overturend
-
మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా?
బెంగళూరు: కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలను తీసుకుంటున్నప్పటికి జనాలు మాత్రం కొంచెం కూడా భయపడటం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అన్నింటి కంటే దారుణం ఏంటంటే.. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఎక్కడికక్కడ కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. జనాలకు తమ ప్రాణల గురించి ఏ మాత్రం ఆలోచన లేదు. ఈ వీడియో చూస్తే.. ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది.. ఫ్రీగా మందు లభిస్తుండటంతో జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. మందు బాటిళ్ల కోసం పరిగెత్తారు. కరోనా వస్తే తగ్గుతుంది.. కానీ మందు ఫ్రీగా లభిస్తుందా అన్నట్లు ఉంది వారి ధోరణి. ఈ సంఘటన కర్ణాటక చిక్మంగళూరులో చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీకి యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా ఆలోచించకుండా మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో విషయం సమీప గ్రామాలకు పాకడం.. వారు మందు బాటిళ్ల కోసం పరిగెత్తుకు రావడంతో.. అక్కడ వందలాదిగా జనాలు పోగయ్యారు. ఇక బీరు బాటిళ్ల కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ.. అందినకాడికి చంక బెట్టుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికి కుదరకపోవడంతో.. చివరకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మీ కక్కుర్తి తగలడా.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కరోనా తీవ్రరూపం: కిట్లు లేవు.. టీకాలు లేవు! -
షాకింగ్ వీడియో : చివరిదాకా చూడండి!
కళ్లు మూసి తెరిచేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇలాంటి భీతి గొలిపే ఘటన సౌత్ వెస్ట్ చైనాలోని ఒక నగరంలో చోటు చేసుకుంది. అనూహ్యంగా మంటల్లో చిక్కుకున్న వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు కేవలం కొన్ని క్షణాల్లో మృత్యువు నుంచి తప్పించుకున్న వైనం వీడియోలో రికార్డైంది. వివరాలను పరిశీలిస్తే.. ఒక మినీ బస్ అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఆ వాహనంనుంచి పొగలు వ్యాపించాయి. అయినా అటుగా వెళ్తున్నవారెవరూ స్పందించలేదు. ఇంతలో భీకరంగా మంటలు అలుముకున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి తక్షణమే స్పందించి ఆ బస్సులో ఉన్నవారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. చివరకు భయంతో బిక్కుబిక్కుమంటున్న ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు. చైనా జినువా వార్తా సంస్థ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. Three passengers trapped in an overturned minibus were rescued by a passing driver in just 50 seconds in southwest China's Chongqing Municipality recently pic.twitter.com/ErmixrvWBV — China Xinhua News (@XHNews) July 3, 2020 -
స్కూల్ బస్సు బోల్తా : విద్యార్థులకు గాయాలు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం ఎల్లంపల్లి వద్ద రహదారిపై బుధవారం స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...స్థానికుల సహాయంతో విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అధిక వేగంతో వెళ్తున్న స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.