(ప్రతీకాత్మక చిత్రం)
సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ హైజాక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఎంవీ లీలా నార్ఫోక్(MV LILA NORFOLK) అనే లైబీరియన్ షిప్‌లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న భారత నేవి అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్‌ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు పేర్కొన్నారు.
హైజాక్ అయిన షిప్, అక్కడి పరిస్థితులకు తెలుసుకోవడానికి కమ్మూనికేషన్ లింక్‌ను సృష్టించామని తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఇండియన్ నేవి పేర్కొంది. లైబీరియాన్ షిప్ హైజాక్ అయినట్లు గురువారం యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్( UKMTO)కు సందేశం వచ్చిందని ఇండియాన్ నేవి తెలిపింది.
ఆ షిప్‌లో ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు ఉన్నట్లు పోర్టల్‌కు వచ్చిన సందేశంలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ నేని.. ఎయిర్ క్రాఫ్ట్‌తో పర్యవేక్షిస్తూ ఐఎన్‌ఎస్ చెన్నైను సోమలియా సముద్ర తీరానికి పంపినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment