షాకింగ్‌ వీడియో : చివరిదాకా చూడండి! | Three passengersrescued by a passing driver in just 50 seconds | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో : చివరిదాకా చూడండి!

Published Fri, Jul 3 2020 3:29 PM | Last Updated on Fri, Jul 3 2020 3:47 PM

Three passengersrescued by a passing driver in just 50 seconds - Sakshi

ఫైల్‌ ఫోటో

 కళ్లు మూసి తెరిచేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇలాంటి భీతి గొలిపే ఘటన సౌత్‌ వెస్ట్‌ చైనాలోని  ఒక నగరంలో చోటు చేసుకుంది.  అనూహ్యంగా మంటల్లో  చిక్కుకున్న వాహనం నుంచి  ముగ్గురు వ్యక్తులు కేవలం కొన్ని క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకున్న వైనం  వీడియోలో రికార్డైంది.

వివరాలను పరిశీలిస్తే.. ఒక మినీ బస్‌ అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది.  ఆ వాహనంనుంచి పొగలు వ్యాపించాయి. అయినా అటుగా వెళ్తున్నవారెవరూ స్పందించలేదు. ఇంతలో భీకరంగా మంటలు అలుముకున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి తక్షణమే స్పందించి ఆ బస్సులో ఉన్నవారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. చివరకు భయంతో బిక్కుబిక్కుమంటున్న ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు.  చైనా జినువా  వార్తా సంస్థ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement