GoAir flight
-
హైదరాబాద్ టు మాల్దీవులు.. వారానికి ఎన్ని రోజులు!
సాక్షి, హైదరాబాద్: పర్యాటక రంగం తిరిగి రెక్కలు విప్పుకుంటోంది. ఏడాదికి పైగా నిలిచిపోయిన రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి షికాగోకు గత నెలలో రెగ్యులర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గల్ఫ్‌దేశాలకు విమాన రాకపోకలు కొనసాగుతున్నాయి. తాజాగా పర్యాటకుల స్వర్గధామం మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గో ఎయిర్‌కు చెందిన ఫ్లైట్ ఏ8(1533) గురువారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మాల్దీవుల్లోని మాలెకు బయలుదేరింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి ఎ8(4033) విమాన సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ –మాలే మధ్య ఈ విమాన సర్వీసులు ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం రాకపోకలు సాగిస్తాయి. పెరుగుతున్న సర్వీసులు.. కోవిడ్ అనంతరం నెలకొన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్‌కు ముందు ప్రతిరోజు 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉండగా ఇప్పుడు 2,500 నుంచి 3,000 మంది రాకపోకలు సాగిస్తున్నాయి. ‘అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేస్తే పూర్తిస్థాయిలో విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి, బెంగళూర్ తదితర ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అడ్వెంచర్ టూర్స్@ మాలే మాల్దీవులు అనగానే అడ్వెంచర్ టూర్స్ గుర్తుకొస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చేస్తారు. రకరకాల జలకాలాటలతో గడిపేస్తారు. అందమైన ప్రకృతి దృశ్యాలు సైతం కనువిందు చేస్తాయి. అద్భుతమైన ప్రదేశాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులే కాదు. హనీమూన్‌కు వెళ్లే జంటలకు సైతం మాల్దీవులు ఎంతో ఇష్టమైన ప్రదేశం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జలక్రీడలను ఆస్వాదించవచ్చు. హైదరాబాద్– మాలేలను కలిపే ఈ విమాన సర్వీసు కోసం నగరవాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండున్నర గంటల్లో మాలేకు చేరుకోవచ్చు.’ అని జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ అన్నారు. గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిక్ ఖోనా, హైదరాబాదీల కోసం గో ఎయిర్ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది’ అన్నారు. -
విమానంలోకి పావురం ఎలా వచ్చిందో!
అహ్మదాబాద్ : ఎయిర్గోకు చెందిన జి8702 విమానం అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ పావురం విమానంలోని ప్రయాణికులను ముప్పతిప్పలు పెట్టింది. ప్రయాణికులకు దొరకకుండా పావురం అటూ ఇటూ ఎగురుతూ తెగ హల్చల్ చేసింది. కాగా ప్రయాణికులు పావురం చేసిన పనిని ఆనందిస్తూనే తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అయితే ఒక వ్యక్తి మరింత ఉత్సాహంతో పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. (ఆ చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు.. ఏం చేస్తారంటే..) అయితే ఈ విషయాన్ని క్యాబిన్ క్రూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విండో క్యాబిన్ ఓపెన్ చేసి పావురాన్నిబయటకు పంపించారు. దీంతో 6.15 గంటలకు బయలుదేరాల్సిన విమానం 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి 6.45 గంటలకు జైపూర్‌కు చేరుకుంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అప్పుడప్పుడు విమానంలోకి పక్షులు రావడం సహజమే. ఒక్కోసారి అవి అయోమయంతో చేసే పనులు విమానం క్రాష్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.('తాజ్ అందాలు నన్ను మైమరిపించాయి') Two pigeons on board Jaipur-bound GoAir flight. See what happens next. #UserGeneratedContent (@gopimaniar) pic.twitter.com/oA9afyFP65 — India Today (@IndiaToday) February 29, 2020 -
విమానం ఇంజిన్‌లో మంటలు..
ముంబై: అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న గోఎయిర్‌కు చెందిన జీ8–802 విమానం ఇంజిన్‌ను పక్షి ఢీ కొట్టడంతో కుడి పక్క ఇంజిన్‌లో మంటలు రేగాయి. దీంతో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అనంతరం విమానాన్ని రన్‌వే నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందులో సిబ్బంది కాకుండా మొత్తం 134 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని గోఎయిర్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు మూడున్నర గంటల తర్వాత మరొక విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు. -
గోఎయిర్ విమానానికి తప్పిన ప్రమాదం
అహ్మదాబాద్ : గోఎయిర్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్లే గోఎయిర్ విమానం మంగళవారం ఉదయం టేకాఫ్ తీసుకున్న సమయంలో ఇంజన్లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపంతో తలెత్తిన సమస్యను సర్దుబాటు చేశామని గోఎయిర్ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని, ప్రయాణీకులను దించివేసిన తర్వాత విమానాన్ని రన్‌వే నుంచి తప్పించారు. ఈ ఘటనతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని గోఎయిర్ ప్రతినిది పేర్కొన్నారు. చదవండి : గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్ -
రన్‌వేపై ప్రయాణికుల ఆందోళన
దొడ్డబళ్లాపురం: విమానం ఆలస్యమైందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి విమానాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగింది. బెంగళూరు నుంచి థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నగరానికి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయలుదేరాల్సిన గో ఎయిర్‌బస్ విమానం సాంకేతిక కారణాల వల్ల టేకాఫ్ కాలేదు. దీంతో విమానంలోని 120 మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పైలట్‌తోపాటు ఎయిర్‌హోస్టెస్‌లు తమ డ్యూటీ సమయం దాటిపోయిందంటూ వెళ్లిపోయారు. మరో మార్గం చూపుతామని అధికారులు చెప్పారు. అయితే ఉదయం 8 గంటలయినా మరో విమానం ఏర్పాటు చేయలేదు. అయిదారు గంటలపాటు విమానంలోనే కూర్చున్న ప్రయాణికులు చివరకు ఓపిక నశించి, రైన్వే పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇతర విమానాలకు ఎదురెళ్లి ఆటంకం కలిగించడానికి యత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. పుకెట్‌కు మరో విమానం ఏర్పాటు చేయాలని భావించినా బీసీఏఎస్ నుంచి అనుమతి లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. -
విమానానికి తప్పిన ప్రమాదం, షాకైన స్థానికులు
సాక్షి, కోలకతా: గో ఎయిర్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ద సమయానికే సాంకేతిక లోపం తలెత్తడంతో గువహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బర్దోయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానంలో ఉన్న మొత్తం 157 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోవహతి-కోల్‌కతా గోఎయిర్ జి 8546 విమానం ఉదయం 11:15 గంటలకు గువహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ సందర్భంగా భారీ శబ్దం వినపడిందని విమానాశ్రయంలోఉన్నవారు చెప్పారు. లోహపు ముక్కలను కనుగొన్నామని స్థానికులు తెలిపారు. విమానం క్రాష్ అయినట్టుగా పెద్ద శబ్దం వినగానే తాను షాక్ అయ్యానని స్థానికుడు ఒకరు తెలిపారు. -
ఉక్కపోతగా ఉందని... విమాన ‘ద్వారం’ తెరిచాడు
బొమ్మనహళ్లి (కర్ణాటక): విమానంలో గాలి రావడం లేదని ఓ ప్రయాణికుడు అత్యవసర కిటికీ తలుపు తీశాడు. దీన్ని సకాలంలో సిబ్బంది గుర్తించి విమానం టేకాఫ్‌కు ముందే కిటికీ మూసివేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం జరిగింది. లక్నోకు వెళ్లేందుకు గాను సునీల్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 8 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చాడు. గోఎయిర్ విమానంలో ఎక్కి..తనకు కేటాయించిన విండో పక్కన సీటులో కూర్చున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో అత్యవసర కిటికీ ద్వారానికి ఏర్పాటు చేసిన గ్లాస్ డోర్‌ను పక్కకు జరిపాడు. దీన్ని విమాన సిబ్బంది గుర్తించి అతడిని హెచ్చరించి వెంటనే డోర్ మూసి వేయించారు. సునీల్‌ను విమానంలో నుంచి కిందికి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ..తాను మొదటిసారిగా విమానం ఎక్కానని, గాలి తగలకపోవడంతోనే విండో డోర్ తెరిచానని..ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విమానాశ్రయ అధికారులకు చెప్పాడు. అనంతరం అతడిని మరో విమానంలో లక్నోకు పంపించారు. ఈ ఘటనపై గో ఎయిర్ సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చెయ్యలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. -
విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడి సాహసం
పాట్నా : తొలిసారి ఎక్కడికైనా వెళ్లినా, ఏదైనా పని ప్రారంభించిన, ఏదైనా వస్తువును కొన్నా కాస్తా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే తొలిసారి విమానయానం చేసేవారు అంటే ఈ కంగారు మరి కాస్తా ఎక్కువే. ఎందుకంటే విమానాలను దగ్గర నుంచి చూడ్డమే చాలా అరుదు. అలాంటప్పుడు ఇక వాటి గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. దాంతో తొలిసారి విమానయానం చేసేటప్పుడు సహజంగా కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. ఇలాంటి పొరపాటు సంఘటనే ఒకటి ఢిల్లీ నుండి పట్నా వెళ్తున్న గోఎయిర్ విమానంలో చోటు చేసుకుంది. రాజస్థాన్ అజ్మీర్‌కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి తొలిసారిగా విమానం ఎక్కాడు. ఈ క్రమంలో.. నిబంధనలు సరిగ్గా అర్థం కాకపోవడంతో తాను ఇబ్బంది పడ్డమే కాక ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. సదరు ప్రయాణికుడు విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు. విస్తుపోయిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో.. సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం విమానం పాట్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం గురించి సదరు ప్రయాణికుడు తనకు విమాన ప్రయాణం కొత్త అని.. తాను విమానం ఎక్కడం ఇదే తొలిసారని.. అందువల్లే వాష్ రూమ్ డోర్‌కి, ఎగ్జిట్ తలుపుకి తేడా తెలుసుకోలేకపోయానని తెలిపాడు. ఫలితంగా ఈ పొరపాటు జరిగిందని వివరించాడు. దాంతో పోలీసులు తెలియక చేసిన తప్పుగా భావించి సదరు వ్యక్తిని విడిచిపెట్టారు. విమాన సిబ్బంది కూడా అనుకోని ఈ పరిణామానికి తొలుత కొంత భయపడినా.. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తి గనుక బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే.. అనుకోని ప్రమాదం సంభవించి ఉండేదని సిబ్బంది తెలిపారు. జరిగిన సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా గోఎయిర్ యాజమాన్యం తమ సిబ్బందిని ఆదేశించింది. అంతేకాక నిబంధనల గురించి ప్రయాణిలకు సరైన రీతిలో అర్థం అయ్యేలా చెప్పాలని తెలిపింది. గతంలో కూడా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్ డోర్ తీసి అందరినీ బెంబేలెత్తించాడు. విమానాశ్రయంలో దిగి ఎయిర్ఏసియా విమానం రన్‌వేపైకి వస్తుండగా ప్రయాణికుడు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఆ ఘటన జరిగింది. -
గోఎయిర్ టికెట్ @ రూ.1,299
ముంబై: విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా ‘మాన్సూన్ సేల్’ పేరుతో పరిమితకాల ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ ఇందులో భాగంగా ఒకవైపు ప్రయాణానికి పన్నులు, ఫీజులు కలుపుకుని రూ.1,299 నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేస్తుంది. జూన్ 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. సాధారణంగా జూలై క్వార్టర్లో ట్రావెల్ బిజినెస్ డల్‌గా ఉంటుంది. అందుకే దేశీ విమానయాన కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరకే టికెట్లను అందిస్తుంటాయి. గోఎయిర్ నెట్‌వర్క్‌లోని అన్ని ఫ్లైట్స్‌కు మాన్సూన్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఆఫర్లో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లు నాన్‌రిఫండబుల్ అని పేర్కొంది. రూట్, ఫ్లైట్, సమయం ఆధారంగా టికెట్ ధరల్లో మార్పు ఉంటుంది. -
గో ఎయిర్‌లైన్స్ విమానం 5 గంటలు ఆలస్యం
హైదరాబాద్ : కొచ్చిన్ వెళ్లాల్సిన గో ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 11.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం సాయంత్రం 4.56 గంటలకు బయలుదేరింది. ఇందులో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. -
విమానం నుంచి మహిళను దించేశారు
ముంబై: సెలబ్రిటీలా ఫోజు కొడుతూ తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిపై దాడి చేసి దుర్బాషలాడిన మహిళను గో ఎయిర్ విమానం నుంచి దించివేసిన ఘటన ముంబై ఎయిర్ పోర్టులో గురువారం చోటు చేసుకుంది. ముంబై-లక్నో జీ8 387 విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న ఓ మహిళ ఏరోబ్రిడ్జి మీదుగా విమానం ఎక్కుతున్నప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ ను తోటి ప్రయాణికులపై విసిరికొట్టింది. అంతేకాకుండా తన ముందు నిలుచున్న ప్రయాణికులను తోసేసి విమానంలోకి దూసుకొచ్చింది. ఆమె గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు గో ఎయిర్ సిబ్బంది ప్రయత్నించగాపై వారిని నోటికొచ్చినట్టు తిట్టింది. విమాన ప్రయాణం నిబంధనలు ఉల్లఘించినందుకు ఆమెను కిందకు దించేశారు. ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ కు తెలిపినట్టు గో ఎయిర్ వెల్లడించింది.