గోఎయిర్‌ విమానానికి తప్పిన ప్రమాదం | Bengaluru Bound Flights Engine Catches Fire | Sakshi
Sakshi News home page

గోఎయిర్‌ విమానానికి తప్పిన ప్రమాదం

Published Tue, Feb 18 2020 12:36 PM | Last Updated on Tue, Feb 18 2020 12:38 PM

Bengaluru Bound Flights Engine Catches Fire - Sakshi

అహ్మదాబాద్‌ : గోఎయిర్‌ విమానానికి పెనుప్రమాదం​ తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి బెంగళూర్‌కు వెళ్లే గోఎయిర్‌ విమానం మంగళవారం ఉదయం టేకాఫ్‌ తీసుకున్న సమయంలో ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపంతో తలెత్తిన సమస్యను సర్దుబాటు చేశామని గోఎయిర్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని, ప్రయాణీకులను దించివేసిన తర్వాత విమానాన్ని రన్‌వే నుంచి తప్పించారు. ఈ ఘటనతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని గోఎయిర్‌ ప్రతినిది పేర్కొన్నారు.

చదవండి : గో ఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement