భారత నేవీ డేరింగ్‌ ఆపరేషన్‌.. వాళ్లంతా సేఫ్‌ | hijacking foiled after rescuing crew including Indians on ship | Sakshi
Sakshi News home page

భారత నేవీ డేరింగ్‌ ఆపరేషన్‌.. ‌హైజాక్‌కు గురైన నౌకలోని సిబ్బంది సేఫ్‌

Published Fri, Jan 5 2024 9:10 PM | Last Updated on Fri, Jan 5 2024 9:28 PM

hijacking foiled after rescuing crew including Indians on ship - Sakshi

సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది.  నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది

కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్‌ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్‌ గురించి వెంటనే యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.  


ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది.  అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్‌ఎస్‌ చెన్నైను పంపినట్లు ఇండియన్‌ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్‌కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement