rescued
-
458 మందిని రక్షించిన ప్రకాశం జిల్లా పోలీసులు
-
‘సెర్చ్’ ఇంజన్లీ అమ్మలు
‘ఈ పిల్లల ఆచూకీ మీరు కనిపెట్టాలి’ అని పై అధికారి ఆదేశించారు. ‘అలాగే సార్’ అనడమే కాదు ‘ఎలాగైనా సరే’ అనుకున్నారు మనసులో. దిల్లీలోని యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ సీమా దేవి, సుమన్ హుడా ఒక్కరు కాదు... ఇద్దరు కాదు రకరకాల కారణాలతో కనిపించకుండా పోయిన 104 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.ఒకప్రాంతంలో... ‘అయ్యా... నా కొడుకు వారం రోజుల నుంచి కనిపించడం లేదు...’‘ఫోటో ఉందా?‘లేదయ్యా’మరోప్రాంతంలో...‘మా అమ్మాయి కనిపించడం లేదు సారూ... ఎక్కడెక్కడో వెదికాం...’దిల్లీ, దిల్లీ చుట్టుపక్కలప్రాంతాలలో కనిపించకుండా పోయిన పిల్లల సంఖ్య 104 ఆ పేద తల్లిదండ్రులలో చాలామంది దగ్గర కనీసం తమ పిల్లల ఫొటోలు కూడా లేవు. కొందరు ‘మా పిల్లలు ఇలా ఉంటారు’ అని పోలికలు చెప్పేవారు.కొందరి దగ్గర ఫొటోలు ఉన్నా అవి అవుట్‌డేటెడ్ ఫొటోలు.. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ‘ఆపరేషన్ మిలాప్’ తెర మీదికి వచ్చింది. ఈ ఆపరేషన్‌ను సీమా దేవి, సుమన్ హుడా సవాలుగా తీసుకున్నారు. దిల్లీలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్స్ ఎలాగైనా సరే కనిపించకుండా పోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలనుకున్నారు. అదెంత కష్టమో వారికి తెలియనిది కాదు. అయినా సరే, రంగంలోకి దిగారు. ప్రతి కేసును సవాలుగా తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హరియాణాలో ఊరూ వాడా వెదికారు.కొన్ని సందర్భాలలో బాధితులకు పోలీసులు మాట్లాడే భాష అర్థం కాకపోయేది. పిల్లలను చివరిసారిగా గుర్తించిన ప్రాంతాల్లోని స్థానికులు పోలీసులతో మాట్లాడేందుకు నిరాకరించేవారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదురైనా వెనకడుగు వేయలేదు. సైబర్ టీమ్ సహాయం కూడా తీసుకున్నారు.ఎట్టకేలకు వారి కష్టం ఫలించింది. తప్పిపోయిన 104 మంది పిల్లలను తొమ్మిది నెలల కాల వ్యవధిలో వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో సీమాదేవి, సుమన్ హూడాలు విజయం సాధించారు. ఈ పిల్లలు కనిపించకుండా పోవడానికి ఇంట్లో నుంచి పారిపోవడం నుంచి సోషల్ మీడియాలో పరిచయం అయిన వారి మాటలు నమ్మి వెళ్లిపోవడం వరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొత్తప్రాంతాలకు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లినప్పుడు స్థానికులు సీమాదేవి, సుమన్‌లను అనుమానంగా చూసేవాళ్లు. ‘మీరు నిజంగా పోలీసులేనా?’ అని అడిగేవారు. వారిలో నమ్మకం రావడానికి కాస్త టైమ్ పట్టేది. అయినా ఓపికగా ఎదురు చూసేవారు. స్థానికులలో నమ్మకం వచ్చాక... ఇంటింటికి వెళ్లి వెదికేవారు.చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వేస్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతోమంది నుంచి ఎన్నో రకాల క్లూలు సేకరించేవారు.‘ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కావు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెదకడంలో మా పిల్లల్ని చూసుకోవడం కుదిరేది కాదు. అయినా బాధ పడలేదు’ అంటుంది సీమాదేవి.‘రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. బాగా అలిసిపోయేవాళ్లం’ అంటుంది సుమన్ హుడా.తొమ్మిది నెలల కాలంలో వారు ఇళ్లు విడిచి, కుటుంబాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే... కృతజ్ఞతతో నిండిన పిల్లల తల్లిదండ్రుల కళ్ల నుంచి వచ్చిన ఆనంద బాష్పాలను చూసిన తరువాత ఆ కష్టాలేవీ ఇప్పుడు వారికి గుర్తుకు రావడం లేదు. -
ప్రాణాలు తెగించి యువకుడిని కాపాడిన YSRCP ఎమ్మెల్యే
-
ఆపరేషన్ కంబోడియా సక్సెస్.. శభాష్ వైజాగ్ పోలీస్!
సాక్షి, విశాఖ: ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. -
ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ 420 మందిని కాపాడిన పోలీసులు
-
భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వాళ్లంతా సేఫ్
సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్‌కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది. The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm — ANI (@ANI) January 5, 2024 -
జయహో.. ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ (ఫోటోలు)
-
కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి..
వాషింగ్టన్: అపాయంలో ఉండగా ఉపాయం తట్టాలే కానీ ఎంతటి అగాధాన్నైనా జయించవచ్చని నిరూపించింది అమెరికాలోని ఓ మైనర్ బాలిక. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన ఒక మైనర్ బాలిక అగంతకుడు లేని సమయం చూసి బాలిక చాకచక్యంగా వ్యవహరించి చుట్టుపక్కల వారికి తాను ప్రమాదంలో ఉన్న విషయం తెలిసేలా సందేశాన్నిచ్చి కిడ్నాపర్ చెర నుంచి బయటపడింది. కిడ్నాప్ జరిగిందిలా.. టెక్సాస్‌కు చెందిన స్టీవెన్ రాబర్ట్ సబలాన్(61) జులై 6న సాన్ ఆంటోనియోలో తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తోన్న 13 ఏళ్ల బాలికను గన్ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి 1400 మైళ్ళు ప్రయాణించి కాలిఫోర్నియా వరకు తీసుకుని వెళ్ళాడు. మార్గమధ్యలో బాలికపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. కిడ్నాపర్ దొరికిందిలా.. లాంగ్ బీచ్ చేరిన తర్వాత అక్కడ బాలికలను బట్టలు విప్పి ఇవ్వమని అడిగి వాటిని తీసుకుని ఒక లాండ్రీ షాపులోకి వెళ్ళాడు సబలాన్. అదే సమయంలో పార్కింగ్ స్థలంలో ఉన్నవారికి తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ ఒక కాగితం మీద "హెల్ప్ మీ" అని రాసి చూపించింది. అది గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. కటకటాల పాలు.. లాంగ్ బీచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాన్ ఆంటోనియోకి చెందిన మైనర్ బాలిక తన ఇంట్లో వారికి చెప్పకుండా తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయటకు వచ్చిందని అదే సమయంలో సబలాన్ తుపాకీ చూపించి ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిపారు. కారు నెంబరు ప్లేటు ఆధారంగా చూస్తే సబలాన్ మీద అప్పటికే టెక్సాస్‌లో దొంగతనం అభియోయోగం మోపబడిందని అన్నారు. తాజాగా అతడిపై కిడ్నాప్, మైనర్ బాలికపై వేధింపులు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు లాంగ్ బీచ్ పోలీసులు. ఇది కూడా చదవండి: భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది -
అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు. మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు. ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ -
3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS — LaHistoria (@lahistoriaec) July 7, 2023 సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw — LaHistoria (@lahistoriaec) July 7, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
మనసున్న పోలీసాయన.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక కుక్క తల కారు బంపర్‌లో ఇరుక్కుపోవడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. దానిని రెస్క్యూ చేసేందుకు అమృత్సర్ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. అతను ఆ కుక్క తలను కారు బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 8 వేలకుపైగా నెటిజన్లు చూశారు. చాలామంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ, పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అమృత్సర్ పోలీస్ కమిషనర్ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘ఇది హదయానికి హత్తుకునే పని. ఒక కుక్క తల.. కారు బంపర్‌లో ఇరుక్కుపోయింది. అమృత్సర్ పోలీసు అధికారి ఒకరు దానిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అతను ఎంతో నేర్పుగా, సురక్షితంగా దాని తలను బంపర్ నుంచి బయటకు తీశారు. ఈ నేపధ్యంలో ఆ కుక్కకు ఎటువంటి గాయం కాలేదని’ రాశారు. A heartwarming act of compassion! 🙌🚓 In a touching incident, a dog got trapped in a car bumper, Amritsar police official came to the rescue. With great care and skill, safely freed the dog, ensuring its well-being.🐾#LetsBringTheChange #LoveForAnimals pic.twitter.com/HylTFNHu8e — Commissioner of Police Amritsar (@cpamritsar) June 28, 2023 పోలీసు అధికారి మెచ్చుకుంటున్న జనం.. ఈ వీడియోను చూసి కామెంట్ చేస్తున్న నెటిజన్లు కుక్కను కాపాడేందుకు ఆ అధికారి వ్యవహరించిన తీరును మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ‘ఈ పని వారి యూనిఫారంనకు మరింత గౌరవాన్నిస్తుంది. భగవంతుడు ఆ అధికారిని.. ఇటువంటి గొప్ప పనిచేసినందుకు ఆశీర్వదిస్తాడు’ అని రాశారు. కొందరు యూజర్స్ జంతుప్రేమ గురించి ప్రస్తావించారు. మరో యూజర్ ‘అన్ని ప్రాణుల విషయంలోనూ సానుభూతితో మెలగాలని అన్ని ధర్మాలు చెబుతున్నాయి. అదే మానవత్వమని పేర్కొంటున్నాయి’ అని రాశారు. ఇది కూడా చూడండి: పర్ఫెక్ట్ టైమింగ్:కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా! -
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
చచ్చిపోదామని పట్టాలపై ..ఇంతలో వచ్చింది దేవత ! వైరల్ వీడియో
న్యూఢిల్లీ: జీవితంలో ఆశను కోల్పోవద్దు అని ఎంత చెప్పినా తృణప్రాయంగా ప్రాణాల్ని త్యజిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చివరికి ఆత్మహత్య చేసు కోవడం నేరం అని చెప్పినా కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ఒక్క క్షణం వారిని మృత్యు ముఖ్యం నుంచి తప్పించగలిగితే, సరియైన కౌన్సిలింగ్ ఇప్పించ గలిగితే జీవితం విలువ తెలిసి వస్తుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్న మాట. అయితే తాజాగా చనిపోవాలని పట్టాలపై పడుకున్న వ్యక్తిని తృటిలో ప్రమాదంనుంచి తప్పించిన వైనం ఒకటి వైరల్‌గా మారింది. (తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!) వెస్ట్ బెంగాల్‌లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ ఇండియా ట్విటర్ హ్యాండిల్ ఈ ఘటనకుసంబంధించినవీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం రైలు కింద పడిచనిపోవాలనుకున్న యువకుడు చాలాసేపే అక్కడక్కడే తచ్చట్లాడాడు. చివరికి అతివేగంగా దూసుకు రానున్న రైలు కింద పడేలా పట్టాలపై పడుకున్నాడు. అయితే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ సుమతి ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా కదిలి అతగాడిని ట్రాక్‌పై నుండి లాగాపడేశారు. అంతే క్షణాల్లో అతడు యమపాశంనుంచి తప్పించుకున్నాడు. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) సుమతి నిర్భయంగా ముందుకు కదిలి ఆ వ్యక్తిని ప్రాణాలను కాపాడిన వైనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుడోస్ సుమతి మేడమ్ అంటూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆత్యహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికిపై కేసు నమోదు చేయకుండా, దయచేసి అతనికి సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ వీడియో దాదాపు 264.6 వేల వ్యూస్, 7వేలకు పైగా లైక్స్, 232 రీట్వీట్లను సాధించింది. #RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station. Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg — RPF INDIA (@RPF_INDIA) June 8, 2023 -
వ్యాపారంలో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యులను మూడేళ్లుగా బంధించి..
యూపీలోని చిత్రకూట్‌లో ఆశ్చర్యకర ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారి కాశీ కేశర్వానీ తన కుటుంబ సభ్యులందరినీ ఇంటిలోనే బంధీ చేశాడు. అతను మూడేళ్లుగా తన భార్య, పిల్లలను ఇంటిలోనే ఉంచాడు. బయటకు వెళ్లనివ్వలేదు. దీనికితోడు ఇంటి కిటికీలను కూడా పూర్తిస్థాయిలో మూసివేశాడు. పిల్లల చేత చదువు మాన్పించేశాడు. ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు తానే తీసుకువస్తున్నాడు. గత మూడేళ్లుగా అతని భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇంటిలోనే మగ్గిపోతున్నారు. ఇటీవల వీరి ఇంటికి వచ్చిన బంధువులు వీరి ఇంటి తలుపులకు తాళాలు వేసివుండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి, లోపలి పరిస్థితి చూసి నివ్వెరపోయారు. తరువాత కాశీ భార్య, పిల్లలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ టీమ్ సభ్యుడు దీపా శుక్లా తెలిపిన వివరాల ప్రకారం కాశీ కేశర్వానీ భార్య పూనమ్(45), కుమారుడు రజత్(13) కుమార్తె అర్షిత(14) గత మూడేళ్లుగా ఇంటిలోనే మగ్గుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం కాశీ బావ తన సోదరి, అతని భర్తతో కలిసి చిత్రకూట్ వచ్చాడు. అయితే కాశీ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగువారి సహాయంతో చైల్డ్ లైన్‌తో పాటు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు సంఘటనానికి వచ్చి ఇంటిలోని పరిస్థితులను పరిశీలించారు. ఇంటిలోని ప్రతీగదిలో హోమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక గదిలో సమాధి లాంటి నిర్మాణం ఉంది. దానిపై కత్తి గుచ్చి ఉంది. ఆ గది తలుపులపై ఓం అక్షరంతో పాటు జై మాతా దీ అని రాసివుంది. దీనికితోడు ఆ వ్యాపారి తన ఇంటిలోకి ఏమాత్రం వెలుగు చొరబడకుండా ఉండేందుకు అన్ని కిటికీలను మూసివేశాడు. వ్యాపారి విచిత్ర ప్రవర్తన కారణంగా అతని భార్య మానసిక వ్యాధిగ్రస్తురాలైంది. వారి పిల్లలు శారీరకంగా చాలా బలహీనంగా మారిపోయారు. బాధితులు ముగ్గురు ఏమాత్రం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కాశీ తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇంటి పరిస్థితులు ఇతరులకు తెలియకూడదని భార్యపిల్లలను ఇంటిలోనే బంధించాడు. పిల్లల చేత చదువు మాన్పించాడు. నిత్యావసరాలను తానే తీసుకు వస్తుండేవాడు. వారంతా ఇంట్లో పూజలు చేస్తుండేవారు. ప్రస్తుతం అతనికి కూడా మానసిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్‌లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi — Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023 (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్‌కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బొప్పాయి ట్రీ హోటల్లో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఆరు అంతస్తుల హోటల్ ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు యత్నించినా నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఆరో అంతస్తులో వ్యక్తులు చిక్కుకుపోవడంతో వారిని నిచ్చెన, బెడ్షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని రక్షించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పొగ భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముమ్మరంగా సహాయం చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel's kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR — Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023 (చదవండి: కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్) -
బావిలో పడిపోయి.. మృత్యువుతో పోరాడి
మానకొండూర్: మతిస్థిమితం లేక నడుస్తూ అదుపుతప్పి బావిలో పడిపోయిన ఒక వృద్ధురాలిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సంజీవ్‌నగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన ఉండింటి మధునమ్మ (80)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో నిద్రలేచింది. అలాగే నడుస్తూ సమీపంలోని చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలోని బోర్‌మోటార్ పైపును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో నిద్ర లేచిన ఓ మహిళకు బావిలోంచి వృద్ధురాలి అరుపులు వినిపించడంతో ఆమె సమీపంలోని వారికి చెప్పింది. వెంటనే స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. మధునమ్మ కుమారుడు రవి అందించిన సమాచారంతో మానకొండూర్ అగ్నిమాపక శాఖాధికారి భూదయ్య, లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్, ఫైర్‌మన్ పి.సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. లీడింగ్ ఫైర్‌మన్ ధర్మ్ చేదబావిలోకి దిగి వృద్ధురాలిని ఉదయం 6.30 గంటల సమయంలో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు మూడు గంటలపాటు చేదబావిలో ఉన్న వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
'నమ్మలేని నిజం': శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా..
టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 20 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో రక్షణ బృందం నిరంతరం రెస్క్యూ చర్యలు కొనసాగిస్తోంది. అక్కడున్నవారికి ప్రతి క్షణం ఆ శిథిలాల కింద గుండె పగిలే దృశ్యాలతో తీవ్ర నిరాశలో ఉన్న వారికి ఓ ఘటన అవధులు లేని ఆనందాన్ని కొనితెచ్చింది. ఈమేరకు రెస్క్యూ సిబ్బంది భవనాల కింది ఉన్న వారిని రక్షించే పనిలో ఉండగా..ఓ కుప్ప కూలిన భవం కింద ఉన్న వ్యక్తులను కోసం గాలిస్తున్నారు. ఐ తే అనహ్యంగా ఆ శిథిలాల కింద ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సజీవంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారి అందరీ ముఖాల్లో కన్నీళ్లతో కూడిన సంతోషం వెల్లవిరిసింది. అక్కడ ఉన్న వారంతా తమవారిని పోగోట్టుకుని నిరాశలో ఉన్నప్పటికీ.. ఒక కుటుంబమైన తమలా కాకుండా అందరూ సజీవంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులతో సహా పెద్దలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఆ కుటంబం క్షేమంగా ఉందని తెలియంగానే వారంతా.. గాడ్ ఈజ్ గ్రేట్, ఇది నిజంగా నమ్మలేని నిజం అంటూ ఆనందంతో గట్టిగా నినాదాలు చేశారు. రెస్క్యూ సిబ్బంది వారందర్నీ హుటాహుటినా ఆస్పత్రికి తరలించి తక్షణ చికిత్స అందించింది. అందకు సంబంధించిన వీడియోని సిరియా డిఫెన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైన క్షణం అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. A true miracle...the sounds of joy embrace the sky... joy beyond belief. An entire family was rescued from under the rubble of their house this afternoon, Tuesday, February 7, in the village of Bisnia, west of #Idlib.#Syria #earthquake pic.twitter.com/Cb7kXLiMjT — The White Helmets (@SyriaCivilDef) February 7, 2023 (చదవండి: పాక్‌లో దారుణం..కస్టడీలో ఉన్న వ్యక్తిపై హత్యయత్నం) -
జీవితంపై విరక్తితో చనిపోతున్నా.. పేస్బుక్ లైవ్‌లో చెప్పిన యువకుడు..
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ యువకుడు తాను చనిపోతానని ఫేస్బుక్ లైవ్ వీడియోలో చెప్పాడు. జీవితంపై విరక్తి వచ్చి, ఒంటరితనం భరించలేక బలవన్మరణానికి పాల్పడాలనుకున్నాడు. అయితే పోలీసులు ఈ వీడియో చూసిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ యువకుడు ఎక్కడున్నాడో గుర్తించి కాపాడాలని డిప్యూటీ కమిషనర్ స్మార్తన పాటిల్ పోలీసులను ఆదేశించారు. వెంటనే వాళ్లు యువకుడు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వెళ్లారు. అక్కడ వెతుకుతుండగా.. అతడు రోడ్డుపక్కన ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. పోలీసులు వెంటనే అతడ్ని తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ ఇండాల్కర్ అతనికి కౌన్సిలింగ ఇచ్చి ధైర్యం చెప్పారు. దీంతో యువకుడు ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నాడు. అనంతరం పోలీసులు యువకుడ్ని స్నేహితుడికి అప్పగించి ఇంటికి పంపారు. చదవండి: దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త! -
రక్కూన్ దాడి నుంచి కూతురిని రక్షించిన తల్లి
-
కొల్లగొట్టేందుకు వచ్చి పట్టుబడ్డ దొంగలు... కొంపముంచిన ప్లాన్
ఇటీవల దొంగలు దోచుకునేందుకు వచ్చి ప్రమాదాల బారిన పడ్డ ఉదంతాలు కోకొల్లలు. అంతేందుకు ఇటీవల ఒక దొంగ ఒక దేవాలయంలో దొంగతనానికి వచ్చి కిటికిలో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు. అచ్చాం అలానే ఒక దొంగల ముఠా ఏకంగా బ్యాంక్‌ని కొల్లగొట్టేందుకు ఒక పెద్ద స్కేచ్ వేశారు. అదే వారిని పట్టుబడేలా చేసింది. వివరాల్లోకెళ్తే....రోమ్‌లో ఒక ప్రముఖ బ్యాంకును దోచుకునేందుకు నలుగురు దొంగలు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఈ మేరకు రోమ్‌లోని వాటికన్ సమీపంలో ఇన్నోసెంటజోలోని రోడ్డులో కొంత భాగం కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా బ్యాంకుకు చేరుకునేలా సోరంగం తవ్వారు. ఆ సోరంగ గుండా వెళ్లి బ్యాంకును దోచుకోవాలనేది వారి ప్లాన్. ఆ నలుగురు దొంగలు అనుకున్న విధంగానే వెళ్లారు గానీ అందులో ఒక వ్యక్తి మాత్రం ఆ సోరంగం నుంచి బయటపడ లేకపోయాడు. దీంతో తనను రక్షించండి అంటూ పెడబొబ్బలు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో సదరు దొంగను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. ఈ మేరు పోలీసులు సదరు దొంగను రక్షించగా అసలు విషయం బయటపడింది. దీంతో తప్పించుకున్న మిగతా ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దొంగల ముఠాపై పలు దోపిడి నేరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
శభాష్... స్నితికా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మనోహర్ పిల్లలు స్నితికా, వేద్ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు. అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్‌ఫోన్ అందుకొని గూగుల్‌లో సెర్చ్ చేసి ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ నంబర్ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది. మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ అంజిరెడ్డి బృందం, ఫైర్ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. ఎలాగైనా కాపాడాలనుకున్నా స్నితికా, ఇంటర్ ఫస్టియర్, కరీంనగర్ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక) -
లక్కీ బాయ్.. మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చాడు!
కొరాపుట్(భువనేశ్వర్): ప్రమాదావశాత్తు లోయలోకి జారిపడిన బాలుడిని గ్రామస్తులు సురక్షితంగా బయటకు చేర్చారు. నవరంగ్‌పూర్ జిల్లా తెంతులుకుంటి సమితి కొంటా పంచాయతీ బరిపొదర్ గ్రామానికి చెందిన డొమ్ము జానీ సమీపంలోని కొండ మీదకు శుక్రవారం ఉదయం పశువులను తీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రమాదావశాత్తు కాలుజారడంతో రెండు బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. తల భాగం కిందికి ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. గమనించిన మిగతా కాపర్లు బాలుడు జారిపోకుండా కాలికి తాడు కట్టి, నిలువరించారు. విషయాన్ని తెంతులకుంటి బీడీఓ దుర్జన బొయికి తెలియజేశారు. ఆయన హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సహకారంతో 8 గంటలు కష్టపడి శుక్రవారం రాత్రికి జానీని వెలుపలికి తీశారు. చిన్నపాటి గాయాలవడంతో తెంతుల కుంటి ఆస్పత్రికి తరలించారు. చదవండి: కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం