ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు.
గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది.
ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు.
Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS
— LaHistoria (@lahistoriaec) July 7, 2023
సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు.
Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw
— LaHistoria (@lahistoriaec) July 7, 2023
ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు!
Comments
Please login to add a commentAdd a comment