
ముంబై: అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న గోఎయిర్‌కు చెందిన జీ8–802 విమానం ఇంజిన్‌ను పక్షి ఢీ కొట్టడంతో కుడి పక్క ఇంజిన్‌లో మంటలు రేగాయి. దీంతో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అనంతరం విమానాన్ని రన్‌వే నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందులో సిబ్బంది కాకుండా మొత్తం 134 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని గోఎయిర్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు మూడున్నర గంటల తర్వాత మరొక విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment