తీరం నుంచి బయల్దేరుతున్నానని చెప్పిన అతడి నుంచి ఆ తరువాత మరెలాం టి సమాచారం రాలేదు. 22మంది సిబ్బందితో ఉన్న ఎమ్టీ మెరైన్ ఎక్స్‌ప్రెస్ అనే నౌకను ఈనెల 1న హైజాకర్లు అపహరించుకుపోయారు. అందు లో సతీష్ కూడా ఉన్నాడు. దీంతో ఆ కుటుం బం విలవిల్లాడింది. ఐదు రోజులపాటు ఆందోళన చెందారు. ఆఖరికి మంగళవారం ఉదయం హైజాకర్లు నౌకను విడుదల చేశారన్న సమాచారంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. తమ కుమారుడు ఇంటికెప్పుడొస్తాడోనని ఆశగా ఎదురుచూస్తోంది. కాగా, తమకు విశాఖ ఎంపీ చాలా సహాయం చేశారని కృష్ణా జీ చెప్పారు. ‘విషయం తెలి సిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఎంపీని కలిశాం, ఆయ న వెంటనే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. మొత్తం ప్రా సెస్ ఆయనే చేశారు. ఆయకు మేం జీవితాంతం రుణపడి ఉంటా’మని పేర్కొన్నారు. -
నౌక హైజాక్‌కు యత్నం
సరుకుల లోడ్‌తో ఉన్న నౌకను హైజాక్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు యత్నించారు. నౌకను తమ ఆధీనంలోకి తీసుకునే యత్నంలో ఉన్న ఆ ముగ్గుర్ని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి వేళ చెన్నై హార్బర్లో కలకలం రేపింది. చెన్నై: రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. రాష్ర్టంలో అసాంఘిక శక్తులు చాప కింద నీరులా తమ కార్యకలాపాల్ని కొనసాగించే పనిలో పడ్డాయా? అన్న అనుమానాలు తలెత్తక మానదు. ఎలాంటి కుట్రలు జరిగినా, తిప్పికొట్టేందుకు సిద్ధం అన్నట్టుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. వీరికి పరీక్ష పెట్టే రీతిలో తరచూ ఆపరేషన్ ఆమ్లా పేరిట మాక్ డ్రిల్‌ను సైతం నిర్వహిస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ బుధవారం ఆరంభమై గురువారం వరకు సాగింది. ఈ డ్రిల్‌లో తీవ్ర వాదుల వేషంలో వచ్చిన 61 మంది పోలీసుల్ని రెండు రోజుల పాటుగా అతికష్టం మీద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు ఏకంగా పోలీసుల కళ్లు గప్పి నౌకను హైజాక్ చేయడానికి యత్నించడం కలకలం రేగింది. ఇన్నాళ్లు విమానాల హైజాక్‌ల ఘటనల్ని చూసిన పోలీసులు నౌక హైజాక్ యత్నం సమాచారంతో బెంబేలెత్తిపోయారు. బుధవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు సముద్ర మార్గం గుండా చెన్నై హార్బర్ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోనికి ప్రవేశించారు. సరుకుల లోడుతో అన్లోడింగ్ కోసం వేచి ఉన్న నౌకలోకి ప్రవేశించి, తమ గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా నౌకలోకి చొరబడుతుండడాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. తక్షణం వారిని తమ అదుపులోకి తీసుకునేందుకు పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. భద్రతా సిబ్బంది, పోలీసులు, గస్తీ సిబ్బంది ఆ నౌకలోకి చొరబడే యత్నం చేసిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హడావుడితో కాసేపు హార్బర్లో కలకలం రేగింది. ఏదో జరిగిందన్న ఉత్కంఠ బయలు దేరింది. చివరకు ఆ ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారించగా, వారు మఫ్టీలో ఉన్న పోలీసులు అధికారులుగా, ఆపరేషన్ ఆమ్లాలో భాగంగానే ఈ హైజాక్ యత్నం సాగినట్టు తేలడం కొసమెరుపు.