వాట్సప్‌ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాడని.. | Man sends messages to woman through watsapp | Sakshi
Sakshi News home page

వాట్సప్‌ నుంచి మెసేజ్‌లు పంపుతున్నాడని..

Published Thu, Jun 9 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

వివాహితను వేధిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

మల్కాజిగిరి: వివాహితను వేధిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ జేమ్స్‌బాబు కథనం ప్రకారం.. మధుసూదన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్(32) క్యాటరింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటి పక్కన గతంలో నివాసముంటున్న యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇటీవలనే యువతి కుటుంబసభ్యులు వేరే ప్రాంతానికి ఇల్లు మారారు.

మూడు నెలల క్రితం ఆ యువతికి వివాహమైంది. గతంలో ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకొని యువతి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తుండడంతో సిమ్ మార్చివేసింది. అయినప్పటికీ వాట్సప్‌లో అదే నెంబర్ ఉండడంతో మళ్లీ వాట్సప్‌లో మెసేజిలు పంపిస్తుండడంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement