Malkagagiri police
-
రైలు ఆపేసి.. ప్రాణాలు కాపాడారు!
సాక్షి, హైదరాబాద్ : సకాలంలో స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని హైదరాబాద్ పోలీసులు కాపాడారు. ఆత్మహత్య చేసుకోవాలని యత్నించిన ఓ వ్యక్తిని మాల్కాజ్‌గిరి పోలీసులు రక్షించారు. గతరాత్రి పాల్దియా గోపీ అనే వ్యక్తి మౌలాలీ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై అడ్గంగా పడుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్ నుంచి సమాచారం అందగానే రంగంలోకి దిగిన మల్కాజ్గిరి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైలును ఆపేయడంతో వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తదనందరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ట్వీట్ చేశారు. పోలీసులు స్పందించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రసంశలు కురుస్తున్నాయి. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు సలామ్‌లు చెబుతున్నారు. చదవండి: ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు -
వాట్సప్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాడని..
మల్కాజిగిరి: వివాహితను వేధిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ జేమ్స్‌బాబు కథనం ప్రకారం.. మధుసూదన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్(32) క్యాటరింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటి పక్కన గతంలో నివాసముంటున్న యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇటీవలనే యువతి కుటుంబసభ్యులు వేరే ప్రాంతానికి ఇల్లు మారారు. మూడు నెలల క్రితం ఆ యువతికి వివాహమైంది. గతంలో ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకొని యువతి మొబైల్‌కు ఎస్ఎంఎస్లు పంపిస్తుండడంతో సిమ్ మార్చివేసింది. అయినప్పటికీ వాట్సప్‌లో అదే నెంబర్ ఉండడంతో మళ్లీ వాట్సప్‌లో మెసేజిలు పంపిస్తుండడంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు.