
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : సకాలంలో స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని హైదరాబాద్ పోలీసులు కాపాడారు. ఆత్మహత్య చేసుకోవాలని యత్నించిన ఓ వ్యక్తిని మాల్కాజ్‌గిరి పోలీసులు రక్షించారు. గతరాత్రి పాల్దియా గోపీ అనే వ్యక్తి మౌలాలీ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై అడ్గంగా పడుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.
ఈ విషయంపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం అందగానే రంగంలోకి దిగిన మల్కాజ్‌గిరి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైలును ఆపేయడంతో వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తదనందరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ట్వీట్ చేశారు. పోలీసులు స్పందించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు కురుస్తున్నాయి. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు సలామ్‌లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment