Technical problem
-
3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే..
ఈక్వెడార్: ప్రపంచంలోనే ఎత్తైన ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సుమారు 75 మంది గంటల తరబడి అందులో బిక్కుబిక్కుమంటూ గడిపారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు గంటల పాటు శ్రమించి అందులో ప్రయాణిస్తున్న మొత్తం 75 మందిని సురక్షితంగా కిందికి చేర్చగలిగారు. గాల్లో కేబుల్ కార్ ప్రయాణమంటే సాహసం చేస్తున్నామన్న భావం తోపాటు వినోదం కూడా గ్యారెంటీ. మరి అలాంటి కేబుల్ కార్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగితే వినోదం కాస్తా విషాదంగా మారిపోతుంది. ఈక్వెడార్ కేబుల్ కార్ లో అచ్చంగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈక్వెడార్ క్విటో కేబుల్ కార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల నుండి నాలుగు వేల మీటర్ల ఎత్తులో రెండు టెర్మినల్స్ మధ్యలో ప్రయాణిస్తుంది. శుక్రవారం 75 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఈ కేబుల్ కార్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక అందులోని వారు అలాగే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపారు. Atrapados sin salida. Falla eléctrica en las cabinas del Teleférico de Quito dejó a 20 personas en el aire. Luego de cinco horas, los Bomberos comenzaron a evacuar a los atrapados. El alcalde Pabel Muñoz llegó al sitio preocupado por lo que estaba pasando. pic.twitter.com/UWa4aEphnS — LaHistoria (@lahistoriaec) July 7, 2023 సుమారు పది గంటల నిరీక్షణ తర్వాత సహాయక బృందాలు గాల్లో కార్ ఆగిన చోటికి చేరుకొని 65 మందిని తాడుల సాయంతో క్షేమంగా కిందికి దించారు. మరో పది మంది మాత్రం కేబుల్ కార్ తిరిగి ప్రారంభమైన తర్వాత సురక్షితంగా కిందికి వచ్చారు. వీడియోలో ప్రయాణికులను రక్షిస్తున్న దృశ్యాలను చూడవచ్చు. Este final nadie se lo esperaba. Así fue la evacuación de las personas atrapadas durante varias horas en las cabinas del Teleférico de Quito. pic.twitter.com/C9LHaI6Zqw — LaHistoria (@lahistoriaec) July 7, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్‌పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్‌జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ
సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది. అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లో పెట్రోల్ లేదని చలాన్ -
ఇండిగో నిర్వహణ బాగోలేదు.. సొంత సంస్థపై ఉద్యోగుల షాకింగ్ ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రామాణిక నిర్వహణ విధానాలను ఇండిగో సరిగ్గా పాటించడం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఆరోపించారు. దీని వల్ల ప్రయాణికుల భద్రత రిస్క్‌లో పడుతోందని పేర్కొన్నారు. ఈమేరకు ఆల్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్ జులై 12న విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. ఇండిగో విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఎయిర్‌బస్‌కు వారు విజ్ఞప్తి చేశారు. 'మీరు విమానాలకు లీజుకు ఇచ్చిన ఆపరేటర్లు నిర్వహణ ప్రమాణాలను పాటించడం లేదు. గత నాలుగు రోజులుగా సాంకేతిక సిబ్బంది స్ట్రయిక్ చేస్తున్నారు. అయినా సరైన నిర్వహణ లేకుండానే విమానాలు నడుస్తున్నాయి. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గత ఏడు రోజులకు సంబంధించిన నిర్వహణ డాటాను ఆపరేటర్లను అడగండి. సరైన నిర్వహణ లేకపోతే ఆ సంస్థల వల్ల మార్కెట్లో మీ కంపెనీకి కూడా చెడ్డపేరు వస్తుంది. మీ విమానాల నిర్వహణ ప్రమాణాలను వారు దిగజార్చారు. ఈ విషయంపై మీరు వాళ్లని నేరుగా ప్రశ్నించండి.' అని సాంకేతిక నిపుణులు ఎయిర్‌బస్‌కు లేఖ రాశారు. అయితే, ఈ ఆరోపణలను ఇండిగో కొట్టిపారేసింది. విమాన నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది. అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఇవి నిరాధార ఆరోపణలని, కొందరు దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇండిగో సాంకేతిక నిపుణులు లేఖ రాసిన ఐదు రోజులకే ఆ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం సాంకేతిక కారణాలతో పాకిస్థాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ఈ లేఖ చర్చనీయాంశమైంది. చదవండి: కరాచీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో సేవలకు అంతరాయం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్‌లైన్ మెట్రో రూట్లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
ఆగిపోయిన ట్విటర్ సేవలు! కారణం ఏంటంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సేవల్లో అంతరాయం ఈరోజుల్లో సాధారణమైపోయింది. అయితే ఈ విషయంలో మిగతా వాటితో పోలిస్తే ట్విటర్ కొంచెం మెరుగు అనే అభిప్రాయం ఉంది యూజర్లలో. అందుకే వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్ సేవలకు ఇబ్బంది అయినప్పుడు.. ట్విటర్లో చెడుగుడు ఆడేసుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చాలా కాలం తర్వాత ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. గంటల వ్యవధిపాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి(శుక్రవారం) 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. సమస్య ఏంటంటే.. ఈ అంతరాయంపై స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల(టెక్నికల్ బగ్) కారణంగానే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది. ట్విటర్ తిరిగి సేవలు ప్రారంభించగానే.. ట్విటర్‌నే ట్రోల్ చేస్తూ పలువురు ట్వీట్లు చేయడం కొసమెరుపు. We’ve fixed a technical bug that was preventing timelines from loading and Tweets from posting. Things should be back to normal now. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) February 11, 2022 మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని పలువురు ఫిర్యాదులు చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. డౌన్‌డిటెక్టర్ అనే ట్రాక్ ప్రకారం.. సుమారు 48 వేలకు పైనే ఫిర్యాదులు అందాయి. -
సాంకేతిక సమస్యతో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం
సాక్షి, బెంగళూరు/రేణిగుంట: రాజమండ్రి నుంచి తిరుపతికి వచ్చిన ఇండిగో విమానం సాంకేతిక కారణాల దృష్ట్యా ఇక్కడ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే చక్కర్లు కొట్టించి.. చివరకు అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు. అందులోని ప్రయాణికులు సుమారు 4 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ విమానంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి 70మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం బయల్దేరింది. 10.30 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయి.. 11.15 గంటలకు తిరిగి రాజమండ్రి వెళ్లాల్సి ఉంది. కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనుకుంటున్న సమయంలో పైలట్ చాలాసేపు విమానాన్ని రేణిగుంట చుట్టుపక్కల గాల్లోనే తిప్పారు. ల్యాండింగ్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. ప్రయాణికులకు మాత్రం మబ్బుల వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారిందని, దీనికితోడు ఫ్యూయెల్ కూడా అయిపోతోందని, విమానాన్ని బెంగళూరుకు అత్యవసరంగా మళ్లిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక దాని డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులంతా నాలుగు గంటలపాటు విమానంలోనే నిరీక్షించారు. తిరుపతిలో దిగాల్సిన ప్రయాణికులను మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు విమానాశ్రయంలో వదిలేయడంతో అక్కడ నుంచి వారంతా అవస్థలు పడి రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరారు. సాంకేతిక సమస్యను నిపుణులు పరిష్కరించడంతో అక్కడే వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానం రేణిగుంటకు చేరుకుంది. కాగా, ఈ విమానం తిరుపతిలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట మీదుగా మధురైకు సాయంత్రం 4.30గంటలకు వెళ్లాల్సి ఉంది. అనూహ్య పరిణామంతో మధురైకు విమాన సర్వీసును ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగోపై కేసు వేస్తా: రోజా ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ.. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చామని విమాన సిబ్బంది చెప్పారన్నారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానాన్ని తిరుపతికి పంపుతామని తెలిపారన్నారు. టికెట్‌కు అదనంగా రూ.5 వేలు అడిగారని, ఇండిగో యాజమాన్యంపై కేసు వేస్తానని రోజా అన్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఆగిపోయిన విమానం
-
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా ఆగిపోయిన విమానం
కృష్ణాజిల్లా: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో ఆ విమానం నిలిచిపోయింది. విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 177 మంది ప్రయాణికులతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం రన్‌వేపైనే నిలుచుని ఉంది. ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సాంకేతిక లోపాన్ని అధికారులు సరిచేస్తున్నారు. రాత్రి 8 గంటలకు ప్రయాణికులను ఢిల్లీ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
సాంకేతిక సమస్యలతో ఆగిన ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ నూతన నమోదు, సవరణల ప్రక్రియ సాంకేతిక సమస్యల కారణంగా గత కొద్దిరోజులుగా నిలిచిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాల్లో (ఏఈసీ) జరిగే ఈ ప్రక్రియకు ఐదురోజులుగా అంతరాయం ఏర్పడింది. దీంతో కొత్త కార్డుల కోసం నమోదు, వేలిముద్రలు–ఐరిస్ అప్డేషన్, ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాల కోసం ఏఈసీలకు వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 కేంద్రాలు ఈ సేవలందిస్తున్నాయి. రోజుకు సగటున లక్ష మంది వివిధ రకాల సేవల కోసం ఈ కేంద్రాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం వీటిల్లో సేవలు నిలిచిపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రాల చుట్టూ చక్కర్లు.. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కార్యక్రమంలో భాగంగా ఆసరా íపింఛన్లు ఇస్తోంది. ఇటీవల ఈ పథకం వయోపరి మితి నిబంధన సడలించి 57 సంవత్సరాలు దాటిన వారికి ఫించన్లు్ల ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పింఛన్ల మంజూరుకు ఆధార్ కార్డు వివరాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖా స్తులకు ఆధార్‌ను జత చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఇప్పటివరకు ఆధార్ లేనివారు కొత్తగా నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే ఉంటే వ్యక్తిగత వివరాల అప్డేషన్, పేర్లు, చిరునామాలు తదితరాల్లో తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏఈసీలకు వస్తున్నారు. అయితే ఐదురోజులుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో వయోవృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ఆధార్ జత చేసి దరఖాస్తు చేసుకోకుంటే పింఛ న్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రోజూ ఆ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆసరాతో పాటు పలు పథకాలు, అనేక వ్యవహారాలు/ లావాదేవీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అ య్యింది. దీంతో ఇప్పటివరకు తీసుకోనివారు ఈ కేం ద్రాల్లో నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఐదేళ్లకోసారి చేసుకోవాల్సిన బయోమెట్రిక్ అప్డేషన్కోసం కూడా చాలామంది ఈ కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యల ను అధిగమించేందుకు యూఐడీఏఐ సంబంధిత ఇంజనీర్లను రం గంలోకి దింపింది. సర్వీసుల పురనరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. అయితే ఎన్నిరోజుల్లో సర్వీసులు పునరుద్ధరిస్తామనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఐదు రోజులుగా తిరుగుతున్నా.. ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం సవరణ కోసం ఐదు రోజులుగా ప్రయత్నిస్తున్నా. నగరంలోని కేంద్రాలతో సహా 20 సెంటర్లు తిరిగా. ఎక్కడా సర్వర్ పనిచేయట్లేదు. ఈ మార్పు చేసుకుంటేనే నేను ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగలను. – కె.నర్సింహారెడ్డి, హన్మాస్‌పల్లి, రంగారెడ్డి జిల్లా -
పులిచింతల: బ్యారెజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు: నారాయణ రెడ్డి
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తి విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెయిన్ గడ్డర్ విరిగిపోవడంతో.. సపోర్ట్ రోప్ థ్రెడ్లు తెగిపోయి గేటు నదిలో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది’’ అని తెలిపారు. ‘‘పైనుంచి వరద నీటిని కిందికి వదిలెందుకు రాత్రి గేట్లను ఎత్తారు. ఒకే గేటు గుండా నీరు వెళ్తుండడంతో ఒత్తిడిని తగ్గించేందుకు క్రమక్రమంగా మొత్తం గేట్లను ఎత్తడం జరిగింది. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్ చేస్తున్నాం. బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది’’ అన్నారు. -
హబుల్ టెలిస్కోప్ స్థానంలో మరో కొత్త టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. కాగా తాజాగా టెలిస్కోప్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని నాసా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న స్పేస్ షటిల్ డిస్కవరీ నిర్మించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్..! సుదీర్ఘ సర్వీస్‌ను అందించిన హబుల్ టెలిస్కోప్ స్ధానంలో మరో టెలిస్కోప్‌ను లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. తరచూ హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను హబుల్ స్థానంలో రానుంది. అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 న జరిపే అవకాశాలు ఉన్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
క్షేమంగా ఇంటికి చేరిన ఈటల
హైదరాబాద్: ఈటల రాజేందర్ బృందం క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో దిగిన ఈటల నేరుగా శామీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఈటల రాజేందర్ బృందానికి ఉదయం ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్ అలెర్ట్ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన ఈటలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు. చదవండి: టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు -
తెలంగాణ ఈ-పాస్ పోర్టల్‌కు సాంకేతిక ఇబ్బందులు
-
జీఎస్ఎల్వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా
సాక్షి, శ్రీహరికోట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ప్రారంభించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపివేశామన్నారు. కాగా ప్రయోగాన్ని నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇస్రో అధికారులు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. జియోస్టేషనరీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను భారత్ ప్రయోగించడం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియల్ టైమ్ ఇమేజ్‌లను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ప్రకృతి విపత్తులను కూడా ఇది మానిటర్ చేస్తుంది. జీశాట్-1 బరువు 2275 కిలోలు. శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగిస్తారు. 18 నిమిషాల తర్వాత జీశాట్-1 ఉపగ్రహం... జీటీవో కక్ష్యలోకి చేరుకుంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీశాట్-1 ఉపగ్రహం ఏడేళ్ల పాటు పనిచేయనున్నది. The launch of GISAT-1 onboard GSLV-F10, planned for March 05, 2020, is postponed due to technical reasons. Revised launch date will be informed in due course. — ISRO (@isro) March 4, 2020 -
గోఎయిర్ విమానానికి తప్పిన ప్రమాదం
అహ్మదాబాద్ : గోఎయిర్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్లే గోఎయిర్ విమానం మంగళవారం ఉదయం టేకాఫ్ తీసుకున్న సమయంలో ఇంజన్లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపంతో తలెత్తిన సమస్యను సర్దుబాటు చేశామని గోఎయిర్ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని, ప్రయాణీకులను దించివేసిన తర్వాత విమానాన్ని రన్‌వే నుంచి తప్పించారు. ఈ ఘటనతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని గోఎయిర్ ప్రతినిది పేర్కొన్నారు. చదవండి : గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్ -
180 మంది ప్రయాణీకులతో సేఫ్ ల్యాండింగ్..
కోల్‌కతా : 180 మంది ప్రయాణీకులతో సిలిగురి నుంచి కోల్‌కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిలిగురిలోని బదోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుదిరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎయిర్‌బస్ ఏ 320 నియోలో తరచూ ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమస్యతో ఇదే ఇంజన్‌ను వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం పరిపాటిగా మారింది. దీంతో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి తన ఎయిర్‌బస్ ఏ 320 నియో విమానాల ఇంజన్లను సవరించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఇండిగోను ఆదేశించింది. -
దారి తప్పిన ‘సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా’ కారు!
సాక్షి, న్యూఢిల్లీ: డ్రైవరు అవసరం లేకుండా తనంతట తాను నడుపుకుంటూ వెళ్లే ‘టెస్లా’ కంపెనీ కార్లు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కంపెనీకి చెంది మూడో మాడల్ కార్లో మంగళవారం నాడు ఓ సాంకేతిక లోపం కనిపించింది. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆ కారును కారు యజమాని ఓ యాప్ ద్వారా తన వద్దకు రమ్మని ఆదేశం ఇచ్చారు. పార్కింగ్ స్థలం నుంచి క్షేమంగా రోడ్డు మీదకు వచ్చిన ఆ కారు ఎలా వెళ్లాలో తెలియక కాస్త కంగారు పడింది. రాంగ్ రూటులో డౌన్లోకి వెళ్లి తికమక పడింది. కాసేపు ఆగిపోయింది, మళ్లీ స్టార్టు చేసుకొని పక్కకు వెళ్లింది. బ్రిటిష్ కొలంబియాలోని రిచ్మండ్ రోడ్డులో కనిపించిన ఈ సీన్‌ను పాదాచారులెవరో గుర్తించి వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. దీని మీద వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పటీ వరకు కార్ల యజమానులు యాప్ ద్వారా ఇచ్చిన దాదాపు ఐదున్నర లక్షల ఆదేశాలను తమ కార్లు కచ్చతంగా పాటించాయని, ఈ ఒక్క కారు విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ డ్రైవర్ అవసరం లేని కార్లు తమను నిర్దిష్ట ప్రాంతాల్లో దించి, అవంతట అవే పార్కింగ్ స్థలాలకు వెళ్లి పార్కు చేసుకోవడం, తాము సందేశం ఇవ్వగానే పార్కింగ్ స్థలం నుంచి తమ వద్దకు రావడం ఎంతో బాగుండడమే కాకుండా ఎంతో థ్రిల్లింగాగా కూడా ఉందని పలువురు వీటిని కొన్న ఎక్కువ మంది కార్ల యజమానులు ఇంతకుముందే మీడియాతో చెప్పారు. యజమానులను చికాకు పర్చడమే కాకుండా, పాదాచారులను భయపెడుతున్నాయని కొంత మంది యజమానులు ఆరోపించారు. -
అకస్మాత్తుగా టేకాఫ్ రద్దు, విమానంలో కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ మూలేకర్ తెలిపారు. -
మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ మెట్రో రైలు వేగానికి తరచూ బ్రేకులు పడుతున్నాయి. స్టేషన్లు, ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై ఏర్పాటు చేసిన విడిభాగాలు చిన్న గాలి దుమారానికే ఊడిపడుతున్నాయి. ఇక మెట్రో మార్గంలో సుమారు వంద వరకు ఉన్న భారీ హోర్డింగ్‌లు.. వాటిపై ఏర్పాటు చేసిన పీవీసీ ఫ్లెక్సీలు చిరిగి విద్యుత్ తీగలపై పడితే రైలు నిలిచిపోతోంది. తాజాగా శనివారం అసెంబ్లీ మెట్రోస్టేషన్ సమీపంలో మెట్రో ట్రాక్‌పై లైటనింగ్ అరెస్టర్ రాడ్(పిడుగు పాటును నిరోధించేది) ఊడిపడడంతో రైలును అరగంట పాటు నిలిపేయాల్సి వచ్చింది. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఇరవై నెలల్లో సాంకేతిక సమస్యల కారణంగా సుమారు యాభై మార్లు మెట్రో రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. నగర మెట్రో రైళ్లలోని సాంకేతికత వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీటీసీలో లోపాలెన్నో.. డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సిటీ ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటి దాకా ఉన్న మంచిపేరు. లండన్, సింగపూర్ వంటి నగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. వాతావరణంలో దుమ్ము, ధూళి కాలుష్యం పెరగితే ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లో రెడ్ లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్నిసార్లు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. ఇటీవల ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్ సిగ్నల్స్ ఒకేసారి వెలిగాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేశారు. సాంకేతిక సమస్యలు బోలెడు నగరంలో తలెత్తే వాతావరణ మార్పులతో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాలిలో 100 మైక్రో గ్రాములు మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారీ మెట్రో రూట్లలో రెడ్ సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే, రెడ్‌లైట్లు ఆన్ అవుతుండడంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్(నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి వస్తోంది. సీబీటీసీ సాంకేతిక అత్యాధునిక, అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా గ్రేటర్ వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను అందించిన థేల్స్(లండన్) కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో నాగోల్–అమీర్‌పేట్ రూట్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ♦ మెట్రో రైళ్లు, స్టేషన్ల నిర్వహణను చూస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ సంస్థ పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో స్టేషన్లు, మెట్రో మార్గాల్లో ఏర్పాటు చేసిన భద్రతకు సంబంధించిన విడిభాగాలు చిన్న గాలికే ఊడి పడుతుండడంతో దీర్ఘకాలంలో ఎలాంటి విపత్తులు ఎదురవుతాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం సాంకేతిక ఇబ్బందులే.. ♦ టిక్కెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించడం లేదు. ♦ నాలుగు పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలోకి ప్రవేశపెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతుండడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ♦ స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్నిసార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ప్రయాణికుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయి. ♦ ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతిరూట్లో ఆరు నిమిషాలకో రైలు అని ప్రకటించినా కొన్నిసార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ♦ సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కనీసం 30 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేస్తున్నారు. ♦ హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ రూట్లో మెట్రో అధికారులు ఎన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్లు ప్రకటించినా.. ఈ మార్గంలో మెట్రో జర్నీ నత్తనడకను తలపిస్తోందని, తాము కార్యాలయాలకు వెళ్లడం ఆలస్యమవుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. ♦ పార్కింగ్ లాట్ వద్ద ద్విచక్ర వాహనానికి నెలవారీ పాస్ రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుం అధికంగా ఉండడంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్‌కు దూరంగా ఉంటున్నారు. ♦ మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. వర్షాకాలంలో లైటింగ్ లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ♦ మెట్రోరైళ్ల గమనంలో సడన్బ్రేక్లు వేస్తుండడంతో ప్రయాణికులు తూలి పడిపోతున్నారు. ♦ రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సార్లు శబ్దకాలుష్యం శృతిమించుతోందని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. ♦ స్టేషన్ల వివరాలను అనౌన్స్మెంట్ చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తుండడంతో సరైన సమాచారం అందక, దిగాల్సిన స్టేషన్లో కాకుండా మరో స్టేషన్లో దిగి తలపట్టుకుంటున్నారు. -
నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..!
సాక్షి, హైదరాబాద్: ఉదయం 7.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇంకా కదలడం లేదు. దాంతో 80 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ఎంతకు విమానం కదలకపోవడంతో వారు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్పైస్‌జెట్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తాము గంటల తరబడి నిరీక్షిస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగానే విమానం ఆగిపోయిందని స్పైస్‌జెట్ సిబ్బంది వెల్లడించారు. -
వికాస్ భవన్లో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని వికాస్ భవన్ ఆరో అంతస్తులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ఎయిర్ కండిషనర్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలిసిన వెలంటే ఐదు అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి తరలించామని ఢిల్లీ పైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కాగా ఈనెల 6న దక్షిణ ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సీఐఎస్ఎఫ్ ఎస్ఐ మరణించగా, పలు కీలక పత్రాలు, ఫైళ్లు దగ్ధమయ్యాయి. 11 అంతస్థుల పండిట్ దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్‌లోని ఐదో ఫ్లోర్లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. -
కరెంట్ లేక ఆగిన మెట్రోరైల్
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్-అమీర్ పేట్ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణీకులతో బయలు దేరిన మెట్రోరైలు ఆకస్మాత్తుగా కూకట్పల్లి వై జంక్షన్‌లోని డాక్టర్ అంబేడ్కర్ బాలానగర్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. మెట్రో పవర్ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్ అంతరాయం వల్లనే రైలు మార్గ మధ్యలో ఆగిపోయిందని ఆరోపించారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణీకులకు అధికారులు వారి టికెట్ ధర చెల్లించి పంపించేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు మియాపూర్ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్ వైర్ తెగిపడిపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు స్పష్టం చేశారు. రెండో ట్రాక్‌పై రైల్లు నడుస్తున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించగానే పూర్తి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు మరమత్తు చర్యలు చేపట్టారు. -
సాంకేతిక సమస్యతో నిలిచిన ఇండిగో సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : సాంకేతిక సమస్యలతో అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్ డౌన్ అయ్యాయి. సాంకేతిక కారణాలతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు గమ్యస్ధానాలకు చేరవలసిన ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నారు. సిస్టమ్స్ డౌన్ అవడంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణీకులు నిలిచిపోయారని, సంయమనంతో తమకు సహకరించాలని ప్రైవేట్ ఎయిర్‌లైనర్ ట్వీట్ చేసింది. సమస్యను త్వరలోనే అధిగమిస్తామని, అప్పటివరకూ సంస్థకు సహకరించాలని ప్రయాణీకులను కోరింది. 90 నిమిషాల పాటు సిస్టమ్స్ పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు ఎదురైన అసౌకర్యానికి మన్నించాల్సిందిగా ఇండిగో కోరింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన మీదట విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. -
ఎదురుచూపులు ఎన్నాళ్లు..!
రాజాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెలా అందించే ఆసరా పింఛన్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో మూడు నెలలుగా అందడంలేదు. బయోమెట్రిక్ విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు, మిషన్లకు సరిగ్గా సిగ్నల్స్ అందక లబ్ధిదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. పింఛన్ వస్తుందన్న నమ్మకంతో తెలిసిన వారితో అప్పు సప్పు చేసి కాలం నెట్టుకొస్తుండగా.. నెలల తరబడి పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పింఛన్లు అందక ఆందోళన ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 అందజేస్తుంది. రాజాపూర్, బాలానగర్ ఉమ్మడి మండలాల్లో మొత్తం 7,464 మందికి ఆసరా పింఛన్ల లబ్ధిధారులు ఉన్నారు. అందులో వయోవృద్ధులు 2,459మంది, వితంతువులు3,611 మంది, వికలాంగులు914, గీతా కార్మికులు 118, నేత కార్మికులు111, ఒంటరి మహిళలు, 250 మంది ఉన్నారు. వీరందరికి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.95,48,500 పంపిణీ జరుగుతోంది. కానీ, గత మూడునెలలుగా అధికారుల అలసత్వమో, ప్రభుత్వ నిర్లక్షమోకాని ప్రతి నెల అందాల్సిన ఆసరా పింక్షన్లు మూడునెలలు అయినా అందడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ లేక.. ఇదిలాఉండగా, గతంలో గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఆసరా పింఛన్లు నేరుగా అందజేసేవాళ్లు. అయితే గత కొన్ని నెలలుగా పోస్టాఫీస్‌ల ద్వారా లబ్ధిదారులకు అకౌంట్లు తెరిపించి, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకూడదనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ ద్వారా అందజేస్తున్నారు. అయితే, గ్రామాల్లో బయోమెట్రిక్ మిషన్లకు సిగ్నల్స్ సరిగ్గా అందకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీస్‌లు లేకపోవడంతో ఉన్న ఒక్క పోస్ట్‌మన్‌కు రెండు మూడు గ్రామాల పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పజెప్పడంతో ఆలస్యమవుతుందని ఆరోపిస్తున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోకపోతే లబ్ధిదారుడి పేరు తొలగిస్తారని, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ అందలే.. ఆసరా పింఛన్ అందక మూడునెలలు అయ్యింది. ప్రతి నెలా పింఛన్ వస్తే కాస్త ఆసరాగా ఉండేది. మూడు నెలలుగా ఎ ప్పుడిస్తారో అంటూ ఎదురుచూస్తున్నా ం. గతంలోలాగా మా ఊర్లో పింఛన్లు అందిస్తలేరు. మా ఊళ్లో పోస్టాఫీస్ లేదు. కుచ్చర్కల్ పోయి తెచ్చుకోవాలే. – మహ్మద్‌జాఫర్, దివ్యాంగుడు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం మూడు నెలలుగా కొన్ని గ్రామాల్లో ఆసరా పింఛన్లు అందడంలేదని ఇటీవల తెలిసింది. ఆ గ్రామాల్లో నెట్వర్క్ సమస్య ఉంది. వీలైన ంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. లబ్ధిదా రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్ నుంచి పేర్లు తొలగించం. ఈ నెల పింఛన్ అందిస్తాం. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ, రాజాపూర్